ఇంటికి దూరంగా చదువుకుంటున్న లేక ఉద్యోగం చేసుకుంటున్న టీనేజ్ యువత కొన్ని వంటలను నేర్చుకుంటే మంచిది. రోజూ వంట చేసుకోవటానికి సమయం కుదరకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఖాళీ కుదిరినప్పుడు కొన్ని రకాలు వండుకుని తినవచ్చు.
కారెట్,బీన్స్, ఆలు.వంటి కూరగాయ ముక్కలు ఎక్కువగా వేసి పులావ్ చేయటం....
బియ్యం, కందిపప్పు, కూరగాయలు వేసి సాంబార్ బాత్ చేయటం..
బియ్యం, పెసరపప్పు తో పొంగలి , ఇష్టమయితే పొంగలిలోనే బీన్స్, ఆలూ, కారట్, వంటి కూరగాయల ముక్కలు వేసుకుని కిచిడీ... వంటివి సులువుగా వండగలిగే పుష్టికరమైన వంటలు.
పులావ్, సాంబార్ బాత్ , పొంగలి, గోధుమ రవ్వ ఉప్మా.. వంటివి పక్కాగా చేయితిరిగిన వాళ్లు అన్ని దినుసులు సమపాళ్ళలో వేసి వండినట్లు వండకపోయినా.... మామూలుగా వండినా రుచిగానే ఉంటాయి.
*******
పులావ్ ... కుక్కర్లో కొద్దిగా నూనె, కొద్దిగా నేయి వేసి... అందులో కారెట్, బీన్స్, ఆలు...వంటి కూరగాయముక్కలు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ గరం మసాలా, సగం స్పూన్ అల్లం వెల్లులి ముద్ద వేసి .... కడిగి ఉంచుకున్న బియ్యం వేసి , రుచికి సరిపడినంత ఉప్పు వేసి,.... తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, తరువాత వెయిట్ పెట్టాలి. అన్నంలా వండుకుని దింపేస్తే .పులావ్ తయారవుతుంది.
పులావ్ తో పాటు పెరుగులో ఉల్లిముక్కలు, మిర్చి వేసి తినవచ్చు.
నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరమ్మసాలా, టమేటో ముక్కలు , జీడిపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి వేయించి.. కొబ్బరిముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి మెత్తగా చేసి, ముందు వేయించుకున్నవి కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి, కొద్దిసేపు పొయ్యిపైన ఉడికించుకుంటే పులావుతో పాటు తినే గ్రేవీ తయారవుతుంది.

లేకపోతే, ముందే కొబ్బరిముక్కలు, జీడిపప్పు, ఉల్లి, పచ్చిమిర్చి, టమేటో, ..ఇవన్నీ మిక్సీలో రుబ్బి తరువాత పొయ్యిపైన కొద్దిసేపు పొయ్యిపైన ఉడికించుకోవచ్చు.
*******
సాంబార్ బాత్ .... బియ్యం, కందిపప్పు, కూరగాయలు వేసి సాంబార్ బాత్ చేయటం... కూరగాయల ముక్కలు మరియు కొద్దిగా చింతపండు ఉడికించుకుని
ఉంచుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి పావుగ్లాస్ కందిపప్పు, సరిపడినంత నీరు పోసి , కుక్కర్ మూత పెట్టి, తరువాత వెయిట్ పెట్టాలి. .
ఇ లా ఉడికించుకుని, అందులో ఉడికిన కూరగాయల ముక్కలు చింతపండు పులుసు, ఉప్పు, కారం , సాంబార్ పౌడర్.. వేసి నీరు పోసి పల్చగా చేయాలి.
అయిదు నిమిషాలు ఉడికిన తరువాత నూనె, నేయి వేసి , ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకుతో తిరగమోత వేసుకుని, అంతా గరిటెతో మెత్తగా తిప్పుకుంటే రుచికరమైన సాంబార్ బాత్ రెడీ.
ఇది కొద్దిగా వండినా చాలా అవుతుంది. కొద్దిగా తిన్నా బోలెడు తిన్నట్లుంటుంది.

************
మాములుగా అన్నం కొరకు .... ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోస్తారు. పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు పోయాలి.
