koodali

Monday, January 31, 2011

ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది..............

మానవులకు అనేక కోణాలనుంచి ఆలోచించే శక్తి ఉండటం ఒక రకంగా వరం.........ఒక రకంగా శాపం కూడా.... 

అంటే మన ఆలోచనల ద్వారా మనము జీవితాన్ని బాగూ చేసుకోవచ్చు....అలాగే పాడూ చేసుకోవచ్చు.

ఉదా.........మహాభారతంలో................. ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు. వారు పాచికలాటలో రాజ్యాన్ని పోగొట్టుకోవటం .. మనకు తెలిసిన విషయాలే కదా !

ఆ సంఘటన ద్వారా ఎంత గొప్పవారైనా సరే.......... చిన్న పొరపాటు చేసినా కష్టాలను అనుభవించే అవకాశం ఉంది ........ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది.

దీని ద్వారా ఒక వ్యక్తి ఎలా ఆలోచించవచ్చంటే........ధర్మరాజంతటి వారే ఒక చిన్న సంఘటన వల్ల అన్ని కష్టాలు అనుభవించినప్పుడు , మనం జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ................... అలా ఆలోచించి ఆ కధవల్ల జీవితాన్ని సరి దిద్దుకుంటారు కొందరు. 

మరి కొందరేమో........... ధర్మరాజంతటి వారే జూదం ఆడటం జరిగింది కాబట్టి సామాన్యవ్యక్తిని నేను ఆడితే తప్పేమీ లేదు అని ఆలోచిస్తారు. ............. ఇలా ఆలోచించి తన  వ్యసనాన్ని   సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తారు. ......... ఇలా ఆలోచిస్తూ తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు.

ఇలా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లో ప్రతిఒక్కరూ ........ అవకాశవాదంతో ............ ధర్మాన్ని ...... తమకు అనుకూలంగా మార్చి చెప్పుకుంటే ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు ?

ఆలోచన అన్ని వైపులా పదునున్న కత్తిలాంటిది. అది వాడుకునేవాళ్ళను బట్టి ఉంటుంది.కత్తితో కూరగాయలూ తరుగుకోవచ్చు........ఇతరుల తలకాయలూ నరకవచ్చు..

అందుకని నాకు ఏమనిపిస్తుందంటే, ఎవరి కర్మ ప్రకారం వారి ఆలోచనలు ఉంటాయి.

బాగుపడేరాత ఉన్నవాళ్ళను ఎవరూ చెడగొట్టలేరు. చెడిపోయేవారిని ఎవరూ బాగుచేయలేరు.

ఒకోసారి కొన్ని సంకటపరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. భగవంతుని మేధాశక్తి అపరిమితం ......... మన ఊహకు కూడా అందదు. మానవుల మేధాశక్తి పరిమితం.


అందుకే సంకటపరిస్థితి వచ్చినప్పుడు మనకు చేతనయినంతలో ప్రయత్నించి ఇక మనలను సరి అయిన దారిలో నడిపించమని ఆ దైవాన్ని కోరటమే మనం చేయగలిగింది.
.....................................

ధృతరాష్ట్రునికి    పాచికలాటకు  పాండవులను  పిలవటం  అంతగా  ఇష్టం  లేకపోయినా,  పుత్రప్రేమను  అణచుకోలేక  ఒప్పుకున్నాడు. అందుకు  తగ్గ  మూల్యాన్ని  చెల్లించారు.

ధర్మరాజుకు  పాచికలాట  ఆడటం  ఇష్టం  లేదు. అయితే,  పెదతండ్రి  అయిన  ధృతరాష్ట్రుని  ఆహ్వానం  మేరకు  ,  ఆయన  ఆహ్వానాన్ని  తిరస్కరించకూడదని వచ్చి,  పాచికలాట  ఆడటం  జరిగింది.

 ఈ  విషయాలు  ఈ  లింక్  ద్వారా  చదువవచ్చు..... మహా భారతము

(తెలుగు )


Mahabharata - Wikipedia, the free encyclopedia

 

 

 

 


Friday, January 28, 2011

శ్రీ శని దేవుడు కొలువై ఉన్న శింగణాపూర్.. ఇక్కడ ఇళ్ళకు తాళం వేయరు .... ........

ఓం..

శ్రీ శని దేవుడు కొలువై ఉన్న శింగణాపూర్.. ఇక్కడ ఇళ్ళకు తాళం వేయరు .... ........ ఆ ఊరిలో దొంగతనం అలాంటివి చేయటానికి ప్రయత్నించినవారు శనిదేవుని చేత శిక్షించబడతారు.


శ్రీ శనిదేవులు కొలువై ఉన్న శింగణాపూర్ మహారాష్ట్రలో ఉంది. శిరిడీకి కొంచెం దగ్గరే. మహారాష్ట్రలో శనిదేవుని పూజలు బాగా చేస్తారట.


మేము కొన్ని సంవత్సరముల క్రిందట శిరిడీకి వెళ్ళినప్పుడు శింగణాపూర్ వెళ్ళటం జరిగిందండి. చాలా గొప్పగా ఉంది. అక్కడ ఒక వేదిక పైన నెలకొన్న దేవుని మూర్తికి పైన కప్పుగా మానవనిర్మిత కట్టడం ఏమీ ఉండదు. మగవారు వేదిక పైకి వెళ్ళి పూజించవచ్చు. ఆడవారు వేదిక క్రింద ఉండి పూజించవచ్చు. వేదిక పైన హనుమంతుని మూర్తి కూడా ఉంటుంది.


శింగణాపూర్ కు చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యమయిన పండుగ రోజుల్లో అయితే విపరీతంగా రద్దీ ఉంటుందట.


ఆ ఊరిలో ఇళ్ళకు తలుపులు తాళములు వేసుకోరట. దేవుని హుండీకి కూడా తాళం ఉండదు. ఇలా ఉండటం చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంగతట. .


ఇప్పుడు మనకు టి.విలో శ్రీ శనిదేవుని మహిమలు కధలుగా వస్తున్నాయి. శింగణాపూర్ వెళ్ళకముందే నేను శనిదేవుని నాకు వీలయినంతలో పూజించటం జరిగేది.


కొందరు శని దేవుడంటే భయపడతారు .......... కానీ శని దేవుడు దయామయుడు. భగవంతుడంటే ఎవరూ భయపడకూడదు.

శ్రీ జ్యేష్ఠా దేవీ సహిత శ్రీ శనిదేవుల వారికి ప్రణామములు. శ్రీ శంకరులకు, శ్రీ వాసుదేవునికి, శ్రీ హనుమంతునికి ప్రణామములు.


ఇంకో విషయం చెప్పాలండి. ఈ మధ్య నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో పూజకు వెళ్ళాను. వాళ్ళు పూజ అయ్యాక వచ్చినవారికి దేవుని పుస్తకములు పంచటం జరిగింది. ఆ గ్రంధము పేరు. .......... " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము. " ఈ గ్రంధములో నేను ఇంతవరకు చదవని ఎన్నో విషయాలు ఉన్నాయి.


నేను కూడా ఇంకా పూర్తిగా చదవలేదు లెండి. ఈ గ్రంధమును, శ్రీ దత్తాత్రేయుల అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులతోను, ఇంకా సద్గురు శ్రీ గోపాల్ బాబా మహరాజ్ వారి ఆశీస్సులతో లార్డ్ దత్తాత్రేయ స్పిరిట్యువల్ సొసైటీ ( శ్రీ క్షేత్ర పిఠాపురం ) వారు వెలువరించారు.


భగవాన్ శ్రీ గోపాల్ బాబా మహరాజ్ వారి ఆశ్రమం పిఠాపురంలో ఉందట. .. .. ఈ గ్రంధములోని విషయములు అద్భుతంగా ఉన్నాయి.. శ్రీ అనఘాదేవీ సహిత శ్రీ దత్తాత్రేయులవారికి ప్రణామములు.......

ఇందులో తప్పులు ఉన్నయెడల దయచేసి క్షమించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను.... .......

Wednesday, January 26, 2011

యధా ప్రజా తథా రాజా.................

అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి.........

ఏం చెప్పుకుంటాములెండి ....... గతవైభ
వం గురించి. . ఏం సాధించాము అనుకుంటే అంతా అయోమయం.. అసలు దేశంలో ఏం జరుగుతోందో తెలియని గందరళగోళం............

పూర్వం భారతదేశం చాలా సంపన్నంగా ఉండేదట. అందుకేగా విదేశాలనుంచి వ్యాపారానికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఇప్పటికి రెండు తరాల క్రిందట ........ ఇప్పటిలా కాక చిన్నచిన్న రాజ్యాలు ఉండేవి. అందుకని వాటికి చాలామంది పాలకులు ఉండేవారు.


బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించేవారుగా చరిత్రలో పేరు తెచ్చుకున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ........... అది నిజమే అయినా ...... అప్పటి మన పెద్దవాళ్ళు అందరూ కలసి ఎదుర్కొంటే దేశం పరాయి పాలకుల చేతుల్లోకి వెళ్ళేదా అని ?


సరే ఆ తరువాత తరం వాళ్ళు గాంధీగారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇంకా............. మనకు పేరు తెలియని ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలు అనుభవించి స్వాతంత్ర్యమును తెచ్చారు.ఇక దేశం ఇప్పటికీ పేదరికంలో ఎందుకు ఉందో ? ఒక దేశం అభివృధ్ధి చెందాలంటే చిత్తశుధ్ధితో పనిచేస్తే 61 సంవత్సరాలు ఎంతో ఎక్కువ సమయం.


ప్రజల సంక్షేమం పాలకుల కర్తవ్యం. పాలకులు ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్ధానాలు చేస్తారు............. దేశాన్ని అభివృధ్ధి చేసేస్తామని......... తరువాత ప్రజలు దాని గురించి అడిగితే మాత్రం మాట మార్చి , దానికి కారణాలు ఏవేవో చెప్పి తప్పించుకుంటారు...........అలాకాక ప్రజల కష్టాలను తీరిస్తే వారిని ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటారు. ఆ సంతోషం ఎంత గొప్పదో వాళ్ళు తెలుసుకుంటే బాగుండు.


ఇక సైనికులు........... వారు కుటుంబాలకు దూరంగా , వాళ్ళ ప్రాణాలకు తెగించి సరిహద్దులలో కాపలా ఉంటారు. కానీ వారికి స్ఫూర్తి ఏదీ ........ ?

చాలామంది ప్రజలు తమ స్వార్ధంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నారు......... ఇక చాలా మంది యువత విదేశీ నాగరికత మోజులో కొట్టుకుపోతున్నారు. ఇవన్నీ చూసి సైనికులకు కూడా ఒక నిరాశ, నిస్పృహ కలగదంటారా ? ఇలాంటి ప్రజల కోసమా ......... తాము ప్రాణాలకు తెగించి సరిహద్దుల దగ్గర బాధ్యతలు నిర్వహించాలి అని.....


సైనికులు , ప్రాణాలకు తెగించి కాపలా కాస్తుంటారు. ............ మనం ఏమో నిశ్చింతగా నిద్రపోతున్నాము, మన స్వార్ధం మనం చూసుకుంటున్నాము.
ఇంకా , కులాసాగా అర్ధనగ్న చిత్రాలున్న సినిమాలు చూస్తున్నాము.


సరే.......అది అలా
ఉంచుదాము.


ఒకప్పుడు ......వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు అడవిలో బాటసారులను ఆటకాయించి వారి వద్ద సొమ్మును
తీసుకోవటము , ఒకోసారి వారిని చంపటం కూడా చేసేవారట.

ఒకసారి నారదులవారు వారిని అడిగారట. నువ్వు నీ కుటుంబం కోసం ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా ! నీ సంపాదన వాళ్ళు అనుభవిస్తున్నారు, మరి ........... నీ పాపంలో వాటాను కూడా వారు అనుభవిస్తారా అని ? అప్పుడు వారి కుటుంబసభ్యులు ............. నీ పాపంలో మేము భాగం పంచుకోము .......... అని ఖచ్చితంగా చెప్పారట.

తరువాత వారి మనసు మారి రామనామ జపం చెయ్యటం అలా ........... వాల్మీకి మహర్షిగా మారటం జరిగిందని...........ఆ మహర్షి గురించి చెప్పటం జరిగింది.
( వ్యాసమహర్షి కధకు పూర్వాపరాలు చాలా ఉన్నాయి. వారు ఒక గొప్ప ప్రయోజనం కొరకు భూమిపై జన్మించారు. )చాలామంది, ఇక్కడి ప్రజల సొమ్ము దోచుకుని విదేశాల్లో దాచుకుంటారు.....
రోజూ ఎంతమందో చనిపోవటం చూస్తూనే ఉన్నారు ............ అయినా తాము,............ తమవిదేశాల్లో దాచుకున్న సొమ్ముమాత్రం ......... భధ్రంగా ఉంటుందని వారి వెర్రి ఆశ ............. ఆ సొమ్ము వారు చనిపోయాక వారితో వెళ్తుందా ?ఎంత వెర్రి ?


ప్రజల సొమ్ము తీసుకున్న పాపానికి తగిలే పాపఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఎంతో బాధపడవలసి వస్తుంది.

ఎంత డబ్బు సంపాదించినా తినటానికి లేకుండా........ సుగర్, బి.పి జబ్బులు ఉన్నప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం. మీ పెద్దవయస్సులో మీ పిల్లలే మిమ్మల్ని గౌరవించకపోవచ్చు.


అంతే కాక........ పిల్లల సుఖం కోరుకునే పెద్దలు ఎవరైనా పాపాలు చెయ్యరాదు. ఎందుకంటే పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లలు అనుభవించాల్సి వస్తుందట.

పెద్దవాళ్ళు పాపాలు చేస్తే ఆ పాపఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సివస్తుంది ..Monday, January 24, 2011

అనాధలను ఆదరించటం మంచిదే , ఇంకా .......


ఈ రోజుల్లో చాలామంది అనాధలకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అలాంటి ఎందరో మహానుభావులకు నా వందనములు.

ఇంకా, నాకు ఏమనిపిస్తుందంటే ....అసలు ............ .ఇంతమంది అనాధలుగా మారటానికి కారణాలను కనుగొని ......... సాధ్యమయినంతవరకు వాటిని ఆపటం కూడా చేస్తే బాగుంటుంది కదా అని...


పూర్వం ప్రకృతి వైపరీత్యాలయిన భూకంపాలు, ఉప్పెనలు ఇలా కారణాలు ఎక్కువగా కనపడేవి. ఇప్పుడు వాటికి తోడు సామాజిక కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వదిలివేయబడటం, తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల హత్యలు, ఆత్మహత్యలు . జైలుకెళ్ళటం తద్వారా పిల్లలు అనాధలవటం ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి.పూర్వపు కాలంలో ...... తల్లిదండ్రులు పోయి అనాధలుగా మారిన పిల్లలను బంధువులు ఆదరించటం కూడా జరిగేది. ఈ రోజుల్లో ఈ విషయం గురించి ఏం చెప్పగలం ?
సమాజసేవ అంటే సంసారులు ఇల్లు పట్టించుకోకుండా .......... సమాజ సేవ చెయ్యాలేమో అని భయపడనక్కరలేదు. అయ్యో !మనం సమాజ సేవ చెయ్యలేక పోతున్నామే ........ అని ఎవరు బాధ పడనవసరం లేదు.


ఎవరికి వారు మంచిగా ప్రవర్తిస్తూ, కోరికలను అదుపులో పెట్టుకుని అవసరాలను తగ్గించుకుంటూ....... సంపద ఇంకా చాలు అని తృప్తి పడినప్పుడు............. అది కూడా పెద్ద త్యాగం, సమాజసేవా అవుతుంది. .. ............ అప్పుడు సంపద అందరికీ సమానంగా అందించిన వాళ్ళమవుతాము.


అసలు ఎవరైనా అవసరానికి మించి డబ్బు కూడపెట్టడం మహాపాపం.

ఈ రోజుల్లో చాలామంది లక్షలకారు కొన్నాక కోట్ల ఖరీదు చేసే కారుకోసం ఆశ పడటం, ఆడవారు లక్షల ఖరీదు చేసే నగలతో తృప్తి పడకుండా కోట్ల రూపాయల విలువ చేసే నగలు, వస్త్రాల కొరకు ఆశపడటం ............... ఇలా కోరికలకు అంతు లేకుండా పోతోంది. ఇవన్నీ చూసి మిగతావాళ్ళూ తామూ అవన్నీ కోరుకుని ఎలాగైనా డబ్బు సంపాదించటమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు.
ఇంతా చేసి అన్ని విలాసాలు ఉన్న ధనవంతుల జీవితాల్లో మానసిక ప్రశాంతత ఎంత ఉంటుందో ........... వారికే బాగా తెలుసు.

ఎన్ని సంపదలున్నా మానసిక ప్రశాంతత కొరకు ఆఖరికి భగవంతుని ఆశ్రయించాల్సిందే,.


