koodali

Sunday, March 31, 2013

కొన్ని విషయాలు.

ఈస్టర్  శుభాకాంక్షలండి.
..............................


 చాలామందికి  లాగే  నాకు  కూడా   చెట్లు,  మొక్కలంటే  చాలా  ఇష్టం.    మొక్కలు,  చెట్లు    మధ్య  తిరుగుతుంటే  చాలా  బాగుంటుంది. 


 చెట్లను,  మొక్కలను  పరిశీలిస్తే  ఎంతో  ఆశ్చర్యంగా  ఉంటుంది.


నీటిలో  పెరిగే  తామరమొక్కల  ఆకులు   చిత్రమైన  లక్షణాలను  కలిగి  ఉంటాయి . తామరాకు  పైన  నీటిబొట్టు    జర్రున   జారిపోతుందికదా  ! 
 
ఇప్పుడు   మనం  వాడుతున్న   ప్లాస్టిక్ వల్ల    ఎన్నో  పర్యావరణ  సమస్యలు  వస్తున్నాయి.    కొంతకాలం  క్రిందట  అయితే   ఇడ్లీలను  అమ్మేవాళ్ళు   ఇడ్లీలతో  పాటు  కొబ్బరిపచ్చడిని    తామరాకులలోనే  పొట్లం  కట్టి  ఇచ్చేవారు. 


 తామరాకు  వల్ల   ప్లాస్టిక్  లాగా   పర్యావరణ  సమస్యలు  ఉండవు.
............................................


మొక్కల  వల్ల  ఎన్నో  లాభాలున్నాయి.
మొక్కలు,  చెట్లు  మనకు  ఆహారాన్ని  అందిస్తున్నాయి.  అనారోగ్యం  వస్తే  ఔషధాలుగానూ  ఉపయోగపడుతున్నాయి.   ఆయుర్వేద  వైద్య  విధానము  ఎంతో  గొప్ప  వైద్యవిధానము.   పసుపు ,  వేప  వంటివాటిని   మనము   తరతరాలుగా  వాడుకుంటున్నాము.


 అయితే  వైద్యాన్ని  మనకు  తోచినట్లు  కాకుండా,   వైద్యుల  ద్వారా  తెలుసుకుని,  లేక  ఇంట్లోని  అనుభవజ్ఞులైన  పెద్దవాళ్ళ  ద్వారా  తెలుసుకుని   వాడుకోవాలి. సీతాఫలాన్ని  చక్కగా  తినవచ్చు. నేను  ఒక  దగ్గర  చదివిన  దాని  ప్రకారం  సీతాఫలం  గింజల  పొడి  తలకు  రాసుకుంటే  పేలు  చనిపోతాయట.  అయితే  ఆ  ఆకు  బాగా  శక్తివంతమైనది  కాబట్టి  తలకు  రాసుకునేటప్పుడు  ఆకురసం  కళ్ళల్లో  పడకుండా  జాగ్రత్తలు  తీసుకోవాలట.  పసుపులో   కూడా  యాంటిబయాటిక్  లక్షణాలున్నాయి . కానీ  పసుపును  మనము  ఆహారంలో  కూడా   వేసుకుంటాము.   పసుపు  కళ్ళల్లో  పడినంతమాత్రాన  ప్రమాదమేమీ  లేదు.  (  నాకు  తెలిసినంతవరకు  ) .అన్నిరకాల  ఆకులు,  పండ్లు........  ఒకే  రకం  లక్షణాలను  కలిగిఉండవు  కదా  !   మొక్కల  యొక్క   ఆకులు,  పువ్వులు ,   పండ్లు......వీటి  లక్షణాలను    చక్కగా  తెలుసుకుని  అప్పుడు   వాడుకుంటే  మంచిది.
.............................................

ఆయుర్వేదం  ఎంతో  గొప్ప  శాస్త్రం.  పూర్వం  రోగి  ముఖాన్ని  పరిశీలించినంత  మాత్రాన్నే  రోగాన్ని  తెలుసుకునే  గొప్ప  వైద్యులుండేవారట. 


పూర్వం   ప్రతి  చిన్నరోగానికి  వైద్యుల  వద్దకు  పరిగెట్టేవారు  కాదట.  ఇంట్లో  ఉన్న  పెద్దవాళ్ళు వంటల్లో  వాడుకునే  పదార్ధాలతోనే   ఎన్నో  రోగాలను  పోగొట్టేవారట.
  


ఇప్పుడు  ప్రతి  చిన్న  జబ్బుకు  రసాయనిక  మందులు  వేసుకోవటం  వల్ల  శరీరం  మందులకు  అలవాటుపడి    రోగాలు  తగ్గని  పరిస్థితి  వచ్చే  ప్రమాదముందంటున్నారు. 
( యాంటిబయోటిక్స్  విచ్చలవిడి  వాడకం వల్ల   కొన్నిసార్లు  రోగకారక  బాక్టీరియ బలపడే  అవకాశాలున్నాయట .)


మన  నిర్లక్ష్యంతో  ఎన్నో  గొప్ప  ప్రాచీన  గ్రంధాలను  పోగొట్టుకున్నాము.  మిగిలిఉన్న  గ్రంధాలనైనా  జాగ్రత్తగా  భద్రపరిచి  ముందుతరాల  వారికి  అందించవలసిన  అవసరం  ఎంతో ఉంది.

...............................

వ్రాసిన  వాటిలో  పొరపాట్లు  ఉంటే దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను ..Wednesday, March 27, 2013

కొన్ని విషయాలు....ఇందులో కాన్సర్ వంటి రోగాలను తగ్గించే ఔషధగుణాలు ఉన్నాయని చెప్పబడుతున్న ఒక అద్భుతమైన చెట్టు గురించి కూడా...


దైవానికి  వందనములు.  అందరికి  హోలి  శుభాకాంక్షలు.


ఈ  టపాలో   కాన్సర్ ను  తగ్గించే  లక్షణాలు  ఉన్న ఒక   పండును  గురించి  చెప్పుకుందాము.. 


 ఈ  పండును   లక్ష్మణ  ఫలం  లేక  హనుమంతుని  ఫలం  అంటారట.  ఈ  పండును  ఇంగ్లీష్  లో  Soursop fruit    అంటారట.


  కొన్ని  వివరాలు.........

సీతాఫలం, రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కనుక హనుమంతుని ఫలాన్ని  నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని సేవించడం మేలు.


ఔషధ గుణాలు


హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు.

 కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది.  నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.

కేన్సర్ కు వాడే విధానం

కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి .....

..................................................

పూర్వం  ఇప్పుడున్నంతగా  కాన్సర్  కేసులు  ఉండేవి  కాదు.    ఈ  రోజుల్లో  కాన్సర్  వ్యాధిగ్రస్తుల  సంఖ్య  పెరిగింది.   


 పర్యావరణాన్ని  కలుషితపరిచి  కాన్సర్  వంటి  రోగాలు  రావటానికి  కారణమవుతున్న  వాటిని  గురించి జాగ్రత్తలు  తీసుకోవాలి. 


వ్యాధి  వచ్చినప్పుడు  మందులు  వాడటంతోపాటు   కొన్ని  జాగ్రత్తలు  కూడా  తీసుకోవాలి  కదా!  

.......................................

 కొంతకాలం  క్రిందట    లక్కరాజు  గారు   బ్లాగ్ లో    కాన్సర్  వ్యాధి  గురించి  ఎన్నో  వివరాలను  తెలియజేసారు.

ఈ  మధ్య  కష్టేఫలి బ్లాగ్   శర్మ  గారు    ఒక  టపాలో    రామాఫలం  గురించి  వ్రాస్తూ....

రామాఫలం లో గింజలు తక్కువగా ఉంటాయి, పండు నిండా తీయని గుజ్జే. కొద్ది వాసన ఉంటుంది. మంచి పండు. సీతాఫలం లాటిదే, లక్ష్మణ ఫలం కూడా ఉంది, ఈ సారి దొరికితే పొటో తప్పక పెడతా....అని  వ్రాసారు.

 వారు  వ్రాసిన వివరాలను  చదివాను.   నాకు  సీతాఫలం,  రామాఫలం  గురించి  తెలుసు.  లక్ష్మణ  ఫలం  గురించి  తెలియదు  .

ఈ  మధ్య  జిలేబి  గారి  బ్లాగులో  ఒక  టపాలో   మొక్కలు, చెట్ల  శాఖల  గురించి  ప్రస్తావన  వచ్చింది.  


 నేను  ఆ  టపాను  చదివిన  తరువాత  వ్యాఖ్యను  వ్రాసి,  చెట్ల  గురించి    మరిన్ని  వివరాల  కోసం   అంతర్జాలంలో   చదువుతుండగా  ఒక దగ్గర   హనుమంతుని  ఫలం  అని  ఉంది. 

వర్గం:వృక్ష శాస్త్రము ...


  హనుమంతుని  ఫలం  ఏమిటో  చూద్దామని  వివరాలను  చూశాను.

ఈ   విధంగా  నాకు  ఈ  
చెట్టు  గురించి  తెలిసింది.
...........................


ఈ పండును  గురించిన మరిన్ని   వివరాలను తెలుసుకోవాలంటే  లింకులు   క్రింద   ఇచ్చాను. 

Soursop Fruit - Natural Cancer Killer - Why Don't You Try This?


హనుమంతుని ఫలం - వికీపీడియా..........

....................  


 ఎన్నో  వ్యాధులను  నివారించే  లక్షణాలున్న   ఈ చెట్టు   గురించి  తెలియజేసినందుకు  దైవానికి  కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను.  

అంతా  దైవం  దయ.


Monday, March 25, 2013

నాకు అనుభవంలోకి వచ్చిన ఒక సాయిలీల..........

సాయిసాయి

 మేము  ఉంటున్న  ఊరిలో  కొంతకాలం  క్రిందట ,  కొందరు  భక్తులు  షిరిడి  సాయి  బాబా  లీలల  గురించి   వివరించే  సభను  ఏర్పాటు  చేసారు.  వారి  ప్రసంగాలను  వినటానికి   నేను,  మాకు  తెలిసిన  ఒకామెతో  కలిసి  వెళ్ళాను.  ఆరుబయట  గ్రౌండ్  విశాలంగా  ఉంది.  భక్తులు  పెద్దసంఖ్యలో  హాజరయ్యారు.  


వేదిక  మీద   అమ్మవారికి,  శివలింగానికి  ,  షిరిడి  సాయికి  పూజలు  జరిగాయి.


భక్తులు  ఇళ్ళకు  వెళ్ళేటప్పుడు  ప్రసాదాన్ని  స్వీకరించి  వెళ్ళమని     సభలో  తెలియజేశారు. శ్రీ రమణానంద మహర్షి గారు   సాయిబాబా  లీలల  గురించి  ఆసక్తికరంగా  తెలియజేస్తుండగా...


  కొంతసమయం  గడిచిన  తరువాత  నాతోపాటు  వచ్చిన  ఆమె  ఏమన్నారంటే,  ఇంకా  వెళ్దామాండి.... ఇంట్లో  పని కాలేదు.  వంట  చెయ్యాలి.  అన్నారు.  మరి  కొంతసేపు  ఉండి  ప్రసాదం  తీసుకు వెళ్తే  బాగుంటుంది . అని  నాకు   అనిపించింది. అయితే  ఆమె  ఇంటికి  వెళ్ళటానికి  తొందర  పడుతున్నారు  కదా !  అని  ఏమనలేకపోయాను. 


సభలో  సాయిబాబా  లీలల  గురించి  తెలియజేస్తున్నారు.   మేము  ఇద్దరం  లేచి  సభకు  కొద్దిదూరంలో  ఉన్న  పుస్తకాలు   మొదలగువాటిని  చూస్తూ  నడుస్తుండగా ,  అక్కడ  పూజచేసిన  ఒక  షిరిడి  సాయి  ప్రతిమ  కనిపించింది.  నేను  అక్కడకు  వెళ్ళి  సాయిని  ప్రార్ధించుకున్నాను. 
సాయిప్రతిమ  ఉన్న  దగ్గర  లైటింగ్  కొంచెం  తక్కువగా  ఉంది. అక్కడ సాయి  పాదాల  వద్ద   చిన్న  ఆకు  దొన్నెలో  పసుపు  రంగులో  అక్షతల  లాగా  కనిపించాయి.  నేను  వాటిని  అక్షతలు  కాబోలు  అనుకుని  చేతితో   తీయబోతుంటే   చేతికి  అన్నపు  మెతుకులులా    అనిపించింది.  


 ఇదేమిటి  ?  ఇవి  అక్షతలు  కావా  ?  అని  పరిశీలనగా  చూస్తే  ఆ  చిన్న  కప్పులో  ఉన్నది  పులిహోర.  సాయికి  నైవేద్యంగా  పెట్టినట్లున్నారు.     ప్రసాదం  అంటుకున్న  నా చేతిని  కడుక్కోకుండా  అలాగే  ఇంటికి  వచ్చి  చేతివేళ్ళకు   ఉన్న   ప్రసాదాన్ని  తిన్నాను.  ప్రసాదం   తీసుకోలేదు .. అని   బాధపడుతున్న  నాకు  అనుకోకుండా  ఈ విధంగా ప్రసాదం  లభించింది.   ఈ  విధంగా  జరిగిన  సాయిలీల  నాకు  అత్యంత  ఆశ్చర్యాన్ని,  అత్యంత  ఆనందాన్ని  కలిగించింది.

అంతా  దైవం  దయ.

..............................


అయితే,  ఎప్పుడూ  ఇలాంటి  లీలలు  జరగాలని  లేదు. కొన్నిసార్లు  దేవాలయాలకు  వెళ్ళినప్పుడు   అక్కడ   పూజ  పూర్తయ్యేవరకు   ఉండటానికి  మనకు  సమయం  కుదరకపోవచ్చు. దేవాలయంలో   దైవానికి  నమస్కరించి  ప్రసాదం  తీసుకోకుండా  ఇంటికి  వచ్చేసినప్పుడు  ఇంట్లోని  దైవం  వద్ద  ఉన్న  ప్రసాదాన్ని  లేక   ఏదైనా  పదార్ధాన్ని  దైవప్రసాదంగా  భావించి  స్వీకరించవచ్చు. అంతేకానీ  ప్రసాదం  తీసుకోకుండా   దేవాలయం   నుంచి  ఇంటికి  వెళ్ళామని  బాధపడనవసరం  లేదు.

దైవం  సర్వాంతర్యామి..............దైవం  యందు  మనకు  గల   భక్తి,  భావం  ముఖ్యం .

 

Friday, March 22, 2013

ఓం

ఓం
శ్రీ విష్ణుమూర్తికి శ్రీ లక్ష్మిదేవికి  వందనములు.

విష్ణోః అష్టావింశతి  నామ స్తోత్రం

శ్రీ  భగవానువాచః
మత్స్యం కూర్మం వరాహంచ  వామనంచ జనార్దన
మ్
  గోవిందం పుండరీకాక్షం  మాధవం  మధుసూదనమ్
  పద్మనాభం  సహస్రాక్షం  వనమాలిం హలాయుధమ్
  గోవర్ధనం  హృషీకేశం  వైకుంఠం పురుషోత్తమమ్
  విశ్వరూపం వాసుదేవం  రామం  నారాయణం  హరిమ్
  దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజమ్
  అనంతం  కృష్ణగోపాలం జపతోనాస్తి  పాతకమ్
గవాం  కోటిప్రదానస్య చాశ్వమేధ శతస్య చ.

లక్ష్మ్యష్టకం
నమస్తే
స్తు మహామాయే శ్రీ పీఠే  సురపూజితే
శంఖ చక్ర  గదాహస్తే మహాలక్ష్మి  నమోస్తుతే 

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి  మహాలక్ష్మి  నమో
స్తుతే 

సర్వజ్ఞే  సర్వవరదే  సర్వదుష్ట  భయంకరి
సర్వపాపహరే  దేవి  మహాలక్ష్మి  నమో
స్తుతే 

సిద్ధిబుద్ధి ప్రదే దేవి  భుక్తిముక్తి  ప్రదాయిని
మంత్రమూర్తే  సదా దేవి మహాలక్ష్మి  నమో
స్తుతే 

ఆద్యంతరహితే దేవి  ఆద్యశక్తే  మహేశ్వరి
యోగజ్ఞే  యోగ సంభూతే మహాలక్ష్మి  నమో
స్తుతే 

స్థూలసూక్ష్మే  మహారౌద్రే  మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి  మహాలక్ష్మి నమో
స్తుతే 

పద్మాసన స్థితే దేవి  పరబ్రహ్మస్వరూపిణి 
పరమేశి  జగన్మాత ర్మహాలక్ష్మి  నమో
స్తుతే 

శ్వేతాంబరధరే దేవి  నానాలంకార భూషితే
  జగత్సితే  జగన్మాత ర్మహాలక్ష్మి నమో
స్తుతే 

మహాలక్ష్మ్యష్టకం  స్తోత్రం యఃపఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి  సర్వదా .

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశన
మ్
  ద్వికాలం యః పఠేన్నిత్యం  ధనధాన్యసమన్వితః
త్రికాలం  యః పఠేన్నిత్యం  మహాశత్రు వినాశన
మ్
  మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా  వరదా  శుభా.

ఇతి  ఇంద్రకృత  మహాలక్ష్మష్టకస్తవః


వ్రాసిన  విషయములలో  అచ్చుతప్పులు  వంటివి  ఉన్నచో   దయచేసి క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.Wednesday, March 20, 2013

శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ లలితా సహస్ర నామములను పారాయణ చేయటం గురించి... . రెండవ భాగము.

* ఓం
*శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును  మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి   పారాయణ  చేయకూడదు అని  ఇంతకుముందు  అనుకున్నాము .

* అయితే,  సహస్రనామ  స్తోత్రములోనే  రెండు  నామములు  కలిపి  ఉంటే  మనము  అలా  పారాయణం  చేయవచ్చు. 

* శ్రీ  విష్ణు సహస్రనామ  స్తోత్రములో  ఒక  ఉదాహరణ..... ....విశ్వం  విష్ణుర్వషట్కారో ..

* శ్రీ  లలితాసహస్ర  నామ  స్తోత్రములో  ఒక  ఉదాహరణ ......ఆదిశక్తి రమేయాత్మా
ఽఽ పరమా  పావనాకృతిః  

........................................

* సహస్రనామములను  పారాయణం  చేసేటప్పుడు  అయితే   ఏ  నామమునకు  ఆ నామము  పారాయణము  చేస్తారు.
..................................... 


* సహస్రనామ  స్తోత్రములో    గమనిస్తే....

1.......శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో  కొన్ని  నామములు  ఇలా  దీర్ఘంగా ఉంటాయి .

