koodali

Saturday, November 17, 2018

ఓం, దైవానికి అనేక వందనములు...నాకు గుర్తున్నంతలో రధసప్తమి రోజు బ్లాగ్ సంకల్పం చేసాననుకుంటున్నాను.

ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించిన దైవానికి అనేక ధన్యవాదములు.

తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నానుఇంతకాలంగా వ్రాస్తానని మొదట్లో అనుకోలేదుఅంతా దైవం దయ.

  బ్లాగ్ ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదములు.బ్లాగ్ ను ఫాలో  అవుతున్నవారికి  నాధన్యవాదములు.

అందరి గురించి వివరంగా వ్రాయలేకపోతున్నందుకు దయచేసి క్షమించండిప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.

అంతర్జాలం పనిచేయాలంటే ఎందరో వ్యక్తుల కృషి ఉంటుంది.నాకు తెలిసిన,తెలియని అందరికీ ధన్యవాదములు.

లేఖిని ద్వారా వ్రాయటం జరిగింది. లేఖిని వారికి ధన్యవాదములు.. అగ్రిగేటర్లకు ధన్యవాదములు

కంప్యూటర్ వాడకంలో నాకు సహకారాన్ని అందించిన మా కుటుంబసభ్యులకు మరియు అందరికి ధన్యవాదములు.

తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను. 

దైవం దయ వల్లఎన్నో గ్రంధాల ద్వారాపెద్దల ద్వారావార్తాపత్రికల ద్వారాపుస్తకల ద్వారాఅంతర్జాలం ద్వారాచానల్స్ ద్వారాతోటి వారితో సంభాషణల ద్వారాచూసినవివిన్నవాటి ద్వారా..ఇంకా ఎన్నో మార్గాల ద్వారా.. మనం ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతాము. 


విషయాల గురించి మాట్లాడుకోవటానికి అంతం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే, ఎంత మాట్లాడుకున్నా ఇంకా చెప్పుకోవటానికి విషయాలెన్నో మిగిలే ఉంటాయి.


చాలా విషయాలను  వ్రాసాను కానీ, రాయాలనుకున్న కొన్ని విషయాలను రాయలేదు.నా అభిప్రాయాలు కొన్ని కొందరికి  నచ్చవనే అభిప్రాయం కలిగి విషయాలను రాయలేదు.


చాలామందికి నచ్చవని తెలిసినా కొన్నింటిని వ్రాసాను. ఇతరులకు నచ్చవని తెలిసినా కూడా, మనకు న్యాయమని అనిపించిన వాటిని కొన్నింటినైనా చెప్పక తప్పదు.


 మన అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని అభిప్రాయాలు నచ్చి, కొన్ని నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా అందరికీ అన్నీ నచ్చాలనుకోవటం చాలా కష్టం. వ్రాసిన విషయాల వల్ల మంచి  జరగాలనే అభిప్రాయంతో వ్రాసాను.

కొన్ని విషయాలలో మనకు  క్లారిటీ ఉన్నా కూడా   విషయాల గురించి బహిరంగంగా  రాయలేం. ఎందుకంటే, వాటిని చదివినవారిలో కొందరు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటమో, అపార్ధం చేసుకోవటమో లేక అర్ధం అయినా కూడా కావాలని వెటకారం చేయటమో జరగొచ్చు. అందువల్ల అన్నీ రాయలేము.


 బ్లాగ్ వ్రాయటం ఎంతో ఆనందమే కానీ, పొరపాట్లు లేకుండా వ్రాయాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎంతో ఆలోచించాలి. మొత్తానికి దైవం దయ వల్ల మాత్రం వ్రాయటం జరిగింది.


పాతటపాలు చదివితే ఇవన్నీ నేనే రాసానా? అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

 అయితే, ఇవన్నీ నేనే రాసానని చెప్పుకోవటం హాస్యాస్పదం. 

దైవం దయ వల్ల వ్రాసాను. వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే, తప్పులు నావిగా భావిస్తున్నాను.


 కొంతకాలం క్రిందటే వ్రాయటం మానేద్దామనుకున్నాను కానీ, ఏవో కారణాలతో కొనసాగింది. ఇకమీదట తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే రాస్తాను. 


దైవానికి ధన్యవాదములు, వందనములు.

 అందరికీ ధన్యవాదములు.

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.ఓం ...

ఈ పాటను శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు వ్రాసారని ఈ మధ్యనే తెలిసింది. అయితే, వారు వ్రాసిన  పాటలో పదములు ఎలా ఉన్నాయో నాకు తెలియలేదు.

