koodali

Thursday, January 22, 2015

షిరిడి సాయిబాబా గురువుకాదు, దేవుడుకాదు అనటం అన్యాయం..

 
ఎన్నో చక్కని బోధలు చేసిన  సాయిబాబా గురువు కాదనటం అన్యాయం. సమాజంలో పెరుగుతున్న మతఘర్షణలను నివారించే విధంగా బోధనలు చేసిన సాయిబాబాను తప్పుపట్టటం సమంజసం కాదు. 

సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అని సాయి బోధ. సబ్ కా మాలిక్ ఏక్ హై..

సాయిబాబా అల్లామాలిక్ అనటం వల్ల హిందువు కాదు అంటున్నారు. మరి, సాయి హిందువులలాగ ధునిని వెలిగించారు, విబూదిని(ఊదీని)   పంచేవారు.

.....................

సాయిపూజా విధానంలో , సరళమైన విధివిధానాలు  ..వంటివెన్నో  ప్రజలను ఆకర్షించాయి. క్రమంగా ఎందరో ప్రజలు  సాయిబాబాను గురువుగా  ఆరాధించటం మొదలుపెట్టారు. 
 
పశుపక్ష్యాదులనే గురువులుగా స్వీకరించవచ్చని సాక్షాత్తూ దత్తాత్రేయుల వారే తెలియజేసినప్పుడు సాయి వంటి గొప్ప వ్యక్తిని గురువుగా భావించకూడదని ఎందుకంటున్నారు ?

.........................
 
సాయి ముస్లింలకు  సంబంధించిన  విధంగా అల్లామాలిక్  అనేవారు  అలాగే   హిందువులకు   సంబంధించిన  విధంగా ధునినీ వెలిగించేవారు, ఊదీని(విభూతిని) పంచేవారు.సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అన్నదే సాయి బోధ.

 దైవం ఒక్కరే  అన్నది  ఏ మతం వారు  అయినా అంగీకరించవలసిన విషయం. ఏ మతం వారైనా విశ్వాన్ని తాము పూజించే దైవమే సృష్టించారని నమ్ముతారు. విశ్వం మొత్తాన్నీ ఒకే దైవం సృష్టించారనే  మాటను గమనిస్తే  అన్ని మతాల ప్రజలనూ సృష్టించిన దైవం  ఒక్కరే అవుతారు  కదా ! 


ప్రతి మతానికీ  వేరువేరు  దైవాలున్నారని  అనుకుంటే వారివారి  దైవాల  గొప్పతనాన్ని  వారు  తక్కువ  చేసుకున్నట్లే. నా దృష్టిలో  దైవం  ఒక్కరే. సూర్యుని  కొందరు సన్  అంటారు, కొందరు సూర జ్ అంటారు..కొందరు సూర్యుడు అంటారు..


అలాగే ఏ మతం వాళ్ళయినా పూజించే దైవశక్తి ఒక్కటే. కొందరు క్రీస్తు అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు 
దుర్గమ్మా శివా కేశవా..  అంటారు..కొందరు  దైవాన్ని నిరాకారంగా ఆరాధిస్తారు.హిందూ మతంలో కూడా నిరాకార ఆరాధన ఉంది.
 
 
ఎవరి దేవతారూపాలను వారు ఆరాధించుకోవచ్చు. అయితే, కొన్ని మతాలవారు ఇతర మతాలను నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంటారు. నయానాభయానా ఇతరులను తమ మతంలోకి మార్చటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది తప్పు.

......................... 

సాయిని ఆరాధించేవారు  మతమేమీ మారటం లేదే.  హిందూమతంలో ఉంటూనే   సాయిని కూడా ఆరాధిస్తున్నారు.   దయచేసి  ఈ విషయాలను గమనిస్తే బాగుంటుంది.

అయితే, వ్యాసపూర్ణిమ వ్యాసమహర్షిది కాబట్టి,  వ్యాసమహర్షిని స్మరించుకోవాలి.

*************

No comments:

Post a Comment