koodali

Friday, September 27, 2013

సంచార జివితము లాంటి మాది అసలు ఎ ప్రాంతం..

Saturday, April 17, 2010

నేను ఇప్పుడు tranfersవల్ల రకరకాల రాష్ట్రములు తిరిగే మాలాంటి వారి కష్టాలూ గురించి రాయాలనుకుంటున్నాను అండి.

కొన్నాళ్ళ క్రితం తెలుగు ప్రజలు నలుగురు కలిస్తే మామూలుగా మీది ఏ ఊరు ?ఇలా కుశల ప్రశ్నలు వేసుకునేవారు. కాని ఇప్పుడు ఏ ఊరు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్తితి. ఏ ఊరు అని చెపితే ఏమి కొంప మునుగుతుందో ఎవరికి తెలుసు మరి.


పూర్వము native place అనేది ఎలా ఉండేదంటే అప్పుడు ప్రజలు వ్యవసాయము, వ్యాపారము వల్ల ఒకే ప్రాంతములో ఉండిపోయెవారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వల్ల ఆఫీస్ వాళ్ళ ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్ళాల్సిన పరిస్తితి.

మేము ఇలా తిరుగుతూ ఉండటము వల్ల మా పిల్లలకు మా సొంత ఊరు అంటే పెద్దగా తెలియదు. ఎప్పుడయినా వెళ్ళ్తుంటాము అంతే. పిల్లలకు వాళ్ళు పెరిగిన చదువుకున్న ప్రాంతము తోనే attachment ఉంటుంది .


మేము మా పై అధికారులతో మాకు వేరే రాష్ట్రము వద్దు భాష కూడా రాదు , కావాలంటే మా రాష్ట్రము లోనే వేరే ఊరు వెయ్యండి మహాప్రభూ...... అన్నా కూడా వారు వినరు , 


మాఖర్మ ప్రకారము ఏ ముంబయొ వేశారంటే ఇక మాపని అంతే................ వెళ్ళకపోతే వీళ్ళు ఊరుకోరు, వెళ్తే అక్కడ వాళ్ళు మీరు ఎవరు? మమ్మల్ని దోచుకోవటానికి వచ్చారా లేక మా సంస్క్రుతి పాడు అయిపోతుంది మీ వల్ల  అని వాళ్ళూ చావగొడతారు.............
 
ఏమిచెయ్యాలి   ? అని ,ఆఖరికి సొంత ఊరు వెళ్తే అక్కడ పెద్దగా ఏమీ తెలియదు. మా లాంటి వారికి నేటివిటీ కి భాష ఒక్కటే ఆధారమేమో. ఇంకొ 50 సంవత్సరములలో ఇంగ్లీష్ పుణ్ణ్యమా అని అది కూడా ఉండదులెండి. లేదంటే మా పెద్దవాళ్ళ ప్రాంతమే మాప్రాంతమని( బేస్) అనుకొవాలి.


అసలు బిజినెస్సు పెరగాలంటే ఏ ఆఫీస్ వాళ్ళకయినా మంచిగా ఆప్రాంత ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడాలి. ఉదాహరణకి బ్యాంక్స్ అనుకోండి,అక్క్డకు వచ్చేవారికి అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా బ్యాంక్ ఏమి అభివ్రుధ్ధి అవుతుంది.వీళ్ళుఅక్కడి భాష చచ్చీచెడీ నేర్చుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటాయి.


నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే జనము మద్య ఈ గొడవలు ఉండవేమోనని.కాని ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి కూడా ఉందండోయ్.అన్నీ ప్రాంతాల వారి మద్య స్నేహము పెరుగుతుంది.మేము అది వరకు ఆంధ్రాలో ఉన్నప్పుడు పేపర్స్ లో మన ప్రాజెక్టులు తమిళనాడు తన్నుకు పోయింది, కర్నాటక కాకిలా ఎత్తుకుపోయింది ఇలాంటి వార్తలు చదివి,ఇంత అన్యాయమా అనిపించేది. ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే వాళ్ళ తప్పేముంది. మనకి తెలివిగా చేతరాదు..వాళ్ళ భాష అన్నా వాళ్ళకి చాలా గౌరవము.మనకి ఇంగ్లీష్ అంటేనే ఇష్టము కదా మరి.మనము వాళ్ళ దగ్గర చాలానేర్చుకోవాలి.

మనకు ఏ ప్రాంతము ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాంతముతో అటాచ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళతో friendship మనపిల్లలకు చదువు చేప్పే టీచర్స్, వీటన్నింటితో అనుభంధము ఏర్పడుతుంది. ఇక భగవంతుని ఆలయాలు ఎక్కడ ఉన్నా అవి అందరివీ కదా... మన జీవితములో మనము ఎక్కడ ఉంటే ఆ ప్రాంతము కూడా ఒక భాగము కదా మరి.


