koodali

Saturday, March 15, 2014

రాబోయే తరాల వాళ్ళను మానసిక, శారీరిక ధృఢత్వం ఉన్న వ్యక్తులుగా తయారుచేయాలి....



  వ్యక్తులకు  శారీరిక  ఆరోగ్యం   మానసిక  ఆరోగ్యం   రెండూ  ముఖ్యమే. ‌‌

యీసురోమని మనుషులుంటే   దేశమేగతి బాగుఅగునోయ్......అని  పెద్దవాళ్ళన్నారు.


  కాబోయే  దేశపౌరులయిన  పిల్లల   పట్ల  తల్లితండ్రులు  ఎంతో  శ్రద్ధ  తీసుకోవలసి  ఉంది. ఆరోగ్యంగా  ఉంటే  ఏ  పనైనా  చేయగలం.   చక్కటి  పుష్టికరమైన  ఆహారం  పెరిగే  పిల్లలకు  ఎంతో  అవసరం. 


బలహీనంగా  ఉండే  మొక్కకు  పూచే  పువ్వులు,  కాచే  పండ్లు   చక్కగా  ఉండవు.   ఆరోగ్యంగా  ఎదిగిన  మొక్కలకు  చక్కటి  పువ్వులు,  చక్కటి పండ్లు  వస్తాయి.

ఆరోగ్యంగా  పెరిగిన  వ్యక్తులకు  కలిగిన  సంతానం  ఆరోగ్యంగా  జన్మిస్తారు.


   రాబోయే  తరాల  వాళ్ళు   మానసికంగా,  శారీరికంగా  ఆరోగ్యంగా,  దృఢంగా  ఉండాలంటే ....  ఇప్పటి  పెద్దవాళ్ళు  పిల్లల  పట్ల  శ్రద్ధ  తీసుకోక  తప్పదు. 

   తల్లితండ్రులు  శ్రద్ధ  తీసుకోకపోతే  పిల్లలు  సరిగ్గా  ఆహారం  తీసుకోరు. వాళ్ళకిష్టమైన  జంక్  పుడ్స్  ఎక్కువ  తంటూ  కడుపు  నింపేసుకుంటారు.  హాస్టల్స్లో  ఫుడ్  నచ్చకపోతే    చారన్నంతో  సరిపెట్టేసుకుంటారు. 


ఏం తినాలో  ?  ఎంత  తినాలో  ?  ఏమి  తినకూడదో  ?  పిల్లలకు  ఎలా   తెలుస్తుంది ? పెద్దవాళ్ళ  మార్గదర్శకత్వం  అవసరం  కదా !


జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో  ?  ఎలా ప్రవర్తించ కూడదో   ? పిల్లలకు  ఎలా   తెలుస్తుంది ?  పెద్దవాళ్ళ  మార్గదర్శకత్వం  అవసరం  కదా !


జీవితంలో  శారీరిక  ఆరోగ్యంతో  పాటు  మానసిక  ఆరోగ్యం  కూడా  ముఖ్యమే.


 ఈ  రోజుల్లో   నైతిక  విలువలను  పాటించని   వ్యక్తుల  వల్ల    సమాజానికి  ఎంతో  హాని  జరుగుతోంది.

నైతికవిలువలతో  పెరిగిన  వ్యక్తుల  సంఖ్య  పెరిగితే   సమాజంలో  చెడ్డపనులు  జరగటం  గణనీయంగా  తగ్గుతుంది. 


 అందువల్ల  ప్రతి  తల్లితండ్రులు  తమ  పిల్లలను  ఆదర్శవంతమైన  వ్యక్తులుగా  తీర్చిదిద్దటానికి  ప్రయత్నిస్తే  ఎంతో  సమాజసేవ  చేసినవారవుతారు. 

 నేరం  జరిగిన  తరువాత    శిక్షించటం  అవసరమే.  అయితే  నేరమే  జరగకుండా  చూడటం  మరింత  మంచిది  కదా  ?

తల్లితండ్రులు    తలుచుకుంటే  ముఖ్యంగా  తల్లి    తలుచుకుంటే  ఇలాంటి  చక్కని  సమాజాన్ని తయారు చేయగలదు.


******************
వందేమాతరం ..బ్లాగులో....  దేశమును ప్రేమించుమన్నా -------- గురజాడ అప్పారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం  ప్రచురించారు . 

 

No comments:

Post a Comment