koodali

Friday, October 26, 2018

మరి కొన్ని విషయాలు ఏమిటంటే..



తల్లితండ్రి తమకు పుట్టబోయే సంతానం అందంగా, ఆరోగ్యంగా, తెలివితేటలతో..ఉండాలని కోరుకుంటారు.

ఆయుర్వేద గ్రంధాల ద్వారా తెలిసిన విషయాలను పాటించి, కోరుకున్న విధంగా  విధంగా సంతానాన్ని పొందవచ్చట. 

నేను చదివిన కొన్ని విషయాలు ఏమిటంటే..

తల్లితండ్రి చక్కటి నైతిక విలువలను పాటించటం, సాత్వికాహారాన్ని తీసుకోవటం..వంటి విషయాలను పాటించితే చక్కటి సంతానాన్ని పొందవచ్చట. 

బాగా కారం ఉన్న పచ్చళ్ళు, నిల్వ ఆహారం వంటివి తగ్గించి...

తాజాపండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, కూరగాయలు..వంటివి తీసుకుంటే తెల్లటి రంగుతో బిడ్దలు జన్మించే అవకాశాలు ఎక్కువట. 

అలాగని పుల్లటి పండ్ల రసాలు అధికంగా త్రాగకూడదు. 


పుల్లటి పండ్లు  కొన్నింటిని   తినాలి. లేదంటే, రసం తీసి  నీటితో కలిపి త్రాగాలి. ఏదైనా ఎంతవరకో అంతవరకూ తీసుకోవాలి..

***********
 ఎప్పుడో అప్పుడప్పుడు చిన్నాచితకా అనారోగ్యం తప్ప మాకు పెద్ద అనారోగ్యాలు లేవు  దైవం దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
****************

 పెరిగే వయస్సులో పిల్లలకు  మంచి ఆహారాన్ని అందిస్తే, వారసత్వంగా వచ్చే ఎత్తు కన్నా పొడుగు పెరిగే అవకాశాలున్నాయని పరిశోధనల ద్వారా తెలిసిందట. 

ఎదిగే వయస్సులో పిల్లలు సరైన ఆహారం తీసుకోకుంటే,  తల్లితండ్రి పొడుగువాళ్ళు అయినా కూడా  పిల్లలు పొడుగు పెరగకుండా పొట్టిగా ఉండే అవకాశం ఉందట. 
 ................

సమాజంలో అందం , డబ్బుకు చాలా గౌరవం లభిస్తోంది. 

ఉదా..సినిమారంగంలో అందంగా ఉన్న నటీనటులు ఏ కులం వారైనా,  వారిని ప్రజలు అభిమానిస్తున్నారు.

( అందంగా ఉండికూడా పైకి రాలేని కొందరున్నారు కానీ, అందుకు వేరే కారణాలుంటాయి.) 

ఇతరదేశాల తెల్లవాళ్ళను భారతీయులు బాగా గౌరవిస్తారు.

 ఇవన్నీ గమనిస్తే నేటి సమాజంలో డబ్బుకు, అందానికి చాలా విలువ ఉందని అర్ధమవుతోంది.
.............

తల్లితండ్రి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాసరే, కొన్ని నియమాలను పాటిస్తే వారికి అందమైన సంతానం  కలుగుతుందని ఆ  మధ్య కొన్ని వార్తలు వచ్చాయి.


ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా  డిజైనర్ బేబీస్ పద్ధతి సాధ్యమేనని ఆ మధ్య శాస్త్రవేత్తలు  ప్రకటించారు .

  కోరుకున్న విధంగా సంతానం పొందే విధానం నిజమయితే ..చాలామంది దంపతులు ఆ పద్ధతులను పాటించటానికి ముందుకు వస్తారు.

అప్పుడు సమాజంలో ప్రజలు అందరూ చక్కగా ఉంటారు.. ఒకరిని చూసి ఒకరు అసూయ చెందనక్కరలేదు.

అందరూ బాగుంటే సమాజంలో ప్రజల మధ్య కొన్ని అసమానతలు తగ్గుతాయేమో..

అయితే, కొందరు ప్రజలు తమకు ఎన్ని భాగ్యాలు ఉన్నా కూడా.. ఇతరులను చూసి అసూయ పడుతుంటారు.

 అందంతో పాటు మంచి మనస్సు కూడా  ఉండటం ఎంతో ముఖ్యం. 

మంచి ఆలోచనలు ఉన్న సమాజంలో మనశ్శాంతి ఉంటుంది.
..........

Garbh Vigyan Sanskar project to Customise Delivery of Fair, Tall Babies | Daily Mirror | TV5 News
.................

  ఆరోగ్యం, మంచి తెలివితేటలు, నైతిక విలువలతో కూడిన చక్కటి  గొప్ప మనుషులతో ప్రపంచం కళకళలాడాలని ఆశిద్దాము.




1 comment:


  1. నల్లటి శరీరచాయ కలిగిన వారిని చిన్నచూపు చూడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది.

    ఉత్తరాదిలో కొందరికి, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళలో చాలామంది నల్లగా ఉంటారని చిన్నచూపు ఉంది.

    నలుపు రంగు చాయ కలిగిన ఒకతను తెల్లటి చాయ అమ్మాయిని వివాహం చేసుకుంటే తెల్లటి సంతానం కలుగుతుందని భావించి తెల్లటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

    అయితే,ఇలాంటప్పుడు కలిగే సంతానం అంతా తెల్లగా ఉంటారని చెప్పలేం.

    కొందరు తెల్లగా, కొందరు నలుపు రంగుతో, కొందరు మిశ్రమంగా ఉండే అవకాశముంది.

    సంతానం అంతా తెల్లగా ఉండాలంటే డిజైనర్ బేబీస్ ప్రక్రియ ద్వారా సాధ్యం కావచ్చు.

    ఆయుర్వేదం ద్వారా గాని, ఆధునిక విజ్ఞానం ద్వారా గానీ డిజైనర్ బేబీస్ ప్రక్రియ సక్సెస్ అయి, ప్రాచుర్యంలోకి వస్తే ప్రపంచంలో వర్ణవివక్ష తగ్గవచ్చు.

    .................
    అయితే, ఇతరులను బాధపెట్టాలనే లక్షణం కలిగిన వారు ఏదో ఒక కారణంతో ఇతరుల పట్ల వివక్షను చూపిస్తుంటారు.

    అందంతో పాటు మంచి మనస్సు కూడా ఉండటం ఎంతో ముఖ్యం.
    .............

    ఆరోగ్యం, మంచి తెలివితేటలు, నైతిక విలువలతో కూడిన చక్కటి గొప్ప మనుషులతో ప్రపంచం కళకళలాడాలని ఆశిద్దాము.

    ReplyDelete