ఈ విధముగా ఒక ప్రాంతము ప్రజలు వేరే ప్రాంతము వెళ్ళటము వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు.స్నేహము పెరగా వచ్చు....ఈ వెళ్ళటము ఒక లిమిట్ దాటితే అపార్ధాలూ పెరగవచ్చు. ఏది ఏమయినా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే ఈ గొడవలు రావు. కాని అదేదో సామెత చెప్పిన్నట్లు అన్ని ప్రాంతములు సమానముగా అభివ్రుద్ది చేసేవారే కనపడుటలేదు....అదే జరిగితే ప్రజలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే హాయిగా ఉంటారు. వేరే చోటకి ఎందుకు వెళ్తారు?


సరే ఆఖరికి మా తెలుగు గాలి, మా తెలుగు మట్టి, మాతెలుగు తిండి, మాతెలుగు స్వర్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ఏమి అడుగుతున్నారంటే.... మీది ఏ ప్రాంతము రాయలసీమనా, కోస్తానా, తెలంగాణానా, ఉత్తరాంధ్రానా........?


ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటుందో విడిపోతుందో నాకు తెలియదు గాని ,  మనము ఇలా ఒకరినొకరు తిట్టుకోవటము చాలా భాధగా ఉందండి...ఇలా తిట్టుకోకుండా గౌరవముగా సమస్య సాల్వ్ అయ్యే మార్గమే లేదా......మిగతా రాష్ట్రముల వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమోనని.........
Wednesday, September 25, 2013

ఇప్పడు తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ,


 ఉద్యమాల  వల్ల   ఎక్కువగా  నష్టపోతున్నది  పేదప్రజలే.

   ప్రజల  మధ్య  విభేధాలు  సృష్టించటం  మాని,  ప్రజా   సమస్యలను  పరిష్కరించమని ..... తాము  ఎన్నుకున్న  వారిని  గట్టిగా  అడిగితేనే   ప్రజాసమస్యలు  పరిష్కారం  అవుతాయి  తప్ప....   విడిపోవటం  వల్లో   కలిసి  ఉండటం  వల్లో    ప్రజల   సమస్యలు  పరిష్కారం  కావు. 

 

ప్రజలు    కొన్ని  విషయాలను  గ్రహించాలి .... నాయకులుగా  చెలామణి  అవుతున్నవారు  ఏం  చెప్పినా  గొర్రెలలాగా  తలలూపుతూ  వారి  వెంట  నడిస్తే  నష్టపోయేది  ప్రజలే. 


 
 స్వాతంత్ర్యం  వచ్చి  ఎంతోకాలమైనా,   ఫ్లోరైడ్   వంటి  స్థానిక  సమస్యలను  కూడా  పరిష్కరించకుండా  ,  ప్రజల   మధ్య  విభేధాలు  సృష్టించి,  తాము  మాత్రం   సొమ్మును  సంపాదించుకుంటున్నవారు  నాయకులు  కారు.  ఇలాంటివారు    జాతిని  విడదీసిన  వారుగా  చరిత్రలో  నిలిచిపోతారు   తప్ప ,   నాయకులుగా  నిలవరు. 


 
నదీ  జలాల   పంపిణిలో  అన్యాయం  జరిగిందని ,   తమకు  న్యాయం  జరగాలంటే,    సాటి  తెలుగువారితో  విడిపోవాలంటున్నారు   కొందరు  తెలుగువాళ్ళు. అయితే,  ఆంధ్రప్రదేశ్ కు  ఎగువ  రాష్ట్రాల  వాళ్ళు   ఎన్నో  నీటి  ప్రాజెక్ట్స్  నిర్మిస్తున్నారు.  ఇదే  పరిస్థితి    కొనసాగితే  మన  రాష్ట్రానికి    రావలసిన    నీటి  సరఫరా  గణనీయంగా  తగ్గిపోతుంది. మరి  కృష్ణా,  గోదావరి   నీటి  పంపకం  విషయంలో   ఇతరరాష్ట్రాల    వల్ల    మనకు  న్యాయం  జరగలేదనుకోండి ....  ఇతర   రాష్ట్రాల   వాళ్ళతో  విడిపోలేము   కాబట్టి,   కొత్త   దేశమే   కావాలి...  అని  అనలేము  కదా !   తెలుగువాళ్ళు  తమలో  తాము  గొడవలు  పడటంలో  ఉద్ధండులే  కానీ,  తమ  న్యాయమైన  హక్కుల  కోసం   ఇతరులతో   మాట్లాడాలంటే   మాత్రం    ఎందుకూ  పనికిరారు. 