* ఉదా......కర్పూర వీటికా
ఽఽమోద సమాకర్షద్ దిగంతరా.......

 ( ఇదంతా  ఒకటే  నామము. )


* ఓం  కర్పూరవీటికామోదసమాకర్షద్ధిగంతరాయై  నమః

 ( శ్రీ లలితా సహస్రనామావళిః )
.................................................

2...... శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో  కొన్ని  నామములు  ఇలా
ఉంటాయి .

* ఉదా..ఆదిశక్తి రమేయాత్మా
ఽఽ పరమా  పావనాకృతిః   

...................................

( శ్రీ లలితా సహస్రనామావళిః
 * ఆదిశక్తి ( ఓం ఆదిశక్త్యై నమః) 
* అమేయా
( ఓం అమేయాయై నమః)
* ఆత్మ  
( ఓం ఆత్మనే నమః)
* పరమా
  ( ఓం పరమాయై నమః)
* పావనాకృతిః
( ఓం పావనాకృత్యే నమః)
అనే  నామములు  ఉన్నవి. 


( నామావళిః ని  పారాయణ  చేసేటప్పుడు  నామమునకు  ముందు  ఓం  అని  చివర  నమః  అని  పారాయణ  చేయాలట. )
.............................................

3.....శ్రీ లలితా సహస్రనామ  స్తోత్రములోని  నామములు  కొన్ని  చోట్ల  వేటికవి  స్పష్టంగా  తెలుస్తూ  ఉంటాయి. 

*  ఉదా...అజా  క్షయవినిర్ముక్తా  ముగ్ధా  క్షిప్రప్రసాదినీ  .....  నాలుగు  నామములు  స్పష్టంగా  తెలుస్తున్నాయి. 


* అజా  క్షయవినిర్ముక్తా  ముగ్ధా  క్షిప్రప్రసాదినీ * ఓం అజాయై  నమః 
( శ్రీ లలితా సహస్రనామావళిః )
* ఓం క్షయవినిర్ముక్తాయై నమః
*ఓం ముగ్ధాయై నమః
* ఓం క్షిప్రప్రసాదిన్యై నమః

......................................


* శ్రీ  విష్ణు  సహస్రనామములలో  కొన్ని  ఉదాహరణలు  ......
* ఓం విశ్వస్మై నమః
 *ఓం విష్ణవే నమః
 *ఓం వషట్ కారాయ నమః

* శ్రీ  విష్ణు  సహస్రనామస్తోత్రములో ....... విశ్వం  విష్ణుర్వషట్కారో .....అని  పారాయణ  చేస్తారు.

* వ్యాకరణం ప్రకారం  విష్ణుః + వషట్కార అనే పదాల్ని కలిపితే విష్ణుర్వషట్కార అని వస్తుంది. ...అని  శ్రీ ఎస్పీ జగదీష్  గారు  తెలియజేశారు.


............................................ 


* శ్రీ  లలితా  సహస్ర  నామస్తోత్రము  పారాయణము  చేయటం  కష్టం  కాదు.

 * మనం  చదివే  శ్రీ  లలితా  సహస్ర  నామస్తోత్రము  పుస్తకంలో  ఒక్కొక్క  నామము  ప్రక్కన  కామా   పెట్టుకుని ,   పండితులు   పారాయణ  చేసిన   విధానమును  గమనించితే    సరియైన ఉచ్చారణతో   ఏ విధముగా  పారాయణ  చేయాలో  సులభంగా తెలుస్తుంది.


.......

* వీలైనంత  స్పష్టంగా  వ్రాయటానికి  ప్రయత్నించానండి.


* వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
* అంతా  దైవం  దయ. 

Monday, March 18, 2013

శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ లలితా సహస్ర నామములను పారాయణ చేయటం గురించి .

ఓమ్

శ్రీ లలితా అమ్మవారి  నామములలో  సుఖారాధ్యా  అనే  నామము  కూడా  ఉన్నది.  దయామయి  అయిన  అమ్మను  భక్తులందరూ     చక్కగా  ఆరాధించుకోవచ్చు.
..........................

ఇంతకుముందు  ఒక  టపాలో  ఒకరు  వ్యాఖ్యానిస్తూ ...

 ఈ రోజులలొ, విష్ణు,లలితా సహస్రనామాలు గుడుల్లో ,ఇళ్ళల్లో సాముహికంగా నిర్వహిస్తున్నారు.ఇవి సామాన్యులు సహితం ఉచ్చరిస్తున్నారు.ఇవి కూడా స్త్రీలకు నిషేదమా? వీటిని సామాన్యులు (వేదాల అర్ధం తెలియనివారు,ఉచ్చారణ దోషం కలిగినవారు) ఉచ్చరించవచ్చునా? ....   అన్నారు. 

  ఈ  వ్యాఖ్యకు   శ్రీ శర్మ గారు, శ్రీ శ్యామల రావు గారు  తమ  అభిప్రాయములను  తెలియజేశారు.

 

నేను  నా  అభిప్రాయములను  తెలియజేస్తూ    .......ఈ  క్రింది  విధంగా  వ్రాశాను. 

 
శ్రీ విష్ణు,శ్రీ లలితా సహస్ర నామస్తోత్రములను ఎవరైనా పఠించవచ్చు కానీ తప్పులు లేకుండా పఠించాలని, విష్ణు, లలితా సహస్రనామావళిః పఠించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విన్నాను. ఇక్కడ మనము గమనించవలసినది నామ స్తోత్రమును పఠించటానికి నామావళిః పఠించటానికి గల తేడా గురించి.
 ( ఈ విషయాల గురించి నాకు ఎక్కువగా తెలియదు.)....అని  వ్రాశాను.
............................................... ఈ  రోజు  సాయంత్రం  భక్తి  టీవీలో  డాక్టర్  శ్రీ మైలవరపు
శ్రీనివాసరావు గారు  చక్కటి  విషయాలను  తెలియజేశారు. వారు  ఏం  చెప్పారంటే  , శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ లలితా సహస్ర  నామములను  భక్తులు  ఎవరైనా  పారాయణ  చేయవచ్చునని  తెలియజేశారు. 

  తప్పులు  లేకుండా  పారాయణ  చేయాలని  తెలియజేశారు.  

