అన్న క్యాంటీన్ల వల్ల ఎందరికో ఉపయోగం జరుగుతోంది. ఇలాంటివి రాష్ట్రమంతటా విస్తరించితే ఎందరికో లాభం జరుగుతుంది.
ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల ఉపాధి లభించటం ఎందరికో కష్టంగా ఉంది.
ఉపాధి లేకపోయినా పేదలకు కనీసం తక్కువ ధరకు ఆహారం లభిస్తే ఎంతో మంచిది.
ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించటం వల్ల ప్రజల ఆకలీ తీరుతుంది. ప్రభుత్వాలకూ మంచి పేరు వస్తుంది.
తమిళనాడులో ఇలాంటి అమ్మా క్యాంటీన్ల వల్ల ఎందరో పేదవాళ్లు కడుపు నింపుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎన్నో పధకాలు ఉన్నాయి.
అక్కడ ఉన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావటానికి ఈ పధకాలు కూడా ఎంతో దోహదపడ్దాయి.
తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తే పాత పధకాల అమలు ఉంటుందో ? ఉండదో? అనే భయం వల్ల కూడా ప్రజలు ఉన్న ప్రభుత్వానికే ఓటు వేసి ఉండవచ్చు.
ఇక ఇంకుడుగుంతల త్రవ్వకం, మొక్కలను నాటడం కూడా చాలా మంచి విషయాలు. ఇందులో ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొనటం మంచి విషయం.
..................................
అయితే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం.
ప్రపంచమంతటా సో లార్, పవన విద్యుత్ వంటి హరిత విద్యుత్ కోసం ప్రయత్నిస్తుంటే.... ఆంధ్రప్రదేశ్లో అణువిద్యుత్ కర్మాగారాలు నిర్మించాలనుకోవటం అత్యంత బాధాకరం ఐన విషయం. కేంద్రం ఈ విషయాలలో తిరిగి ఆలోచించటం మంచిది.
No comments:
Post a Comment