కుటుంబం  అన్నాక  కుటుంబసభ్యుల  మధ్య  ఎక్కువతక్కువలు  ఉంటాయి. అలాగే   అన్ని  రాష్ట్రాలలోను  ప్రాంతాల  మధ్య   తేడాలు  ఉంటాయి.  అవన్నీ  చాకచక్యంగా   సరిదిద్దేవారే  గొప్పనాయకులు. 
  అంతేకానీ    నలుగురిలో  గొడవలు  పడుతూ  తిట్టుకునేవారు  చేతకానివారు.


ఏ  సమస్యలనైనా  చాతుర్యంగా  పరిష్కరించుకునే  నేర్పు  ఉంటే  చాలావరకు  సమస్యలు  పరిష్కారమవుతాయి. తమిళులను   చూడండి .  వాళ్ళందరూ   తెలివిగా  తమ  రాష్ట్ర  సమస్యలు  పరిష్కరించుకుంటారు.  వాళ్ళకు   మనకు  ఉన్నట్లు  విడదీసే  నాయకులు  లేరు.  తమిళనాడును  విభజించాలి ... అని  ఎవరో  అంటే  వాళ్ళ  నాయకుడైన  చిదంబరం  గారికి  చాలా  కోపం  వచ్చిందట.  తమిళనాడు  ఎప్పటికి  విడిపోదు  అన్నారట.  ఎంతైనా  తమిళుల  తీరే  వేరు.


 తెలుగు  వాళ్ళేమో  తమలోతాము  కొట్లాడుకుని  నలుగురిలో  పలుచన  అవుతారు. ఓట్ల  కోసం      ఢిల్లీవాళ్ళు   తెలుగువాళ్ళను  వాడుకుంటున్నారు.  తరువాత  మనలను  చులకనగా  చూస్తున్నారు.

 

 తమలో  తాము  గొడవలు  పడేవారిని  ఎవరూ  గౌరవించకపోగా  చిన్నచూపు  చూస్తారు.  అందుకే  ఎప్పుడూ  తెలుగు వాళ్ళకు  బడ్జెట్ లో  కూడా  సరైన  ప్రాధాన్యత  లభించటం  లేదు. ఇప్పడు  తెలు
గు  వాళ్ళ  పరిస్థితి   ఎలా  ఉందంటే  ,  మాకు  న్యాయం  చేయండి,  మాకు  న్యాయం  చేయండి  ....అని  ఇతరులను   బ్రతిమాలుకుంటున్నారు.   ఇతరులేమో  వాళ్ళ   ఇష్టం  వచ్చినట్లు  రోజుకొక  విధంగా  మాట్లాడుతూ   తెలుగువారి  ఆత్మగౌరవాన్ని  దెబ్బతీస్తున్నారు.
 

ప్రజాసమస్యలను   సరిగ్గా   పరిష్కరించకుండా....  ఎన్నో  వాగ్ధానాలను  గ్రుమ్మరిస్తూ  అరచేతిలో  స్వర్గాన్ని  చూపించే    వారి   మాటలను  గొర్రెలలా  నమ్మే  ప్రజలున్న  సమాజంలో  సమస్యలు  వస్తూనే  ఉంటాయి.   ప్రజలు  విచక్షణతో   ప్రవర్తించినప్పుడు  సమస్యలు  పరిష్కారమవుతాయి.
 

Monday, September 23, 2013

మరి కొన్ని విషయాలు....

రామాయణ,భారతములు ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని  ఇంతకుముందు  చెప్పుకున్నాము.  మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే . .. ( క్లుప్తంగా. )

ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు ........... దేవతలు మరియు భూదేవి ...... ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.

అప్పుడు అమ్మవారు ......... దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.

శ్రీకృష్ణ జననం గురించి ,  పాండవుల జననం గురించి ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.

ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.

అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.


ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.

కానీ, దేవతలు నిమిత్తమాత్రులుగా అమ్మవారు నడిపించిన చరిత్ర ఎన్నో కధలు, ఉపకధలతో రసవత్తరంగా నడిచింది.


ఆ విధంగా , పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ....... లోకానికి ఎన్నో గొప్ప విషయాలు అందించబడ్డాయి.


సామాన్యులమైన మనము పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా చక్కగా అర్ధం చేసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.

.........................

పురాణేతిహాసాలలోని  పాత్రలు  చేసినట్లుగా  అనిపిస్తున్న    పొరపాట్ల    ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు. 

..................................

పురాణేతిహాసాలలో    కొన్ని  విషయాలలో ,   ఒకే  విషయం    గురించి  రెండు  విధాలుగా  చెప్పినట్లుగా   కూడా   మనకు  అనిపిస్తుంది.

