ఈ రోజుల్లో ఇంటర్ నెట్ , సెల్ఫోన్..వంటివి ఎంతో అవసరంగా మార్చుకున్నాం.
అయితే అస్తమాను నెట్ వద్ద కూర్చుని కర్సర్ ను వేళ్ళతో కదిలించటం, సెల్ఫోన్లో మెసేజ్ కొరకు వేళ్లను వాడటం వల్ల వ్యాధులు వచ్చే అవకాశముందని అనిపిస్తుంది .
గంటలతరబడి స్పీడ్ గా వ్రేళ్ళతో పనిచేయటం అనేది కొన్ని సంవత్సరాలు కొనసాగితే నరాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
ఉద్యోగరీత్యా ఇలా పనిచేయటం తప్పనిసరి అయినవాళ్లు నరాలు బలంగా ఉండటానికి ఆహారం, మందులు తీసుకోవాలి.
. ఈ రోజుల్లో చాలామంది మెడనొప్పి, తలనొప్పి, చేతులు, భుజాలు నొప్పి, కళ్ళ సమస్యలు, నడుము నొప్పి.. వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇంటర్నెట్, వంటి వస్తువులు వచ్చాక ఇంట్లో, ఆఫీసుల్లో .. రేడియేషన్ కూడా పెరిగింది.
ఐటీ రంగం మాత్రమే కాకుండా బ్యాంకింగ్ వంటి ఎన్నో రంగాల వారికి ఇంటెర్నెట్ తప్పనిసరి అయింది.
ఇక సెల్ఫోన్ సంగతి చెప్పనక్కరలేదు. పిల్లలు, పెద్దలు కొంత సమయం ఖాళీ దొరికినా సెల్ ఫో న్ తో గడుపుతున్నారు.
ఈ సామాగ్రి అతిగా వాడటం కూడా ఈ రోజుల్లో వ్యాధులు పెరగడానికి కారణం కావచ్చు.
No comments:
Post a Comment