koodali

Friday, June 22, 2018

కధలలో ఎన్నో విషయాలున్నాయి..


శ్రీ దేవీ భాగవతము గ్రంధములో  ఎన్నో విషయాలున్నాయి. 


ఒకప్పుడు,  త్రిమూర్తులు  యువతులుగా మార్పు చెంది..  పరమాత్మ అయిన ఆదిపరాశక్తి ని  ఆరాధించారని  శ్రీ దేవీ భాగవతము గ్రంధము ద్వారా తెలుస్తుంది. 


(  త్రిమూర్తులు యువతులుగా మారటాన్ని గమనిస్తే , దేవతల రూపాలు  మారటం విషయంలో  ఏదైనా సాధ్యమే ..అని తెలుస్తుంది. )

కొంతకాలానికి, త్రిమూర్తులు తమ నిజరూపాల్లోకి మారటం  జరుగుతుంది. 


*పరమాత్మఆదిపరాశక్తి...  బ్రహ్మదేవునికి మహాసరస్వతి దేవిని నిత్య సహచారిణిగా , విష్ణుమూర్తికి మహా లక్ష్మీదేవిని, పరమశివునికి గౌరిదేవిని(మహాకాళి దేవిని) ఇవ్వటం జరిగిందని తెలుస్తోంది.


విష్ణుమూర్తికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గంగాదేవి..భార్యలుగా ఉండటం అనే విషయం కూడా  శ్రీ దేవీభాగవతంలో ఉన్నది.  


సరస్వతీదేవి గంధమాదనపర్వతం మీద లక్షదివ్య వసంతాలు  తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై జగదారాధ్య అయ్యింది. ..అని   కూడా  ఉన్నది.


******************

 విష్ణుమూర్తికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గంగాదేవి..భార్యలుగా ఉండటం అనే విషయం  లో…


ఒక సారి  విష్ణుమూర్తి యొక్క  భార్యల   మధ్య వచ్చిన మనస్పర్ధ  వల్ల  వారిలో  వారు శపించుకోవటం,  తద్వారా  విష్ణువు …కొన్ని విషయాలను తెలియజేయటం జరిగింది…..


పనిలో పనిగా లోకంలో అందరికీ  పనికివచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను. మీరు  ఆలకించండి-


ఒక పురుషుడికి   ఒక ఇల్లాలు ఉండటం  ఉత్తమోత్తమమం. ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు ఆ పురుషుడి జన్మ ధన్యమయినట్టే. అంతటి సుఖి మరొకడు  ఉండడు.  బహుభార్యలు  ఉండటం ఎంతటివాడికైనా  నరకమే..అది ధర్మవిరుద్ధమూ  వేదవిరుద్దమూ  కూడా. అందులోనూ  సవతులు  ఒకే చోట ఉండటం  మరింత  నరకం..అంటూ కొన్ని విషయాలను  చెప్పటం జరిగింది.



సరస్వతీదేవి  కేవలం  కళాంశ రూపంతో  భారతదేశాన నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంతో  బ్రహ్మసదనంలో నివసిస్తుంది. స్వయంగా  ఇక్కడే మన ఇంటిలోనే  ఉంటుంది.  అలాగే గంగాదేవి  భగీరధుడి వెంట కళాంశరూపంతో  నదిగా  భారతదేశానికి వెడుతుంది. ముల్లోకాలనూ  పవిత్రీకరించడానికి  స్వయంగా తానూ ఇక్కడే  ఉంటుంది. భూలోకానికి  వెళ్ళే దారిలోనే కైలాసంలో  అన్యదుర్లభమైన శివుడి జటాజూటాన్ని అలంకరిస్తుంది. నువ్వుకూడా ఇలాగే కళాంశాంశరూపంలో  పద్మావతీనదిగా  తులసీవృక్షంగా  భారతభూభాగంలో అవతరిస్తావు.  కలియుగంలో అయిదువేల సంవత్సరాలు  గడిచాక  మీరు ముగ్గురూ తిరిగి పరిపూర్ణ రూపాలతో  నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు...అంటూ ఎన్నో విషయాలను  తెలియజేస్తారు. 


* ఈ విషయాల ద్వారా ..  బహుభార్యలు ఉండటం వల్ల కలిగే కష్టాలు, బహుభార్యలుండటం, ధర్మవిరుద్ధం, వేదవిరుద్ధం... అనే విషయాలను గమనించటం ముఖ్యం. 

(తులసీదేవి లక్ష్మీదేవి అంశతో అవతరించటం జరిగింది.)

