అందరికి.. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
............
marikonni vishayamulu..
పాతకాలంలో ఆహారధాన్యాలను పండించుకోవటానికి పొలాలను దున్నటానికి పశువులను ఉపయోగించేవారు. పశువుల పెంపకం పెరిగి, వాటి దూడలు త్రాగగా మిగిలిన పాలను మనుషులు వాడుకోవటం జరిగేది.
చాలామంది తాము పెంచుకున్న పశువులను చక్కగా చూసుకునేవారు. వృద్దాప్యంలో కూడా అవి మరణించేవరకూ బాగా చూసుకునేవారు.
పశువులను మంచిగా చూసుకునేవారు వాటితో పొలం పనులు చేయించవచ్చు. అలా ఆసక్తి లేనివారు ట్రాక్టర్ ఉపయోగించవచ్చు.
ఈ
రోజుల్లో వ్యవసాయం చేయటానికి ట్రాక్టర్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ వల్ల
భూసారం దెబ్బతింటుందని కొందరు అంటున్నారు.
అయితే, ఆధునికకాలంలో మనుషుల వల్ల పర్యావరణానికి ఎన్నో విధాలుగా ఎంతో హాని జరుగుతోంది. పురుగులమందుల వల్ల కూడా భూసారం పోతుంది.
అందువల్ల పశువులను బాధపెట్టకుండా ట్రాక్టర్లను వాడుకోవచ్చు. భూసారం పోకుండా ట్రాక్టర్ల డిజైన్ మార్చవచ్చు.

No comments:
Post a Comment