koodali

Monday, July 18, 2016

ఓం. హిందువులు.. మరి కొన్ని విషయాలు.....


గురువులకు అనేక వందనములు.


  .............
క్రింద వ్రాసిన విషయాలు ఈ పొస్ట్ వేసిన చాలాకాలం క్రిందట వ్రాసి ఇక్కడ వేయటం జరిగిందండి.
 
ఇప్పుడు చాలామంది హిందువులు హిందుదేవతలను ఆరాధిస్తూ, సాయిని కూడా ఆరాధిస్తున్నారు.

ఎన్నో నియమాలు పాటిస్తూ హిందువులకు దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు కూడా కొందరు ,  సాయి సర్వాంతర్యామి అని పూజలు చేస్తుంటే,  హిందువులు కొందరు  వారిని అనుసరించటంలో ఆశ్చర్యం లేదు.

సాయి విధానాలు సరళంగా ఉంటాయి. అనేక ఆచారవ్యవహారాలుండవు, అనేక కఠినమైన నియమాలుండవు. 
 
అయితే,  షిర్డిసాయికి హారతులు ఇస్తారు. రోజుకి మూడుసార్లు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. హారతులకు ఎక్కువ సమయమే పడుతుంది.
 
 ఎక్కువ నియమాలు లేకుండా ఉండే సాయి ఆరాధనలో కూడా, సాయిని హిందు దేవతలుగా పూజలు మొదలుబెట్టి ఆరాధించటం ఆశ్చర్యం. 
.....................................
 సులభమైన విధానాలతో ఉన్న షిర్డిసాయి ఆరాధనకు చాలామంది ఆకర్షితులవటంలో ఆశ్చర్యం లేదు.

 పరిస్థితి ఎలా ఉందంటే,  సాయి విగ్రహం ఉంటే,  జనాలు వస్తారని 
కొన్ని హిందు దేవాలయాల్లో  సాయి విగ్రహాన్నికూడా పెడుతున్నారట. భవిష్యత్తులో  పరిస్థితి  ఎలా ఉంటుందో?
..........................................
షిర్డిలో ప్రాచీన శివుని దేవాలయం ఉంటుంది. శివాలయానికి మేము వెళ్లినప్పుడు  అక్కడ, షిర్డి మందిరంలోలా  క్యూలు లేవు. బోలెడు భక్తులు లేరు.
....................................... 
  కొందరు హిందువుల ప్రవర్తన వింతగా ఉంటుంది. ఒకే హిందువుల్లో వైష్ణవులు, శైవులు అని కొందరు గొడవలు పడటం జరిగింది. మరి, ఇతర మతాలను కూడా నమ్మే సాయిబాబాను గురువుగా, దైవంగా భావించటం ఆశ్చర్యమే.
 
 హిందువులను ఉద్ధరిస్తామనే వాళ్ళు,  వైష్ణవ.. శైవ ..అని గొడవలు మానేయాలి.

అనేకముఖములతో ఉన్న విష్ణుమూర్తి(శ్రీకృష్ణుని) విశ్వరూపదర్శనము చిత్రం ద్వారా శివుడు కూడా ఉండటాన్ని గమనిస్తాము..దైవశక్తి కదా..మరి, వైష్ణవులు శివుని పట్ల ద్వేషభావం కలిగిఉంటే మహాపాపము.
 .....................................
  కొందరు సాయిబాబాకు అనేక దేవతలుగా అవతారాలు అలంకరించి పూజలు చేస్తున్నారు.
 
హిందుదేవతలకు వారి పద్ధతుల ప్రకారం పూజలు చేస్తారు.  శివుని విష్ణువులా ఆరాధిస్తారా? విష్ణువును శివునిగా ఆరాధిస్తారా? 
 
సాయికి  హిందుదేవతలుగా అలంకరించి పూజలు చేయటం కాకుండా, సాయిని సాయిలా ఆరాధింవచ్చు  కదా....
 .........................................
 
 భవిష్యత్తులో ఇంకెవరైనా వచ్చి,  వారు సర్వాంతర్యామి అంటే, వారికి కూడా హిందుదేవతల అలంకారాలు చేసి పూజలు చేస్తారా? 