దైవం  యందు  భక్తి,  శ్రద్ధ  లేనివారికి  తప్ప,  భక్తులకు  శ్రీ  లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ  లలితా సహస్ర  నామములను  గురించి  తెలియజేయవచ్చునన్నారు.     

ఇంకా ఎన్నో   విషయములను  తెలియజేసారు. 
( క్షమించాలి,  సర్  తెలియజేసిన  విషయాలను  నాకు  తోచినంతలో  వ్రాశాను. )
..................................... 

పండితుల  ద్వారా  నేను  తెలుసుకున్న  కొన్ని  విషయములను  వ్రాస్తున్నాను.

 లలితా సహస్రనామ స్తోత్రమును  మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి   పారాయణ  చేయకూడదట. 


ఉదా.....
లలితాదేవి యొక్క కొన్ని నామములు   .... 

* అజా 
* క్షయవినిర్ముక్తా 
* ముగ్ధా 
* క్షిప్రప్రసాదినీ
 
 అజా   క్షయవినిర్ముక్తా   ముగ్దా   క్షిప్రప్రసాదినీ .. అని
  పారాయణ చేయాలట .

 అజాక్షయ   వినిర్ముక్తా   ముగ్దాక్షి   ప్రప్రసాదినీ .. అని
పారాయణ  చేయకూడదట. 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము ముద్రించిన కొన్ని పుస్తకములలో అచ్చుతప్పులు ఉంటున్నాయి.  అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్తగా ముద్రించాలి. మా వద్ద ఉన్న ఒక పుస్తకములో ముగ్దా...అని ఉంది.  ఒక పుస్తకములో  ముగ్ధా ...అని ఉంది. 


ముగ్దా అని ఉండాలో ? లేక ముగ్ధా అని ఉండాలో నాకు తెలియదు.
( వత్తు  ఉంటుందో ? ఉండదో  ? ).


ఒకవేళ  మనం  తెలిసితెలియక  తప్పుగా  పారాయణం  చేసినా,   అమ్మ దయామయి  కదా !  క్రమంగా  మన  తప్పులు  సరిదిద్దబడతాయి . 
 

 లలితా సహస్ర నామావళిః   పారాయణ  చేస్తూ , లలితా సహస్ర నామ స్తోత్రములోని ఒక్కొక్క నామమునకు ప్రక్కన కామా గుర్తు పెట్టుకుంటే వివరంగా తెలుస్తుంది. (నేను  కొంతవరకు  ఈ విధంగా ప్రయత్నించాను.) 

  ( పెన్నుతో  కాకుండా  పెన్సిల్ తో  కామా  గుర్తు  పెట్టుకుంటే   తప్పు  వచ్చినప్పుడు  సరిదిద్దుకోవటానికి  సులభంగా ఉంటుంది. )


  ఒక్కొక్క  నామము  ప్రక్కన    కామా   పెట్టుకుని ,  దానితో  పాటు   పండితులు   పారాయణ  చేసిన   శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము  పారాయణ   విధానమును  గమనించితే  సరియైన ఉఛ్ఛారణతో   ఏ విధముగా  పారాయణ  చేయాలో  సులభంగా తెలుస్తుంది.


నామముల  ప్రక్కన  కామాలు  పెట్టుకునేది  నామములను  విడగొట్టి  చదవటానికి  కాదు,    నామములను  మన  ఇష్టం  వచ్చినట్లు  కలిపి  లేక  విడగొట్టకుండా  ఉండటానికి .  టీవీచానల్స్ లో  లలితా సహస్రనామస్తోత్రము   గురించి పండితులు   ఎన్నో వివరములను తెలియజేస్తున్నారు. 


 శ్రీ  సామవేదం  షణ్ముఖ  శర్మ  గారు,  డాక్టర్ శ్రీ  మైలవరపు  శ్రీనివాసరావు  గారు ,శ్రీ  మల్లాప్రగడ  శ్రీమన్నారాయణమూర్తి  గారు,  డాక్టర్ శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి  గారు..... ఇంకా  ఎందరో  పండితులు  శ్రీ  లలితా  అమ్మవారి  గురించి  తెలియజేస్తున్నారు.

..............................ఇంతకుముందు  గానీ,  ఈ  టపాలో  గానీ  ఏమైనా  పొరపాట్లు  వ్రాసి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


 
 నేను  తెలుసుకున్న  విషయాలు  తక్కువ.  నేను  ఏమైనా  పొరపాట్లు  వ్రాసి  ఉంటే  , తెలిసినవారు  దయచేసి  చెప్పవలెనని  కోరుతున్నానండి .

Friday, March 15, 2013

ఈ  రోజు  పాత  టపాలనే  వేస్తున్నానండి.

అనగనగా ఒక కధ.....


భగవంతుడు చండశాసనుడు కాదు....................


Wednesday, March 13, 2013

కొన్ని విషయములు.

ఓం.
శ్రీ పాద శ్రీ వల్లభస్వామికి  వందనములు.
త్రిమూర్తులకు వారి పత్నులకు  వందనములు.
 గాయత్రీ దేవి  అమ్మవారికి వందనములు.
విశ్వామిత్ర మహర్షికి  వందనములు.


గాయత్రి మంత్రమును  స్త్రీలు  జపించకూడదని  కొందరు  అంటారు.

  స్త్రీలకు  కొన్ని  శారీరిక  సంబంధమైన  అడ్డంకులు  ఉండటం  కూడా  పూర్వీకులు ఇలా  చెప్పటానికి  ఒక  కారణం  అయి  ఉండవచ్చు. అని  అనిపిస్తుంది. 
 వ్రాసిన  విషయాలలో   ఏమైనా పొరపాట్లు ఉంటే  దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

Monday, March 11, 2013

నిధి చాలా సుఖమా .

ఓం,
 ఓం శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారికి  వందనములు.
శ్రీ  అనఘాదేవిసమేతదత్తాత్రేయస్వామి వారికి  వందనములు.
శ్రీ  పార్వతీపరమేశ్వరులకు  వందనములు.
శ్రీ  సీతారాములకు  వందనములు. నిధి  చాలా  సుఖమా ....రాముని  సన్నిధి  సేవ  సుఖమా .... అని  త్యాగయ్య వారు  తనకు  రాముని  సన్నిధి  సేవే  సుఖమని  తెలియజేశారు. 