బాస్మతి బియ్యం అయితే కొద్దిగా తక్కువ నీరు పోస్తారు.
******
పొంగలి.... అరకప్పు బియ్యం, పావుకప్పు పెసరపప్పు కడిగి ఉంచుకోవాలి. కుక్కర్లో కొద్దిగా నూనె, కొద్దిగా నేయి వేసి అందులో కొద్దిగా జీలకర్ర, పెప్పర్ పౌడర్, ఇంగువ, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించి..
కడిగి ఉంచిన బియ్యం, పెసరపప్పు అందులో వేసి బియ్యం, పెసరపప్పు కొద్దిగా వేయించుకుని , అందులో తగినన్ని నీరు పోయాలి.
బియ్యం అరకప్పు, పెసరపప్పు అరకప్పు కూడా వేసుకోవచ్చు.ఆ నీటిలో ఉప్పు వేయాలి. కుక్కర్ మూత పెట్టి, తరువాత వెయిట్ పెట్టాలి.
ముందే బియ్యంలో కొద్దిగా నీరు ఎక్కువ పోసుకోవచ్చు. నీరు ఎక్కువయితే పొంగుతుందనుకుంటే, ఉడికిన తరువాత పొంగలిని గరిటతో మెత్తగా మెదిపి, ఒక అరగ్లాస్ నీటిని వేడి చేసి, పొంగలిలో కలిపితే పొంగలి పల్చగా అవుతుంది. మళ్ళీ గరిటెతో ఒకసారి తిప్పితే సరిపోతుంది.
*******
నిమ్మకాయ పులిహోరకు .. అన్నం వండి ఒక పళ్ళెంలో ఆరబెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసుకుని , ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయముక్కలు, పసుపు.. వేసి వేయించాలి. వేగిన తరువాత అన్నంలో కలపాలి.
. అన్నం వేడి ఆరిన తరువాత అందులో ఉప్పు, నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర తయారవుతుంది.
..................
గోధుమ రవ్వ ఉప్మా .... పొయ్యి పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో రెండు స్పూన్ల నూనె, ఒక స్పూన్ నేయి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, వేసి వేయించి, ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, తరిగిన ఒక చిన్న ఆలూ, ఒక చిన్న కారెట్, ఒక చిన్న టమేటో ముక్కలు , ఉంటే కొన్ని పచ్చి బటాణీ వేసి కొద్దిసేపు వేయించాలి.
ఇవన్నీ లేకపోయినా ఉన్నవి వేసుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ రవ్వకు రెండు గ్లాసుల నీరు పోసి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత వెయిట్ పెట్టాలి.
*******************
ఎవరి కుక్కర్ అలవాటు బట్టి వారు ఎన్ని విజిల్స్ అవసరమో అలా వండుకోవాలి.

కుక్కర్ అల్యూమినియంది కాకుండా , స్టెయిన్ లెస్ స్టీల్ కుక్కర్ అయితే ఆరోగ్యానికి మంచిది.
ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారుగా మూడు టీ స్పూన్లు.
ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారుగా మూడు టీ స్పూన్లు.
*****************
ఇవన్నీ పెద్దవాళ్లకు దూరంగా ఉన్న టీనేజ్ పిల్లలకు తేలికగా వండుకునేలా వ్రాసిన పుష్టికరమైన వంటలు.
టీనేజ్ వాళ్ళు వీలుకుదిరినప్పుడు కొంచెం ఓపికతో వండుకుంటే మంచిది. ఎప్పుడూ బయటే తినడం కాకుండా ఇంటివద్ద వండుకుని తినడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.
....................
లడ్దూ... కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా నువ్వులు వేటికవి విడివిడిగా వేయించి మిక్సీలో తిప్పితే పొడి అవుతుంది. తరిగిన బెల్లం వేసి మరల మిక్సీలో తిప్పాలి.
ఈ పొడిని ప్లేట్లో వేసి నెయ్యి కలిపి లడ్దూలు చుట్టుకోవాలి. వేయించిన జీడిపప్పు, బాదం పలుకులు లడ్దూలో కలిపితే ఇంకా బాగుంటాయి.