డబ్బు లేనివారికి డబ్బు ఎలా సంపాదించాలో అన్న చింత...........డబ్బు ఉన్నవారికి ఆ డబ్బు పోకుండా ఎలా కాపాడుకోవాలో అన్న చింత............... ఇలాగే జీవితం గడిచిపోతుంది.


అసలు పెద్దలు ఏం చెబుతున్నారంటే , ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కన్నా మరణం తరువాతే చాలా జీవితం ఉంటుందట.


ఎన్నో పాపాలు చేసి వచ్చే జన్మలో కుంటి, గ్రుడ్డి ఇలా కష్టాలతో కూడిన జీవితం లభిస్తే అప్పుడూ .......... దేవునికి దయలేదు అని భగవంతుడినే తిడతారు. అంతేకానీ, తాము చేసిన పాపాల వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని గ్రహించరు.


కొందరు ప్రజల సొమ్మును దోచుకుంటారు,...... కొందరు ఆడవాళ్ళకు అర్ధనగ్నదుస్తులు వేసి, ఇంకా కుటుంబసభ్యుల మధ్యన చిచ్చురగిలేలా కధలు అందిస్తూ సమాజాన్ని పెడత్రోవపట్టించేవాళ్ళూ ,......... కొందరు పర్యావరణాన్ని పాడుచేసి మూగజీవులను రోదనకు గురిచేసేవాళ్ళు, ......కొందరు అవినీతిపరులు.......... ఇలా ఎందరో................. అనేకరకాలవాళ్ళు .పేదవారు ఏం చేస్తారులే అనుకుంటారు కొందరు . పేదవారు ఏమీ చెయ్యలేకపోవచ్చు. కానీ పేదవారి కన్నీటికి కూడా కరెంట్ కన్నా ఎక్కువ పవరుంటుందండి. దాన్నే ఉసురు అంటారు. బాధితుల ఉసురు తగిలితే ఎన్నో కష్టాలు వస్తాయి. ఇవన్నీ పాపాలు చేసేవాళ్ళు ఆలోచించుకోవాలి.


పాపాలు చేసిన వాళ్ళు వారి పాపం పండినరోజున ఫలితాన్ని అనుభవిస్తారు.భగవంతుడు అందరూ తన పిల్లలే కదా అని , వారిలో మార్పు వస్తుందిలే అని కొంత అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది.


ఎన్నో పాపాలు చేసి కొన్ని పూజలు చేస్తే చాలు , ఇక భగవంతుడు క్షమిస్తారు అనుకోవటం పొరపాటు. పాపాలు చేసినవాళ్ళు పశ్చాత్తాపపడి మంచిగా మారితే అప్పుడు దైవం క్షమించే అవకాశం ఉంది.


పూర్వం గొప్పతపస్సులు చేసి దైవాన్ని ప్రత్యక్షం చేసుకున్నవాళ్ళే ...... తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు భగవంతుడు.............. వారు నా భక్తులే కదా.. అందుకని ఎలా ప్రవర్తించినా ఫరవాలేదులే అనుకోలేదు...ఏమాత్రం మొహమాటం లేకుండా వారిని శిక్షించటమే జరిగింది.


ఎవరికివారు నీతిగా జీవించినప్పుడు అనాధలుగా మారేవారు చాలావరకూ తగ్గిపోతారు. ఇలా నీతిగా ప్రవర్తించటం సమాజానికి సేవచెయ్యటం అనేకన్నా..తాము మంచిగా ప్రవర్తించటం తమ మేలు కొరకే అన్నది నిజం...... .
...............

Friday, January 21, 2011

శరణం, శరణం....... శబరిమలై మకరజ్యోతి......... ... .... . .

ఈ మధ్య శబరిమలై దగ్గర జరిగిన ప్రమాదంలో కొందరు భక్తులు మరణించటం ఎంతో బాధాకరమైన విషయం. అలా ఎందుకు జరిగిందో కారణం ఆ భగవంతునికే తెలియాలి.

అయితే ఒక పక్క భక్తులు చనిపోయిన విషాదం జరిగి ఎంతో సమయం గడవకముందే మకరజ్యోతిని మనుష్యులే వెలిగిస్తున్నారు అని చర్చ జరగటం ఏమిటో నాకు అర్ధం కాలేదు. దానికీ, దీనికీ ఏం సంబంధం ?


ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగేది కాదేమో ? ఒకోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్ పైన యాక్సిడెంట్స్ , రైలు, విమానప్రమాదాలు జరగటం చూస్తూంటాము. కారణాలు మనకు తెలియదు. విధిలిఖితం అనుకోవాల్సిందే.


మకరజ్యోతి దైవికాధ్బుతమని, అయ్యప్పస్వామి యేనని భక్తుల నమ్మకం. మకరసంక్రమణం రోజున ఆకాశంలో దేదీప్యమానంగా కనిపించే మకరనక్షత్రమే మకరజ్యోతి అని కూడా భావిస్తుంటారు.


సరే , కొంతమంది అంటున్నట్లు ఆ జ్యోతిని మనుష్యులే వెలిగిస్తున్నారు అనుకున్నా అందులో తప్పేమిటి ?

ఆ యాత్ర వల్ల మంచే జరుగుతోంది కదా ! చాలామంది భక్తులు కొన్నిరోజులు నియమాలను పాటించటం వల్ల మనస్సుని నిగ్రహించుకోవటం నేర్చుకునే అవకాశం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసే ప్రయత్నం చెయ్యటం వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదుకదా !


సమాజంలో దేవుని పేరుతో కొంతమంది ఎన్నో మోసాలు చేస్తున్నారు నిజమే. అలాంటివాటిని అడ్డుకోవటం ద్వారా ప్రజలకు మంచి చేసేవారిని నిజంగా అభినందించాలి. కానీ ఈ యాత్ర వల్ల ప్రజలకు మంచే జరుగుతోంది.


ఇక ప్రమాదాలంటే ఇలాంటివి జరగకుండా ఇక ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


తమిళనాడు లోని తిరువణ్ణామలైలో ప్రతిఏటా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఆ రోజున సాయంత్రం ఎత్తైన కొండ మీద చాలా పెద్ద జ్యోతిని వెలిగిస్తారు దేవాలయమునకు సంబంధించిన వారు.

ఆ రోజున ఆ దీపాన్ని చూడటానికి లక్షల మంది జనం వస్తారు. ఆ దీపం సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. చూసినవారికి ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకోసారి ఆ దీపం వారం రోజులు కూడా వెలుగుతుందట. అంత పెద్దది.


ఆ రోజు గుడికి 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేస్తారు. కాలినడకన వెళ్ళాల్సిందే. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అంతేకానీ దేవుని విమర్శించటం వల్ల సమాజానికి చెడు జరుగుతుందే కానీ మంచి జరగదు.


ఎందుకంటే , దేవుని యందు భయభక్తులు ఉండటం వల్ల ప్రజలు చెడు పనులుచేయటం కొంచెమయినా తగ్గుతుంది. కొందరు దేవుని పూజ చేస్తూ కూడా చెడ్డ పనులు చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి దేవుని యందు నమ్మకం లేకపోతే మరెన్ని దుర్మార్గాలు చేస్తారో ఊహించండి.


ఉదా......పరీక్షరాసే హాల్ లో ఇన్విజిలేటర్ విద్యార్దులను జాగ్రత్తగా చూస్తుంటే కాపీకొట్టటానికి పిల్లలు భయపడతారు, అదే టీచర్ బయటకు వెళ్తే ఇక ఎన్ని కాపీలు , జరుగుతాయో అందరికీ తెలుసు.


సరే , ఇంత ఎక్కువమంది భక్తులు వెళ్ళే సందర్భాలలో , భక్తులు కూడా ఒక్కరోజే అందరూ వెళ్ళాలి అనుకుంటే ఒకోసారి కుదరదు. ముఖ్యమైన రోజుల్లో రష్ వల్ల భగవంతుని దర్శనం కూడా సరిగ్గా జరగకపోవచ్చు. అందుకని కొంతమంది కొన్ని రోజులముందే వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేస్తే ముఖ్యమైన రోజుల్లో రష్ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.

శరణం, శరణం....... శబరిమలై మకరజ్యోతి......... ... .... . ....

(అయినా రద్దీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని అనుకోవటం కూడా తప్పేమో ? ఒకోసారి రద్దీ లేకపోయినా ప్రమాదాలు జరగటం వింటున్నాము. కర్మఫలం ప్రకారం అలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుందేమో. ఏది ఎందుకు జరుగుతుందో భగవంతునికే తెలుస్తుంది. )

(
కామెంట్స్ చూసాక ఇలా రాయాలని అనిపించింది. ).

