koodali

Wednesday, March 26, 2014

భార్యాభర్త .... మధ్యన మూడో వ్యక్తి వద్దు.


ఈ రోజుల్లో మారిన సమాజపు పోకడ వల్ల వ్యవస్థలో   ఎన్నో మార్పులు వచ్చాయి.

 ...............................

  మధ్య  వచ్చిన  ఒక  కధలో  ఒక  స్త్రీ  ఒక  పురుషుడు  ఒకరినొకరు  ఇష్టపడతారు.  ఇద్దరూ  వివాహమై  పిల్లలున్నవారే. 

ఇప్పటి  సమాజంలో  ఇలాంటి  సంఘటనలు  జరుగుతున్నాయి  కాబట్టే  అలాంటి  కధను  వ్రాసారు . 

అసలు  వివాహమైన  స్త్రీలు,  పురుషులు    ఇంకొకరి  భార్యనో   లేక  ఇంకొకరి  భర్తనో  ఇష్టపడటమేమిటి  ? ఇది  అధర్మం  కదా !

ఈ  రోజుల్లో  స్త్రీలకు  పురుషులకు  స్వేచ్చగా  మాట్లాడుకోవటానికి    ఎన్నో  అవకాశాలున్నాయి.  స్త్రీలు,  పురుషులు  మాట్లాడుకోవటంలో  తప్పులేదు.


 పర  స్త్రీని  సోదరి గానూ.... పర  పురుషుడిని  సోదరుని గాను  భావించినప్పుడు  ఎటువంటి  ఇబ్బందులు  ఉండవు.


.....................................

మాకు  తెలిసిన  ఒక  కుటుంబములో   భర్త  యొక్క   వివాహేతర  సంబంధాన్ని  తట్టుకోలేక  భార్య  ఆత్మహత్య  చేసుకుంది.

  ఇంకొక  కుటుంబంలో  భార్య  యొక్క  వివాహేతర  సంబంధాన్ని  తట్టుకోలేక  భర్త  ఆత్మహత్య  చేసుకున్నాడు. 

స్త్రీలు,  పురుషులు  కలుపుగోలుగా  మాట్లాడుకోవటం  అనేది  అనేక  అపోహలకు  దారితీసి  కొన్ని  కుటుంబాలలో      గొడవలు  జరుగుతున్నాయి.

................................. 

  కొన్ని  వార్తాపత్రికలలో  సైకాలజిస్టులను  కొందరు  సలహాలు   అడుగుతుంటారు. కొన్ని  సమస్యలను   గమనిస్తే  సమాజంలో   వివాహేతర  సంబంధాలు  ఎంతలా  పెరిగాయో  తెలుస్తుంది.
....................... 


ఈ రోజుల్లో ....
స్త్రీలు,  పురుషుల   మధ్య పరిచయాలకు ఎంతో అవకాశం ఏర్పడింది.కొందరి విషయంలో ఆ పరిచయాలు పెడత్రోవ పడుతున్నాయి.

అంతే, అప్పటివరకు   ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుని ఒద్దికగా గడిపిన భార్యాభర్త వారి పిల్లలతో కూడిన కుటుంబం అనే ఆ బంధం విచ్చిన్నమయిపోతుంది...


పోయిన వారు పోగా మిగిలిన వారు ఒంటరి పక్షుల్లా మిగిలిపోతారు నిస్సహాయంగా.

అలా ఒంటరిగా మిగిలిపోయిన భార్య గానీ భర్త గానీ వారి పరిస్థితి అయోమయమే .. వారి పిల్లల పరిస్థితి అంతకన్నా అయోమయం.

 
అయినా ఇలా ఇతరుల కుటుంబములో చిచ్చుపెట్టడం న్యాయమా ?

..........................................  
 
మన దగ్గర కొన్ని ఉండకపోవచ్చు . అవి ఇతరుల దగ్గర ఉండవచ్చు. అంతమాత్రాన అవి మన సొంతమవాలని కోరుకోవటం ఏం న్యాయం ?


మనకు నచ్చాయని ప్రక్కింటి వారి కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో మచ్చిక చేసి మన ఇంటికి తెచ్చేసుకుని మన సొంతం చేసుకుంటానంటే ఎవరూరుకుంటారు ?


మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా అని .... ఎదుటివారి డబ్బు కావాలని ఆశ పడి ప్రయత్నిస్తే  ఏమవుతుంది ? వారిని ఏమంటారు ?

 ఇతరుల వస్తువులు లాక్కునేవారికి శిక్షలున్నాయి. కానీ ఇతరుల కాపురాన్ని  కూల్చేవారికి  ..... ?


ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ అధర్మంగా అయినే సరే పొందాలనుకోవటం అన్యాయం.


ఒక జంట వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని ........ భార్యాభర్త   బయటి ఆకర్షణల విషయంలో తప్పుటడుగులు వేయకూడదు మరి.




6 comments:

  1. ఇది మన సంస్కృతి కాదు. మనదికానిదాన్ని ఇష్టపడి కష్టాలు తెచ్చుకుంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు, ఇది మన సంస్కృతి కాదు. మనదికానిదాన్ని ఇష్టపడి కష్టాలు తెచ్చుకుంటున్నారు.

      Delete
  2. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. తిలక్ "నీతి కట్టె లాంటిది, కోరిక మంట లాంటిది, అందుకే సారంగధరుడి కొంప కాలింది" - అని ఒక చోట కవితాత్మకంగా వ్యాఖ్యానించాడు.

    ఇవ్వాళ కోరిక యేడుపుగా మారింది.

    మొదట - వాడి కది ఉంది నాకు లేదు - అనే యేడుపు వస్తుంది.
    అది కాస్తా వస్తే - ఇది నాకూ ఉంది, వాడికీ ఉంది ఇందులో గొప్పేముంది యెవడికీ లేంది కావాలి నాకు - అనే యేడుపు లా మారుతుంది.
    అది కూడా వచ్చాక -ఇది నాకొక్కడికే ఉంది, మిగతా వాళ్ళంతా దీన్ని చూసి కుళ్ళిపోతున్నారేమో - అనే యేడుపు యెగదన్నుకొస్తుంది.

    కోరిక కోరికలా ఉంటే కష్టపడి సాధించాలనిపిస్తుంది.యేడుపులా మారితే వీలుంటే పక్కోడి నుంచి కొట్టెయ్యాలని లేకపోతే వాడిక్కూడా దక్కకుండా నాశనం చెయ్యాలని అనిపిస్తుంది.

    ఈ యేడుపే అన్ని యేడుపులకీ మూలం.యేడ్పు సత్యం నవ్వు మిధ్య:-)

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరు వ్రాసింది నిజమే.

    ReplyDelete