ఈ పొడిని ప్లేట్లో వేసి నెయ్యి కలిపి లడ్దూలు చుట్టుకోవాలి. వేయించిన జీడిపప్పు, బాదం పలుకులు లడ్దూలో కలిపితే ఇంకా బాగుంటాయి.
వేరుశనగపప్పు, నువ్వులు వేయించి .. బెల్లం పాకం వేసి చిక్కీలు చేయవచ్చు.
ఇలాంటివి పెద్దవాళ్ళు తయారుచేసి పిల్లలకు పంపవచ్చు.
..........................
టీనేజ్ పిల్లలు తేలికగా స్వీట్ .... చేసుకోవాలంటే ఇలాగ చేయొచ్చు......
రెండు లేక మూడు టీ స్పూన్ల గోధుమపిండిని కొద్దినీటిలో కలిపి ఉండలు రాకుండా పొయ్యిపై జావలా కాచి కొద్దిగా పాలు , కొద్దిగా నేయి, వేయించిన జీడిపప్పు కలిపి కొద్దిసేపు కాచితే చక్కటి పాయసం రెడీ అవుతుంది. అందులో తరిగిన బెల్లాన్ని కానీ, పంచదార కానీ కలుపుకోవాలి.
దీనిని ఫ్రిజ్లో ఉంచి త్రాగితే చల్లగా బాగుంటుంది.

గోధుమపిండితో పాటు రెండు స్పూన్ల జొన్నపిండి కలుపుకుంటే మంచిది. అయితే ఎక్కువ స్పూన్ల పిండి కలిపితే మరీ చిక్కగా అయిపోతుంది. అప్పుడు మరిన్ని నీళ్లు, పాలు కలుపుకోవాలి.
ఇది ఉత్తరాది వారు తయారుచేసే ఫిర్నీ వంటిది.
రాగి పిండి, జొన్నపిండి తో జావ ... రెండు టీ స్పూన్ల రాగి పిండిని రెండు టీ స్పూన్ల జొన్న పిండిని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా జావలా కాచి బెల్లం లేక పంచదార వేసుకుని త్రాగవచ్చు.ఇష్టమయిన వారు బోర్నవిటా వంటివి కూడా కలుపుకోవచ్చు.
రాగి పిండి, జొన్నపిండి తో సూప్.... బాణలిలో ఒక స్పూన్ నూనె లేక వెన్నవేసి, సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి వేసి వేయించి అందులో రెండు టీ స్పూన్ల రాగిపిండి, రెండు టీ స్పూన్ల జొన్నపిండి కలిపిన నీరు పోసి, ఉప్పు వేసి సూపులా కాచినా బాగుంటుంది.
సన్నగా తరిగిన కారట్, బీన్స్, ఆలు..వంటి కూరగాయ ముక్కలను ఎక్కువగా నీరుపోసి కుక్కర్లో మెత్తగా ఉడికించి, మెత్తగా మెదిపి వడకట్టి. ఆ రసాన్ని కూడా సూప్ లో వేసి కాచినా సూప్ బాగుంటుంది.

కొబ్బరి పైన ఉండే పొట్టుతో సహా తింటే త్వరగా అరగదట.
పచ్చికొబ్బరి అయితే పై పొట్టును పీలర్ తో తేలికగా తీయవచ్చు.
పచ్చికొబ్బరి చిప్పపైన తోలును పీలర్ తో తీసి.. కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి.. అవి ఎండలో ఎండిన తరువాత డబ్బాలో నిల్వ చేసుకుని(ఫ్రిజ్లో కూడా పెట్టవచ్చు).. అవసరమైనప్పుడు వాటిని మిక్సీలో పొడి చేసుకుని వంటలో వాడుకోవచ్చు.
ReplyDeleteఈ మధ్య చాలా గిన్నెలు అడుగుభాగం మందంగా లేకుండా పలుచగా ఉంటున్నాయి. వీటిలో కూరలు వేయించాలంటే పదార్ధం త్వరగా మాడిపోతుంది.ఈ గోలతో పల్చటి మందం ఉన్న పాన్లు వాడటం మానేసాను.
అయితే, పలుచటి గిన్నె క్రింద మెష్ వంటిది పెడిదే మంట ఒకే పద్ధతిలో వ్యాపించి కూర త్వరగా మాడకుండా ఉంటుంది.. అని తెలుస్తోంది.
