koodali

Monday, January 10, 2011

కొన్ని ఆవిష్కరణలతో అవస్థలు............

 

 

ఈ విషయాలను ఎవరినీ బాధపెట్టాలని రాయటం లేదండి. కొత్త ఆవిష్కరణల వల్ల ప్రపంచానికి కొన్ని విషయాలలో మేలు జరిగిన మాట వాస్తవమే,

కానీ కొన్నిటిని తలచుకుంటే బాధగానే ఉంటుంది. ఏదైనా కొత్తవి కనుక్కున్నప్పుడు , ఇక దానివల్ల అధ్బుతాలు జరిగిపోతాయని అందరం భావిస్తాము.


శాస్త్రవేత్తలు కూడా ప్రపంచానికి మంచి చేద్దామనే ఏదో ఒకటి కనుక్కుంటారు. కానీ వాటి ఫలితాలు వారికి అయినా ముందే తెలియవు కదా !


వాటి ఫలితాలు చాలా కాలం తరువాత గానీ అనుభవం లోకి రావు. ఇక అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి. ఉదా..........ప్లాస్టిక్ కనుగొన్న తరువాత ప్రపంచం ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఇక ఇప్పుడు దానిని ఎలా వదిలించుకోవాలో దారి తెలియక దిక్కులు చూస్తున్నాము.


పురుగుల మందుల వల్ల ఇక ఆహారకొరత ఉండదని భావించాము. ఇప్పుడు వాటి ప్రభావం తెలిసాక అవి పురుగులు ఏపుగా పెరగటానికి, మనుషులు రోగాలతో చావటానికి మాత్రమే పనికి వస్తాయని తెలిసింది కదా !


పంజాబ్ లో చాలా మంది రైతులు వీటి ప్రభావం వల్ల కాన్సర్ వంటి జబ్బులకు గురయ్యారట. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులను విదేశాల వారు తిప్పి పంపిస్తున్నారు. వాటిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని.


అసలు ఒక చిన్న వాన పడితే మరుసటి రోజుకే మొక్కలు నవనవలాడుతూ కనిపిస్తాయి. అదే ఎన్ని రసాయనిక ఎరువులు వాడినా ఒకోసారి మొక్కలు వెర్రిగా పెరుగుతాయి కానీ పువ్వులు, కాయలు కనబడవు. (ఇలా జరగటం వల్లనే కొంతమంది రైతులు అప్పులపాలయ్యారు. )


వాన నీటి సహజత్వం రసాయనిక ఎరువుల కృత్రిమత్వానికి ఎలా వస్తుంది ?


ఇంకా సేంద్రియ ఎరువులు సహజమైన పదార్ధముల నుంచి చేస్తారు. వాటిని వాడి అధిక దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ రైతులూ కొందరు ఉన్నారు. వాళ్ళనుంచి మిగతావారు స్పూర్తిని పొందాలి .


ఇక సెల్ ఫోన్ టవర్స్ చుట్టుప్రక్కల ఉండేవాళ్ళ బాధలు మీడియాలో చూపిస్తున్నారు కదా ! ఆ తరంగాల ప్రభావం వల్ల వారికి చర్మవ్యాధులు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.


ఎ.సి. లు, కంప్యూటర్స్ లాటివి వాడుతున్నప్పుడు విడుదల అయ్యే వాయువుల వల్ల ఓజోన్ పొరకు జరిగే హాని గురించి చదువుతూనే ఉన్నాము.

సెల్ ఫోన్ అధికంగా వాడితే ప్రమాదం , గర్భిణీ స్త్ర్రీలు ఓవెన్ కు దూరంగా ఉండాలన్న సూచనలు ...... ఇలా .......చెప్పాలంటే చాలా ...