Wednesday, January 19, 2011

.ఆ ఆదిశక్తియే దైవం .

కొందరు ప్రజలు చాలా చిత్రమైన వారు. తల్లిదండ్రులను, పొరుగువారిని, ఇలా ఎందరినో గౌరవించమని చెబుతుంటారు.

కానీ మనకు ఊపిరితో సహా అవసరమైన ఎన్నిటినో అందిస్తున్న దైవం విషయంలో మాత్రం పొరపాటుగా ఆలోచిస్తారు. దైవం అని ఎవరూలేరు అంటారు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే నేనూ ఒకప్పుడు దైవాన్ని నమ్మని వ్యక్తినేలెండి.


దైవము సైన్స్ వేరువేరు కానేకాదు. సైన్స్ అన్నది ఇవాళ కొందరు కొత్తగా కనుక్కున్నది కాదు. విశ్వ ఆవిర్భావం లోనే సైన్స్ ఉంది.


పురాణములలో సృష్టిని గురించిన విజ్ఞానం ఎంతో చెప్పబడింది. అయితే ఈనాటి వస్తూత్పత్తి విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ అన్న పేరుతో మనం పిలుచుకోవచ్చు.


కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు దేవుడని ఎవరూ లేరని, ఈ విశ్వం భౌతిక నియమాల వల్ల మాత్రమే ఏర్పడిందని వింతగా చెబుతుంటారు. అయితే మనస్సు, ఆలోచనలు, వాటిమాటేమిటి ?


అనేక రకముల ప్రాణులు , వాటి జీవనశైలికి అనుగుణంగా ఏర్పరచబడ్డ వాటి శరీరనిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

అనన్యసాధ్యమైన ఆలోచనాశక్తిగల మహాశక్తికే ఇలాంటి సృష్టిరచన సాధ్యపడుతుంది.


ఈ సృష్టిలో ఎంతో చిన్నవారమయిన మానవులకే ఇన్ని సంకల్పాలు, తెలివితేటలు ఉన్నప్పుడు........... ఆ ఆదిశక్తికి ఎంత గొప్ప సంకల్పశక్తి, తెలివితేటలు ఉంటాయో ఆలోచించండి. అందుకే ఆ మహాశక్తి అండ కావాలని భక్తులు ఆ శక్తిని దైవంగా
భావించి ఆరాధిస్తారు.


పరమాత్మ యొక్క అనిర్వచనీయమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను అని శ్రీ దత్త ప్రభువు చెప్పటం జరిగింది.

ఈ క్రింది విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో చెప్పబడినవండి........


బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. ......... రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కల. ........ మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు , తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్నీ సృష్టిస్తాడు." ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు..... తరవాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తీ ఆ తరవాత పదార్ధమూ పుట్టాయి. ..... భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు.... దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ... ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తనం చెందుతాయి..... అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది.... భూభావం , స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. "


"దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించి, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచి, ప్రయోజనం తీరగానే దాన్ని అదృశ్యం చేయటం జరుగుతుంది..."...... ఇలాగే......... మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు......... మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు........... .."...... ఈ విషయాలు ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడ్డాయి.మనము కలకంటున్నసేపు నిజమనే భ్రమలో ఉంటాము. కలలో కనిపించిన వస్తువులు ఎలా నిర్మించబడ్డాయి అని ఆలోచించము. నిజమే కలలో వస్తువులు ఏ పదార్ధంతో నిర్మించబడ్డాయో ? ఏమిటో అంతా మాయ.
అందులో ఇంకా ....... సృష్టి అనేది కేవలం, బృహత్తరమైన ఒక చలనచిత్రమేననీ కూడా చెప్పబడింది.మనస్సు, బుద్ధి, ఆలోచనలు, ఆత్మ మనకు తెలియని ఏ కొత్త పదార్ధములతో ఏర్పడుతాయో మనకు తెలియదు, కానీ అవి ఉన్నవని అందరికి తెలిసినదే. అలాగే కలలు కూడా సృష్టించబడతాయేమో ... !
ఈ విశ్వంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. శూన్యం అంటే ఏమీ ఉండదు అని మన అభిప్రాయం. శూన్యమే అనంతము...............అనంతమే శూన్యమూ కావచ్చు. అదే ....... సంకల్పం, ఆలోచన గల అనంతశక్తికి ఆద్యస్థానం కావచ్చు. విశ్వమంతటా ప్రతి అణువులోను ఆ శక్తి చైతన్య రూపంలో ఉంటుంది. ఆ చైతన్యానికి ప్రాణం, ఎన్నో సంకల్పాలు, ఆలోచనలు, భావాలు, ఇలా ఎన్నో ఉంటాయి.అందుచేత , ప్రస్తుతానికి నాకు ఇంకా ఏమనిపిస్తోదంటే....... శూన్యం నుంచి ఈ అనంతమైన విశ్వంలో గల అన్ని తత్వములను తనలో కలిగిఉన్న అనంత శక్తి ఆవిర్భవిస్తుంది. .............. ఆ అనంతమయిన శక్తి ......... ప్రాణం, జీవము , భావములతో కూడిన అనంతమయిన చైతన్యము......... ఈ ఆదిశక్తి తన సంకల్పానుసారం రెప్పపాటులో బ్రహ్మాండములను సృష్టించనూగలదు, లయించనూగలదు. ఆది శక్తియే దైవం.


జగదీశచంద్రబోస్ అనే భారతీయ శాస్త్రవేత్త మొక్కలు, లోహాల్లో కూడా చైతన్యం ఉంటుందని మనం వాటిని బాధ పెట్టినప్పుడు అవి మనలానే బాధను అనుభవిస్తాయని క్రెస్కోగ్రాపు అనే పరికరం సహాయంతో వెల్లడించారు. ఆ విధంగా సృష్టి అంతా ప్రాణంతో స్పందిస్తుందన్న విషయం నిజమని తేలింది.


అందుకే విశ్వంలో చిన్నవారమైన మనకు తెలియని విషయాలు అనంతంగా ఉన్నాయి.


బావిలో ఉండే కప్ప తాను ఉండే బావి కన్నా వేరే ప్రపంచం లేదని తనకన్నా తెలివికలవారు వేరే ఉండరని భావిస్తుందట. అలాగే మనకన్నా తెలివిగల దేవతల వంటివారు ఉంటారు. వారికన్నా అధికశక్తి గలవారు ఆదిపరాశక్తి.అందుకే అనవసరపు ఆలోచనలతో ఈ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అందుకే పరమాత్మను పొందాలనుకునేవారు, విశ్వరహస్యాలను తెలుసుకోవాలనిగానీ అనుకునేవారు చేయవలసినది ఏమిటంటే .................
దైవభక్తిని కలిగి, పెద్దలు చూపిన దారిలో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఆ దైవం యొక్క కృపను పొందగలిగితే ఎప్పటికయినా అన్నీ ఆ దైవమే దారి చూపించటం జరుగుతుంది. ........ ఈ విషయం ఎందరో పెద్దల జీవితాల ద్వారా మనకు తెలిసినదే......


ఇందులో తప్పులున్నయెడల దైవం దయచేసి క్షమించవలయును............

Monday, January 17, 2011

అందరికీ ఆహారం అసాధ్యమా ?

అందరికీ ఆహారం అసాధ్యమా ? అసాధ్యమని భావించటమే అత్యంత విచారకరమయిన అంశం. అందరికీ ఆహారం అసాధ్యమేమీ కాదు ......... మనకు చిత్తశుద్ధి ఉంటే...........అది అలా ఉంచండి.....

భగవంతుడు ఎంత తెలివిగలవాడు , వారు చక్కని ప్రణాళికతో ఈ విశ్వాన్ని సృష్టించటం జరిగింది. జీవులకు దాహం తీర్చటానికి నీరు, మనిషికి ఆహారంగా ఎన్నో పండ్లు , కాయగూరలు, ధాన్యములు ఇలా ఎన్నో సృష్టించారు.


ఒక చిన్న విత్తనం నాటితే అందులోనుంచి మహావృక్షం దానికి పండ్లు మళ్ళీ వాటినుంచి చెట్లు ఇలా ఎంతో ఆహారాన్ని పొందవచ్చు.


భగవంతుడు మనకొరకు ఇంత ఏర్పాటు చేసినా , ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఆహారాన్ని పొందటం విషయంలో కూడా మనం విఫలమవుతున్నాము. మళ్ళీ మనం చాలా తెలివి గలవాళ్ళమని ఫీలయిపోతుంటాము.


