koodali

Wednesday, May 11, 2016

.సాయిబాబా భక్తులు..మరికొన్ని విషయాలు..



ఎందరో హిందువులు  షిర్డి సాయిని కూడా పూజిస్తున్నారు.
 
***************
  క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన తరువాత చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ ప్రచురించటం జరిగింది.హెడ్డింగ్ కూడా మార్చటం జరిగింది.
 
చాలాకాలం క్రితం ద్వారకాపీట్ శంకరాచార్య, షిర్డి సాయిబాబాను పూజించవద్దన్నట్లుగా చెప్పటం జరిగింది.
ఆ మధ్య కొందరు సాయి భక్తులు ఇతర మత దేవత పేరుతో పాట పాడటం గమనించిన తరువాత, కొందరు హిందువుల్లో కొన్ని సందేహాలు, భయాలు కలుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా, 
 
  సాయిని పూజించాలనుకుంటే హిందు దేవాలయాల్లో కాకుండా, సాయికి విడిగా మందిరం కట్టి, సాయిమందిరాల్లో కూడా హిందూ దేవతలను పెట్టకుండా, సాయిని ..సాయిరాం, సాయి కృష్ణ.. ఇలా హిందుపేర్లతో కలపకుండా పూజించ్చు.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
 సాయిబాబా ఇతర మతాల దేవతలను పూజించారు కాబట్టి, హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టి పూజిస్తే,  భవిష్యత్తులో ఇతరమతాల వారివల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందో..అని కొన్ని సందేహాలున్నాయి.
...........................

షిర్డి సాయి ఇతరమత దేవతలను కూడా ఆరాధించారు. అలాగని హిందువులైన సాయి భక్తులు ఇతరమత దేవతలను ఆరాధించరు కదా..
 
  సాయిబాబా ఇతరమతాల దేవతలను ఆరాధించటం గురించిన విషయంలో హిందువుకు  అయోమయం ఉంది. ఈ విషయాల గురించి దైవము దారి చూపితే బాగుండు.
 
ఇతరమతాల వాళ్లు వారి మతం పట్ల గట్టిగా ఉంటారు. హిందువులు మాత్రం అన్ని మతాలు ఒకటే అని తేలికగా తీసుకుని మతాన్ని మారితే హిందువుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది. 
 ..........................
 
 హిందువులకు ఎందరో దేవతలుండగా, హిందువుల్లోనే కొందరు బ్రాహ్మణులు కూడా కొత్త వారిని పూజించమని  ఎందుకు చెబుతున్నారో? తెలియటం లేదు. 
 
 వారి పద్ధతులు  సులభంగా ఉండి, ప్రజలు వారివైపు 
అకర్షితులయ్యి కొన్నిసంవత్సరాలు గడిచాక, 
 కొత్తవారు ఇతరమతాల దేవతలను కూడా ఆరాధించారు కాబట్టి, హిందువులు  ఇతరమతాల్లోకి వెళ్తారని భయపడి,  వారి పూజలను మానేయమంటారు. ఈ భయాలను కూడా తప్పు పట్టలేము. 

కొత్త వారిని పూజించమని చెప్పటం, అందుకు అలవాటుపడి కొన్నిసంవత్సరాల తరువాత మానేయమనటం ...ఇదంతా ప్రజలకు అయోమయంగా ఉంటుంది.
 
ఇక మీదటయినా ఎవరూ కొత్త వారిని తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా కొత్తవారిని ప్రచారం చేయబోతే గట్టిగా ముందే అడ్డుకోవటం మంచిది.

ఆ మధ్య ఒకటోపి అమ్మను దైవస్వరూపంగా భావించి కొందరు ప్రచారం చేసారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎక్కడకు దారితీస్తాయో..అని కొందరు గట్టిగా ఈ విషయం గురించి మాట్లాడారు. పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. తెలుగువాళ్లకు ఇంకో కొత్త  వారిని కొలుచుకునే పని తగ్గింది.

నేను వాళ్లను తప్పుగా అనటం లేదు. వారు గొప్ప అవధూతలు, మహిమలు కలవాళ్లే కావ  చ్చు. 
 
హిందువులకు అనేక దేవతలుండగా  దేవతా స్వరూపాలంటూ
 కొత్తవారిని పూజించటం కన్నా, మనం ఎప్పుడూ పూజించే దైవాన్నే పూజించవచ్చు కదా. కొత్తగా అనేకమంది దేవతలను ప్రచారం చేస్తే హిందువులు అనేకశాఖలుగా చీలే ప్రమాదముంది.

 టోపి అమ్మ  తిని పడేసిన వాటిని  తింటే కష్టాలు, కోరికలు తగ్గుతాయని కొందరు ఆ
మె తిన్నవి  తింటున్నారట. హిందువులకు తాము నమ్మే దైవము పట్ల నమ్మకం లేదా? 
 
తాము పూజించే దైవప్రసాదాన్ని స్వీకరిస్తే తమ కష్టాలుపోతాయని, కోరికలు తీరుతాయని నమ్మాలి కదా.
...................................

 జీవితంలో కొన్నిసార్లు గురువునైనా, పెద్దవారినైనా.. కొన్నిసందేహాలు అడగాలనిపిస్తుంది. నాకు కొన్ని సందేహాలు కలిగాయి..
 
ఏ మతం వారికి ఆ మతాన్ని నమ్మి ఆచరించే గురువు ఉంటారు. అయితే, తాము నమ్మిన గురువు ఒక మతాన్ని కాకుండా, కొన్ని మతాలను నమ్మే వారైతే ఆ శిష్యులు ఏం చేయాలి?

ఎవరి మతాన్ని వారు నమ్మి ఆచరించాలి. ఇతరమతాల పట్ల గౌరవంతో ఉండాలి.. కానీ, ఇతరమతస్తులు తమపట్ల గౌరవంతో ఉండకపోతే ఏం చేయాలి? 
 
ఉదా..హిందువుల్లో చాలామంది పరమతసహనంతో ఉంటారు. కానీ, చాలామంది ఇతరమతస్తులు తమ మతం మాత్రమే గొప్పదని,  ఇతరమతాల వాళ్ళను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తారు.

భారతదేశం విభజన కూడా జరిగింది. ఆ సమయంలో ఎందరో  మరణించారు. 

 భారతదేశంలో ఎప్పటినుంచో హిందువులను నయానాభయానా మతం మార్చటానికి ఇతరమతాలవారు కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందువులు కూడా చాలామంది మతాన్ని మారారు. ఇలాంటిపరిస్థితిలో హిందువులు తమ ఉనికిని గట్టిగా కాపాడుకోవాలా? లేక తమ గురువు ఇతరమతాలను కూడా నమ్మారు కాబట్టి, అన్ని మతాలు సమానమే, మనం నింపాదిగా ఊరుకుందాం..అని హిందువులు గమ్మున ఉండాలా?

 మరి, ఇతరమతాల వాళ్లు మతమార్పిడులకు ప్రయత్నించరని, హిందువులు మైనారిటీగా మారరని,  హిందువులకు హాని జరగదని ఎవరైనా హామీ ఇస్తారా? 
 
భవిష్యత్తులో ఏం జరుగుతుందో? ఇలాంటి పరిస్థితిలో అనేక సందేహాలు కలిగి అయోమయంగా ఉంటుంది. దైవమే దిక్కు.
.......................


 
 

1 comment: