గోవు సకల దేవతాస్వరూపం కాబట్టి, నూతన గృహప్రవేశ సమయంలో ఆవును తీసుకు వచ్చి గృహప్రవేశం చేయిస్తే మంచిదంటారు. .
పాతకాలంలో అపార్ట్మెంట్స్ లేవు కదా ! అప్పుడు గోవు గృహప్రవేశానికి ఏమీ ఇబ్బంది ఉండేది కాదు.
అయితే ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పుణ్యమాని ఎన్నో అంతస్తుల ఎత్తున ఇళ్ళు ఉంటున్నాయి .
అయినా మనవాళ్ళు ఊరుకోరు ..... . కొందరు ఆవును పైవరకు తీసుకెళ్ళి మరీ గృహప్రవేశం చేయిస్తున్నారు.
ఇవన్నీ చూసే ఈ కాలం పిల్లలు పూర్వులు ఇలాంటి ఆచారాలను ఎందుకు పెట్టారో ! అనుకునే అవకాశం ఉంది. పూర్వీకులు ఈ ఆచారం పెట్టినప్పుడు ఇలాంటి అపార్ట్ మెంట్స్ లేవు కదా !
మా చిన్నతనంలో మేము ఒక గృహం కొన్నాము. . గృహప్రవేశానికి తెల్లవారు ఝామున ముహూర్తం కుదిరింది.
గృహప్రవేశానికి మేము తెల్లవారు ఝామున వెళ్ళగా ఇంటి ఆవరణలో ఒక ఆవు దూడకు జన్మ ఇచ్చింది. ఆ ఆవు ఎవరిదో మాకు తెలియదు. రోడ్డు మీద కొన్ని ఆవులు తిరుగుతుంటాయి కదా ! ఎవరి ఆవో మరి.
అలా ఆ ఆవు దాని కదే రావటం, దూడ పుట్టడం ... చాలా శుభ సూచకమ్ అన్నారు. అలా జరగటం మాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించింది.
నూతన గృహప్రవేశ సమయంలో ఆవు యొక్క ప్రవేశం మంచిది ... అని పెద్దలు చెప్పిన మాట నిజమే కానీ ,
మారిన కాలమాన పరిస్థితుల్లో ఎంతో ఎత్తైన అపార్ట్మెంట్స్ ను బలవంతానా ( మెట్ల మీద ) ఎక్కించి ఆవుదూడలను ఇబ్బంది పెట్టటం అనేది ఎంతవరకూ భావ్యమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఇలా పెద్దలు చెప్పిన ఎన్నో ఆచారాలు రూపు మారి పోతున్నాయి కొందరు ప్రజల విపరీత ధోరణి వల్ల.
No comments:
Post a Comment