ప్రాచీనకాలంలో... ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న పద్ధతి ఉండేదేమో అనిపిస్తుంది. విదేశాల్లో ప్రాచీన ఆనవాళ్ళకు.... భారతీయ సంస్కృతికి పోలికలు ఉన్నాయని కొందరు కనుగొన్నారట.
పేర్లు అన్నీ మరీ ఒకేలా ఉండకపోవచ్చు. కాలక్రమేణా పేర్లలో మార్పులు వచ్చి ఉండవచ్చు.
మనదేశంలో కొన్ని ఊర్లకు ఆ పేర్లు రావడానికి వెనుక కొన్ని కధలు చెబుతారు. ఆ పేర్లు కాలక్రమేణా కొన్ని మార్పులు చెందాయని చెబుతుంటారు.
*Shocking similarities between ancient indian & Egyptian mythology | United originals english * Top
Similarities Between Hindu Gods And Greek Gods | In Telugu | Kranthi Vl
*Striking Similarities Between the Indian & Mayan Gods! | Dr.D.K.Hari | Dr.D.K.HemaHari | BharathGyan
*The true origins of ancient Egyptian civilisation: India (Vedic Hindu) Radha Mohan Das - Vedic Science and history ***** ప్రాచీనకాలంలో ఏం జరిగిందో కానీ .. ఇప్పుడు ప్రపంచంలో అనేక మతాలున్నాయి. ఒకే హిందుమతంలోని వారు కూడా బౌద్ధ, జైన..వంటి మతాలుగా ఏర్పడ్డారు. ఇంకా శైవులు, వైష్ణవులు..వంటి ఎన్నో విభాగాలున్నాయి. అన్ని మతాలలోనూ మంచివారుంటారు, చెడ్దవారుంటారు. ************** మరికొన్ని విషయాలేమిటంటే, కొంతకాలం
క్రిందట ఒకరు సాయి అనే పదం హిందువుల గ్రంధాలలో లేదంటే, నేను శాయి అనే
పదం ఉందని వ్రాసాను. ఉదా..వటపత్రశాయి. ఈశా ..అనే పేరును తిప్పి చదివినా
శాఈ.. అని వస్తుందని వ్రాసాను. అయితే, వ్రాసిన వాటిలో కొన్నింటిని కొంతకాలం క్రిందట డిలిట్ చేసాను. మంచి అభిప్రాయంతో వ్రాసినా కూడా ఎన్నో ఆలోచించాలి కదా.. ************ రామకృష్ణమఠంలో అన్ని
మతాల వారికి ప్రవేశం ఉంది. ఒకయోగి ఆత్మకధ లో కూడా ఇతరమతాల వారి గురించి
ఉంది. షిర్డి సాయిబాబా సినిమాలో పాటలో ఇతరమతాల వారు ఆరాధించే వారి పేర్లు
ఉన్నాయి. ఆ పాటలను మనం చాలామందిమి ఎంతో అభిమానంగా విన్నాము, పాడాము. *************** ఈమధ్య నేను ఒక వీడియో చూశాను. అందులో కొందరు హిందువులు గ్రూపుగా సాయి భజన చేస్తూ అల్లా గురించి కూడా పాడుతున్నారు. నాకు తెలిసినంతలో, ఇతర మతాల వాళ్లు హిందూ దేవతలను పూజించరు, పాటలు పాడరు. ఆలాంటప్పుడు హిందువులు మాత్రం అందరూ ఒకటే.. అని, కొందరు మతం మారటం వంటివాటి వల్ల హిందువులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. నిజానికి దైవం ఒకరే. కానీ, మతాలు..ఆ మతాల పద్ధతులు వేరు. అన్ని మతాలను గౌరవించాలని మనకు
పెద్దవాళ్లు చెప్పటం వల్ల .. ఇతరమతాలను గౌరవించటం జరిగేది. అందరితో మంచిగా ఉండాలని పెద్దవాళ్లు చెప్పటం మంచిదే. కానీ, కొందరు మతమార్పిడులు చేయటం, మతం అని గొడవలుచేయటం..వంటివి
జరుగుతున్నాయి. ఇప్పుడు , మతమార్పిడుల వల్ల కలిగే నష్టాలను గురించి బాగా అవగాహన పెరిగింది.పొరుగుదేశంలో హిందువుల పట్ల దౌర్జన్యాలు జరగటం గురించి వార్తలు వింటున్నాము. కొందరు, దేశంలోని కొన్ని భూములు మావే ..అంటున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది. వాటిలో కొన్ని దేవాలయాల భూములు.. కూడా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే, హిందువులం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తోంది. **************** మంచిగా ఉండే పెద్దవాళ్లు, అందరితో మంచిగా
ఉండాలని తమ పిల్లలకు నేర్పిస్తారు.అలా చెప్పటం సరైనదే. కానీ, పరిస్థితులను