అంతర్జాలంలో  పాట చాల దగ్గర ఉన్నది. అయితే,  కొన్నిచోట్ల..  పదాలలో మార్పులు ఉన్నాయి. 

పాటను అందించిన అందరికి  ధన్యవాదములండి.

నేను పాటను పాడిన విధానంలో చాలా తప్పులు ఉండవచ్చుసంగీతం బేసిక్స్ కొద్దికాలం మాత్రమే నేర్చుకున్నాను. అది కూడా సాధన లేక మర్చిపోయాను

ఏదో తోచినట్లుగా  పాడాను. పాడిన విధానంలో తప్పులను దయచేసి క్షమించమని కోరుతున్నాను.

...............

బంధువులు,స్నేహితులు ఒక జన్మకే తోడుగా ఉంటారేమో?

 దైవం మాత్రం అందరికీ జన్మజన్మల తోడుగా ఉండే అద్భుతమైన ఆత్మబంధువు

 దైవాన్ని ఆరాధించాలి.

 జీవితంలో ఎవరి స్వధర్మాన్నివారు చక్కగా  ఆచరించాలి.దైవకృపను పొందాలి. 

సాలోక్యం,సామీప్యం,సారూప్యం, సాన్నిధ్యం.....అని ముక్తులు ఉంటాయని తెలుస్తోంది.

  కష్టమూ లేని పరమానందం పొందాలంటే దైవాన్ని పొందాలి.

సాయి సాయి 

శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః.


దైవానికి వందనములు. 
Friday, November 16, 2018

ఓం ....
త్రిమూర్తులకు వందనములు.


Monday, November 12, 2018

ఓం..


లింగాష్టకం.

1..బ్రహ్మమురారి సురార్చితలింగం
....నిర్మల భాసితశోభితలింగమ్ 
జన్మజదుఃఖవినాశకలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం
....కామదహనకరుణాకరలింగమ్ 
రావణదర్పవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం
....బుద్ధివివర్ధనకారణలింగమ్ 
సిద్ధసురాసురవందితలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం
....ఫణిపతివేష్టిత శోభితలింగమ్ 
దక్షసుయజ్ఞవినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందన లేపితలింగం
....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం
....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం
....సర్వసముద్భవకారణలింగమ్ 
అష్టదరిద్ర వినాశనలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం
....సురవనపుష్పసదార్చితలింగమ్ 
పరమపదం పరమాత్మక లింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం
....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి
....శివేన  సహ  మోదతే.

గౌరీస్తుతి 

నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.Sunday, November 11, 2018

ఓం....
నాగుల చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి. Wednesday, November 7, 2018

ఓం..


శ్రీలక్ష్మీనారాయణులకు వందనములు.

అందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలండి.

లక్ష్మీదేవి అనే రూపాలుగా ఉంటుంది. 

 ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి..ఇలా  లక్ష్మీదేవిని పూజిస్తారు. 

ఇంకా..  వరలక్ష్మి, స్వర్గలక్ష్మి, మోక్షలక్ష్మి..గా  కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. 

దైవానికి వందనములు. 
Wednesday, October 31, 2018

ఇద్దరూ ముఖ్యమే. ...


జీవితంలో తల్లితండ్రులూ ముఖ్యమే...జీవితభాగస్వామీ ముఖ్యమే.


కొందరు తల్లితండ్రిని బాగా గౌరవించి, జీవితభాగస్వామిని చిన్నచూపు చూస్తారు.


కొందరు జీవితభాగస్వామిని బాగా గౌరవించి, తల్లితండ్రిని చిన్నచూపు చూస్తారు.

 రెండూ తప్పే.

తల్లితండ్రులూ  ముఖ్యమే.. జీవితభాగస్వామీ   ముఖ్యమే.
........................

తల్లి తనకు  జన్మించిన సంతానాన్ని ఎంతో ప్రేమిస్తుంది.

 ఎందరో భార్యలు కూడా తమ భర్తలను ఎంతగానో ప్రేమిస్తారు.


తల్లి స్థానం ఎంతో గొప్పది.... అలాగని భార్యను చిన్నచూపు చూడటం సరికాదు.

రక్తం పంచుకుని పుట్టపోయినా ఎందరో స్నేహితులు ప్రాణస్నేహితులుగా ఉంటారు.


భార్యాభర్త కూడా జీవితంలోని  కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా చక్కటి స్నేహితుల్లా ఉండాలని పెద్దలు 
 అంటారు.
..................

తల్లి నవమాసాలు మోసి సంతానానికి జన్మనిస్తుంది.