కొందరు హిందువులు ఇతర మతాల దైవాన్నికూడా పూజిస్తారు. కోరికలు తీరటానికి ఇతర మతపండుగలలో పాల్గొంటారు.  భవిష్యత్తులో అలాంటివాళ్లు ఎవరైనా ,  తనకు ఏదైనా కల వచ్చిందని చెప్పి, తనకు తోచినట్లుగా పూజలు చేస్తానంటే ?  ఎవరు ఏది చెబితే అది ఒప్పుకోవాలా?
.................................
 హిందుదేవతల పూజలకు కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి కదా....ఎవరికి తోచినట్లు వారు పూజలలో పూజించే చిత్రాలను మార్చేయవచ్చా?
 
ఇతరమతాల వారికి కూడా పూజలో వారి పద్ధతులు వారికి ఉంటాయి. హిందువులు, ఇతరమతాల దేవతలను హిందుదేవతలతో కలిపి పూజిస్తే, ఇతరమతస్తులకు కూడా అందరికి నచ్చకపోవచ్చు.
 ....................................
సినిమాల్లో హిందు దేవతలను తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చూపించినా,  న్యాయస్థానంలో కేసులు వేయాలి.  
 
మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్ ,  సోషల్మీడియాలో మూఢనమ్మకాలను వ్యాపింపచేసేవాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోవాలి.
.........................................
 పూజలలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదని ఎన్నో చెప్పే బ్రాహ్మణులు,  ఈ విషయాలలో అలా చేయకూడదని చెప్పాలి కదా.. 
 ............................................... 
   వినాయకచవితి పూజలలో కొందరు ఏం చేస్తున్నారంటే,   తమకు ఇష్టం వచ్చినట్లు వినాయకునికి రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇకమీదట ఇవన్నీ చేయకూడదని గట్టిగా చెప్పాలి. 
    హిందువులుగా ఉన్నవాళ్లు హిందుత్వం.. హిందుదేవతల ప్రాముఖ్యత తగ్గేలా ప్రవర్తించకూడదు. హిందుత్వానికి ఎటువంటి హాని జరగకుండా చూడాలి.

  సాయిభక్తులు కూడా హిందువులే కాబట్టి, హిందుధర్మ పరిరక్షణ కూడా చేస్తారు.
..................................... 
ఈ  తరంవారు తాము ఎప్పటినుంచో పూజించే హిందుదేవతలతో పాటు, సాయిని కూడా  పూజిస్తున్నారు. రాబోయే తరాల వాళ్ళు హిందుత్వంలోని అనేక నియమాలను పాటించలేక,  అందరు దేవతలు సాయిలోనే ఉన్నారని,  సాయిని మాత్రమే పూజించే పరిస్థితి కూడా రావచ్చేమో?

 ఇప్పటికే కొందరు సాయిభక్తులు ఏమంటున్నారంటే, సాయిలోనే అందరు దేవతలు ఉన్నారని, సాయిని ఆరాధించుకుంటామని అన్నట్లు అంటున్నారు.
   ......................................................
  నాకు తెలిసినంతలో,  శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు. సాయిసాయి ..యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.
....................................................
  పూర్వీకులు పూజించిన దేవతలు అంటే నాకు భక్తి ఉంది. షిర్డి సాయి అంటే భక్తి ఉంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. దైవము ఒక్కరే అయినా, ఏ మతం వారి పద్ధతులు వారికి ఉన్నాయి.
 
 దైవము ఒక్కరే కదా.. అని,   అన్ని మతాల వారు ఒకే ఆచారవ్యవహారాలు పాటించాలంటే  ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో చాలా కష్టం.
.................................
 ఆ రోజుల్లో  సాయి  షిర్డి వస్తే, ఒకరి గుర్రం కనిపించకపోతే సాయి  ఆ విషయాన్ని చెప్పగా, సాయికి మహిమలున్నాయని  హిందువులే వారి వద్దకు వెళ్లి తమకష్టాలు తీర్చమని అడిగినట్లు అనిపిస్తోంది.
 ............................
  నాకు తెలిసిన ఒక సాయి మందిరంలో హిందుదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న విగ్రహాను సాయి పాదాలవద్ద ఒక పళ్లెంలో పెట్టి పూజిస్తారు. దసరా వస్తే హాల్లో ఒక పక్కన పెద్ద అమ్మవారి బొమ్మను అలంకరించి నవరాత్రులు చేసేవారు. మామూలుగా నవరాత్రులంటే భక్తులు  అమ్మవారి దేవాలయానికి  లేక ఇంకో హిందుదేవాలయానికి వెళ్తారుకావచ్చు. 