ఉదా...ఆలస్యం  అమృతం  విషం  ...అని  తెలియజేసిన  పెద్దలే ,  నిదానమే  ప్రధానం  ....అని  కూడా  తెలియజేశారు.  


 ఇదేమిటి  ?  పెద్దలు  ఒకే  విషయాన్ని  రెండు  విధాలుగా  తెలియజేశారు . అనిపిస్తుంది  కొందరికి. 

   కొన్ని  విషయాలలో  నిదానమే  ప్రధానం. 
  ఉదా...ఆవేశం  లేక  కోపం  కలిగినప్పుడు  త్వరపడకుండా  నిదానంగా  ఆలోచించాలి కదా  ! మరికొన్ని  విషయాలలో   ఆలస్యం  పనికిరాదు.  
ఉదా....ఇల్లు  తగలబడిపోతుంటే  నిదానమే  ప్రధానం . అని  తీరికగా  కూర్చోకూడదు  కదా  !   

 ఇలా పెద్దలు  ఎన్నో  చక్కటి  విషయాలను  మనకు  తెలియజేసారు.  మనం  పరిస్థితిని  బట్టి  విచక్షణతో  ఆలోచించి  నిర్ణయం  తీసుకోవాలి. 

................................

 కొన్నిసార్లు,  ఒకే  గ్రంధములో  కూడా  ఒకే  సంఘటన  రెండు  విధాలుగా  జరిగినట్లుగా  మనకు  అనిపించే  అవకాశం  ఉంది.  ఇలాంటప్పుడు  ఏ  విషయాన్ని  నమ్మాలి ?  అని  మనకు సందేహం  వస్తుంది. 

ఇక్కడ   మనం  ఒక  విషయాన్ని  గుర్తుంచుకోవాలి.  పెద్దలు   ఎంతో  తెలివిగలవారు.  వారు  ఏం  చేసినా   ఎన్నో   కోణాలలో  ఆలోచించి    ఒక  పద్ధతి   మరియు   ప్రణాళిక   ప్రకారం  చేస్తుంటారు. 


  ఆ  విషయాలలోని  అంతరార్ధాలు    మనకు  తెలియవలసినప్పుడు  తప్పక  తెలుస్తాయి.

  ఆలోచిస్తే  పురాణేతిహాసాలలోని  అంతరార్ధాలు   మనకు  చక్కగా  అవగతమవుతాయి.  


 సరిగ్గా   అర్ధం  చేసుకోనప్పుడు  అపార్ధాలు  అగుపిస్తాయి. 

 అవి  అర్ధం  అయినప్పుడు   మనకున్న  సందేహాలు  తొలగి   అద్భుతంగా  అనిపిస్తాయి.  

అంతా  దైవం  దయ.
Friday, September 20, 2013

కొన్ని విషయాలు ...

లోకంలో  ఎలా  జీవించాలి  ? ఎలా జీవించకూడదు  ?  ఏది  ధర్మం ? ఏది  అధర్మం ?   సృష్టిలోని  విజ్ఞానం ....వంటి  విషయాలను  ప్రజలకు   ఎవరు  తెలియజేస్తారు  ? 
మన  పెద్దలు  మనకు  తెలియజేస్తే ,  మన  తరువాతి  తరాలకు  మనము   తెలియజేస్తాము.

ఈ  విషయాలన్నింటినీ   ఎన్నో  మార్గాల  ద్వారా  ప్రాచీనులు  మనకు  తెలియజేశారు.  పురాణేతిహాసాల  ద్వారా  కూడా  ఈ  విషయాలను  తెలియజేశారు.
.................................

 చిన్నపిల్లలకు  ధర్మాధర్మాలను  బోధించటానికి  జంతువులు  పాత్రలుగా  ఉన్న   పంచతంత్రం  వంటి  నీతికధలను  అందించారు......పెద్దవాళ్ళకు  ధర్మాధర్మాలను  బోధించటానికి  పురాణేతిహాసాలను  అందించారు.

చిన్నపిల్లలకు  పక్షులు, జంతువులంటే  ఇష్టంగా  ఉంటుంది.

(నేటి  కార్టూన్  నెట్  వర్క్  అంటే  పిల్లలకు  ఇష్టం  ఉన్నట్లు.)

  పంచతంత్రం  వంటి  కధలలో  జంతువులు    మనుషులలా  మాట్లాడతాయి,  ప్రవర్తిస్తాయి.   జంతువులు  పాత్రలుగా  ఉన్న  కధలను  చెబితే  పిల్లలు  ఉత్సాహంగా  నేర్చుకుంటారు.

అయితే,  కొందరు   ఏమంటారంటే , జంతువులు    ఎక్కడైనా  మాట్లాడతాయా  ?   మనుషులలా  ప్రవర్తిస్తాయా  ? పెద్దలు   ఇలాంటి  కధలను  అందించటమేమిటి  ? అని  వాదిస్తారు.

