koodali

Monday, July 11, 2016

విపరీతమైన జనాభా పెరుగుదల అనేక సమస్యలకు మూలం...marikonni vishayaalu..

 
విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల అనేక నష్టాలున్నాయి.

  విపరీతంగా జనాభా పెరిగితే వనరులు సరిపోవు. 

దేశంలో ఆహార కొరత,  నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యే  పరిస్థితులు ఏర్పడుతాయి.  

ఆహార కొరత,   నిరుద్యోగ సమస్యల  వల్ల  దేశంలో నేరాలు కూడా పెరుగుతాయి. 

 జనాభా పెరిగే కొద్దీ  దేశం జనాభాతో  కిటటలాడుతూ మురికిగా ఉంటుంది. 

విపరీతమైన జనాభా పెరుగుదల  అనేక సమస్యలకు మూలం. 

  అయితే,  మరీ ఒక్కరే కాకుండా,  ఇద్దరు సంతానం ఉంటే మంచిది.
 ..................................
 అయితే, స్వదేశీయులు తక్కువ సంతానం పొంది, విదేశాలనుంచి అక్రమవలసదారులు దేశంలోకి వస్తే,  జనాభా పెరిగి  స్థానికులకు కష్టాలు వచ్చే అవకాశముంది. ప్రభుత్వాలు అక్రమవలసలను అరికట్టాలి.
 
భారతీయులు విదేశాలకు వెళ్లటం పట్ల ఆసక్తి తగ్గించుకుని, దేశాన్ని అభివృద్ధి చేయటంలో కృషిచేయాలి. దేశం అభివృద్ధి చెందితే అందరికి అభివృద్ధి ఉంటుంది.
..........................
 marikonni vishayaalu...
 
తెలుగువాళ్లు ఎక్కువగా తమ పిల్లలు డాక్టర్ లేక ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు. ఇందుకోసం చిన్నతనం నుండి హాస్టల్స్లో వేస్తారు. ట్యూషన్స్ పెట్టి రుద్దిరుద్ది చదివిస్తారు. పిల్లలు ఆడుకోవటం కూడా తక్కువే. అన్నీ అయి, ఇంటర్లో సీట్లు కోసం విపరీతమైన పోటీ ఉంటుంది.

 ఉదా..మెడిసిన్లో సుమారు కొన్ని వేల సీట్ల కోసం కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తే ఎంత మందికి సీట్ వస్తుంది..మంచి మార్కులు వచ్చినా, కొన్ని కారణాల వల్ల కొందరికి సీట్లు రావు.

అందువల్ల, ప్రభుత్వాలు మెడిసిన్, ఇంజనీరింగ్ బాగా సీట్లు పెంచి, కాలేజీలు స్థాపించి చాలామందికి సీట్లు ఇస్తే మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలన్న వారి కోరికన్నా తీరుతుంది. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఫీజులు కొంత పెంచితే, ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది.

చాలామందికి సీట్లు లభించే పరిస్థితి ఉంటే, సీట్ల కోసం పోటీపడి వెర్రిగా చదవటం అనేది తగ్గుతుంది. మంచి మార్కులు వచ్చిన అందరికి సీట్లు ఇస్తే, పిల్లలు పోటీపరీక్షల కోసం ప్రాణాంతకంగా చదివే టెన్షన్ తగ్గుతుంది.

 కొద్దిసీట్ల కొరకు అనేకమంది పోటీపడే పరిస్థితి, చావుబతుకుల సమస్యగా మారిన పోటీ పరీక్షల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది.
..............................................

చదువయ్యాక అందరికి ప్రభుత్వఉద్యోగాలు రాకున్నా,  కొందరు వేరే ఉద్యోగాలు చేస్తారు. కొందరు విదేశాలకు వెళ్తారు. మెడిసిన్ చదివిన కొందరు సొంతంగా ప్రాక్టిస్ పెట్టుకుంటారు. ఇంజనీరింగ్ చదివిన కొందరు సొంత పరిశ్రమ, స్టార్టప్ స్టార్ట్ చేస్తారు.

