koodali

Monday, March 25, 2013

నాకు అనుభవంలోకి వచ్చిన ఒక సాయిలీల..........

సాయిసాయి

 మేము  ఉంటున్న  ఊరిలో  కొంతకాలం  క్రిందట ,  కొందరు  భక్తులు  షిరిడి  సాయి  బాబా  లీలల  గురించి   వివరించే  సభను  ఏర్పాటు  చేసారు.  



వారి  ప్రసంగాలను  వినటానికి   నేను,  మాకు  తెలిసిన  ఒకామెతో  కలిసి  వెళ్ళాను.  ఆరుబయట  గ్రౌండ్  విశాలంగా  ఉంది.  భక్తులు  పెద్దసంఖ్యలో  హాజరయ్యారు.  

వేదిక  మీద   అమ్మవారికి,  శివలింగానికి  ,  షిరిడి  సాయికి  పూజలు  జరిగాయి.

భక్తులు  ఇళ్ళకు  వెళ్ళేటప్పుడు  ప్రసాదాన్ని  స్వీకరించి  వెళ్ళమని     సభలో  తెలియజేశారు.  సాయిబాబా  లీలల  గురించి  ఆసక్తికరంగా  తెలియజేస్తుండగా...

  కొంతసమయం  గడిచిన  తరువాత  నాతోపాటు  వచ్చిన  ఆమె  ఏమన్నారంటే,  ఇంకా  వెళ్దామాండి.... ఇంట్లో  పని కాలేదు.  వంట  చెయ్యాలి.  అన్నారు. 


 మరి  కొంతసేపు  ఉండి  ప్రసాదం  తీసుకు వెళ్తే  బాగుంటుంది . అని  నాకు   అనిపించింది. అయితే  ఆమె  ఇంటికి  వెళ్ళటానికి  తొందర  పడుతున్నారు  కదా !  అని  ఏమనలేకపోయాను. 

సభలో  సాయిబాబా  లీలల  గురించి  తెలియజేస్తున్నారు.   మేము  ఇద్దరం  లేచి  సభకు  కొద్దిదూరంలో  ఉన్న  పుస్తకాలు   మొదలగువాటిని  చూస్తూ  నడుస్తుండగా ,  అక్కడ  పూజచేసిన  ఒక  షిరిడి  సాయి  ప్రతిమ  కనిపించింది.  నేను  అక్కడకు  వెళ్ళి  సాయిని  ప్రార్ధించుకున్నాను. 


సాయిప్రతిమ  ఉన్న  దగ్గర  లైటింగ్  కొంచెం  తక్కువగా  ఉంది. అక్కడ సాయి  పాదాల  వద్ద   చిన్న  ఆకు  దొన్నెలో  పసుపు  రంగులో  అక్షతల  లాగా  కనిపించాయి. 


 నేను  వాటిని  అక్షతలు  కాబోలు  అనుకుని  చేతితో   తీయబోతుంటే   చేతికి  అన్నపు  మెతుకులులా    అనిపించింది.  

 ఇదేమిటి  ?  ఇవి  అక్షతలు  కావా  ?  అని  పరిశీలనగా  చూస్తే  ఆ  చిన్న  కప్పులో  ఉన్నది  పులిహోర.  సాయికి  నైవేద్యంగా  పెట్టినట్లున్నారు.  


   ప్రసాదం  అంటుకున్న  నా చేతిని  కడుక్కోకుండా  అలాగే  ఇంటికి  వచ్చి  చేతివేళ్ళకు   ఉన్న   ప్రసాదాన్ని  తిన్నాను. 


 ప్రసాదం   తీసుకోలేదు .. అని   బాధపడుతున్న  నాకు  అనుకోకుండా  ఈ విధంగా ప్రసాదం  లభించింది.   


ఈ  విధంగా  జరిగిన  సాయిలీల  నాకు  అత్యంత  ఆశ్చర్యాన్ని,  అత్యంత  ఆనందాన్ని  కలిగించింది.

అంతా  దైవం  దయ.

..............................
అయితే,  ఎప్పుడూ  ఇలాంటి  లీలలు  జరగాలని  లేదు. కొన్నిసార్లు  దేవాలయాలకు  వెళ్ళినప్పుడు   అక్కడ   పూజ  పూర్తయ్యేవరకు   ఉండటానికి  మనకు  సమయం  కుదరకపోవచ్చు. 


దేవాలయంలో   దైవానికి  నమస్కరించి  ప్రసాదం  తీసుకోకుండా  ఇంటికి  వచ్చేసినప్పుడు  ఇంట్లోని  దైవం  వద్ద  ఉన్న  ప్రసాదాన్ని  లేక   ఏదైనా  పదార్ధాన్ని  దైవప్రసాదంగా  భావించి  స్వీకరించవచ్చు. 


అంతేకానీ  ప్రసాదం  తీసుకోకుండా   దేవాలయం   నుంచి  ఇంటికి  వెళ్ళామని  బాధపడనవసరం  లేదు.

దైవం  సర్వాంతర్యామి..దైవం  యందు  మనకు  గల   భక్తి,  భావం  ముఖ్యం .

 

4 comments:

  1. దైవం సర్వాంతర్యామి...దైవం యందు మనకుగల భక్తి, భావం ముఖ్యం.
    ఇది సత్యం.
    మంచి మాట చెప్పారు.

    ReplyDelete
    Replies

    1. మీకు కృతజ్ఞతలండి.

      Delete
  2. సర్వాంతర్యామి అప్పుడపు ఒక్కొకచోట కనపడుతూ ఉంటాడు.

    ReplyDelete
    Replies
    1. మీకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి. దైవం సర్వాంతర్యామి . లోకోద్ధరణకోసం అప్పుడప్పుడు ఒక్కొక్కచోట మానవదేహంతో అవతరిస్తూ ఉంటారు. ఎన్నో అవతారాలను ధరించి తన లీలలను ప్రదర్శిస్తుంటారు .


      Delete