ఇక్కడ  మనం  ఏం  తెలుసుకోవాలంటే,


పంచతంత్రం  నీతి  కధలలోని  జంతువుల  పాత్రల  ద్వారా   లోకంలో  ఎలా  ప్రవర్తించాలి ? ఎలా  ప్రవర్తించకూడదు  ?  వంటి  ఎన్నో  విషయాలను  పిల్లలు  నేర్చుకోవాలి .. .అని  అర్ధం.

  అంతేకాని    పశుపక్ష్యాదులు  ఎక్కడైనా   మనుషుల్లా  మాట్లాడతాయా ?  ప్రవర్తిస్తాయా ?  అని  ఆలోచించటం,  వాదించటం    సరైనది  కాదు.

అలాగే  పురాణేతిహాసాలలోని  పాత్రల  ద్వారా    లోకంలో  ఎలా  ప్రవర్తించాలి ? ఎలా  ప్రవర్తించకూడదు  ?  వంటి  ఎన్నో  విషయాలను  పెద్దవాళ్ళు   నేర్చుకోవాలి .. .అని    అర్ధం.  అంతేకానీ,  ఆ  దేవతలు  అలా  ప్రవర్తించారేమిటి  ?  అని   ఆలోచించటం  సరైనది  కాదు.

 దేవతలు  మనకోసం    మానవులుగా  జన్మించి,   తమ  జీవిత  పాత్రల  ద్వారా  మనకు  ఎన్నో  విషయాలను  తెలియజేశారు.  ఇక్కడ  మనం  చూడవలసింది  వారి  పాత్రలనే  గానీ,  పాత్రధారులను  కాదు. 

...........................................ఆదిపరాశక్తి  అయిన  పరమాత్మ  జగన్నాటకాన్ని  నడిపిస్తున్నారు. వీరు   తలచుకుంటే  రాక్షసులను   చిటికెలో సంహరించగలరు.   మరి,   రామాయణం  వంటివి  జరగటం  ఎందుకు  ?   అని  మనకు  ఎన్నో  సందేహాలు  వస్తాయి. నిజమే ,  వీరు   తలుచుకుంటే   పాపాత్ములను  చంపటం  పెద్ద పనేమీ  కాదు.  అయితే  రామాయణాది  కధలను  నడిపించి ,  ఆ  కధలలో  దేవతలను  సహితం  పాత్రధారులుగా  చేసి  కధలను  నడిపించి  ఆ  కధలను  లోకానికి  అందించటానికి  ఎన్నో  కారణాలుంటాయి. 

 ఉదా.   పెద్దవాళ్ళు   పిల్లలకు   ధర్మాధర్మాల  గురించి    తెలియజేయాలంటే,  కధల  ద్వారా  కూడా తెలియజేస్తారు.  కొందరు   పెద్దవాళ్ళు  పిల్లలకు  నీతికధలను  చెప్పేటప్పుడు  తామే  ఆ  కధల  లోని  పాత్రధారులుగా   అభినయిస్తారు. 

 

   లోకానికి  ధర్మాధర్మాలను  బోధించటం  కోసం   పురాణేతిహాసాలలోని   పాత్రలను  ధరించిన  దేవతలను   తప్పుపట్టటం   సరైనది  కాదు. ఇక్కడ  మనం  చూడవలసింది  పాత్రలనే  కానీ  పాత్రధారులను  కాదు......దేవతలు  ఎప్పుడూ  ధర్మాత్ములే.

.....................


నిజజీవితంలో   మంచి  వ్యక్తిత్వం  ఉన్న  నటుడు/ నటి   విలన్  గా  నటించవచ్చు.  అంతమాత్రం  చేత  ఆ నటుడు
/ నటి  నిజజీవితంలో చెడ్దవారు  అయిపోరు కదా  ?
........................................


పురాణేతిహాసాలలో  గొప్పపాత్రలు  కూడా  కొన్నిసార్లు   పొరపాట్లు  చేసి  దానికి  తగ్గ  కష్టాలను  అనుభవించినట్లు  ఉంది.  అయితే   వారు  చేసిన  పొరపాట్లను  దాచలేదు.  ఈ  విషయాలను  గ్రంధాల  ద్వారా  మనకు  అందించి,   చదవమన్నారు. 

అలా  చదవటం  ద్వారా  ...ఎంత  గొప్పవాళ్ళైనా  సరే ,  పొరపాట్లు  చేస్తే  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించే  అవకాశం  ఉంది.  కాబట్టి  జాగ్రత్త  ....వంటి  ఎన్నో  విషయాలను   మనకు  బోధించారు.Wednesday, September 18, 2013

Monday, July 19, 2010 పురాణేతిహాసములలో ఉన్నది అధర్మం కాదు....అంతా ధర్మమే... పురాణములు ఎంతో గొప్పవి... ఏడవ భాగం....