ఆ మధ్య మన దేశంలో టన్నులకొద్దీ ధాన్యాన్ని కుళ్ళపెట్టుకున్న విషాదం మనకు తెలిసిందే. ఒకోసారి ఎక్కువగా లెక్కలు వేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. అప్పుడు లెక్కలకన్నా లౌక్యంగా ప్రవర్తించటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.


ఇలా ఆహారకొరత రావటానికి ఎన్నో కారణాలు. పంటలు పండే భూమి విస్తీర్ణమ్ తగ్గించి , ............. ఆ భూమిని పరిశ్రమలు, పార్కులు, గోల్ఫ్ కోర్ట్స్ అంతటి పెద్ద ఇళ్ళు కట్టుకోవటానికి కేటాయించుకుంటూ పోతే ........... పంటలు ఇక చంద్రమండలంలో పండించుకోవలసిందే.

ఆహార కొరత రావటానికి ......... పండిన పంటను చక్కటి ప్రణాళిక ప్రకారం అందరికీ అందుబాటులోకి తేలేక పోవటం , వృధా అవుతున్న ఆహారం ఇలా ఎన్నో కారణాలు.


ఇవన్నీ ఆలోచించే పెద్దలు అన్నం పరబ్రహ్మస్వరూపమని వృధా చెయ్యరాదనీ చెప్పేవారు.. ఇప్పటివాళ్ళు ఇలాంటి మాటలను విని చాదస్తం అంటారు. మీరు చెట్లను, పశువులను పూజిస్తారు అని ఎగతాళిగా మాట్లాడుతారు.మనం తింటున్న ఒక్కో మెతుకు ఒకో మొక్క త్యాగంతో , తాను బాధపడి మనకు ఇస్తున్న ఆహారమే. అందుకే చెట్లను పూజిస్తే తప్పేమిటి ?

ముందుముందు ఇంధన అవసరాలకు మొక్కజొన్న లాంటివాటిని వాడుతారట. ఇక అప్పుడు రోబోట్స్ కు తప్పితే మనుషులకు, పశువులకు ఆహారం అందని ద్రాక్షే.


నీటిని కూడా తాగునీటి అవసరాలకన్నా పారిశ్రామిక అవసరాలకోసమే ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ మనిషి కోరి తెచ్చుకున్న కష్టాలే. ఫలితం అనుభవించక తప్పదు మరి...


ప్రపంచం నుండీ తీసుకోవటమే కానీ మనిషి తాను ప్రపంచానికి ఇస్తున్నదేమీ కనిపించటం లేదు. మనకన్నా మొక్కలు, చెట్లు నయం. వాటి వల్ల మనం బ్రతుకుతున్నాము,. మన వల్ల ప్రపంచానికి ఏమీ ఉపయోగం కనిపించటం లేదు..

Friday, January 14, 2011

శేషశాయి, వటపత్రశాయి..........పేర్లలో శాయి అన్న పదం................

కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

మనం రోజూ అలవాటుగా ఎన్నో పనులను చేస్తూ ఉంటాము. ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉంటాము. కానీ ఒకోసారి సడన్ గా ఆ చేసే పనులలో కొత్త అయిడియా రావటం, చదివే పుస్తకంలోని విషయం నుంచి కొత్త అర్ధం స్ఫురించటం జరుగుతుంది.

ఇంతకుముందు ఒక పోస్ట్ లో నేను ' ఈశానుడు,' 'జగదీశా ' ఇలాంటి పేర్లలో ఉన్న ' ఈశా ' అన్న పదమును తిరగతిప్పి పలికితే ' శాఈ ' అని వస్తుందని వ్రాశానండి.

వాల్మీకి మహర్షి తాను మహర్షిగా మారకముందు ' రామ ' నామాన్ని తిరగత్రిప్పి ' మరా,మరా ' అని పలికారట.

ఈ మధ్య ఒక ఆమె తన ఉపన్యాసంలో ' శేషశాయి ' అన్న పదములో " శాయి " అన్న సాయిబాబా పేరు ఉన్నదని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది.

నేను కూడా చాలాసార్లు ' శేషశాయి,' 'రంగశాయి ' ఇలా విన్నాను, కానీ వారు చెప్పేవరకూ నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎందుకో ! అనిపించింది.

ఇంకో విచిత్రం ఈ పోస్ట్ రాస్తున్నప్పుడే నాకు అవునూ,.......... వటపత్రశాయికి వరహాల లాలి, అనే పాటలో ' వటపత్రశాయి ' అన్నపదములో కూడా ' శాయి ' అన్న నామం వినిపిస్తోంది కదా ! అని ఆలోచన వచ్చిందండి.

నేను ఈ పాట చాలాసార్లు విన్నాను కానీ ఇలా ఆలోచన రావటం ఇదే మొదటిసారి.

ఇంకొకసారి బ్లాగ్ లో రాయటం కోసం ఒక పదం స్పెల్లింగ్ ఎలా వ్రాయాలో తెలియలేదండి.

ఒకరోజు ' శ్రీ శిరిడి సాయి సచ్చరిత్ర ' చదువుతోంటే అందులో నేను స్పెల్లింగ్ కోసం వెదుకుతున్న పదం కనిపించింది. నాకు ఆశ్చర్యమనిపించింది.

నేను ఈ పుస్తకం లో ఈ పదం ఇంతకుముందు కొన్నిసార్లు చదివానుకదా ! మరి ఎంత ఆలోచించినా ఇంతకుముందు ఎందుకు గుర్తు రాలేదు ? ఇప్పుడు మాత్రం సడన్ గా ఎలా స్ఫురించింది ? అని ఆశ్చర్యం వేసిందండి.

ఇంకో విషయం..........

కొంతమంది చెడ్డ పనులు చేసి ఇతరులను ఇబ్బంది పెడుతూ తమకి మాత్రం మంచి జరగాలని గొప్ప ముహూర్తాల కోసం తాపత్రయ పడిపోతుంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే మనం మంచిపనులు చేస్తూ ఉన్నప్పుడు కొద్దిపాటి పంచాంగమును చూసుకున్నా మంచి ముహూర్తములు అవే కలసి వస్తాయి.

అదే చెడ్డగా ప్రవర్తించేవారికి ఎంత మంచి ముహూర్తమును పెట్టించుకున్నా కూడా ఆ ముహూర్తంలో పని జరగక తప్పిపోవటమే జరుగుతుంది.

ఉదా...గడియారం ముల్లు ముందుకు , వెనుకకు నడవటం ద్వారా కావచ్చు, ఇంకా మనకు తెలియని ఎన్నో విధములుగా ఆ మంచి ముహూర్తం తప్పిపోయే అవకాశాలున్నాయి. లేదా మనకి తెలియని లోటుపాట్లు ఉన్న ముహూర్తమే కుదురుతుంది........

ఇవన్నీ ఇలా జరగటం చూస్తే నాకు ఏమనిపిస్తుందంటేనండి , మనం దైవభక్తిని కలిగి జీవితంలో సత్ప్రవర్తనతో నడచినప్పుడు మనకు జీవితం సవ్యంగా నడిచేటట్లు మంచి ఆలోచనలు కలిగేటట్లు ఆ భగవంతుడు చేస్తాడు అని, ..............

అదే మనము చెడ్డగా ప్రవర్తిస్తే దాని ఫలితంగా మనము రాంగ్ రూట్ లో ఆలోచించే విధంగా చేసి మనకు కష్టాలు కలుగచేస్తాడు భగవంతుడు అని. ....................

నేను కూడా ఎప్పుడయినా అనవసరంగా ఆవేశపడినప్పుడూ, అర్ధంలేని అహంభావంతో ప్రవర్తించినప్పుడు నా ఆలోచనల్లో పొరపాట్లు వస్తున్నాయండి.

ఇంకా,........ ఏమనిపిస్తుందంటేనండీ, మనం పూర్వ కర్మ ప్రకారం ఒకవేళ కష్టాలు అనుభవిస్తున్నా కూడా , చలించకుండా దైవభక్తిని కలిగి మంచిపనులు చేస్తూ పోతే భగవంతుడు అన్నీ సవ్యంగా జరిగేటట్లు సరిదిద్దటం జరుగుతుంది అని............

అయితే ఆ శక్తి రావాలంటే భగవంతుని దయ ఎంతో అవసరం..............

Wednesday, January 12, 2011

తల్లిదండ్రుల బదిలీల వల్ల విద్యార్ధులు తమ సొంత రాష్ట్రంలో ................

శ్రీ రామకృష్ణ పరమహంస , శారదా మాత , వివేకానందులు వీరంతా పూజ్యులు, గౌరవనీయులు. ఈ రోజు వివేకానందుని జయంతి.