కొందరు ఇంట్లో ఉండి కుటుంబబాధ్త్యతలు చూసుకుంటారు.పిల్లలు కొంచెం పెద్దయ్యాక  ఉద్యోగమో,సొంతంగానో మొదలుపెట్టవచ్చు.
...................

 పెద్దవాళ్ళు ఆలోచించాలి, తమ పిల్లలని అంత క్షోభ పెట్టి చదివించటం అవసరమా? వ్యాపారం, వ్యవసాయం, ఇంకా ఇతర వృత్తులు ఎన్నో ఉన్నాయి. అటు వెళ్లాలని ఎందుకు కోరుకోరో తెలియదు.

తెలుగువాళ్లు ఉపాధి కొరకు విదేశాలకు వెళ్ళి, ఆ ఉద్యోగం ఎంతవరకు ఉంటుందో తెలియక కొందరు, తక్కువ జీతానికి పనులు చేస్తూ కొందరు కష్టాలు పడుతుంటే, వేరే దగ్గరనుంచి వచ్చిన వారు, ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

దూరపుకొండలు నునుపు అని విదేశాలకు వెళ్తారు కాని, వెళ్ళాక అక్కడ కష్టాలు తెలుస్తాయి. విదేశం ఎప్పటికైనా విదేశమే. ఎప్పుడు పొమ్మంటారో తెలియదు.
....................................

వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతులు ఎన్నో వచ్చాయి. వ్యవసాయఉత్పత్తులను దళారీలు రైతుల వద్ద తక్కువధరకు కొని, వినియోగదారులకు చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులు సంఘటితంగా ఉండి, తమఉత్పత్తులను తెలివిగా అమ్ముకోవాలి.

వ్యాపారస్తులకయితే బాగానే డబ్బు వస్తుంది. వ్యాపారం రిస్క్ అని అనుకుంటారు కాని, ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా చాలా కష్టపడాలి. ఇంజనీరింగ్ వాళ్ల టార్గెట్ల టెన్షన్, ఆ కంపెనీల వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాల్లో తీసేస్తారో తెలియదు.
..................
ప్రభుత్వాలు స్థానికుల ఓట్లతో అధికారంలోకి వస్తారు.తమప్రజల కొరకు పని చేస్తారు. కంపెనీలను తెచ్చినప్పుడు, స్థానికులకు ఉపాధి కల్పించటంలో ప్రాముఖ్యత ఇవ్వాలి.
.................

పాతకాలంలో వైద్యం, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా, చాలా వృత్తులు ఉండేవి. అప్పట్లో కొన్ని చేతివృత్తులవారు సమాజానికి అవసరమయ్యే ఎన్నో వస్తువులను తయారు చేసేవారు.

అప్పట్లో టీవీలు, ఫ్రిజ్లు..టెక్నాలజి లేకపోయినా, మనిషి చక్కగా జీవించటానికి అవసరమైనంతలో అన్నీ వారికి తెలుసు. ఇప్పుడు టెక్నాలజి పెరిగింది, పొల్యూషన్ పెరిగింది. యంత్రాల వల్ల నిరుద్యోగమూ పెరిగింది. టెక్నాలజిని పర్యావరణానికి హాని కలగనంత వరకు, నిరుద్యోగం పెరగనంత వరకు వాడుకోవచ్చు.
 .....................

మనిషి చక్కగా బతకటానికి బోలెడు డబ్బు అవసరం లేదు. పాతకాలంలో ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. ఇప్పుడు విలాసాలు, వస్తువ్యామోహం, ఇళ్లు, స్థలాల కొనుగోలు వ్యామోహం పెరిగి, విపరీతంగా పనిచేస్తున్నారు. తృప్తి లేనివారికి ఎంత డబ్బున్నా తృప్తి ఉండదు. ఎంత డబ్బు ఉన్నా సరిపోదు.



1 comment:

  1. You are right. India's population based on its area should not be more than 15 crores whereas it is 8 times the desired population. Dangerous explosion of population more so in case of muslims.

    ReplyDelete