నిష్కామ కర్మ గురించి భగవద్గీత నుంచి చక్కగా తెలుసుకోవచ్చు.
నిష్కామకర్మ యోగం ఆచరించే వ్యక్తి.. ప్రతి జీవికి పరమ లక్ష్యమైన మోక్షాన్ని అందుకోగలరు.
జీవితంలో నిష్కామ కర్మయోగం ఎంతో అవసరం... స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఫలితాన్ని గురించిన తాపత్రయాన్ని వదిలేస్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది.
................
ఈ రోజుల్లో నిష్కామకర్మను హేళన చేస్తున్న వారు కొందరు ఉన్నారు. అలా హేళన చేయటం వారి దురదృష్టం.
నిష్కామకర్మ అంటే దేనిపైనా శ్రద్ధ లేకుండా నిస్సారంగా జీవించటం కాదు.
జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవటానికి శక్తిని అందిస్తూ ..ఆటుపోట్లకు క్రుంగిపోని చక్కటి జీవితాన్ని పొందటానికి అద్భుతమైన మార్గమిది.
( అతిసంతోషం కలిగించే వార్త కాని అతివిచారం కలిగించే వార్త కానీ సడన్ గా వింటే .. గుండెపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందట. ఎక్కువ సంతోషమైనా, ఎక్కువ విచారమైనా.. ఒకేలా ప్రభావాన్ని చూపించటం ఆశ్చర్యకరం.)
జీవితంలో నిష్కామకర్మను ఆచరించే వారు దేనికీ పొంగరు, దేనికీ క్రుంగరు కాబట్టి వారికి ఈ బాధలుండవు .
.....................
ఏ పని ఆచరించినా కూడా చక్కటి ఫలితాలు లభించాలని ఆచరిస్తాము. చక్కటి ఫలితాలు రావాలని కోరుకోవటంలో తప్పు లేదు.
అయితే, ఎప్పుడూ ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. అలాంటప్పుడు నిష్కామకర్మయోగి నిరాశతో క్రుంగిపోవటం ఉండదు.
ఉదా.. చక్కగా చదివి పరీక్షలు వ్రాయటం వరకు విద్యార్ధి వంతు.
చక్కగా చదివి ఫలితాన్ని గురించి ఆందోళన చెందకుండా పరీక్ష వ్రాస్తే చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
ఫలితం గురించి అదే పనిగా వర్రీ అయితే పరీక్ష సరిగ్గా వ్రాయలేకపోవచ్చు, వర్రీవల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా ఉంది.
శక్తికి మించి ప్రయత్నించినా , కొన్నిసార్లు ఫలితం విద్యార్ధి చేతుల్లో పూర్తిగా ఉండకపోవచ్చు.
ఈ రోజుల్లో పోటీపరీక్షలలో అతిపోటీ వల్ల కొద్దిపాటి తేడావల్ల కూడా ఉన్నత విద్యాభ్యాసం చేయటానికి అవకాశాన్ని కోల్పోతున్న విద్యార్ధులెందరో ఉన్నారు.
ఇంటర్వ్యూకు ఎంతముందు బయలుదేరినా ట్రాఫిక్ జాం వల్ల సకాలంలో చేరలేకపోవచ్చు.
( నిష్కామ కర్మతో నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తే ,తిరిగి మళ్ళీ ప్రయత్నించి చక్కటి ఫలితాన్ని పొందే అవకాశమూ ఉంది. )
మరి కొన్నిసంఘటనలను పరిశీలిస్తే .. అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ప్రయాణంలో ఆపదలో చిక్కుకున్నవారు ఉంటారు. కొన్ని కారణాల వల్ల , కొనుక్కున్న టికెట్ ను కాన్సిల్ చేసుకుని జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకునే వారూ ఉంటారు.

అత్యంత ప్రమాదకరమైన సంఘటనలో కూడా అత్యంత ఆశ్చర్యకరంగా సురక్షితంగా బయటపడినవారూ ఉంటారు.
( ఏది ఎందుకు ఎలా జరుగుతుందో ? అలా జరగటానికి వెనుక ఉన్న కారణాలేమిటో భగవంతునికే తెలుస్తాయి.)
సమాజంలో ఎన్నో సంఘటనలను పరిశీలిస్తే, జీవితంలో మనిషి చేతిలో లేని సంఘటనలు కూడా జరిగే అవకాశముందని అర్ధమవుతుంది.
అయితే, నిష్కామకర్మ ఆచరించే వారికి క్రుంగుబాటు దరిచేరదు.
సంసార జీవితంలో స్త్రీలకు, పురుషులకు ఎదురయ్యే సమస్యలకు కూడా నిష్కామకర్మ అనేది అద్భుతమైన పరిష్కారమార్గం.
.......................
జనకమహారాజు సంసారంలో ఉంటూ రాజ్యపాలన చేస్తూనే నిష్కామయోగిగా జీవించారని పెద్దలు తెలియజేసారు.
అయితే, మనస్సును అదుపులో ఉంచుకోవటం, చుట్టూ సమాజంలో ఉన్న పరిస్థితుల మధ్య నిష్కామకర్మయోగాన్ని ఆచరించటం అనేవి అంత తేలికయిన పనులు కావు.
నిష్కామకర్మయోగాన్ని ఆచరించటం అనేది సాధ్యమవ్వాలంటే దైవకృప ఎంతో అవసరం.
దైవకృపను పొందాలంటే దైవానికి నచ్చిన మార్గంలో ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. ఆ శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణు వేడాలి.

No comments:
Post a Comment