నాకు హైదరాబాద్ లోని శ్రీ రామకృష్ణ మఠంతో బాగానే పరిచయం ఉందండి. అక్కడ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

అంతే కాదు కర్నూల్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా రాష్ట్రం లోని నాలుగు ప్రాంతములలోను, ఇంకా చెన్నై ......... ఇలా నివసించటం వల్ల అన్ని ప్రాంతములతోను మంచి అనుబంధం ఉంది.

ఇలా చుట్టుప్రక్కల దేవాలయములతో అనుబంధం, ప్రాంతం వాళ్ళతో మంచి స్నేహసంబంధాలు జీవితంలో భాగాలవుతాయి.

పూర్వం రోజుల్లో వ్యవసాయం ,వ్యాపారం వల్ల ఎక్కువగా ఒకే ఊరిలో నివసించేవారు. ఇప్పుడు ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్స్ వల్ల అనేక ప్రాంతాలు , ఒకోసారి విదేశాలు కూడా వెళ్ళవలసి వస్తోంది.

ఇలాంటి రాకపోకల వల్ల ప్రజల మధ్య స్నేహసంబంధాలు పెరుగుతాయి. అయితే వెళ్ళే శాతం విపరీతంగా ఉంటే అపార్ధాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాల కోటా ఇలాంటి విషయాలలో అపార్ధాలు రావచ్చు.


అందుకే విద్యార్ధులకు కాలేజీలలో సీట్ల కొరకు లోకల్......నాన్......లోకల్ ఇలా నిబంధనలు ఏర్పరిచారేమో !


నాకు రూల్స్ గురించి పూర్తిగా తెలియదు కానీ ఒక విద్యార్ధి ఇంటర్ చదువుకు ముందు అయిదు సంవత్సరములు ఎక్కడ చదివితే ప్రాంతము అతనికి లోకల్ అని ఒకరూల్ ఉందనుకుంటాను.


గ్రూప్ .......ఒన్ లాంటి ఉద్యోగాల్లో కూడా లోకల్ నిబంధనప్రకారం నియామకాలు ఉంటాయనుకుంటా ! మిగతా రూల్స్ నాకు అంతగా తెలియవు.

మాకు చెన్నై నుండి ఇక్కడకు బదిలీ అయినప్పుడు మా అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చిందండి.

తనని మాతో తీసుకువచ్చి ఇక్కడ కాలేజీలో జాయిన్ చెయ్యాలని అనుకున్నాము. తను చెన్నై లోనే చదువుతానన్నాడు. తన ఫ్రెండ్స్ అక్కడ ఉండటం వల్ల.

ఇంకా ,.......... తను అక్కడ ఆరు సంవత్సరములు చదవటం వల్ల అక్కడ లోకల్ కోటా సీట్ వస్తుంది . అయితే మాకు తనని మాకు హాస్టల్లో ఉంచటం ఇష్టం లేదు. ( వేరే దారి లేనప్పుడు హాస్టల్లో ఉంచవలసిందే . )

మాకు తెలిసిన వాళ్ళు కూడా అదేమిటి ? అందరూ చెన్నై వెళ్ళి చదువుతుంటే మీరు అబ్బాయిని ఇక్కడ చదివిస్తానంటారు ......అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

అక్కడ మాకు బాగా దగ్గర బంధువులు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు.


ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా ! హాస్టల్లో ఉంచటం ఇష్టం లేక మేము అబ్బాయిని ఇక్కడకు తీసుకువచ్చి చదివిస్తున్నాము. దైవం దయ వల్ల అబ్బాయి బాగానే చదువుతున్నాడు. క్లాస్ లో ఫస్ట్ రావటం కూడా జరిగింది.


సరే, అయితే మాకు బాధ కలిగించిన విషయమేమిటంటే , మేము ' .పి ' లో నాన్....లోకల్ అట.

మా అబ్బాయి రాష్ట్రంలో చదవలేదు కాబట్టి తనకి ఇక్కడ లోకల్ కోటాలో సీట్ రాదన్నారు. తెలుగువాళ్ళం అయిఉండీ మేము నాన్..లోకల్ అంటే బాధనిపించింది.

ట్రాన్స్ఫర్ వల్ల మేము ఇతర ప్రాంతానికి వెళ్ళాము కానీ........ మేము కావాలని వెళ్ళలేదు కదా !

అదే తమిళనాడులో అయితే విద్యార్ధులు పుట్టుకతో తమిళులు అయితే చాలు ,.............. వారు ఇతర రాష్ట్రములలో చదివినా కూడా వారికి తమిళనాడులో ......... లోకల్ కోటాలో సీట్ వస్తుంది. పద్ధతి బాగుంది. మరి మన రాష్ట్రంలో ఇలా ఎందుకు లేదో ?


మన రాష్ట్రంలో కూడా రూల్ అమలుపరిస్తే పిల్లలు చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది. అంటే, ........... లోకల్, నాన్....లోకల్ పద్ధతి వల్ల పెద్దవాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు పిల్లలను తమతో తీసుకు వెళ్ళలేక ఇక్కడే హాస్టల్స్ లో ఉంచేస్తున్నారు......... తీసుకువెళ్తే లోకల్ కోటాలో సీటు రాదేమోనన్న భయంతో.అందుకే , బైబర్త్ తెలుగువాళ్ళయినప్పుడు వారు ఎక్కడ చదివినా కూడా ' . పి ' లో లోకల్ కోటాలో సీట్ వస్తే బాగుంటుంది అనిపించింది..........


Monday, January 10, 2011

కొన్ని ఆవిష్కరణలతో అవస్థలు............

ఈ విషయాలను ఎవరినీ బాధపెట్టాలని రాయటం లేదండి. కొత్త ఆవిష్కరణల వల్ల ప్రపంచానికి కొన్ని విషయాలలో మేలు జరిగిన మాట వాస్తవమే,

కానీ కొన్నిటిని తలచుకుంటే బాధగానే ఉంటుంది. ఏదైనా కొత్తవి కనుక్కున్నప్పుడు , ఇక దానివల్ల అధ్బుతాలు జరిగిపోతాయని అందరం భావిస్తాము.


శాస్త్రవేత్తలు కూడా ప్రపంచానికి మంచి చేద్దామనే ఏదో ఒకటి కనుక్కుంటారు. కానీ వాటి ఫలితాలు వారికి అయినా ముందే తెలియవు కదా !


వాటి ఫలితాలు చాలా కాలం తరువాత గానీ అనుభవం లోకి రావు. ఇక అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి. ఉదా..........ప్లాస్టిక్ కనుగొన్న తరువాత ప్రపంచం ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఇక ఇప్పుడు దానిని ఎలా వదిలించుకోవాలో దారి తెలియక దిక్కులు చూస్తున్నాము.
పురుగుల మందుల వల్ల ఇక ఆహారకొరత ఉండదని భావించాము. ఇప్పుడు వాటి ప్రభావం తెలిసాక అవి పురుగులు ఏపుగా పెరగటానికి, మనుషులు రోగాలతో చావటానికి మాత్రమే పనికి వస్తాయని తెలిసింది కదా !పంజాబ్ లో చాలా మంది రైతులు వీటి ప్రభావం వల్ల కాన్సర్ వంటి జబ్బులకు గురయ్యారట. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులను విదేశాల వారు తిప్పి పంపిస్తున్నారు. వాటిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని.


అసలు ఒక చిన్న వాన పడితే మరుసటి రోజుకే మొక్కలు నవనవలాడుతూ కనిపిస్తాయి. అదే ఎన్ని రసాయనిక ఎరువులు వాడినా ఒకోసారి మొక్కలు వెర్రిగా పెరుగుతాయి కానీ పువ్వులు, కాయలు కనబడవు. (ఇలా జరగటం వల్లనే కొంతమంది రైతులు అప్పులపాలయ్యారు. )వాన నీటి సహజత్వం రసాయనిక ఎరువుల కృత్రిమత్వానికి ఎలా వస్తుంది ?ఇంకా సేంద్రియ ఎరువులు సహజమైన పదార్ధముల నుంచి చేస్తారు. వాటిని వాడి అధిక దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ రైతులూ కొందరు ఉన్నారు. వాళ్ళనుంచి మిగతావారు స్పూర్తిని పొందాలి .ఇక సెల్ ఫోన్ టవర్స్ చుట్టుప్రక్కల ఉండేవాళ్ళ బాధలు మీడియాలో చూపిస్తున్నారు కదా ! ఆ తరంగాల ప్రభావం వల్ల వారికి చర్మవ్యాధులు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.