******************

 విష్ణుమూర్తి  భార్య అయిన సరస్వతి యొక్క కొంత అంశను   బ్రహ్మ వద్ద కు పంపటం అనే విషయం  గురించి... 

  వైకుంఠంలోని సరస్వతీ  దేవి యొక్క కొంత అంశ  మాత్రమే బ్రహ్మ సదనానికి వెళ్తుంది. మరికొంత భాగం నదిగా మారుతుంది. స్వయంగా వైకుంఠంలోనే ఉంటుందని చెప్పబడింది. 

బ్రహ్మదేవునికి  ఆదిపరాశక్తి ప్రసాదించిన సరస్వతీ దేవి ఉంటుంది కదా. 

 బ్రహ్మ వద్ద ఉన్న సరస్వతి   బ్రహ్మ వద్ద ఉంది. వైకుంఠంలో  ఉన్న  సరస్వతీ దేవి  వైకుంఠంలో ఉంది.

*********************
ఇంకొక విషయం ఏమిటంటే, 

 కలియుగంలో 5000సంవత్సరాల తరువాత లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, గంగా దేవి తిరిగి పరిపూర్ణరూపాలతో వైకుంఠానికి తిరిగి వస్తారని  చెప్పబడింది.


నాకు కలిగిన కొన్ని ఆలోచనలలో ఒకటి ఏమిటంటే,  

 వైకుంఠంలో విష్ణుమూర్తిని వివాహం   చేసుకున్న సరస్వతీ  దేవి  నుండి  (కృష్ణాదేవి ముఖం నుండి ఆవిర్భవించిన సరస్వతి దేవి నుండి ) ఒక భాగం వెళ్లి ఆదిపరాశక్తి బ్రహ్మకు ప్రసాదించిన సరస్వతీ దేవి లో ప్రవేశిస్తుందేమో? అనిపించింది.


కలియుగంలో 5 వేల సంవత్సరాల తర్వాత ….వైకుంఠం నుండి వెళ్లిన సరస్వతీ  దేవి అంశ తిరిగి వైకుంఠంలో ఉన్న సరస్వతిలో కలుస్తుందేమో? అని ఒక ఆలోచన కలిగింది.


*************
సరస్వతులలో ఎన్నో రకముల సరస్వతులున్నారట. ఉదా: నీల సరస్వతి .. 
************

ఇంకొక విషయం ఏమిటంటే, అష్టలక్ష్ములలో విద్యాలక్ష్మి  కూడా  ఉంది.
**********
పార్వతీపరమేశ్వరులు అర్ధనారీశ్వరులు.

***************
 ప్రపంచంలో పశుపక్ష్యాదులు, మనుషుల విషయంలో ఎన్నో భేదాలుంటాయి. ఇక ఎంతో ఉన్నతమైన దేవతలకు ఎన్నో శక్తులుంటాయి. 

దేవతలు అపవిత్రతకు తావు లేకుండా  తమ రూపాలను, లక్షణాలను ఎలాగైనా మార్చుకోగలరు. 


మార్పు జరిగినప్పుడు ఎక్కడి ధర్మం అక్కడ ఉంటుంది. 

దేవతలకు మనుషుల వలె శరీరాలుండవు. వారు సంకల్పమాత్రం చేతనే ఏమైనా మార్పులను చేయగలరు. 

 లౌకిక ప్రపంచంలోనే గమనిస్తే, ఒకే అంశ కలిగిన నీటి అవిరి నీరుగా మారుతుంది. నీరు మంచుగడ్దగా మారుతుంది. 


అయినా, నీటి ఆవిరి లక్షణాలు , నీటి లక్షణాలు, మంచుగడ్డ లక్షణాలు వేటికవే వేరుగా ఉంటాయి... 

ఉదా..ఒక మంచుగడ్డ ముట్టుకుంటే గట్టిగా ఉంటుంది, నీరు అలా గట్టిగా ఉండదు కదా!

నీరు మంచుగా  మారినప్పుడు..  మంచుగడ్డ లక్షణాలను పొందుతుంది.. అదే మంచుగడ్డ తిరిగి   నీటిగా మారినప్పుడు  తిరిగి  నీటి లక్షణాలను పొందుతుంది. 


 అయితే, మనుషులకు ఇలాంటి పరిస్థితి లేదు  కానీ,   దేవతలకు ఏదైనా సాధ్యమే.  

