koodali

Monday, January 3, 2011

విదేశాల్లో స్థిరపడటమే ఇక్కడ పుట్టిన ప్రతిఒక్కరి లక్ష్యమా ? .................2.

 

 

లోకంలోని జీవులన్నీ సుఖంగా ఉండాలని కోరుకునే వ్యక్తినండి నేను. నా దేశాన్ని , ప్రజలను ఎంతగా అభిమానిస్తానో అంతగానూ అన్నిదేశాలప్రజలు సుఖంగా జీవించాలని కోరుకుంటాను .


ఇంతకుముందు ఒకపోస్ట్ లో .......... ఈ దేశం నుంచి విదేశాలకు జరుగుతున్న మితిమీరిన వలసల గురించి వ్రాస్తూ ...........ఇలా ఎందుకు వెళ్తున్నారు ? డబ్బు కోసమా ? అన్న వాక్యాన్ని ఉపయోగించానండి. తరువాత చదివితే ,డబ్బు కోసమా ? అన్నవాక్యం తప్పుగా వ్రాశానని అనిపించిందండి. ఆ వాక్యం నాకే నచ్చలేదు.


విదేశాలకు ప్రపంచక్షేమం కోసం వెళ్ళేవారు, ఇంకా తప్పనిసరిపరిస్థితిలో వెళ్ళేవారు కూడా ఉంటారు. అందుకని ఇలాంటి వాక్యం వ్రాసి ఇబ్బంది పెట్టినందుకు నేను వారందరికి క్షమాపణ చెప్పుకుంటున్నానండి.


నా ఆవేదనకూడా దయచేసి కొంచెం అర్ధం చేసుకోండి. కొంతకాలం క్రిందట భారతదేశంలో పల్లెటూళ్ళలో కుటుంబాలు పిల్లాపాపలతో కళకళలాడేవి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా వృద్ధులు, ఇంటిముందు కార్లు మాత్రమే కనబడుతున్నాయి. .ఇప్పుడు పిల్లలు విదేశాలలో ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.


పట్టణాలలో కొద్దిగా చదువుకున్నవారు కూడా ఇక విదేశాలకు వెళ్ళటమే తరువాయి అన్నట్లు ఆలోచిస్తున్నారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలించకపోతే ఇక దొరికిన ఉద్యోగంతో నిర్లిప్తముగా జీవిస్తుంటారు.


ఈ నాడు ఈ దేశ అభివృద్ధికి కావలసింది............ డబ్బు కన్నా, ఒక ప్రణాళిక ప్రకారం ఉత్సాహంగా పనిచేసే వ్యక్తులు. ఇలా మితిమీరిన వలసల వల్ల దేశాభివృద్ధి ఎలా అన్న అభిప్రాయం వల్ల, .................


ఇంకా ఇప్పుడు మనదేశం చూడండి.... మనలో మనమే సర్దుకు పోలేక పోతున్నాము. ఇక మనం గుంపులుగా విదేశాలకు వెళ్తే వాళ్ళు మనలను ఎంతకాలం గౌరవిస్తారో చెప్పలేము. కొంతకాలానికి మనవల్ల వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని కూడా భావించే అవకాశం ఉంది.


మితిమీరిన వలసల వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిమంది మాత్రమే వలసలు వెళ్ళటం వల్ల ఇలాంటి అపార్ధాలు రావు. దేశాల మధ్యన స్నేహసంబంధాలు బాగుంటాయి. ఇలా సమసమాజం ఏర్పడాలని కోరుకుందామండి.
.....


ఈ క్రింది కామెంట్స్ మొదటి భాగమును ........ ఈ పోస్ట్ యొక్క ....1 వ భాగం కామెంట్స్ లో ( డిసెంబర్ 27 2010 న వ్రాసిన పోస్ట్ యొక్క కామెంట్స్ లో ) చూడగలరు.......




4 comments:

  1. ధన్యవాదములండి.
    మీరు నా అభిప్రాయములను ఒప్పుకోకపోతే సరేనండి. బయట కూడా నాతో చాలా మంది ఇలాగే అంటారండి. ఈ రోజుల్లో ఇలా ఆలోచిస్తే కష్టం అని. కొంతమందేమో నా యొక్క కొన్ని అభిప్రాయములను ఒప్పుకుంటారు, కొన్నింటిని ఒప్పుకోరు. ఇది మామూలేలెండి.

    ఇంతకుముందు మీ కామెంట్స్ గురించి నా అభిప్రాయములు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నానండి.

    1. మీరు ఇక్కడున్నంత అవినీతి విదేశాలలో లేదు అన్నారు గదా ! అదిసరే కానీ అక్కడ కొంతమంది గురించి రకరకాల లీకేజీల ద్వారా వెల్లడవుతున్న విషయాలు వార్తాపత్రికలలో చదువుతూనే ఉన్నాము.

    అయితే కొంతమంది వ్యక్తుల స్వార్ధం గురించి ఏ దేశ ప్రజలనయినా అందరినీ మనము తప్పుగా అనుకోకూడదు. ప్రజలలో మంచివారు అన్నిదేశాలలోనూ ఉంటారు.


    2. ఇంకా ఈ రోజుల్లో ఎవరికయినా చేయటానికి పనులు, ఉద్యోగాలు దొరకకపోవటానికి ఇంకో కారణం కూడా ఉందండి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల ప్రతిచిన్నపనినీ యంత్రాలతో చేయించటంవల్ల ఇక మనకు చెయ్యటానికి పనులు, ఉద్యోగాలు ఎక్కడినుంచీ వస్తాయి ?

