ఈ రోజుల్లో ఆహారపద్ధతులలో విపరీతమైన మార్పులు వచ్చాయి.
అజనిమోటో, సోయాసాస్, వెనిగర్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..వంటివి విరివిగా వాడిన ఆహారానికి ప్రజలు బాగా అలవాటుపడ్దారు.
పొంగి కరకరలాడుతూ ఉండటానికి... సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..
ఒకవిధమైన రుచి పెరగటం కోసం ....అజనిమోటో, సోయాసాస్, వెనిగర్ వంటివి బాగా వాడుతున్నారు.
అజనిమోటో ఎక్కువగా వాడకూడదు.
ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన రుచి రావటం వలన వీటి వాడకం బాగా పెరిగింది.
ఆ రుచికి అలవాటుపడటం వల్ల మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది. అలా శరీరంలోకి వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది.
ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.
నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.
కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.
కొన్ని దేవాలయాలకు సమీపంలో యాత్రికులు వెళ్ళే దారిలో కూడా నూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నారంటే ప్రజలు వీటికి ఎంతలా అలవాటుపడ్డారో తెలుస్తోంది.
మన పూర్వీకులు సోడాఉప్పు వంటివి వాడకుండానే వెన్న వాడి కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు.
*************
ఇంకో విషయం ఏమిటంటే, ఆరోగ్యానికి మంచిదని భావించి.... ఈ రోజుల్లో సోయా కు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు.
అయితే, సోయా మంచిదే కానీ పరిమితి మించి మరీ ఎక్కువగా సోయాను తినకూడదంటున్నారు.
ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు.
No comments:
Post a Comment