ఓం.
శ్రీ
ఆంజనేయ స్వామికి నమస్కారములు.

రామాయణము
, మహా భారతము ఎంతో గొప్ప గ్రంధములు. మన పురాణములు, ఇతిహాసముల ద్వారా మనము ఎన్నోవిషయములను నేర్చుకోవచ్చును. విష్ణుమూర్తి ధరించిన అవతారముల ద్వారా సృష్టి యొక్క పరిణామక్రమము , దానియొక్క లక్షణములను కూడా తెలుసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.


ఉదాహరణకు మత్శ్యావతారము ...... భూమిపైన మొదటి దశ అయిన నీరు మాత్రమే ఉన్న దశకు, కూర్మావతారము ..... కూర్మము నీటిలోను, నేలమీదజీవించే జీవి కాబట్టి ,అలాంటి దశకు సంకేతముగాను ఇలా చెప్పవచ్చునట. రామాయణములో ఎన్నో సామాజికసందేశాలున్నాయి.


ఇక సీతా రాములు అంత అవతార మూర్తులైనా ఎందుకు ఇన్ని కష్టములను అనుభవించారో అనిమనకు అనిపిస్తుంది.

ఒకసారి దేవతలకు, రాక్షసులకు మద్య యుధ్ధం జరిగిందట. అప్పుడు కొంతమంది రాక్షసులు భృగుమహర్షి యొక్క భార్యను శరణు వేడారట. అప్పుడు ఆమె వారికి అభయాన్ని ఇచ్చిందట. ఆ సమయములో లోకహితంకోసం శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు భృగు పత్నిని సం హరించి ఆ తరువాత రాక్షసులను సం హరించవలసి వచ్చింది. . .ఆతరువాత భృగు మహర్షి భార్యను తన తపశ్శక్తితో బ్రతికించి ఆ కోపములో శ్రీ మహావిష్ణువును శపించారు. కొంతకాలంభార్యా వియోగం అనుభవించాలని. అప్పుడు విష్ణుమూర్తి త్రేతాయుగములో అది జరుగగలదని తెలియచేసారట.


ఆవిధముగా సీతాపహరణం, సీతాదేవిని అడవులకు పంపించుట ద్వారా ఆ శాపాన్ని వారు అనుభవించారు. లోక క్షేమంకొరకు సీతారాములు ఆ కష్టములను భరించారు.


అసలు రావణాసురుడు కూడా వైకుంఠములోని ద్వారపాలకులయినజయవిజయులలో ఒకరే . గొప్ప విష్ణు భక్తులు. శాపవశాత్తు వారు రావణునిగా జన్మించారు.


సీతాదేవిని రక్షించేక్రమములో రాముల వారు ఎంతోమంది రాక్షసులను సం హరించారు. అప్పుడు జరిగిన యుధ్ధం వల్లనే రావణాసునితోపాటు ఆయన అనుచరులయిన ఎంతోమంది రాక్షసులను చంపివేయగలిగారు.


సీతాదేవిని అన్వేషించే కాలంలోఎంతోమంది భక్తులను, మంచివారిని కూడా ఉధ్ధరించారు.. ఉదాహరణకు అహల్యాశాపం విషయములో .......... భవిష్యత్తులో విష్ణుమూర్తి అవతారం ధరించివచ్చిన పిమ్మట ఆమెకు శాపవిమోచనం కలుగుతుందని తెలపడం ద్వారా ఈ సంఘటనలన్నీ ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరుపబడ్డాయని మనము తెలుసుకోవచ్చు. .ఇక ... ఆంజనేయస్వామిఆయన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంత గొప్ప పాత్ర ఆయనది. ఆయన ద్వారా దాస్యభక్తి, ఇంకా ఇలాంటిఎన్నో గొప్ప విషయములు మనము తెలుసుకోవచ్చు. గొప్ప భక్తి వల్ల భగవంతుని దయ పొందవచ్చని శబరి పాత్ర ద్వారామనము తెలుసుకోవచ్చు.జటాయువు ఇలా ఎన్నో గొప్ప పాత్రలు........


లోకంలో ఉండే   రకరకముల   వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగే  సంఘటనలు, పరిణామములు ....... ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములను   పెద్దలు మనకు   పురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు....రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత  తాను  రాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు. సీతారాములు ఆదర్శ దంపతులు. వారు అంత ధర్మమూర్తులు కాబట్టే వారి కుమారులు లవకుశులు చక్కగా రాజ్యాన్ని పాలించారు.
 

