koodali

Monday, October 4, 2010

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.

 

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.


నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ? అనిపించిందండి. తరువాత నాకు జరిగిన అనుభవాల ద్వారా నాకు అనిపించినది చెబుతాను అండి.


కసారి.. గుడికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు జరగకుండా పూజ జరగాలనే ఆలోచనలోపడి ... ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోవటము జరిగేది. అంటే తీర్ధప్రసాదములు తీసుకుని బయటకు వచ్చాక తీరిగ్గా గుర్తు వచ్చేది.


ఏమంటే హుండీలో కానుకలు సమర్పించటము మరిచిపోవటమో, లేక తీసుకువెళ్ళిన పండ్లు సమర్పించటం మర్చిపోయి సంచీలో ఉండిపోవటమో .... కొన్ని ఉపాలయములు చూడలేదని గుర్తు రావటము.. ఇలాగన్నమాట.

ఇలా గుడిలోనుంచి ఒకసారి బయటకువచ్చాక .... మళ్ళీ తిరిగి వెళ్ళి ఉపాలయములు దర్శించుకోవటము ..... ఇలా చేసినప్పుడు చుట్టూ అక్కడివాళ్ళు నన్ను వింతగా చూస్తున్నట్లు నాకు అనిపించిందండి.

ఎందుకంటే ఇప్పుడే తీర్ధప్రసాదములు తీసుకుని వెళ్ళి మళ్ళీ ....అప్పుడే వస్తే ఎవరైనా కొంచెం ఆశ్చర్యముగా చూస్తారు గదండి. ( ఏమో వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు అలా అనిపించేది. )


ఇలా కొన్ని సార్లు జరిగాక నాకు ఏమని అనిపించిది అంటేనండి.......ఇలా ఎవరూ అతిగా చేయకుండా ...అంటే ఏదోఒకటి మర్చిపోయి గుడిలోకి బయటకు తిరగటం...... ఇలాంటివి ఆపటానికే పెద్దలు అలా చెప్పారేమోనని.


ఇలా ఒకటిరెండుసార్లు జరిగాక నాకు ఓపిక లేక భగవంతునితో దేవా ............ పూజలో జరిగే లోటుపాట్లకు క్షమించు..... నాకు శక్తి మేరకే చేయగలను . అని చెప్పేసాను..


అప్పటినుంచి ఏదయినా మర్చిపోయి ఇంటికి వచ్చేసినా భయపడటంలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ......... లోటుపాట్ల గురించి అతిగా ఆలోచించకుండా, ప్రశాంతముగా నా శక్తి కొలది ప్రవర్తించటము మంచిదని అలా ప్రయత్నిస్తున్నాను.


ఇంతగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటేనండీ ..... ఈ రోజుల్లో దేవుని గురించి తక్కువగా ...... విధి విధానముల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండే నా లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారేమోనని.... ఇలా వ్రాయాలనిపించిందండి.

ఇలాంటివారు అతిగా ప్రవర్తించి మూఢత్వముగా మారకూడదని నా ఆలోచన.

పూజలో జరిగే లోటుపాట్ల వలన వచ్చే పాపం కన్నా.... అతిగా ఆలోచనల్లో పడి భగవంతుని భక్తికి దూరమవ్వటము మరింత పాపమని నాకు అనిపించింది అండి.
 

 సాయి కూడా పూజ ఎట్టిదయినా బుద్ది ప్రధానమని తెలియజేసారట. రామకృష్ణపరమహంస వారు కూడా దైవముతో మనము చనువుగా ఉండాలి....... భయపడటమెందుకు అని అనేవారట.

 
.అసలు పూజ చెయ్యటము దైవం కొరకే ..... మనము అసలు లక్ష్యమునకు దూరము కారాదు

 

5 comments:

  1. అన్ని విధాల పూజల లోకి 'మానసిక పూజ ' ఉత్తమమైనది అంటారు...మనసు దైవం మీద లగ్నం చేస్తే చాలు....ఎక్కడో అలోచిస్తూ గంటలు గంటలు పూజ చేసే కంటే మనస్సులో ఒక్క క్షణం చిత్తసుధ్ధిగా దేవుణ్ణి తలుచుకున్నా చాలు!!

    ReplyDelete
  2. మీకు నా కృతజ్ఞతలండి, మీరు చక్కగా చెప్పారండి.

    ReplyDelete
  3. Replies
    1. మీకు కృతజ్ఞతలండి.

      Delete
  4. టపాలో వ్రాయాలనిపించిన ఒక విషయాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను...

    తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని.. చెప్పారు కదా ! అని దేవాలయంలో ఇంటితాళాలు, బండి తాళాలు లేక మరేదైనా మర్చిపోతే అప్పుడే తిరిగి దేవాలయానికి వెళ్ళొచ్చో? లేదో ? అనుకోనవసరం లేదు, తిరిగి దేవాలయానికి వెళ్ళి తెచ్చుకోవచ్చు.

    ReplyDelete