ఎ.సి. లు, కంప్యూటర్స్ లాటివి వాడుతున్నప్పుడు విడుదల అయ్యే వాయువుల వల్ల ఓజోన్ పొరకు జరిగే హాని గురించి చదువుతూనే ఉన్నాము.సెల్ ఫోన్ అధికంగా వాడితే ప్రమాదం , గర్భిణీ స్త్ర్రీలు ఓవెన్ కు దూరంగా ఉండాలన్న సూచనలు ...... ఇలా .................చెప్పాలంటే చాలా ...


మా పిల్లలు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటుంటే భయంగా ఉంటుంది. ఆ తరంగాలవల్ల ఏ ప్రాబ్లం వస్తుందోనని. చెప్పినప్పుడు తీసివేసినా తరువాత మళ్ళీ మామూలే. ఎన్ని సార్లు చెప్పగలం. ? మన సిద్ధాంతాల ప్రకారం జీవించాలంటే బొత్తిగా కుదరటం లేదు.సమాజం పోకడ మన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది.ఇవన్నీ ఆలోచించే ఓపిక లేక విసుగ్గా టి. వి పెట్టామనుకోండి ........ ఒక అమ్మాయి విలాసంగా గిర్రున తిరిగి మీరు ఫలానా వస్తువులు కొంటారుగదూ ! అని అలవోకగా అనటం......... చూస్తాము.


అవన్నీ చూసి మనం మూర్ఛపోయి ఆ వస్తువులు కొంటామని వారి అభిప్రాయం. ఇదంతా మన ఖర్మ. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల వల్ల ప్రపంచం ఏమవుతుందో ?


అసలు మనిషికి ఏం కావాలి ? దైవభక్తి, సత్ప్రవర్తన ,........ పుష్టికరమైన ఆహారం ,
....... శుభ్రమైన వస్త్రాలు, .........సకాలంలో అందే వైద్యం,............. విలువలతో కూడిన విద్య,....... రక్షణనిచ్చే ఇల్లు, దేశం ...... ఇలాంటివి కదా ! ఇవన్నీ వదిలేసి మనం ఎటు పోతున్నామో ! ఏం చేస్తున్నామో !ఇక్కడ ఉన్న నీటిని సరిగ్గా వాడుకోవటం చేత రాక వృధా అవసరాలకు వాడుతూ.......... ఎండమావుల వెంట పరిగెడుతున్నాము. ఇతరగ్రహాల పైన నీరు ఉందట . అక్కడకు ఎంతమంది వెళ్ళగలరు ? డబ్బు బాగా ఉన్న ఏ కొద్దిమందో వెళ్ళగలరు . మిగతావారి సంగతి ?


ఇంకా,....... ఇప్పటి లెవెల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే......... అవన్నీ పీల్చలేక చెట్లు కూడా చచ్చూరుకుంటాయి. వేడి పెరిగిపోయి ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరిగి, ......... సముద్రమట్టం పెరిగి , కొన్ని దేశాలు మునిగిపోతాయట. ఇప్పటికే వాతావరణంలో విపరీతమైన మార్పులు చూస్తూనే ఉన్నాము.ఏమిటో కలికాలం. ఏమన్నా అంటే అభివృద్ధి నిరోధకులంటారు...... ... అయితే ఇవన్నీ గమనించి శాస్త్రవేత్తలు సౌరశక్తిని వాడుకోవటం ఇలా...... దిద్దుబాటు చర్యలు ఆరంభించారులెండి. ( ఎలాగూ ఖనిజనిల్వలు కూడా అయిపోతాయి కాబట్టి ).

* అన్నిటికీ కారణం పెద్దలు చెప్పినట్లు మితిమీరిన కోరికలే అన్ని అనర్ధాలకు కారణం.


* ఇప్పటికయినా మనం మేలుకొనకుంటే దేవుడే మనల్ని సరిదిద్దుతాడు ......... మనకి బుద్ధి వచ్చేలా......... ఎందుకంటే ప్రపంచమంటే మనమే కాదుగా ...... అమాయక మూగ జీవులు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా భగవంతుడు ఆలోచిస్తారు మరి.......

Friday, January 7, 2011

సాయి సత్యవ్రతం గురించి నాకు ఈ విధంగా తెలిసిందండి.ఈ విషయం కొంతకాలం క్రితం జరిగిందండి. అప్పుడు మాకు చిన్నచిన్న కష్టాలు వచ్చాయండి .

అప్పుడు ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. ఆ కలలో నేను ఒక ఎర్రరంగు కారుని వంకరటింకరగా ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నానట . ( అప్పట్లో మాకు కారు లేదు . )

తరువాత కారు ఒక దగ్గర ఆగింది . అక్కడ శ్రీ సత్యనారాయణ వ్రతం పూజ జరుగుతున్నట్లు కలలో కనిపించిందండి . అక్కడ శిరిడీసాయిబాబా విగ్రహం కూడా కనిపించిందండి .

అయితే ఈ కల అర్ధం నాకు తెలియలేదు. నాకు అప్పటికి సాయిసత్యవ్రతం గురించి తెలియదండి. నాకు మామూలుగా మనము చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం గురించి మాత్రమే తెలుసు. మేము అన్నవరంలో కూడా ఈ వ్రతం చేసుకున్నామండి .

అందుకని నేను ఏమనుకున్నానంటే, ఇదేమిటి ? కలలో సత్యనారాయణవ్రతం దగ్గర సాయిబాబా విగ్రహం కూడా కనిపించారు అనుకున్నానండి .

ఆ కల అర్ధం కాక సరే ఏమైనా దేవునికి సంబంధించిన కల రావటం మంచిదే కదా ! అని సంతోషించామండి .

తరువాత కొంతకాలానికి మేము శిరిడి వెళ్ళామండి . అక్కడ గుడి పరిసరాల్లో అన్నీ చూస్తోంటే , ఒక దగ్గర సాయిసత్యవ్రతం గురించిన వివరాలున్నాయండి .అలా సాయిసత్యవ్రతం గురించిన వివరాలు తెలుసుకున్నామండి .

నాకు నా కల గుర్తు వచ్చింది. ఆ కలకు సాయిసత్యవ్రతానికి సంబంధమున్నదేమో అని నాకు అనిపించిందండి. తరువాత దైవం దయవల్ల మేము సాయిసత్యవ్రతం ఆచరించుకున్నామండి.

అంతా భగవంతుని దయ ...

మనము దైవభక్తిని కలిగి ఉండటంతోపాటు దైవానికి ఇష్టమయిన మంచిపనులు చేస్తేనే మనకు మంచి జరుగుతుంది.

మనము దైవభక్తి , సత్ప్రవర్తన కలిగిఉన్నప్పుడు , మన కష్టాలు తీరే మార్గాన్ని దైవం చూపిస్తారు. నేను ఇలా ఉన్నప్పుడు నాకు గొప్ప ఆలోచనలు రావటం, మంచి జరగటం జరుగుతోంది .................అదే ఎప్పుడయినా నేను అనవసరంగా ఆవేశపడితే అప్పుడు నా ఆలోచనలలో పొరపాట్లు రావటం, నాకు ఏదైనా ఇబ్బంది కలగటం నేను గ్రహించానండి.


అందుకే ఇవన్నీ చూశాక నాకు ఏమని అనిపించిందంటేనండి, మనము ఇతరులకు మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుంది.........చెడు చేస్తే మనకూ ఇబ్బందులు వస్తాయని ....క్రితం జన్మలో చెడు చేసినా ...ఇప్పుడు మంచిగా ప్రవర్తించటం ద్వారా ఆ చెడు ఫలితాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు కదండి. .......


నాకు మా ఇంటి ఫోన్ నంబరే ఒకోసారి గుర్తు రాదండి. అలాంటి నేను ఈ మాత్రం తోచిన విషయాలు రాస్తున్నానంటే అంతా భగవంతుని దయయే . నేను వ్రాస్తున్న వాటిల్లో మంచి ఆలోచనలను భగవంతుని దయగానూ , పొరపాట్లను నా తప్పులుగానూ భావిస్తున్నాను...

Wednesday, January 5, 2011

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు పోవటం , ఇంకా పర్యావరణానికి హాని.......

ఈ రోజుల్లో నిరుద్యోగం , ఉన్న ఉద్యోగాలు పోవటం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కూడా నిరుద్యోగసమస్య వస్తోందని నా అభిప్రాయమండి. ఈ రోజుల్లో పనులన్నీ యంత్రములే చేసేయ్యటం వల్ల మనకి చెయ్యటానికి ఇక పనులు , ఉద్యోగాలు ఎలా వస్తాయి ?