మరి , రావణుని సంతానం అలా అయ్యారు.శ్రీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట.సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ  ? సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?ధర్మం అధర్మం పై విజయాన్ని సాధించిన కధ ఇది. .......

రామతత్వంరావణతత్వం పై విజయాన్ని సాధించిన కధ ఇది......

అందుకే రామాయణ పారాయణం ఎంతో శుభకరమని పెద్దలుతెలిపారు......

 

 ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ఆత్మహత్యలకు పాల్పడటం   లేక అధర్మాన్నిఆశ్రయించటం   వంటి   పనులు చేయకుండా,  ఈ కధలను గుర్తు తెచ్చుకుని అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలుఅనుభవించారు  మనమెంత అని ధైర్యము తెచ్చుకోవాలి.


వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలాసాధించారో మనమూ నేర్చుకోవాలి. ఎక్కడయినా, ఎప్పటికయినా ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవచ్చు. 


 అంతా భగవంతుని దయ..............Monday, September 16, 2013

తెలుగు వాళ్ళు .......


ఇప్పడు  తెలుగువాళ్ళంటే .... మనలో  మనమే  తిట్టుకుని,  కొట్టుకునే  వాళ్ళంగా    ప్రపంచమంతటా   చాలామందికి  పరిచయమే  కానీ,   ఒకప్పుడు , 


శాతవాహనులు, పల్లవులు,  విజయనగర  పాలకులు,  కాకతీయులు ,  ....  వంటి  ఎందరో  రాజుల  వల్ల   తెలుగు  వారి  గొప్పదనం  ఎందరికో తెలుసు. 

.......................... 

తెలుగు వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. ఈ దేశ రాజకీయ, ఆర్ధిక, ఇంకా ఎన్నో రంగాల్లో వాళ్ళు ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నారు. 

 మనం ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండాలేకానీ ,  ఇతరులతో చెప్పించుకునే స్థాయికి పడిపోరాదు.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం యొక్క ప్రభావం దేశం పైన ఎంతో ఉంటుంది.


ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎంతో గొప్పదిగా ఉండాలి. ఆవేశముతో కాకుండా ఆలోచించి విజ్ఞతగా నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయమిది.


మనం ఎంతో తెలివిగలవాళ్ళమేకానీ, మన భాషను, సంస్కృతిని అంతగా గౌరవించని బలహీనత ఒకటి మనకు ఉంది. ఉదా........ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురుపడితే ఇతర భాషలో మాట్లాడుకుంటారు.


ఇక్కడ ఒక కధ........ 


పీతలను ఇతర  ప్రాంతాలకు ఎగుమతి చేసే వ్యాపారి ఒకరు ఉన్నారు. ఆయన దగ్గర  పనిచేసేవారు ఒకసారి   పీతలు ఉన్న  పెట్టెలను  లారీలో ఎక్కిస్తున్నారట. 

 అందులో కొన్ని పెట్టెలకు మూతలు వేసి లేవట.


ఆ వ్యాపారి కంగారుపడి పనివాళ్ళతో అదేమిటి  ?  మూతలు వెయ్యకపోతే అవి పైకి  పారిపోతాయి కదా !  అని కోప్పడితే వాళ్ళేమన్నారంటే,అవి తెలుగు పీతలు సార్  ! ఒకటి పైకి రావటానికి ప్రయత్నించినా ఇంకొకటి వెంటనే క్రిందకు లాగేస్తుంది. అందుకే మూతలు పెట్టలేదు.

 అవి పైకి వెళ్ళి తప్పించుకుంటాయన్న భయం వద్దు. అన్నారట. మన గురించి   ప్రపంచానికి  ఇలా   తెలుసుకదా !

రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ?Friday, September 13, 2013

వినాయక విగ్రహం తలపై ఆడిన పాము ...

ఖైరతాబాద్ లో  వినాయకుడు   గోనాగ  చతుర్ముఖ  గణపతిగా దర్శనమిస్తున్నారు. 


  పాల్వంచలోని ( ఖమ్మం )    ఒక  వినాయక మండపంలో  నాగుపాము  ప్రవేశించి   వినాయక  విగ్రహంపై   ఆడటం  మీడియాలో  చూపించారు.  


  చుట్టూ  భక్తులు  సందడి  చేస్తున్నా  కూడా  ఆ  పాము  భయపడకుండా    వినాయకుని  విగ్రహం  పైకి  ప్రవేశించి  ఆడటం  ఆశ్చర్యంగా  ఉంది.


 అంతా  దైవలీల.


Wednesday, September 11, 2013

భారతదేశం పేదదేశం కాదు. భారతీయులే ( కొందరు ) పేదవారు...


.దేవాలయాలలో  భక్తులు  సమర్పించిన  బంగారం  గురించి  ఆరాలు  తీస్తున్నారని  ఈ  మధ్య  వార్తలు  వచ్చాయి.   ఎందుకో  ? తెలియదు.
...............................