బట్టి కూడా ప్రవర్తించాలి. సమాజంలో కొందరు, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వేధిస్తుంటే , అలా చేయవద్దని కొన్నిసార్లు మంచిగా చెబుతాము. అప్పటికీ వారు మారకపోతే తప్పనిసరిగా వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకానీ, ఎవరైనా అదేపనిగా వేధిస్తుంటే.. ఏమీ కాదులే.. అనుకుంటూ నింపాదిగా.. చేతకానివారిలా ఉండకూడదు. . అలా చేతకాని వారిలా ఉండాలని పెద్దవాళ్లు కూడా చెప్పరు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. రాక్షసులు
తపస్సులు చేసినప్పుడు, కష్టపడి తపస్సు చేసారు కదా..వారు మంచిగా మారటానికి
ఒక అవకాశాన్ని ఇవ్వాలని, దేవతలు వారికి వరాలనిస్తారు. రాక్షసులు వరాలను
పొందిన తరువాత, మంచిగా ఉండకుండా చెడ్దగా ప్రవర్తిస్తే, ఇక వాళ్ళ పట్ల
ఎటువంటి మొహమాటం లేకుండా దైవం వాళ్ళను శిక్షిస్తారు. ఆధునికకాలంలో కొందరు ఎన్నో చెడ్దపనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళను శిక్షించటం పట్ల ఎటువంటి మొహమాటం ఉండకూడదు. ***************** సమాజంలో
దైవాన్ని నమ్మి పూజించేవారు ఉన్నారు. కొన్ని మతాల వారు
వారి పద్ధతులలో దైవాన్ని పూజిస్తారు. కొందరు ఒక్కమతం అని కాకుండా, అనేక మతాలపద్ధతులను పాటిస్తారు. ఆధునిక సమాజానికి కొంత దూరంగా అడవుల్లో ఉండే ఆటవికులు కొందరు వారి
పద్ధతిలో దైవాన్ని పూజిస్తారు. సమాజంలో కొందరు దైవాన్ని నమ్మని
నాస్తికులున్నారు... ఒక్క మతాన్ని సరిగ్గా పాటించటమే కష్టం. అలాంటప్పుడు ఎక్కువ మతాలను
కలిపి పాటించటం ఇంకా కష్టం. చాలామంది అన్నీ పాటించలేరు. ఇలాంటప్పుడు కొన్నిసార్లు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా భావించే పరిస్థితి ఏర్పడే అవకాశమూ ఉంది.. ఎవరైనా దైవాన్ని పూజించవచ్చు. ********** దైవం ఒకరే... వివిధమతాల పేరుతో అనేక పద్ధతులు ఉన్నాయి. అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. పరమతసహనం..వంటి లక్షణాలు అందరికి ఉండాలి. అయితే, కొన్ని మతాలవారు హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరైనా పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు, అందుకుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మతాల పేరుతో దారుణాలు చేసే వారు దైవాన్ని కూడా అగౌరవించినట్లే. ఇలాంటివారిని దైవం క్షమించరు. ఎవ్వరైనా సరే, దైవము యొక్క న్యాయస్థానం నుండి తప్పించుకోలేరు. ఒక విషయం ఏమిటంటే, ప్రపంచంలో మతాలు లేకపోయినా దైవం ఎప్పుడూ ఉంటారు. మతాల
పేరుతో మారణకాండలు, మూఢనమ్మకాలు..ఎక్కువయితే, విసిగిపోయిన ప్రజలు..మతాలను
అంతగా పట్టించుకోకుండా, వాటిలోని మంచివిషయాలను మాత్రం
తీసుకుని..దైవభక్తితో దైవాన్ని ఆరాధించుకుంటారు..మానవత్వంతో ధర్మబద్ధంగా
జీవిస్తారు. ప్రపంచంలో సంపద కొరకు, అధికారం కొరకు, మతాల కొరకు..అనేక యుద్ధాలు, దారుణాలు, గొడవలు జరగటం చాలా బాధాకరం. మతాల విషయానికొస్తే, మతం అంటే ప్రశాంతత. అలాంటప్పుడు, మతాల పేరుతో కూడా దారుణాలు జరగటం అత్యంత బాధాకరం.
మతయుద్ధాలు ఆగాలంటే, అన్ని మతాలలోని మంచి విషయాలతో ప్రపంచమంతటా కొత్త మతం ఏర్పడాలేమో? ఒకరితో ఒకరు గొడవలు పడకుండా ఎవరికి నచ్చినట్లు వారు ప్రశాంతంగా దైవాన్ని ప్రార్ధించుకోవచ్చేమో? యుద్ధాలలో ఎక్కువమంది మరణిస్తే మిగిలిన కొద్దిమందితో కొత్తగా ప్రపంచం ప్రారంభమవుతుందేమో? ఇంకా కొత్త విధానం ఏమన్నా ఉంటుందేమో? ఏది ఎందుకు జరుగుతుందో.. దైవానికే తెలుస్తుంది. దైవమే దిక్కు. |
No comments:
Post a Comment