భార్య నవమసాలు మోసి, భర్తకు చెందిన సంతానానికి జన్మనిస్తుంది.


తల్లి, భార్య ఇద్దరూ గొప్పవారే.


 కొన్ని కారణాలవల్ల కొందరు దంపతులకు సంతానం కలగకపోవచ్చు.  


సంతానం లేరని క్రుంగిపోకుండా దంపతులిద్దరూ జీవితంలోని కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉంటూ సంతోషంగా ఉండాలి. 

దైవపూజలు చేయటం, వైద్య సహాయం ద్వారా సంతానాన్ని పొందే ప్రయత్నాలు చేయవచ్చు. లేదంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు.

..................

కొందరు భర్తలు బయట తమకు కలిగిన విసుగును ఇంటికొచ్చి భార్యపై చూపిస్తారు. ఇలా చేయటం సరైనది కాదు.


కొందరు మగవాళ్ళు .... తల్లితండ్రితోనూ, అన్నదమ్ములతోను, అక్కచెల్లెళ్ళతోను , ఇరుగుపొరుగుతోనూ, ఆఫీసువాళ్ళతోనూ, అందరితో బాగా మాట్లాడుతూ భార్యతో సరిగ్గా మట్లాడకుండా విసుగును ప్రదర్శిస్తారు.

కొందరు స్త్రీలు కూడా ....అందరితో బాగా మాట్లాడి భర్తతో సరిగ్గా మాట్లాడరు.

భర్యాభర్తలను అర్ధనారీశ్వరులని పెద్దలు తెలియజేసారు.

 జీవితంలో ఒకరికొకరు తోడుగా జీవించటం కొరకు, సత్సంతానం కొరకు వివాహాన్ని ఏర్పాటుచేసారు.


భార్యాభర్త యొక్క బంధం సరిగ్గా లేనప్పుడు తల్లితండ్రిగా బాధ్యతలను కూడా సరిగ్గా నిర్వహించలేరు. అప్పుడు పిల్లలు బాధలుపడతారు.

కుటుంబవాతావరణం సరిగ్గా లేనప్పుడు ఆ ప్రభావం సమాజంపై పడుతుంది.

చక్కని కుటుంబవాతావరణం ఉన్న సమాజం బాగుంటుంది.
..................... 


విషయాల గురించి కొన్ని పాత టపాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

Thursday, March 20, 2014


Wednesday, May 20, 2015Monday, October 29, 2018

మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచే విధానంలో ఎండ తగిలి నీరు వేడెక్కే ప్రమాదం..Monday, September 17, 2018...  
మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచటం మరియు...అనే టపాను వ్రాసాను. 

HOW TO GROW HYDROPONIC PLANTS |GROW PLANTS ON WATER

Self watering system for plants using waste plastic bottle 


పై  విషయాల  గురించి ఇప్పుడు కలిగిన కొత్త ఆలోచనలు ఏమిటంటే....

ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచినప్పుడు ఆ బాటిల్ ఎండలో ఉంటే ఎండకు నీరు వేడెక్కుతాయి.


తద్వారా మొక్కల వేర్లు వేడి నీటిలో ఉండటం వల్ల మొక్కలు చనిపోతాయి. 


 పైన మొక్క కొంత భాగం మట్టిలో  ఉన్నా కూడా, క్రింద వేర్లు వేడినీటిలో ఉన్నప్పుడు మొక్క వాడిపోతుంది.


 అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి  మొక్కలు పెంచే విధానంలో బాటిల్స్ ను ఎండలో ఉంచకూడదు.


 బాటిల్స్లో నీరు ఎండకు వేడెక్కకుండా బాటిల్స్ ను నీడలో మాత్రమే ఉంచాలి.


లేదా ఎండకు బాటిల్స్ లో నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


బాటిల్స్ లోని నీరు వేడెక్కకుండా బాటిల్స్ చుట్టూ క్లాత్  చుట్టాలి.


 ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే ఎప్పట్లాగానే మట్టిలో మొక్కలు పెంచుకోవటం మంచిది.


పెద్ద ఎత్తున నీటిలో మొక్కలను పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేవారు ఎక్కువగా  గ్రీన్ హౌస్ లలో మొక్కలను పెంచుతారు కాబట్టి , నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Commercial Hydroponics Farm in India... Friday, October 26, 2018

మరి కొన్ని విషయాలు ఏమిటంటే..తల్లితండ్రి తమకు పుట్టబోయే సంతానం అందంగా, ఆరోగ్యంగా, తెలివితేటలతో..ఉండాలని కోరుకుంటారు.