సాయి మందిరంలో ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి, ఆ చుట్టుపక్కల ప్రజలు అమ్మవారిని అక్కడే పూజించేవారు. భక్తులు అక్కడ  కానుకలు సమర్పిస్తారు.

షిర్డిసాయి ఇవన్నీ పూజలు చేయమని చెప్పలేదు. 
ఇవన్నీ  సాయి మందిరాల నిర్వాహకులు  చేస్తున్నారు.
....................................
  హిందువుల గ్రంధాలలో ఎవరిశక్తిని బట్టి వారు దైవాన్ని పూజించవచ్చని ఉంది.

దైవపూజ అంటేనే ప్రశాంతంగా చేసుకోవాలి. అలాంటి విషయాన్ని   విపరీతధోరణితో కొందరు హిందువులు క్లిష్టం చేసేసారు.   అవన్నీ విన్న ప్రజలకు అనేక సందేహాలు, భయాలు కలుగుతాయి.
...............
  సాయి తనకు షోడశోపచారాలతో పనిలేదు, ప్రేమతో కూడిన భక్తి ఉంటే చాలన్నారు.
 
 మరి, హిందు పెద్దవాళ్లు ఎలా చెబుతారంటే,   ప్రతిదానికి  ఇలా చేస్తే కష్టాలు వస్తాయి, అలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలంటూ భయపెడతారు. హిందువులకు విసుగొచ్చి ఇతరమార్గాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.

  పూజలో కొబ్బరికాయ కుళ్లితే ఏ కష్టం ముంచుకొస్తుందో.. అని భయం, దీపంలో ఎన్ని వత్తులు వేయాలో? అనే సందేహాలు, బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలనే శంకలు, ఫలానా దిక్కున తిరిగి అన్నం తినాలి, టాయ్లెట్లో ఫలానా దిక్కున 
తిరిగి  కూర్చోవాలి, టీవీ ఫలానా దిక్కు పెడితే అరిష్టం..ఇలా వందల విషయాలను గుర్తుంచుకోలేక, గుర్తున్నా కూడా పాటించలేక నలిగిపోతున్నారు.

 ఇవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయోమోనని  భయపడి విసిగిపోయినవాళ్లు,  సులభంగా ఏదైనా మార్గం కనిపిస్తే అటు వెళ్లటానికి ఆలోచిస్తారు.
 
 ప్రాచీనులు ఎన్నో మంచి విషయాలను ఆచారవ్యవహారాలుగా తెలియజేసారు. అయితే, కాలక్రమేణా కొందరు కొన్నింటిని మార్పులుచేర్పులు చేసి మూఢనమ్మకాలుగా అతిగా తయారుచేసారు.
.............................
అంటరానితనం వంటి విషయాల వల్ల,  కొందరు శూద్రులు  మతం మారారని కొందరు అంటారు.  కొందరు అగ్రకులాల వాళ్లు కూడా ఎందుకు మతం మారారు? మతం మారిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

హిందుత్వంలోని అనేక  విషయాలను పాటించలేక కూడా, అగ్రకులాల వాళ్లు కొందరు మతం మారుతున్నారేమో? అనిపిస్తుంది.

ఇవన్నీ గమనించాక, ఇప్పటికైనా హిందువులు తమ పద్ధతులను కొంత సులభం చేసుకోవాలి, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.

.........................................
 గ్రంధాలలో విషయాల గురించి ప్రశ్న వేయకూడదన్నట్లు కొందరు అంటారు. గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు(మార్పులుచేర్పులు) జరిగాయంటారు. 
 