నేను కొన్నిసంవత్సరాల క్రితం... పొయ్యి మీద పెట్టే గుండ్రని మెష్ వంటిది కొన్నాను. ఈ మెష్ వాడితే గాస్ సేవ్ అవుతుందని చెబితే కొన్నాను. అయితే, అవి వాడకుండా పక్కన ఉంచేసాను.
పల్చటి గిన్నెల క్రింద మెష్ పెడితే , వేడి తగ్గి గిన్నె మాడటం తగ్గుతుందేమోనని ఈ మధ్య ఆలోచన వచ్చి, మెష్ బయటకు తీసి వాడాను. మెష్ చాలా ఉపయోగపడుతున్నాయి.
పొయ్యిపైన ఈ మెష్ పెట్టిన వెంటనే వేడి ఎక్కువగా వస్తుంది. అర నిమిషం తరువాత వేడి సర్దుకుంటుంది.
అప్పుడు గిన్నె పెట్టి వంట చేస్తే పదార్ధాలు త్వరగా మాడకుండా నిదానంగా వేగుతాయి.
Buy LPG Gas Saver Grill - Mini Tandoor Online -
ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నవి కూడా మార్కెట్లో ఉన్నాయి.
ReplyDeleteకొబ్బరి పైన ఉండే పొట్టుతో సహా తింటే త్వరగా అరగదట.
పచ్చికొబ్బరి అయితే పై పొట్టును పీలర్ తో తేలికగా తీయవచ్చు.
ఎండుకొబ్బరి అయితే ఎండుకొబ్బరిని నీటిలో కొద్దిసేపు నానబెట్టి, పొట్టు ఉన్న భాగాన్ని కొబ్బరికోరు పై కోరితే పొట్టు వస్తుంది.
లేకపోతే, కొబ్బరి చిప్ప నీటిలో నానిన తరువాత పీలర్ తో నిదానంగా పొట్టును తీయవచ్చు.
చక్కగా వంటకాలవి తెలిపారు అనురాధ గారు. బిర్యాని నాకెంతో ఇష్టమని మా అమ్మ వండే బిరియానిలా చేయమంటే నా ధర్మపత్ని కి కాస్త చేయ్యి తిరగక దానిని చివరాఖరుకి ఉడికి ఉడకని నూనన్నం లా చేసి పెడితే రెండే రెండు ముద్దలు దిగమింగి తూర్పు దిక్కుకి దణ్ణం పెట్టాల్సి వచ్చింది నిన్ననే..
ReplyDeleteపైపెచ్చు ఈ మధ్యాహ్నం పనీర్ కూర్మ చక్కగా చేసింది కాని మా చిట్టితల్లి కి గోరుముద్దలు తినిపిస్తు అన్నాన్ని ఇలెక్ట్రిక్ కుకర్ లో వేసి, అనక ఉప్పు డబ్బను అక్కడే పెడితేను మా గారాల పట్టి అందులో పావు డబ్బ ఉప్పు వంపేసినట్టుంది.. ఈమె చూసుకోలేదు అలానే ఆన్ చేసేస్తే చివరాఖరున రైత చేసుకుని ఉత్త పనీర్ కూర ముక్కలతో తినాల్సి వచ్చింది. అన్నం ఎంత ఉప్పగయిందో బాబోయి.. కనీసం అమ్మ చెప్పిన టిప్స్ కొన్ని నేను అపుడపుడు చెబుతుంటే చక్కగ చేసి పెడుతోంది. మా రెండున్నర ఏళ్ళ కాపురం లో తనకు తానుగా చక్కని పొళ్ళు పచ్చళ్ళు, అన్నం, ఆకుకూరలు, చపాతి, సేమియ, ఉప్మ, పులిహోర వంటివి చకచకా చేసే నా సతిమణి అపుడపుడిలా తప్పుల తడ్కాతో జడిపిస్తు ఉంటుంది. ఐనా నా భార్య అంటే నాకు ఎనలేని గౌరవం.
మీరు పైన తెలిపిన కొన్ని రెసిపీలు తనకి చెబుతాను ట్రై చేయమని. ధన్యవాదాలు