  త్యాగయ్యగారు  మహా  భక్తులు  కాబట్టి  అలా  నిబ్బరంగా  ఉండగలిగారు. ఈ  రోజుల్లో  ప్రజలకు  ఇలాంటి  పరీక్ష  ఎదురైతే  ?  


రామసేతు  కట్టడాన్ని  కొంతవరకు  తీసి  దారి  ఏర్పరిస్తే   ఆర్ధికంగా  కొన్ని  లాభాలు  ఉంటాయని  కొందరు  అంటున్నారు. కొందరేమో  రామసేతుకు  హాని  కలిగించటం  వల్ల  పర్యావరణానికి  హాని  వంటి  ఎన్నో  నష్టాలుంటాయని  అంటున్నారు.

  శ్రీరాముని  కాలంలో  కట్టబడినదిగా  భావిస్తున్న  రామసేతును  కదిలించటం   అనే  ఆలోచన   ఎంతో  దురదృష్టకరమైనది.  కొందరు విదేశాల  వాళ్ళు  తమ దేశాల లోని  పురాతన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  కాపాడుకుంటారు.  మనదేశంలో  అంత  శ్రద్ధ  కనిపించటం  లేదు.


 మనం  కొత్తగా  కట్టడం  లేకపోయినా  పూర్వం  నుంచి  ఉన్నవాటిని  పడగొట్టి  సొమ్ము  చేసుకోవటం  గురించి  ఆలోచించటం  అనేది  ఎంతో   దురదృష్టకరమైన  విషయం. 


అందునా  రామసేతు  కట్టడం  కేవలం  ప్రాచీన కట్టడం మాత్రమే  కాదు. అది  పరమ  పవిత్రమైన నిర్మాణము.  


డబ్బు   ఎలాగైనా  సంపాదించుకోవచ్చు.  పురాతన  కట్టడాలను  మళ్ళీ  రప్పించలేము  కదా  ! పురాతన  కట్టడాల  విలువ  డబ్బుతో  తూచలేనిది.  మనలో  చాలా  మందికి  భక్తి  ఉంటోంది  కానీ , నిధికన్నా  రాముని  సన్నిధి  సేవే  సుఖమని  అనుకునేవారు   తక్కువమంది.
 

నేటి సమాజంలో  పెరిగిన   ఎన్నో  ఆకర్షణల  నడుమ  మనస్సును  అదుపులో  పెట్టుకోలేక  కొందరు  పాపాలను  కూడా చేస్తున్నారు.


 దేవాలయాలు  ఎందరో  భక్తులతో  కిటకిటలాడుతున్నాయి.

   ప్రజలలో  పాపభీతి ఉండటం  అనేది  ఎంతో  సంతోషించవలసిన  విషయం.   

డబ్బు   ఎలాగైనా  సంపాదించుకోవచ్చు .  అంటే,  దేశంలో  పెరిగిపోయిన  అవినీతిని  నిర్మూలించటం,  విదేశాలకు  తరలిపోతున్న  నల్లడబ్బుకు   అడ్డుకట్టవేయటం,  సంపద  కొందరి  దగ్గరే  ప్రోగుపడకుండా   చూడటం..... వంటి   చర్యలను  కఠినంగా  అమలుచేసినప్పుడు  ఈ  దేశంలో  ఆర్ధిక  సమస్యలు  ఉండవు. 


అంతేకాని, ఆర్ధికాభివృద్ధి  కోసం  అని  చెప్పి, పురాతన  కట్టడాలకు  హాని  కలిగించటం  ఏమిటో ? అర్ధం  కావటం లేదు.


 

Friday, March 8, 2013

కొన్ని విషయములు.


ఓం
ఓం నమఃశ్శివాయ.....
శ్రీ విశ్వనాధాష్టకం...

.గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధంతేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ విలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

అదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశ ధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలి తప్పులూ కలగకపోడం.


పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
...........................


ఈ  రోజు  మహిళా దినోత్సవము  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలు.


ఆదివారం  మహాశివరాత్రి  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలు.
Wednesday, March 6, 2013

కొన్ని విషయాలు....

ఓం.
ఈ  బ్లాగ్ లో  పచ్చగా  ఉన్న  ఒక  చిత్రం  కనిపిస్తోంది  కదా  ! ఈ  చిత్రాన్ని   కంప్యూటర్లో  చూసి  బాగుందని  బ్లాగ్ లో  పెట్టాము.

ఈ  చిత్రాన్ని  ఎవరు  తీసారో  కానీ,   చాలా  బాగా  తీశారు. చిత్రంలోని   ప్రదేశం  కళ్ళముందు  ఉన్నట్లే  అనిపిస్తుంది. అయితే  ఈ  సీనరి  ఎక్కడిదో ? ఎవరు  తీసారో ? మాకు  తెలియదు. ఈ  చిత్రంలోని  పరిసరాలు  ఎక్కడివో ?  అనుకున్నాము.

అయితే, కొంతకాలం  క్రిందట  నేను....
Mahima Shanidev Ki 12march 1 HQ - YouTube .....లో   చూస్తుంటే  ఈ చిత్రంలోని  పరిసరాలు  కనిపించాయి.

ఆశ్చర్యంతో  మళ్ళీ  చూస్తే  నాకు  తెలిసిందేమిటంటే , శ్రీ  శనిదేవుని  మహిమలు  సీరియల్ లోని  అష్టావక్ర  మహర్షి  కధలోని  భాగాన్ని  ఈ  చిత్రంలోని  పరిసరాల్లో  చిత్రీకరించారని  నాకు  అనిపించింది.   ఈ  చిత్రంలోని  పరిసరాలు  బాగున్నాయని  భావించి,  ఎవరో   సీనరీగా  కంప్యూటర్ లో  పెట్టి  ఉంటారని  నాకు  అనిపించింది.
  కంప్యూటర్లో  ఈ  చిత్రాన్ని   చూసి  బాగుందని  బ్లాగ్ లో  పెట్టాము. ఇదంతా  నాకు  చిత్రంగా  ఉన్నది. 


మహారాష్ట్ర లో  శిరిడికి  కొంత  దూరంలో  ఉన్న  శ్రీ  శనిదేవుని  శింగణాపూర్ క్షేత్రం ఎంతో  గొప్పది. ఎందరో భక్తులు ఈ  క్షేత్రాన్ని  సందర్శిస్తుంటారు.
 
శ్రీ శ్రీ  ఆదిపరాశక్తి  అయిన  పరమాత్మకు  వందనములు.