***************
కెమిస్ట్రీ గురించి నాకు తెలిసినంతలో .. 

నీటి ఆవిరి, నీరు,  మంచు..ఒకే ఫార్ముల్లా ఉన్నా కూడా ఫిజికల్ లక్షణాలు వేరుగా ఉంటాయి.

ఐతే, నీటి ఫార్ములా  H2O  అయితే, నీటి ఆవిరి యొక్క  ఫిజికల్ లక్షణాలు వేరుగా ఉండటం వల్ల  H2O(g) అని కూడా అంటారు.

 కెమిస్ట్రీలో ఇలాంటి వాటి గురించి ఎన్నో చిత్రమైన అంశాలుంటాయి.

దేవతల వంటివారు.. తమకు కావలసిన రూపాలను ధరించటం, కోరుకున్న రూపాల్లోకి మారటం..అనే విషయాల్లో..కెమిస్ట్రీ, ఫిజిక్స్ కు సంబంధించిన ఎన్నో అంశాలు కూడా ఉన్నాయని నా అభిప్రాయం. 

**********
గ్రంధాలలోని అంతరార్ధాలను అర్ధంచేసుకోవటం కొన్నిసార్లు చాలా కష్టం. ఎంత తెలుసుకున్నా ఇంకా అర్ధం చేసుకోవలసినవి  ఎన్నో ఉంటాయి.మనకు అర్ధం కాలేదని అపార్ధం చేసుకోకూడదు.  

************
ఇల్లాలు అంటే సహచారిణి అనే అర్ధం కూడా ఉంది. భార్యాభర్తలలో రకరకాల వాళ్ళుంటారు. 

ఉదా..రామకృష్ణపరమహంస శారదాదేవిలు భార్యాభర్తలే. కానీ, బ్రహ్మచర్యాన్ని అవలంబించారు. 


మానవులలోనే ఇంతటి గొప్పవారున్నప్పుడు..    దేవతల గురించి  తప్పుగా  భావించటం సరైనది కాదు.


ఈ కధలో ...  

బహుభార్యలుండటం, ధర్మవిరుద్ధం , వేదవిరుద్ధం .. అని  విష్ణుమూర్తి  తెలిపిన  విషయాలను గమనించటం ముఖ్యం.

****************
దేవతలకు మానవుల వంటి శరీరాలు ఉండవు. వారు ఏ విధంగానైనా తమ శరీరాలను మార్చుకోగలరు.వారు  సంకల్పమాత్రం చేతనే ఎన్నో పనులు చేయగలరని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

అలాంటప్పుడు వారి విషయాలలో అంతా  మనుషుల వలే ఆలోచించి  అపార్ధం చేసుకోకూడదు.

సృష్టిలో మనుషులకు తెలిసింది నీటిబొట్టంత....తెలియనివి సముద్రమంత.

దైవానికి మాత్రమే అన్ని విషయాలు తెలుస్తాయి.


1 comment:


  1. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్తస్తోత్రరత్నాన్ని ఇంద్రుడు అనర్ఘళంగా పఠించాడు......ఆ స్త్రోత్రంలో శ్రీ మహాలక్ష్మిని స్తుతించాడు. ఆ స్తుతిలో లక్ష్మి దేవి గురించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి.

    లక్ష్మీదేవి స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతుందట.


    దుర్గాదేవి కూడా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా ఉంటుందని ఇంకో దగ్గర చదివాను.


    భార్యాభర్తలను పార్వతీపరమేశ్వరులుగాను లేక లక్ష్మీనారాయణులుగానూ భావిస్తారు.


    భగవద్గీతలో శ్రీ కృష్ణుల వారు అర్జునునితో ....( విభూతి యోగంలో.) ...దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో శంకరుడను వాడను, పాండవులలో అర్జునుడును, మునులలో వేదవ్యాసమునీంద్రుడను....నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించి యున్నాను .....అని చెప్పటం జరిగింది.


    ఇవన్నీ గమనించితే మనకు ఏ అర్ధం అవుతుందంటే దైవం ఒక్కరే. సందర్భాన్ని బట్టి ఒక పద్దతి ప్రకారం దైవం రూపాన్ని ధరిస్తారు అని .

    ************

    ఒకే వ్యక్తిలో రెండు లేక మూడు తత్వాలు ఉండటం ఆశ్చర్యం కాదు.

    మానవులలోనే సాత్విక, రాజస, తామస తత్వాలు ఒకే వ్యక్తిలో ఉంటాయికదా!

    మరి అద్భుతమైన శక్తులు గల దేవతలకు ఎన్నో మహిమలు ఉంటాయి.

    ReplyDelete