మా పిల్లలు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటుంటే భయంగా ఉంటుంది. ఆ తరంగాలవల్ల ఏ ప్రాబ్లం వస్తుందోనని. చెప్పినప్పుడు తీసివేసినా తరువాత మళ్ళీ మామూలే. ఎన్ని సార్లు చెప్పగలం. ? మన సిద్ధాంతాల ప్రకారం జీవించాలంటే బొత్తిగా కుదరటం లేదు.



సమాజం పోకడ మన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది.



ఇవన్నీ ఆలోచించే ఓపిక లేక విసుగ్గా టి. వి పెట్టామనుకోండి ........ ఒక అమ్మాయి విలాసంగా గిర్రున తిరిగి మీరు ఫలానా వస్తువులు కొంటారుగదూ ! అని అలవోకగా అనటం......... చూస్తాము.


అవన్నీ చూసి మనం మూర్ఛపోయి ఆ వస్తువులు కొంటామని వారి అభిప్రాయం. ఇదంతా మన ఖర్మ. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల వల్ల ప్రపంచం ఏమవుతుందో ?


అసలు మనిషికి ఏం కావాలి ? దైవభక్తి, సత్ప్రవర్తన ,........ పుష్టికరమైన ఆహారం ,
....... శుభ్రమైన వస్త్రాలు, .........సకాలంలో అందే వైద్యం,............. విలువలతో కూడిన విద్య,....... రక్షణనిచ్చే ఇల్లు, దేశం ...... ఇలాంటివి కదా ! ఇవన్నీ వదిలేసి మనం ఎటు పోతున్నామో ! ఏం చేస్తున్నామో !



ఇక్కడ ఉన్న నీటిని సరిగ్గా వాడుకోవటం చేత రాక వృధా అవసరాలకు వాడుతూ.......... ఎండమావుల వెంట పరిగెడుతున్నాము. ఇతరగ్రహాల పైన నీరు ఉందట . అక్కడకు ఎంతమంది వెళ్ళగలరు ? డబ్బు బాగా ఉన్న ఏ కొద్దిమందో వెళ్ళగలరు . మిగతావారి సంగతి ?


ఇంకా,....... ఇప్పటి లెవెల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే......... అవన్నీ పీల్చలేక చెట్లు కూడా చచ్చూరుకుంటాయి. వేడి పెరిగిపోయి ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరిగి, ......... సముద్రమట్టం పెరిగి , కొన్ని దేశాలు మునిగిపోతాయట. ఇప్పటికే వాతావరణంలో విపరీతమైన మార్పులు చూస్తూనే ఉన్నాము.



ఏమిటో కలికాలం. ఏమన్నా అంటే అభివృద్ధి నిరోధకులంటారు...... ... అయితే ఇవన్నీ గమనించి శాస్త్రవేత్తలు సౌరశక్తిని వాడుకోవటం ఇలా...... దిద్దుబాటు చర్యలు ఆరంభించారులెండి. ( ఎలాగూ ఖనిజనిల్వలు కూడా అయిపోతాయి కాబట్టి ).

* అన్నిటికీ కారణం పెద్దలు చెప్పినట్లు మితిమీరిన కోరికలే అన్ని అనర్ధాలకు కారణం.

* ఇప్పటికయినా మనం మేలుకొనకుంటే దేవుడే మనల్ని సరిదిద్దుతాడు ......... మనకి బుద్ధి వచ్చేలా......... ఎందుకంటే ప్రపంచమంటే మనమే కాదుగా ...... అమాయక మూగ జీవులు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా భగవంతుడు ఆలోచిస్తారు మరి.......

4 comments:

  1. * అన్నిటికీ కారణం పెద్దలు చెప్పినట్లు మితిమీరిన కోరికలే అన్ని అనర్ధాలకు కారణం.
    ------
    అబ్బా ఎంత చక్కటి మాట.

    ReplyDelete
  2. ధన్యవాదములండి..

    ReplyDelete
  3. చాల గొప్ప విషయాలెన్నో క్లుప్తంగా చెప్పారండీ, మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములండి..

      Delete