ఈ మధ్యనే ఒక పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడిని రక్తం కారేలా కొట్టిన వార్తను విన్నాము. రెండురోజుల తరువాత కానీ పిల్లవాడికి జరిగిన విషయాన్ని గురించి ఇంట్లోవాళ్ళు తెలుసుకోలేకపోయారట.
ఇక హాస్టల్స్లో ఇలాంటివి జరిగితే పిల్లలకు జరిగిన విషయాన్ని ఇంట్లోవాళ్ళు తెలుసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?
ఎంతమంది తల్లితండ్రులు విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. డబ్బు, సీటు కన్నా పిల్లలే ముఖ్యం అనుకునే తల్లితండ్రులు ఎంతమంది ?
ఎంతో డబ్బు పోసి హాస్టల్లో చేర్పించాము, ఈ సీట్ వదులుకుంటే కష్టం అనుకుని బాధలు భరించే వాళ్ళూ ఉంటారేమో ?
విద్యాలయాల్లో చదువుల వత్తిడిని, తోటివారి , పైవారి వేధింపులను తట్టుకోలేక కొందరు పిల్లలు ప్రాణాలను కోల్పోయిన వార్తలను విన్నాము.
.....................................
ఇంట్లో ఉంటే పిల్లలకు సరిగ్గా సాగదని భావించి కొందరు తల్లితండ్రులు , గొప్ప కాలేజీ అని కొందరు ... తమ పిల్లలను హాస్టల్లో వేస్తారు.
అయితే హాస్టల్లో తోటి పిల్లల అల్లరితో చదువు సాగక మార్కులు తక్కువ మార్కులు వచ్చిన పిల్లలూ ఉన్నారు.
హాస్టల్ నచ్చలేదని ఇంటికి వచ్చేసిన పిల్లలను కోప్పడకుండా , హాస్టలుకు కట్టిన ఫీజులను కూడా వదులుకుని .... ఉన్న ఊళ్ళోనే కాలేజీలో చేర్పించిన తల్లితండ్రులూ నాకు తెలుసు.
పిల్లల బాధను అర్ధం చేసుకునే ఇలాంటి తల్లితండ్రులు అభినందనీయులు.
.................................
హాస్టల్స్ లో కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు తెలిసిన కొందరు పిల్లలు చెప్పినదాని ప్రకారం హాస్టల్లో ఉదయాన్నే స్నానం చేసి కాలేజీకి వెళ్ళాలంటే బాత్రూంస్ ఖాళీ ఉండవట.
ఉదయం టాయ్ లెట్ కు వెళ్లాలన్నా సమయం కుదరదట. అందుకని కొందరు పిల్లలు రాత్రి పూట స్నానం చేసి ఇక ఉదయానే స్నానం చేయరట. ఇలా ఇబ్బందులూ ఉన్నాయి.
ఇక, కొందరు పిల్లలకు కొన్ని పదార్ధాలు తింటే సరిపడవు . ఇంట్లో అయితే పెద్దవాళ్ళు పిల్లల శరీరతత్వానికి సరిపడే విధంగా అవసరమైన విధంగా ఆహారాన్ని అందిస్తారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే పిల్లలకు ఇవన్ని కుదరవు కదా!
పిల్లలకు తల్లితండ్రితో కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది. తమకు నచ్చిన వంటకాలను వండించుకుని తినాలని ఉంటుంది. అనారోగ్యం వస్తే తల్లితండ్రితో బాధ చెప్పుకోవాలని అనిపిస్తుంది.
హాస్టల్స్ లో పిల్లలకు అనారోగ్యం వచ్చినా పెద్దవాళ్ళు దగ్గర ఉండరు. ఇలా చాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక పిల్లలకు తల్లితండ్రి ఎంత డబ్బు సంపాదించి ఇచ్చినా ఏమిటి సంతోషం ?
పూర్వం తల్లులు చక్కటి ఆహారాన్ని వండి ఆప్యాయంగా పిల్లలకు తినిపించుకునేవారు. పిల్లలకు అనారోగ్యం వచ్చినా దగ్గరుండి చూసుకునే వారు. అలా పెద్దవాళ్ళు పిల్లల మధ్య చక్కటి ఆప్యాయతలు, అనుబంధాలు ఉండేవి.
పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం లేనంతగా కొందరు తల్లితండ్రి బిజీ అయిపోతున్నారు. ఇదేమిటంటే పిల్లలకు డబ్బు సంపాదించటం కోసమే కదా మేము తాపత్రయపడుతున్నాము ....అని తల్లితండ్రులు అంటున్నారు.
చిన్నతనం నుంచి ఒంటరిగా బ్రతకటానికి అలవాటయిన పిల్లలు పెద్దయిన తరువాత తమ బిజీ లైఫ్ వల్ల తల్లితండ్రిని ఖరీదైన వృద్ధాశ్రమంలో వేస్తే తల్లితండ్రి బాధపడతారు.
( వాళ్ళూ తమ పిల్లలకు మళ్ళీ బిజీగా డబ్బును సంపాదించాలి కదా ! )
అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారంటే, మాకు ఖరీదైన వృద్ధాశ్రమాలు వద్దు ..... పిల్లలు మాతో కొంచెం సేపు మాట్లాడితే బాగుండు , మాకు అనారోగ్యం వస్తే మా వద్ద కూర్చుని, మాతో కొంచెం సేపు ఓదార్పుగా మాట్లాడితే చాలు ... అంటారు.
మరి ఇలా అనే పెద్దవాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎంతసేపు మాట్లాడి కష్టసుఖాలు పంచుకున్నారో ఆలోచించుకోవాలి.
పూర్వకాలంలొ పిల్లలను హాస్టల్స్ లో వేయటం చాలా తక్కువగా ఉండేది. అయితే కొందరు రాజులు వారి కుమారులను గురుకులాలకు పంపేవారు. అక్కడ గురువు గురుపత్ని ఆ పిల్లలను తమ సొంత పిల్లలకు వలె ఎంతో చక్కగా చూసుకునేవారు.
ReplyDeleteఅయితే గురుకులాలలో ఎక్కువకాలం ఉండే అవసరం ఉండేది కాదు. నాకు తెలిసినంతలో, టీనేజ్ దాటకముందే ఇంటికి వెళ్ళిపోయేవారు. తరువాత కొంతకాలానికి వివాహం చేసుకునేవారు.
( ఈ రోజుల్లో 30 ఏళ్ళు వచ్చినా ఇంకా చదువుకోవటంతోనే సరిపోతోంది. )
అయితే, అప్పటి రాజులు కొందరు రాజ్యాన్ని వారసులకు అప్పగించిన తరువాత వానప్రస్థాశ్రమం వంటివి స్వీకరించినట్లు తెలుస్తుంది.
ఇక, వాళ్ళు తమ పిల్లలు తమను సరిగ్గా పట్టించుకుంటున్నారా ? లేదా ? అనే విషయాలకు ఎంతవరకు ప్రాముఖ్యతను ఇచ్చేవారో ? సరిగ్గా తెలియదు.
అయితే ఆ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దవాళ్ళను చక్కగా గౌరవించేవారనిపిస్తుంది.
పూర్వకాలంలో చాలామంది పిల్లలకు ఇప్పటిలా విద్య కోసం బయట పాఠశాలలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయవలసిన అవసరం ఉండేది కాదు.
ఉద్యోగం కోసం వెతుక్కుంటూ నిరుద్యోగిగా తిరిగే అవసరమూ ఉండేది కాదు. వచ్చిన ఉద్యోగాన్ని పై వాళ్ళు ఎప్పుడు పీకేస్తారో అనే భయమూ ఉండేది కాదు.
తమకు చేతిలో వృత్తినైపుణ్యం ఉండేది కాబట్టి ఉపాధి కోసం ఇతరులపై ఆధారపడకుండా తమ బ్రతుకులు తాము బ్రతికేవారు.
పూర్వకాలంలో తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు చిన్నతనం నుంచి తండ్రికి చేదోడుగా ఉండి వ్యవసాయం లోని పద్ధతులను నేర్చుకునే వారు. తండ్రి వ్యాపారస్తుడు అయితే పిల్లలూ వ్యాపారంలోని కిటుకులను తండ్రి నుంచి నేర్చుకునేవారు.
తండ్రి వైద్యుడు అయితే పిల్లలూ తండ్రి నుంచి వైద్యశాస్త్రాన్ని నేర్చుకునేవారు. తండ్రి చేతి వృత్తి పనిమంతుడైతే పిల్లలూ ఆ నైపుణ్యాన్ని అలవరుచుకునేవారు.
అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసే నైపుణ్యం ఉన్న దేశం మనది. అద్భుతమైన నైపుణ్యం ఉన్న కట్టడాలు కట్టే నిపుణులు ఉన్న దేశం మనది.
వరంగల్ వద్ద గల వేయిస్థంబాల కట్టడం ఇసుక , నీరు పై కట్టబడిందట. అలా నిర్మించిన అప్పటి పనిమంతుల నైపుణ్యానికి ఇప్పటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పూర్వకాలంలో సిమెంట్ లేకుండానే జిగురు, బెల్లం , సున్నం ...మొదలైన వాటిని తగు పాళ్ళలో మిళితం చేసి పటిష్టమైన కట్టడాలను నిర్మించారు. ఆ కట్టడాలు చాలా కాలం దృఢంగా ఉండేవి.
ఇప్పటి వారిలా కాలేజీల్లో విద్యాభ్యాసం చేయకపోయినా ఆ రోజుల్లో గొప్ప నైపుణ్యం కలిగిన వృత్తి పనిమంతులు ఉండేవారు.
అప్పటి వాళ్ళు ప్రకృతితో మమేకం అయి జీవించేవారు. ఇప్పటి వారు ప్రకృతికి దూరంగా నాలుగు గోడల మధ్య బందీ అయి ప్రాణం లేని యంత్రాల మధ్య ప్రాణం ఉన్న యంత్రాలుగా జీవిస్తున్నారనిపిస్తోంది.
ఈ మధ్యనే ఒక పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడిని రక్తం కారేలా కొట్టిన వార్తను విన్నాము. రెండురోజుల తరువాత కానీ పిల్లవాడికి జరిగిన విషయాన్ని గురించి ఇంట్లోవాళ్ళు తెలుసుకోలేకపోయారట.
ReplyDeleteఇక హాస్టల్స్లో ఇలాంటివి జరిగితే పిల్లలకు జరిగిన విషయాన్ని ఇంట్లోవాళ్ళు తెలుసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?
ఎంతమంది తల్లితండ్రులు విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. డబ్బు, సీటు కన్నా పిల్లలే ముఖ్యం అనుకునే తల్లితండ్రులు ఎంతమంది ?
ఎంతో డబ్బు పోసి హాస్టల్లో చేర్పించాము, ఈ సీట్ వదులుకుంటే కష్టం అనుకుని బాధలు భరించే వాళ్ళూ ఉంటారేమో ?
విద్యాలయాల్లో చదువుల వత్తిడిని, తోటివారి , పైవారి వేధింపులను తట్టుకోలేక కొందరు పిల్లలు ప్రాణాలను కోల్పోయిన వార్తలను విన్నాము.
.....................................
ఇంట్లో ఉంటే పిల్లలకు సరిగ్గా సాగదని భావించి కొందరు తల్లితండ్రులు , గొప్ప కాలేజీ అని కొందరు ... తమ పిల్లలను హాస్టల్లో వేస్తారు.
అయితే హాస్టల్లో తోటి పిల్లల అల్లరితో చదువు సాగక మార్కులు తక్కువ మార్కులు వచ్చిన పిల్లలూ ఉన్నారు.
హాస్టల్ నచ్చలేదని ఇంటికి వచ్చేసిన పిల్లలను కోప్పడకుండా , హాస్టలుకు కట్టిన ఫీజులను కూడా వదులుకుని .... ఉన్న ఊళ్ళోనే కాలేజీలో చేర్పించిన తల్లితండ్రులూ నాకు తెలుసు.
పిల్లల బాధను అర్ధం చేసుకునే ఇలాంటి తల్లితండ్రులు అభినందనీయులు.
మీరు చెప్పినవన్నీ వాస్తవాలే...
ReplyDeleteహాస్టల్ కి తమ పిల్లల్ని పంపబోయే తల్లితండ్రులు కొందరైనా ఈ పోస్ట్ చదివి తమ పిల్లల్ని ఆరా తీసి వాళ్లకు హాస్టల్ చదువులు ఇష్టం లేకపోతె వాళ్ళ మనసుకు నచ్చే విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశమిస్తే అటు తల్లితండ్రులకి ఇటు పిల్లలకి ఆనందం కలుగుతుంది. ఆ విధంగా పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ గట్టి చర్యలు తీసుకోవాలి.
ఇలాంటివి జరగటానికి గల మూలకారణాలను శోధించి, కనుగొని , సమస్యలను పరిష్కరించాలి.