ఆయుర్వేద గ్రంధాల ద్వారా తెలిసిన విషయాలను పాటించి, కోరుకున్న విధంగా  విధంగా సంతానాన్ని పొందవచ్చట. 


నేను చదివిన కొన్ని విషయాలు ఏమిటంటే..

తల్లితండ్రి చక్కటి నైతిక విలువలను పాటించటం, సాత్వికాహారాన్ని తీసుకోవటం..వంటి విషయాలను పాటించితే చక్కటి సంతానాన్ని పొందవచ్చట. 


బాగా కారం ఉన్న పచ్చళ్ళు, నిల్వ ఆహారం వంటివి తగ్గించి...

తాజాపండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, కూరగాయలు..వంటివి తీసుకుంటే తెల్లటి రంగుతో బిడ్దలు జన్మించే అవకాశాలు ఎక్కువట. 

అలాగని పుల్లటి పండ్ల రసాలు అధికంగా త్రాగకూడదు. 


పుల్లటి పండ్లు  కొన్నింటిని   తినాలి. లేదంటే, రసం తీసి  నీటితో కలిపి త్రాగాలి. ఏదైనా ఎంతవరకో అంతవరకూ తీసుకోవాలి..

***********
 ఎప్పుడో అప్పుడప్పుడు చిన్నాచితకా అనారోగ్యం తప్ప మాకు పెద్ద అనారోగ్యాలు లేవు  దైవం దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
****************

 పెరిగే వయస్సులో పిల్లలకు  మంచి ఆహారాన్ని అందిస్తే, వారసత్వంగా వచ్చే ఎత్తు కన్నా పొడుగు పెరిగే అవకాశాలున్నాయని పరిశోధనల ద్వారా తెలిసిందట. 

ఎదిగే వయస్సులో పిల్లలు సరైన ఆహారం తీసుకోకుంటే,  తల్లితండ్రి పొడుగువాళ్ళు అయినా కూడా  పిల్లలు పొడుగు పెరగకుండా పొట్టిగా ఉండే అవకాశం ఉందట. 
 ................

సమాజంలో అందం , డబ్బుకు చాలా గౌరవం లభిస్తోంది. 

ఉదా..సినిమారంగంలో అందంగా ఉన్న నటీనటులు ఏ కులం వారైనా,  వారిని ప్రజలు అభిమానిస్తున్నారు.

( అందంగా ఉండికూడా పైకి రాలేని కొందరున్నారు కానీ, అందుకు వేరే కారణాలుంటాయి.) 

ఇతరదేశాల తెల్లవాళ్ళను భారతీయులు బాగా గౌరవిస్తారు.

 ఇవన్నీ గమనిస్తే నేటి సమాజంలో డబ్బుకు, అందానికి చాలా విలువ ఉందని అర్ధమవుతోంది.
.............

తల్లితండ్రి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాసరే, కొన్ని నియమాలను పాటిస్తే వారికి అందమైన సంతానం  కలుగుతుందని ఆ  మధ్య కొన్ని వార్తలు వచ్చాయి.


ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా  డిజైనర్ బేబీస్ పద్ధతి సాధ్యమేనని ఆ మధ్య శాస్త్రవేత్తలు  ప్రకటించారు .


  కోరుకున్న విధంగా సంతానం పొందే విధానం నిజమయితే ..చాలామంది దంపతులు ఆ పద్ధతులను పాటించటానికి ముందుకు వస్తారు. 


అప్పుడు సమాజంలో ప్రజలు అందరూ చక్కగా ఉంటారు.. ఒకరిని చూసి ఒకరు అసూయ చెందనక్కరలేదు.


అందరూ బాగుంటే సమాజంలో ప్రజల మధ్య కొన్ని అసమానతలు తగ్గుతాయేమో..


అయితే, కొందరు ప్రజలు తమకు ఎన్ని భాగ్యాలు ఉన్నా కూడా.. ఇతరులను చూసి అసూయ పడుతుంటారు. అందంతో పాటు మంచి మనస్సు కూడా  ఉండటం ఎంతో ముఖ్యం. 


మంచి ఆలోచనలు ఉన్న సమాజంలో మనశ్శాంతి ఉంటుంది.
..........

Garbh Vigyan Sanskar project to Customise Delivery of Fair, Tall Babies | Daily Mirror | TV5 News
.................

  ఆరోగ్యం, మంచి తెలివితేటలు, నైతిక విలువలతో కూడిన చక్కటి  గొప్ప మనుషులతో ప్రపంచం కళకళలాడాలని ఆశిద్దాము.