శ్రీ  శనేశ్వరునికి వందనములు.  శ్రీ  శనేశ్వరునికి పత్ని శ్రీ  జ్యేష్ఠాదేవి .  శ్రీ  జ్యేష్ఠాదేవి  అమ్మవారికి  వందనములు. 


శ్రీ  శనిదేవుడు  న్యాయాన్ని  పరిరక్షిస్తారని  పెద్దలు  తెలియజేశారు.

వ్రాసిన  విషయములలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే   దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.Monday, March 4, 2013

మరి కొన్ని సంగతులు .

 ఆధునిక  టెక్నాలజీ  వల్ల  కమ్యూనికేషన్  అభివృద్ధి  అయిన  మాట  నిజమే.  అయితే , పురాతన కాలం నుండి  ఇప్పటి  వరకూ  కూడా  పురాణేతిహాసాలు  ప్రాచీన  విజ్ఞానం ఒక  తరం  నుండి  తరువాత  తరానికి  భద్రంగా అందింపబడుతూ  ఉండటమనేది  ఎంతో  అద్భుతమైన విషయం. దైవం దయ  వల్లనే  ఇలా  జరుగుతుంది.
....................................


ఆధునిక  విజ్ఞానం  మంచిదే.  దీనివల్ల  లాభాలు  ఉన్నాయి. అయితే  తగినవిధంగా  వాడుకోకపోతే కొన్ని   నష్టాలు  కూడా  ఉన్నాయి.

 ఎలెక్ట్రానిక్  వస్తువుల  వల్ల  ఆరోగ్యానికి  కొంత  హాని  కలిగే  అవకాశం  ఉంది  కాబట్టి ,  జాగ్రత్తలు  తీసుకోవాలి .  అని  కొందరు  హెచ్చరిస్తున్నారు. 


కాబట్టి  , ఎలెక్టానిక్  వస్తువులు   వాడేటప్పుడు  కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవటం  వల్ల  లాభమే  కానీ  నష్టమేమీ  ఉండదు.

 లాప్ టాప్  వంటి  ఆధునిక  ఉపకరణాల  నుండి  వెలువడే   రేడియేషన్  మొదలైన  విషయాల   గురించి  అంతర్జాలంలో  చూడవచ్చు. 

వాడిపారేసిన  ఎలెక్ట్రానిక్  వస్తువుల  వల్ల  కూడా  వాతావరణం  కలుషితమవుతోందని  కొందరంటున్నారు. (  ఆ  పరికరాల  తయారీలో  వాడిన  పదార్ధాల  వల్ల.  ) 


మానవుల  అంతులేని  కోరికల  కోసం  మూగ జీవులు  అంతరించి  పోతున్నాయి. 


ఆ మధ్య  జీవవైవిధ్య  సదస్సు  జరిగినప్పుడు ప్రపంచంలో  అంతరించిపోతున్న  జీవ జాతుల  గురించి  అందరూ చర్చించారు   కదా  !


   ఇంతకుముందు  ఎక్కువగా  కనిపించే పిచ్చుకలు,  కాకులు  వంటి  పక్షులు ఇప్పుడు  ఎక్కువగా  కనిపించటం  లేదు . అన్నది  మనకు  తెలిసిన  విషయమే.   గ్లోబల్ వార్మింగ్  వంటి  సమస్యల  వల్ల  ఇతర  జీవజాతులకు  నష్టం  కలుగుతున్నప్పుడు  మానవులకు  మాత్రం  ఆరోగ్య  సమస్యలు  రాకుండా  ఉంటాయా  ?

 

మనుషుల్లో   పూర్వం  60  ఏళ్ళు  వచ్చిన  వారిలో  కనిపించే  కంటి ,  పంటి  సమస్యలు, జుట్టు  తెల్లబడటం  వంటి   లక్షణాలు  ఈ  కాలంలో  చిన్నపిల్లలలోనే   కనిపిస్తున్నాయి.  మన  అంతులేని  కోరికలను  తగ్గించుకుంటే  పర్యావరణ  కాలుష్యం  తగ్గుతుంది. ........అంతేకానీ  కోరికలను  పెంచుకుంటూ  పోతే  అంతరించిపోతున్న  జీవజాతుల  జాబితాలో  మానవులు  కూడా   చేరే  ప్రమాదముంది.

 

ఇక  ముందుముందు  నానో  టెక్నాలజీ  రాబోతోంది  అంటున్నారు. ఇక  దాని  ఫలితాలెలా  ఉంటాయో  ?  కాలమే  నిర్ణయించాలి.   


ఇలాంటి  విషయాలలో  పెద్దలు  చెప్పినట్లు  కీడెంచి  మేలెంచటం  ఎంతైనా  అవసరం.

 ( ఈ  మధ్య  ఒకరు  తమ   బ్లాగ్ లో  నానో టెక్నాలజి  గురించిన  సందేహాలను  వివరించారు.....
  ) .

 ఆధునిక  విజ్ఞానాన్ని  అవసరమైనంత  వరకు  మాత్రమే  వాడుకుంటే  మంచిది.   ఉదా...మనుషులు  ఎత్తలేని  బరువుల  కోసం  క్రేన్  వాడకం   ఉపయోగకరమే. అయితే  కొద్ది  దూరానికి  కూడా  కారులోనే  వెళ్ళాలనుకోవటం  అనవసరం  కదా  ! ... ఇలా  ఏది  ఎంతవరకు  అవసరమో  విచక్షణతో  ఆలోచించుకోవాలి.

 లాప్ టాప్  వంటి  ఆధునిక  ఉపకరణాల  వల్ల  కలిగే  సందేహాల  గురించి  ఒక లింక్ ......

Harmful Electrostress from Computers/Laptops       

 

 

 

Friday, March 1, 2013

ఎలెక్ట్రానిక్ వస్తువులు... కొన్ని సందేహాలు.

ఈ  రోజుల్లో     మనుషులు  ప్రకృతికి  దూరంగా   జీవించటం  పెరిగింది.   తలుపులు  వేసిన  గదులలో ( ఏ.సీ  గదుల్లో ) ఎలెక్ట్రానిక్  వస్తువుల  మధ్యే  రోజంతా  గడపవలసి  వస్తోంది. శారీరిక  శ్రమ  తగ్గిపోయింది. రోగాలు  పెరుగుతున్నాయి.  ఒక  వ్యాధికి  మందులు  కనుక్కుంటుంటే  కొత్తరకం  వ్యాధి  వస్తోంది.