1. పాతకాలంలో ఇప్పటిలా ఇన్ని యంత్రాలు ఉండేవి కావు. ఉదా...........వాళ్ళు ఒక వస్తువును తయారుచేయాలంటే ఒక వారం రోజులు సమయం తీసుకునేవారనుకుందాము. దీనివల్ల ఆ వారమంతా రోజూ చేతి నిండా పని ఉండేది. ఇలా చెయ్యటానికి ఎప్పుడూ పని ఉంటుంది.............
అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువ వస్తువులు తయారు చెయ్యలేము కాబట్టి భూమి పైన ఎక్కువ చెత్త వస్తువులు పేరుకుపోకుండా పర్యావరణం శుభ్రంగా ఉంటుంది.2. ఈ రోజుల్లో అదే వస్తువును యంత్రాల సహాయంతో ఒక గంట సమయంలోనే ఒక వంద తయారుచేస్తున్నారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే ,.......... పని త్వరగా అయిపోయి ఇక చేయటానికి పని ఉండదు . ( నిరుద్యోగం. ) ఇంకా , ఇలా గుట్టలుగా వస్తువులను ఉత్పత్తి చేయటం వల్ల ఖనిజనిల్వలు ఖాళీ అయిపోవటం , భూమి పైన గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వస్తువులతో ఎన్నో సమస్యలు..కంపెనీలు ఇలా గుట్టలుగా వస్తువులు తయారు చేస్తాయి . ఇలా గుట్టలుగా వస్తువులను తయారుచేసిన తర్వాత వాటిని ఎవరైనా కొంటేనే వారికి లాభాలు వచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరు. ఎవరూ కొనకపోతే నష్టాలు వచ్చి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేస్తారు.

అలాగని ఎవరు మాత్రం ఎంతకని వస్తువులు కొంటారు ? మనకు అప్పటికే ఇంటినిండా వస్తువులు ఉంటాయి, ఎన్నని కొంటాము ? కొత్తవి కొనేకొద్దీ ఇల్లంతా గజిబిజి .


మా ఇల్లు ఇలాగే చూసినవన్నీ కొని, అలా కొన్నవాటితో కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాటిని పారవెయ్యలేము.

పారవేసినా అవి ఎక్కడో ఒకచోట భూమిపైనే చెత్తలా ఉంటాయి గానీ మాయమయ్యేవి తక్కువ . అందుకని ఇప్పుడు ఎంతో అవసరమయితే తప్ప , కొత్తవి కొనటం మానేసామండి.

ఎవరికయినా కొంతకాలానికి ఇలాగే విరక్తి వస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే

1. వస్తువులను ఎవరూ కొనకపోతే , కంపెనీలకు నష్టం వచ్చి అందులోని వారికి ఉద్యోగాలు పోతాయి.

2. వస్తువులను కొంటే కంపెనీలకు లాభాలు వచ్చి ఉద్యోగాలు ఉంటాయి. కానీ భూమి ,పర్యావరణం మట్టికొట్టుకుపోతాయి.

3.అందుకే నాకు ఏమనిపిస్తుందంటేనండి ,పారిశ్రామీకరణ పూర్తిగా తప్పని అనటం లేదు. దానివల్ల కొన్ని లాభాల ఉన్నాయి. అయితే , మనకి కావలసినంత అంటే , మనిషి చేయలేని కష్టమయిన పనులకు యంత్రములను వాడుకోవాలి .

4. గుట్టలుగా వస్తువులను తయారుచేయటం మానాలి.

5. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

6. అంతగా వస్తువులు తయారుచేయటం అవసరం లేని ....... అర్ధ శాస్త్రం , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , పర్యాటకం , ఆటలు , సంగీతం, వినోదం ఇలాంటివాటితో ఆర్ధికాభివృద్ధిని సాధించటానికి ప్రయత్నించాలి.

ఈ వినోదం లాంటివి మితిమీరి ప్రజలు తప్పుదారిన వెళ్ళకుండా , వారిలో సోమరితనం పెరగకుండా చూడాలి .దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా కొత్త వస్తువులు కొనాలన్న మోజు , ఇలా ........ మన కోరికలను కొంచెము తగ్గించుకోవాలి..

దైవభక్తి ఇలాంటి వాటి విషయంలో తప్ప ప్రతి పనికీ ఒక పరిధి ( లిమిట్ ) ఉంటుంది. ఉదా.....ఆరోగ్యానికి మంచిది కదా అని విటమిన్ టాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటే అనారోగ్యం కలుగుతుంది.

అలాగే పెద్దలు చెప్పినట్లు , దేనినయినా ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.. యంత్రములను వీలయినంత తగ్గించటం వల్ల అందరికీ పని దొరికే అవకాశం ఉంది. పర్యావరణం బాగుంటుంది.

* ఇంకా , మనము ఒళ్ళు వంచి పనులు చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.... ..........

Monday, January 3, 2011

విదేశాల్లో స్థిరపడటమే ఇక్కడ పుట్టిన ప్రతిఒక్కరి లక్ష్యమా ? .................2.

లోకంలోని జీవులన్నీ సుఖంగా ఉండాలని కోరుకునే వ్యక్తినండి నేను. నా దేశాన్ని , ప్రజలను ఎంతగా అభిమానిస్తానో అంతగానూ అన్నిదేశాలప్రజలు సుఖంగా జీవించాలని కోరుకుంటాను .


ఇంతకుముందు ఒకపోస్ట్ లో .......... ఈ దేశం నుంచి విదేశాలకు జరుగుతున్న మితిమీరిన వలసల గురించి వ్రాస్తూ ...........ఇలా ఎందుకు వెళ్తున్నారు ? డబ్బు కోసమా ? అన్న వాక్యాన్ని ఉపయోగించానండి. తరువాత చదివితే ,డబ్బు కోసమా ? అన్నవాక్యం తప్పుగా వ్రాశానని అనిపించిందండి. ఆ వాక్యం నాకే నచ్చలేదు.


విదేశాలకు ప్రపంచక్షేమం కోసం వెళ్ళేవారు, ఇంకా తప్పనిసరిపరిస్థితిలో వెళ్ళేవారు కూడా ఉంటారు. అందుకని ఇలాంటి వాక్యం వ్రాసి ఇబ్బంది పెట్టినందుకు నేను వారందరికి క్షమాపణ చెప్పుకుంటున్నానండి.


నా ఆవేదనకూడా దయచేసి కొంచెం అర్ధం చేసుకోండి. కొంతకాలం క్రిందట భారతదేశంలో పల్లెటూళ్ళలో కుటుంబాలు పిల్లాపాపలతో కళకళలాడేవి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా వృద్ధులు, ఇంటిముందు కార్లు మాత్రమే కనబడుతున్నాయి. .ఇప్పుడు పిల్లలు విదేశాలలో ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.


పట్టణాలలో కొద్దిగా చదువుకున్నవారు కూడా ఇక విదేశాలకు వెళ్ళటమే తరువాయి అన్నట్లు ఆలోచిస్తున్నారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలించకపోతే ఇక దొరికిన ఉద్యోగంతో నిర్లిప్తముగా జీవిస్తుంటారు.


ఈ నాడు ఈ దేశ అభివృద్ధికి కావలసింది............ డబ్బు కన్నా, ఒక ప్రణాళిక ప్రకారం ఉత్సాహంగా పనిచేసే వ్యక్తులు. ఇలా మితిమీరిన వలసల వల్ల దేశాభివృద్ధి ఎలా అన్న అభిప్రాయం వల్ల, .................


ఇంకా ఇప్పుడు మనదేశం చూడండి.... మనలో మనమే సర్దుకు పోలేక పోతున్నాము. ఇక మనం గుంపులుగా విదేశాలకు వెళ్తే వాళ్ళు మనలను ఎంతకాలం గౌరవిస్తారో చెప్పలేము. కొంతకాలానికి మనవల్ల వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని కూడా భావించే అవకాశం ఉంది.


మితిమీరిన వలసల వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిమంది మాత్రమే వలసలు వెళ్ళటం వల్ల ఇలాంటి అపార్ధాలు రావు. దేశాల మధ్యన స్నేహసంబంధాలు బాగుంటాయి. ఇలా సమసమాజం ఏర్పడాలని కోరుకుందామండి.
.....


ఈ క్రింది కామెంట్స్ మొదటి భాగమును ........ ఈ పోస్ట్ యొక్క ....1 వ భాగం కామెంట్స్ లో ( డిసెంబర్ 27 2010 న వ్రాసిన పోస్ట్ యొక్క కామెంట్స్ లో ) చూడగలరు.......