శ్రీలక్ష్మీదేవి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.
లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు. పెద్దలు అష్టలక్ష్ముల గురించి తెలియజేసారు.
ఇంకా ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు.
ఇంటి ముందు ఆవుపేడతో కళ్ళాపి జల్లటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు.
ఆవుపేడ నీటితో కలిపి జల్లటం వల్ల ఇంటి పరిసరాల్లో ఉన్న చెడు బాక్టీరియా పోయి ఇంట్లో వాళ్ళకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా !
ఇంకా, స్త్రీలు కన్నీరు ఫెట్టిన చోట సిరి ఉండదనీ అంటారు. ఈ విషయాన్ని గమనిస్తే ప్రాచీనులు స్త్రీలకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో తెలుస్తుంది.
ఈ విధంగా పెద్దలు ఎన్నో చక్కటి ఆచారాలను ఏర్పరిచారు.
No comments:
Post a Comment