koodali

Wednesday, March 5, 2014

ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల సమస్యలు పరిష్కరించటానికే కదా !


  రకరకాల  కారణాల  వల్ల  దేశంలో  ఎప్పుడూ  ఎక్కడో  ఒకచోట  ఎన్నికలు  జరుగుతున్నాయి.   ఎన్నికలలో  ఎత్తులు  పై  ఎత్తులు,  పొత్తులు,  ఈ  కోలాహలంతోనే    పార్టీలకు  ఎక్కువ   సమయం  సరిపోతోంది.

  అధికారంలోకి  వచ్చిన   వాళ్ళకు  ,  ఇతరులు   తమ   ప్రభుత్వాన్ని   పడగొట్టకుండా  ఎలా   నిలుపుకోవాలి  ?  వంటి   సమస్యలతోనే   కాలం  గడిచిపోతోంది. 

  ప్రతిపక్షాల  వాళ్ళకు ,   తిరిగి  అధికారంలోకి  ఎలా  రావాలి  ? వంటి   ప్రయత్నాలతోనే  కాలం  గడిచిపోతోంది.

ప్రభుత్వాలను  ఎన్నుకునేది  ప్రజల  సమస్యలు  పరిష్కరించటానికే  కదా  ! అయితే   ప్రజాసమస్యల  పరిష్కారం  ఎంతవరకూ  జరుగుతోంది ?

సమాజంలో    ప్రాధమిక అవసరాలు తీరని   వాళ్ళు  చాలామంది ఉన్నారు.  ప్రభుత్వం ముందు ప్రాధమిక అవసరాలకు  ప్రాముఖ్యం ఇవ్వాలి.
................................

   ప్రభుత్వరంగ  సంస్థలను  ప్రభుత్వమే  సమర్ధవంతంగా  నడపాలి. అది  ప్రభుత్వం  యొక్క    బాధ్యత.  

అయితే,   దేశంలో  ప్రైవేటైజేషన్  పరిధికి  మించి   జరుగుతోంది.

  ప్రభుత్వ  రంగ  సంస్థలను సమర్ధవంతంగా  నడపటం  తన వల్ల  కాదంటూ    ప్రైవేట్  వారికి  అప్పగించటం  ఎక్కువైపోయింది.

  ప్రైవేటైజేషన్  కొంతవరకూ  అవసరమే  కానీ,   విపరీతంగా  పెరగటం  మంచిది  కాదు.

  ప్రజాస్వామ్య  వ్యవస్థలో  దేశ సంపద   ప్రభుత్వం   దగ్గర  మరియు  ప్రజలు   అందరి వద్దా  ఉండాలి. 

ఇప్పుడేమో ,  ప్రభుత్వం  మరియు  సామాన్య  ప్రజల వద్ద   కన్నా  కొద్దిమంది   ప్రైవేట్   సంస్థల  వద్ద ఎక్కువ ఉంటోంది.

ప్రభుత్వం  వద్ద   డబ్బు లేకపోతే ,   ఏ విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు  ?

కొద్దిమంది  వద్దే    ఎక్కువ  సంపద  ఉండకూడదని    జమీందారీ వ్యవస్థ  రద్దు  , భూపరిమితి చట్టం   వంటివి    చేశారు. 

అయితే,   రకరకాల విధానాల  వల్ల   ఇప్పుడు   మళ్ళీ  సంపద   కొందరి  దగ్గరే  చేరుతోంది.  ప్రజల  మధ్య  ఆర్ధిక  అసమానతలు   బాగా  పెరిగాయి.

 ప్రజల  మధ్య  ఆర్ధిక  అసమానతలు  తగ్గాలి.   అప్పుడు  ఎన్నో  సమస్యలూ  తగ్గుతాయి.

........................

 సమాజం కూడా  ఎంతో  మారాలి.  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  విలాసంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటాన్ని  మానుకోవాలి.


   న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో   జీవిస్తున్న  వారిని  గౌరవించటం  నేర్చుకోవాలి.



No comments:

Post a Comment