koodali

Saturday, March 29, 2014

అంతా దైవం దయ.

సామాజిక  విషయాలు,  సంసారం,   స్త్రీలు,  పురుషుల  విషయాల  గురించి   మాట్లాడటం  తప్పనుకుంటారు  కొందరు. ....సామాజిక  విషయాల  గురించి  మాట్లాడుకోవటం తప్పుకాదు.


అయితే,   దైవపూజా   విధానాలతోపాటు    సంసారం,   స్త్రీలు,  పురుషుల  వంటి  విషయాలను  కూడా  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  తెలియజేసారు   కదా  !



 జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో ,  ఎలా ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా పెద్దలు  తెలియజేసారు.



అవన్నీ  తెలుసుకుని  మన  జీవితాలను  సరైన  పద్ధతిలో  మలుచుకోవాలన్నది  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.



పూజామందిరంలో  కూర్చుని  దైవప్రార్ధన  చేయటం  పూజనే...దానితోపాటు   సత్ప్రవర్తనతో  జీవించటం  కూడా  దైవపూజ  వంటిదే.
...........................


ఎవరైనా మనలను  సరిగ్గా  పట్టించుకోకపోతే మనం   ఎంతో  బాధపడతాము. మరి  మనకు   జీవించటానికి  అవసరమైన  గాలి,  నీరు  వంటి  ఎన్నింటినో   ఇచ్చిన  దైవాన్ని  గురించి  మనం ఎంతవరకూ   పట్టించుకుంటూన్నాము?  


  దైవం  మనకు  ఎన్నో  ఇస్తున్నారు.  అందరికీ  ఆత్మబంధువు  దైవం.

.....................

మాకు  కూడా  దైవం  దయ  వల్ల   మంచి  జరిగింది . 

 మా  ఇద్దరు  పిల్లలలో  ఒకరికి  కొంత కాలం  క్రిందట  ఉద్యోగం  లభించింది .  ఒకరికి  ఉన్నతవిద్య   చదవటానికి  అవకాశం  లభించింది.  అంతా  దైవం  దయ. దైవానికి  అనేక  కృతజ్ఞతలు .
.....................


నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  బ్లాగులో  ఈ  మాత్రం    విషయాలను   వ్రాయగలుగుతున్నానంటే  అంతా  దైవం  దయే.... దైవానికి  అనేక  కృతజ్ఞతలు .
....................


ప్రపంచం  శాంతి , సౌభాగ్యాలతో  కళకళలాడాలని  కోరుకుంటున్నాను.



2 comments:

  1. ఎవరైనా మనలను సరిగ్గా పట్టించుకోకపోతే మనం ఎంతో బాధపడతాము. మరి మనకు జీవించటానికి అవసరమైన గాలి, నీరు వంటి ఎన్నింటినో ఇచ్చిన దైవాన్ని గురించి మనం ఎంతవరకూ పట్టించుకుంటూన్నాము ?

    I accept this

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete