పర్యావరణదినోత్సవం రోజున కొంతసేపు ప్లాస్టిక్ వంటి వాటితో కలుగుతున్న నష్టాల గురించి కొంతసేపు బాధపడుతూ చర్చలు జరుపుకోవటం, ఆనక మళ్లీ మన బ్రతుకులు మనం బ్రతకటం అలవాటయ్యింది.
అయినా , ప్లాస్టిక్ వాడకం ప్రజలు మానేయాలంటే చాలా కష్టం కదా!
ప్లాస్టిక్ సంచులు బదులు కాటన్ సంచి వాడినంత మాత్రానా ప్లాస్టిక్ పోతుందా?
షాపింగ్ మాల్స్ లో ఉప్పు, పప్పులు, అన్నీ ప్లాస్టిక్ కవర్లలోనే నింపి ఉంటాయి.
ఈ విధంగా కూడా ప్రతి ఇంటిలో నెలకు గుట్టలుగా ప్లాస్టిక్ ప్రోగుపడుతుంది.
చాలా వస్తువులు ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి.
ప్లాస్టిక్ నుంచి విడదీయలేనంతగా బ్రతుకులు మార్చుకున్నాము.
ఇక చావైనా, బ్రతుకైనా ప్లాస్టిక్ తోటే.
సెల్ఫోన్లతో రేడియేషన్ ప్రమాదమున్నా చేయగలిగేది ఏం లేదు.
చాలామంది విషయంలో చావైనా, బ్రతుకైనా సెల్ఫోనుతోటే.
వాతావరణం మారి పిడుగులు పడుతున్నా మనం చేయగలిగిందేమీ లేదు ..
అయ్యో ! ఇంతలా పిడుగులు పడటమేమిటి ? అని ఆశ్చర్యపడటం తప్ప..
ప్లాస్టిక్ నేలలో కలవకుండా వందల ఏళ్లు ఉండిపోతుందట.
మనం పోయినా.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ సంచీలు వందల ఏళ్లు అలాగే ఉండటం అంటే ఎంతగొప్ప? అని సంబరపడదాము.
ఇక ఇంతగా పొల్యూషన్ పెరిగితే భావి తరాల సంగతి ఏమిటంటారా?
ఇప్పటి తరాలు పొల్యూషన్ వల్ల నాశనం కాకుండా మిగిలి ఉంటేనే కదా ...భావితరాలంటూ ఉండేది...
No comments:
Post a Comment