కొన్ని సంవత్సరాల క్రితం , వివాహం జరిగిన కొత్తలో కొంతకాలం మేము కొన్ని వారపత్రికలు తెప్పించుకొనేవాళ్ళం.
వాటిలో సీరియల్స్, కధలతో పాటూ సెక్స్ కు సంబంధించి వైద్యులు ఇచ్చే సలహాలు కూడా ఉండేవి.
కధలు, సీరియల్స్ తో పాటూ అవి కూడా చదవటం జరిగింది.
తరువాత ఆ పత్రికలలో శృంగార పరమైన బొమ్మలు ఎక్కువగా వేస్తుండటంతో, పిల్లలు అలాంటి చిత్రాలను చూడటం మంచిది కాదని , పత్రికలను తెప్పించుకోవటం నిలిపివేసాం.
ఒక వారపత్రికలో ఒక మానసిక వైద్యురాలు , సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను వ్రాసారు.
అవి చదివితే సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో , కొందరు మనుషుల్లో ఉండే ఘోరమైన ప్రవృత్తుల గురించి కూడా వ్రాసారు.
......................
ఈ రోజుల్లో కూడా ఎన్నో సంఘటనలు వింటున్నాము.
నిర్భయ వంటి కేసులు, చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరగటం..వంటివీ విన్నాము.
నిర్భయ ఘటన తరువాత అలాంటి కేసులు మరింత ఎక్కువయ్యాయనిపిస్తుంది.
..............................
ఈ మధ్య వచ్చిన ఒక వార్త ద్వారా తెలిసిన విషయమేమిటంటే..
6 సంవత్సరాల పాప రేప్ కు గురవ్వటం, అమ్మాయి మర్మాంగం వద్ద చెక్క ముక్క వంటి వస్తువు లభించటం జరిగిందట.
ఇలాంటి సంఘటనల నిందితులను కఠినంగా శిక్షించాలి.
ఆ శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే ...మరెవరైనా నేరం చేయడానికి భయపడే విధంగా ఆ శిక్ష ఉండాలి.
.........................
శృంగారం దైవం సృష్టించిందే..
అలాగని స్త్రీపురుషులు ఎటువంటి పరిధులు లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించటం సరైనది కాదు.
ఆహారం తీసుకోవటం, లైంగికకోరికలు.. అందరికీ ఉండేవే.
ఆరోగ్యకరమైన శ్రేయస్కరమైన లైంగిక కార్యం చక్కటి వివాహవ్యవస్థ ద్వారా సాధ్యం.
అయితే ఇక్కడ ఒక విషయమేమిటంటే, ఎవరికైనా శారీరిక కోరిక కలిగినప్పుడల్లా స్త్రీ లేక పురుషుని తోడు లభించకపోవచ్చు.
అలాంటప్పుడు ఆ కోరిక తీరడం కొరకు దొరికిన వారి పట్ల అఘాయిత్యం చేస్తే నేరాలు..ఘోరాలు జరిగే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితులు జరగకుండా శారీరిక నిర్మాణంలోనే అవకాశం ఏర్పరచబడింది.
స్వయం తృప్తి విధానం ద్వారా ఎవరి కోరికను వారు నెరవేర్చుకోవచ్చు.
..................
* ఇందులో వ్రాసిన శృంగార సంబంధ విషయాలు వారపత్రికలలో వైద్యుల అభిప్రాయాలు చదివి వ్రాసినవి.
. స్వయంతృప్తి పద్ధతి గురించి కొన్ని అపోహలున్నాయంటారు.
ఈ విషయంలో భాగస్వామి అవసరం లేదు కాబట్టి, ఈ పద్ధతికి అలవాటుపడి, అనేకసార్లు ప్రయోగిస్తే వ్యక్తి నీరసించిపోయే ప్రమాదముంది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే స్వయంతృప్తి వల్ల నీరసం వస్తుందని కొందరు చెప్పి ఉంటారు.
అయితే, మనిషిలో లైంగికకోరికలు పెరిగితే ..స్వయంతృప్తి చేయకున్నా , నిద్రలో కూడా వీర్య స్కలనం జరిగి, వీర్యం పోవటం జరుగుతుందని వైద్యులు చెబుతారు.
ఈ విషయాలను గమనిస్తే, లైంగికకోరికలను అదుపుచేయలేనప్పుడు , అక్రమ సంబంధాలలో పాల్గొని వ్యాధులు తెచ్చుకోవటం, గొడవలు జరగటం, మానభంగాలు చేయటం, హత్యలు, ఆత్మహత్యలు వరకు పరిస్థితి వెళ్ళటం..వంటి సమస్యల కన్నా ..ఒక లిమిట్ పాటించి స్వయంతృప్తిని పొందటం మంచిదని తెలుస్తుంది.
( లైంగిక కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో పై వివరాలను వ్రాయటం జరిగింది.)
(ఇలాంటి విషయాలను రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, సమాజంలో కొన్ని దారుణమైన వార్తలను విన్నప్పుడు ఎంతో బాధ కలిగి ఇలా రాయాలనిపించి వ్రాసాను.)
*******************
నిర్భయ సంఘటనల వంటివాటిని గమనిస్తే , మనుషుల్లో పైశాచిక ప్రవృత్తి పెరుగుతుందనిపిస్తోంది.
ఆధునిక టెక్నాలజీ వల్ల అశ్లీలదృశ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం కూడా ఇలాంటివి జరగటానికి ఒక కారణం.
అసభ్యకరమైన చిత్రాల ప్రసారం , మత్తుపదార్ధాల ప్రసారం ద్వారా కూడా మనుషుల్లో నేరప్రవృత్తి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.
ఇలాంటివాటిని ప్రసారం చేసేవారిని కూడా శిక్షించాలి.
ఇలాంటి వారు ఒకవేళ ఇక్కడ శిక్షను తప్పించుకున్నా.. దైవం వేసే శిక్షనుండి మాత్రం తప్పించుకోలేరు.
*******************
నిర్భయ సంఘటనల వంటివాటిని గమనిస్తే , మనుషుల్లో పైశాచిక ప్రవృత్తి పెరుగుతుందనిపిస్తోంది.
ఆధునిక టెక్నాలజీ వల్ల అశ్లీలదృశ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం కూడా ఇలాంటివి జరగటానికి ఒక కారణం.
అసభ్యకరమైన చిత్రాల ప్రసారం , మత్తుపదార్ధాల ప్రసారం ద్వారా కూడా మనుషుల్లో నేరప్రవృత్తి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.
ఇలాంటివాటిని ప్రసారం చేసేవారిని కూడా శిక్షించాలి.
ఇలాంటి వారు ఒకవేళ ఇక్కడ శిక్షను తప్పించుకున్నా.. దైవం వేసే శిక్షనుండి మాత్రం తప్పించుకోలేరు.
No comments:
Post a Comment