konni vishayamulu...
బ్రహ్మాండంలో భూమితో పాటు ఎన్నో లోకాలు ఉంటాయంటారు. ఆ లోకాల్లో పాపాలు చేసే జీవులు ఆ పాప ఫలితాలను, పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలను అనుభవించటానికి భూమిపై కూడా జీవులుగా జన్మించటం జరుగుతుందేమో?
మనుషుల్లో శాంతితో ఉన్నభావాలు పెరిగితే ప్రపంచం శాంతిగా ఉంటుంది. మనుషుల్లో హింసతో కూడిన భావాలు పెరిగితే ప్రపంచంలో హింస ఎక్కువగా ఉంటుంది.
తమ పాపపుణ్యకర్మల ప్రకారం మనుషులు నరకాన్ని, స్వర్గాన్ని అనుభవించి..మిగిలిన కొంత కర్మతో తరువాత జన్మలలో మొక్కలు, క్రిమికీటకాదులుగానో, పశుపక్ష్యాదులుగానో,మనుషులుగానో జన్మిస్తారేమో.. అనిపిస్తుంది.
ఎక్కువ పాపాలు చేసిన జీవులు క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులుగా జన్మించి, అందులో కొన్ని జీవులు సాటి జీవుల ద్వారా చంపబడతాయేమో?
ఎక్కువ పాపాలు చేసిన జీవులు క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులుగా జన్మించి, అందులో కొన్ని జీవులు సాటి జీవుల ద్వారా చంపబడతాయేమో?
కొంత పుణ్యం చేసుకున్న జీవులు పశుపక్ష్యాదులుగా జన్మించినా కూడా, మనుషులు వాటిని చక్కగా పెంచి బాగా చూస్తారేమో?
(ఉదా.. ఇళ్ళలో పెంచుకునే పెంపుడుజీవులు..)కొందరు కొంతకాలం వాటిని పెంచి, చంపి తినేవాళ్లూ ఉంటారు.
మనుషులైనా, ఇతరజీవులైనా కష్టాలు పడుతుంటే, వాటి కర్మ అవి అనుభవించనీ..అని వదిలేయటం సరైనపని కాదు. చేతనైనంతలో ఆదుకుంటే పుణ్యం వస్తుంది.
మనుషులైనా, ఇతరజీవులైనా కష్టాలు పడుతుంటే, వాటి కర్మ అవి అనుభవించనీ..అని వదిలేయటం సరైనపని కాదు. చేతనైనంతలో ఆదుకుంటే పుణ్యం వస్తుంది.
భూమి ఒక పరీక్షాలోకం అనిపిస్తుంది. ఎలాంటిపరిస్థితిలోనైనా, దైవాన్ని నమ్మి సత్ప్రవర్తనతో జీవించిన వారికి ఉత్తమగతి
లభిస్తుంది.
లభిస్తుంది.
................
నాకు తోచినంతలో వ్రాసాను. ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
happy new year sir 2018
ReplyDeleteLatest Telugu News
మీకు ధన్యవాదాలండి.
ReplyDeleteమీకు మరియు అందరికి మరొక్కసారి అంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.