ఈ  దేశంలో  ఎంతో  సంపద  ఉంది  కాబట్టే  విదేశీయులు  ఎందరో  ఇక్కడ  వ్యాపారం  చేయటానికి   ఆసక్తిని  చూపించారు,   చూపిస్తున్నారు.

........................................

ఈ  దేశంలో  విస్తారమైన  వనరులు   ఉన్నాయి.  అపారమైన  సూర్యరశ్మి  ఉంది.    గలగల  పారే  నదీనదాలు  ఉన్నాయి.  చక్కటి  వాతావరణం  ఉంది.

 ఇన్ని  ఉన్నా  కూడా   దేశంలో  ఇంకా   పేదరికం  ఉందంటే    ప్రజల  చేతగానితనం  వల్లనే.స్వాతంత్ర్యం  వచ్చి  ఎంతో  కాలం  గడిచినా  కూడా   ఎక్కడిసమస్యలు  అక్కడే  ఉన్నాయి.కొందరు  ప్రజలలో  స్వార్ధం ,  బద్ధకం,  అత్యాశ  వంటి  దుర్లక్షణాలు  పెరగటం ,   నైతికవిలువలు  తగ్గిపోవటం  వల్ల    దేశంలో  ఎన్నో  సమస్యలు  వస్తున్నాయి.  పేదరికం  పెరిగిపోవటానికి   అనేక  కారణాలున్నాయి.   సంపద  కొందరి  వద్ద  మాత్రమే   ప్రొగుపడటం   అనేది   పేదరికం  పెరిగిపోవటానికి    ఒక  ముఖ్య  కారణం.
 


సంపద  కొద్దిమంది  వద్ద  మాత్రమే  ఉండకుండా ,   అందరి  వద్దా  ఉన్నప్పుడు    సమాజంలో  పేదరికం   తగ్గుతుంది.


 ఈ  దేశంలో    ఎందరో  ధనికులు    ఉన్నారు.   కొందరు  ధనికులు  సంపదను  విదేశాలకు  తరలించి  దాచుకుంటున్నారు. అలా  దాచిన  లక్షల
కోట్ల   సంపదను    తిరిగి  తెచ్చే  ప్రయత్నాలు  చేస్తే  దేశంలోని   ఆర్ధిక  సమస్యలు  చాలావరకు  పరిష్కారం  అవుతాయి  కదా  !   


 దేవాలయాల  సొమ్ము  గురించి  ఆరాలు  దేనికి  ?  దానిని  కూడా ......చేయటానికా ?

.....................................

కొద్దిమంది  వద్ద  మాత్రమే  సంపద  ప్రోగుపడుతుంటే ,  దేశం  నుంచి  సంపద  తరలివెళ్తుంటే ,  అవినీతి
  వ్యవహారాలకు  అడ్డుకట్ట  వేయకుంటే....  ఎన్ని  ప్రయత్నాలు  చేసినా    ఆర్ధిక  సమస్యలు  పరిష్కారం  కావటం  అసాధ్యం.
..........................................

ఇతరులను  మోసం  చేసి   కూడబెట్టిన  సొమ్ముతో   అన్నీ  కష్టాలే.  బ్రతికి  ఉన్నంతకాలం  ఆ  సంపదను  కూడబెట్టడానికి,  దాచటానికి  ఎంతో  కష్టపడాలి.  చచ్చిన  తరువాత   కూడా నరకబాధలను  అనుభవించాలి.  తిరిగి    ఎక్కడో  పుడతారు.    క్రితం  జన్మలో  చేసిన  పాపాలకు  ఫలితంగా   కష్టాలను  అనుభవించాలి.  అప్పుడు  క్రితం  జన్మలో  కూడబెట్టిన  సొమ్ము  ఆదుకోదు  కదా  !అధర్మబద్ధంగా  జీవించటం  వల్ల   తాత్కాలిక   సుఖాలు   వచ్చినా  కూడా    తరువాత   ఎన్నో    కష్టాలు   వచ్చే  అవకాశం  ఉంది.ధర్మబద్ధంగా    జీవించటానికి   ప్రయత్నిస్తే   తాత్కాలిక  కష్టాలు  వచ్చినా  కూడా  శాశ్వతమైన  సుఖాలు  దక్కుతాయి.ఇవన్నీ  భారతీయులకు  తెలియని  విషయాలు  కాదు.  ఆధునిక    జీవితాలలోని  ఆకర్షణలకు  లొంగిపోయి   అశ్రద్ధచేస్తున్నారు.

Monday, September 9, 2013

ఓం.


అందరికి  వినాయక చవితి  శుభాకాంక్షలండి.