 కొన్ని ఎలెక్ట్రానిక్  వస్తువుల  నుంచి   రేడియేషన్  వెలువడుతుందని   అంటున్నారు . అందువల్ల  వీటిని  వాడేటప్పుడు కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలట .

ఉదా...    స్త్రీలు  పురుషులు  కూడా  లాప్ టాప్ ను   ఒడిపై  కాకుండా  టేబుల్  పై  పెట్టి  చూడాలని  చెబుతున్నారు.


 ఎందుకంటే  లాప్ టాప్  నుంచి  ప్రసరించే  వేడి  మరియు  రేడియేషన్ వల్ల  మగవారికి  స్పెర్మ్ కౌంట్  గణనీయంగా  తగ్గిపోవటం , సంతానానికి   సమస్యలు ... వంటి ప్రమాదాలు  పొంచి  ఉన్నాయని  పరిశోధనల్లో  తేలిందట .

 గర్భవతులు  మరింత  జాగ్రత్తగా  ఉండాలి.  లాప్ టాప్ ను  కడుపుకు  దగ్గరగా  ఉంచటం  వల్ల   లాప్ టాప్ నుంచి  ప్రసారమయ్యే  వేడి  మరియు  రేడియేషన్   గర్భంలోని  శిశువుపై  ప్రభావాన్ని  చూపిస్తుందని  పరిశోధనల్లో  తేలిందట.

అందువల్ల  స్త్రీలు,  పురుషులు  లాప్ టాప్  వాడేటప్పుడు  ఒడిపై  కాకుండా,  ఎదురుగా  టేబుల్ పై  పెట్టి  వాడుకుంటే  మంచిదని  అంటున్నారు.


ఈ  మధ్య  మాకు  తెలిసిన  వాళ్ళింటికి  వెళ్ళాను.  వారి  అమ్మాయి   సోఫాలో  కూర్చుని  ఒడిపై  లాప్ టాప్ లో  ఎదో  చూస్తోంది.  ఆ  అమ్మాయి  గర్భవతి....  ఈ  దృశ్యం  చూసి,  ఆ అమ్మాయి కి  ఈ  విషయాలన్నీ  చెప్పాలనిపించింది  నాకు.

  అయితే  ఆ  అమ్మాయి  ఏమైనా  అపార్ధం  చేసుకుంటుందేమోనని  భావించి  నా  అభిప్రాయాలను  చెప్పకుండా  ఇంటికి వచ్చేశాను .

 ఇంటికి  వెళ్ళాక  ఆ  అమ్మాయికి    విషయం    చెప్పకుండా  వచ్చేశానే .......బిడ్డకు  ఏమైనా  ఇబ్బందులు  వస్తాయేమో  ? అని   ఫీలయ్యాను.  అయినా  ఆ  అమ్మాయికి  ఈ  విషయం  తెలియకుండా  ఉంటుందా  ? అనుకుని  ఊరుకున్నాను.

 ఆ  అమ్మాయితో   నాకు  ఎక్కువ  పరిచయం  లేదు.  ఆమె  కొద్ది రోజుల  క్రితమే  విదేశాలనుంచి  ఇండియాకు   వచ్చింది.  నాకు  ఆ  అమ్మాయి  పెద్దవాళ్ళు   బాగా పరిచయం.  నేను  అప్పుడప్పుడు  తీరిక  సమయాలలో   వాళ్ళింటికి  వెళ్ళి   కొద్దిసేపు  కబుర్లు  చెప్పి  వస్తుంటాను.

 ఒక  వారం  గడిచిన  తరువాత  మళ్లీ   వాళ్ళింటికి  వెళ్ళాను.  నేను  వెళ్ళేసరికి    ఆ  అమ్మాయే    తలుపుతీసింది.   నేను నా  అభిప్రాయాలను  చెప్పేసాను.

 గర్భవతులు  లాప్ టాప్  దూరంగా  ఉంచి  చూడాలి .  దగ్గరగా  ఉంచకూడదట..  అని నాకు  తెలిసిన  విషయాలను  చెప్పేసాను. చెప్పి,  ఇలా  చెప్పినందుకు  అపార్ధం  చేసుకోవద్దని   అన్నాను. 


అప్పుడు   ఆ  అమ్మాయి  అయ్యో  !  ఇందులో  అపార్ధం  చేసుకోవటానికి  ఏముందండి.  మా  వదిన  కూడా  లాప్  టాప్ ను  దూరంగా  పెట్టి  చూడమని   చెప్పింది.  నేను  ఎప్పటికప్పుడు  మర్చిపోతున్నాను  అన్నది.


నాకు  మనసు  తేలికయింది.   నా  అభిప్రాయాన్ని  చెప్పేసాను.  ఇక  దాన్ని  పాటించటం  పాటించకపోవటం  అనేది  ఆ  అమ్మాయి  ఇష్టం.

 
  గర్భిణీ  స్త్రీలు  మైక్రో అవెన్  నుంచి  కూడా  దూరంగా  ఉండాలంటున్నారు.  ఏమిటో  అన్నింటికి  దూరంగా  ఉండాలంటున్నారు. మళ్ళీ  ఎలెక్ట్రానిక్  పరికరాలు   లేనిదే  జీవితాలు  గడవని  పరిస్థితులు  ఏర్పరుస్తున్నారు.

 ఈ మధ్య  ఒక  టీవీ  చానల్లో  సెల్  టవర్స్ గురించిన  విషయాలను  చెప్పారు. సెల్  టవర్స్ కు  దగ్గరలో  నివసించేవారిలో  కొన్ని  వ్యాధులు  ఎక్కువగా వస్తున్నాయట. ఇవన్నీ  వింటుంటే   ఏమీ  అర్ధం  కావటం  లేదు.

 అయితే  కొంతకాలం  క్రిందట    కాన్సర్  వ్యాధి  ఇప్పటంత  ఎక్కువగా  ఉండేది  కాదు.  ఈ  రోజుల్లో  కాన్సర్ ,  బీపి,  డయాబెటిస్  వంటి  వ్యాధులు  పూర్వం  కన్నా   బాగా  పెరిగినట్లు  అనిపిస్తోంది.

  వీటన్నింటికీ  కాలమే  జవాబు  చెప్పాలి.