గ్రంధాలను చదివినప్పుడు కొన్ని విషయాలు అర్ధం కావు, సందేహాలు కలుగుతాయి. అలాగే,  కొన్ని గ్రంధాలను చదివినప్పుడు  నాకు  కొన్ని సందేహాలు కలిగాయి.
 
 తెలియనివిషయాలు పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. గురువును, దైవాన్ని అడగటంలో కూడా తప్పులేదు.
................................
 కొందరు,  తమ పూర్వీకులు ఆరాధించిన దేవతలను, గురువులను  కాకుండా, ఇతర మతాలదేవతల ఆరాధనలోకి వెళ్తారు. భవిష్యత్తులో ఇంకో కొత్త వాళ్లు మహిమలు చూపిస్తే, వీళ్ళు అటు వెళ్లరని గ్యారంటి ఉందా?
.........................
 హిందువులకు చాలామంది దేవతలు, గురువులు ఉండగా, ఎందుకు కొత్త వాళ్లవద్దకు వెళ్తారు?  అన్నది ఆలోచించాలి. ఇది హిందువుల బలహీనతే. 
 
తిరువణ్నామలైలో అంత గొప్ప దైవము ఉండగా, మళ్లీ అక్కడున్న టోపి అమ్మ అనే ఆమె వద్దకు వెళ్లి ఆమె విసుక్కుంటున్నా కూడా,  ఆమె వెంటపడుతున్నారు. 
 ............................
 హిందువులు ఎన్నో నియమాలనే చట్రంలో భయపడుతున్నారు. గ్రంధాలలో ఉన్న ఎన్నో విషయాలను పాటించకపోతే ఏమవుతుందో?  అని భయపడుతున్నారు. 
 
 గ్రంధాలలోని విషయాలు, ఆచారవ్యవహారాలు గత యుగాలలో చక్కగా పాటించగలరు.
 
కలియుగంలో పరిస్థితుల గురించి తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో దైవస్మరణ..దైవనామ స్మరణ సులభమైన ఉపాయమని తెలియజేసారు.

కలికాలంలో చాలా పదార్ధాలు కల్తి అయి ఉంటాయి. దైవనామము కల్తి చెయ్యలేరు.  దైవనామాన్ని చక్కగా సులభంగా స్మరించుకోవచ్చు.

దైవస్మరణ..దైవనామస్మరణ వల్ల ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించి, ప్రపంచం శాంతిగా ఉండే అవకాశముంది.
 ............................
 విధివిధానాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సరిగ్గా పాటించామా? లేదా? అనే టెన్షన్ తోనే సరిపోతుంది.

విధివిధానాలు ఎక్కువ చేస్తూ చెప్పేవారు ప్రజలను దైవానికి దూరం చేస్తున్నట్లే.

దైవపూజ కోసం విధివిధానాలు కానీ, విధివిధానాల కొరకు దైవపూజ ఏర్పాటు చేయలేదు.  
అతి చారాలను తగ్గించుకుంటే,  దైవాన్ని ప్రశాంతంగా  ఆరాధించుకోవచ్చు.
 ..................................
.దైవము ఒక మహాశక్తి. హిందుగ్రంధాల ద్వారా తెలిసిన అనేక  దేవతారూపాలు మూలదైవము నుండి వచ్చిన  దేవతలే. మూలదైవాన్ని పరమాత్మ అని ప్రార్ధించుకోవచ్చు. మూలదైవాన్ని ప్రార్ధించుకుంటే అందరు దేవతలను ప్రార్ధించుకున్నట్లే.
 
అందరు దేవతలను ఒకే దైవశక్తిగా శ్రీ మాత..శ్రీ పరమాత్మగా లేక పరమాత్మగా పూజించుకోవచ్చు..అని నాకు అనిపిస్తుంది.
 .......................... 
 ఈ పోస్ట్ పెద్దది అయ్యింది.
 konni links...
 
  • షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ..

  • .సాయిబాబా భక్తులు..మరికొన్ని విషయాలు .. 
  • ...........................
  •  వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


  • No comments:

    Post a Comment