    3. ఇక మీరు అంటున్న వర్డ్ వెరిఫికేషన్ అంటే ఏమిటో నాకు తెలియదండి. నాకు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదండి. ఏదో ఈ బ్లాగ్ వ్రాయటానికి కావలసినంత మాత్రమే నేర్చుకున్నానండి. అందుకే ఏం చేస్తే ఏ ప్రాబ్లం వస్తుందో అని బ్లాగ్ లో ఏదన్నా మార్చాలంటే ఇబ్బందిపడతానండి. వర్డ్ వెరిఫికేషన్ గురించి మీరు చెబితే , నేను అర్ధం చేసుకోగలిగితే, ప్రయత్నిస్తానండి.. ..

    ఇంకా , .రకరకాల కారణాలవల్ల ఒకోసారి కామెంట్స్ కు జవాబు వ్రాయటం ఆలస్యమయితే ఏమీ అనుకోవద్దండి.....

    ReplyDelete
  2. ఇంకో ముఖ్యమైన విషయం వ్రాయటం మరిచిపోయానండి. మా అబ్బాయికి నాకు కూడా వాదోపవాదాలు జరుగుతాయండి అప్పుడప్పుడు. తను పై చదువులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటానంటున్నాడు.చదువుకోవాలంటే ఇక్కడ కూడా ఎన్నో మంచి విద్యాలయాలు ఉన్నాయి. అక్కడకు వెళ్ళాక అక్కడి సౌకర్యాలు చూశాక ఎవరి మనసు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు ? మా భయం మాది.
    అలా అంటే ......... అలా ఏమీ కాదు నాకు భారతదేశంలో ఉద్యోగం చేయటమే ఇష్టం అంటాడు.. ముందుముందు మా కధ ఏం కానున్నదో ? అయితే ఇంకా కొంచెము సమయం ఉందిలెండి దీనికంతా. మా బంధువుల పిల్లలు కూడా ఒకరిని చూసి ఒకరు కొంతమంది విదేశాలకు వెళ్ళారు. ఇలాంటివి చూసినప్పుడు బాధగా అనిపిస్తోంది.

    ReplyDelete
  3. విదేశాలకి వెళ్ళడ౦, లేదా పుట్టిన ఊరు దాటి మెట్రో సిటీ కి వెళ్ళి ఉద్యోగ౦ చెయ్యడ౦..ఏ విధము గా వేరు అ౦టారు? సరే ఆ మెట్రో సిటీ లో బాస్ పలనా క౦పెనీ పని మీద దేశ౦ దాటి వెళ్ళి రావాలి లేదా వెళ్ళాలి అ౦టారు ..వెళ్తే తప్పా..ఆ క౦పెనీలు కూడా లాభాల లో కొ౦త భాగ౦ , ప్రజల కోస౦ వినియోగిస్తున్నాయి కదా ?

    మీరు చూసిన పల్లెలకి ఇప్పుడు కార్లు వచ్చాయి, రేపు మ౦చి రవాణా సౌకర్యాలు, అలా ఆ పల్లె మారుతు౦ది ..పల్లె ఎప్పటికీ పల్లె గానే ఉ౦డదన్నది ...ఎ౦దుకు నచ్చడ౦ లేదు? :)

    ReplyDelete
  4. ధన్యవాదాలండి.
    విదేశాలకు వెళ్ళటానికి, పుట్టిన ఊరు దాటి మెట్రో సిటీకి ఉద్యోగానికి వెళ్ళటానికి చాలానే తేడా ఉంటుంది లెండి.

    ఇక కంపెనీ పని మీద తాత్కాలికంగా విదేశాలకు వెళ్ళటం తప్పని నేను ఎప్పుడూ రాయలేదండి. ఈ రోజుల్లో అలా వెళ్ళకుండా కుదరదు కూడా .

    ఇక కంపెనీలు లాభాల్లో కొంత ప్రజలకు వినియోగించటం అంటే........ ... కొంతమంది సంపదను విపరీతంగా పోగేసుకోవటం కూడా మిగతా ప్రజల పేదరికానికి ఒక ముఖ్య కారణమండి. . దానితో పోలిస్తే ప్రజలకు ఇచ్చేది చాలా కొంచెం... అందరూ ఇలా ఉండరు లెండి. కొందరు నిజాయితీగా ప్రజలకు సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు..స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్ళు గడిచినా కొందరు ప్రజలు ఇతరులు డబ్బు సహాయం చేస్తే తీసుకోవలసిన పేదరికంలో ఉండటమే అందరూ బాధ పడవలసిన విషయం.

    ఇక పల్లెలు పచ్చటి పంటపొలాలతో , సిరిసంపదలతో పల్లెలుగా ఉంటేనే బాగుంటుందండి. . సిటీల్లో పొల్యూషన్ తో చిరాకు వచ్చేస్తోంది. పల్లెలలో కార్లు అవీ లేని రోజుల్లో కూడా ఇంతకన్నా ఆనందంగా కుటుంబసభ్యులందరూ కలసిమెలిసి చక్కని జీవితాన్ని గడిపేవారు.. ఇప్పుడు ధన సంపాదనలో పడి కుటుంబ బంధాలు దూరమవుతున్నాయి.

    నేనేమీ విదేశాల వాళ్ళకు వ్యతిరేకం కాదండి. పారిశ్రామీకరణ అయినా, విదేశాలకు వెళ్ళటం అయినా అతి అనర్ధదాయకం అని అంతే........................ .

    ReplyDelete