koodali

Friday, December 31, 2010

అన్నివేళలా అందరినీ ఆపదలలో ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న , అమృత , అభయ హస్తం పరమాత్మదే...........

 

లోకములో అదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మినవారు. దురదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మనివారు.

మనం
భగవంతుని నమ్మినప్పుడు వారికి ఇష్టమయిన పనులను చెయ్యటానికి ప్రయత్నించాలి. అంతేకానీ భగవంతుడుమెచ్చని అన్యాయమైన పనులను చేస్తే అది దైవభక్తి అనిపించుకోదు.


ఒకోసారి మన నిర్ణయములలో పొరపాట్లు జరగవచ్చు.


కానీ పరమాత్మ విషయంలో అలా జరగదు. పరమాత్మ చూపిన దారి, వారి నిర్ణయములు ఎప్పుడూ సరిగ్గానే ఉంటాయి. వాటి వెనుక కారణాలు ఒకోసారి మనకు తెలియవు అంతే....అందుకే పరమాత్మను నమ్మేవాళ్ళు అదృష్టవంతులు అనేది.


ఇంకా , భగవంతుని
నమ్మినవారు అదృష్టవంతులని ఎందుకు అంటారంటే , మనకు ఎప్పుడయినా ఆపదలు వస్తే ఆదుకునే శక్తి భగవంతునికి మించి విశ్వంలో ఎవరికీ ఉండదు కాబట్టి.


జీవితంలో
ఒక్కోసారి మనం సంపాదించిన సొమ్ము కానీ, మనవాళ్ళు అని అనుకున్న ఆప్తులు కానీ, విజ్ఞానశాస్త్రంకానీ, మనకు సహాయము చెయ్యలేని సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆపదలలో అన్నివేళలా అందరినీ ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న అమృత అద్భుత హస్తం పరమాత్మదే.


అందుకే
అందరం ఆ దైవాన్ని సదా గుర్తుంచుకోవాలి. సత్ప్రవర్తనతో జీవిస్తూ వారిని ఆనందపరచాలి.

 

1 comment:

  1. మీకు చాలా కృతజ్ఞతలండి. అలాగే మీరు మీకుటుంబం నూతన సంవత్సరములో ఆనందముగా జీవించాలని కోరుకుంటున్నానండి. ఇంకా, అందరూ కూడా ఆనందముగా జీవించాలని కోరుకుంటున్నానండి.

    ReplyDelete