koodali

Sunday, December 26, 2010

1.మన ఆచారములు అన్నిచాదస్తములా ...... 2. ..జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

 

మన ఆచారములు అంతా చాదస్తమేనా..........

విషయములో అయినా మంచిని మాత్రమే గ్రహించాలి అని నా అభిప్రాయమండి. అంటే మన పాత ఆచారములు గానిక్రొత్త సైన్స్ గాని వీటి వల్ల నైతికత తో కూడిన ఆనందం మనకు కలగాలి.

సైన్స్ మరియు భగవంతుడు వేరని ఎందుకు అనుకోవాలి . ఇంత గొప్ప ప్రపంచాన్ని స్రుష్టించిన భగవంతుడు పెద్ద సైంటిస్ట్అని నా అభిప్రాయము.


మనము గుమ్మానికి పసుపు రాయటము వల్ల గాలికి బయట నుంచి వచ్చే దుమ్ము గడపకు తగిలి .............చెడ్డ బాక్టీరియా ఇంట్లోకి రాకుండా పసుపు రాసిన గడప కాపాడుతుంది.

ఆపసుపు
లోని ఆంటిబయొటిక్ గుణము వల్ల గడపకు ఉన్న దుమ్ము లోని చెడు క్రిములు చనిపోతాయి.

ఇవన్నీ అర్ధము కావని గుమ్మానికి పసుపు రాస్తే డబ్బు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. మరి మనము రోజుల్లోపసుపు రంగు పెయింట్ వేసేసి................. పెద్దవారు చెప్పినదానివల్ల ఏమి ఉపయోగము....... అంతా చాదస్తముఅంటున్నాము.
అలాగే చెట్ల ఆకులు కార్బండైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజెన్ విడుదల చేస్తాయని మనకు తెలుసు.ఒక్క మామిడి చెట్ల ఆకులుమాత్రము చెట్ల నుంచి కోసిన తరువాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే శక్తి కలిగి ఉంటాయట.


అందుకని ఎక్కువమంది కలిసే ఫంక్షన్స్ లో మామిడి ఆకులు కట్టడము వల్ల గాలి శుభ్రముగా ఉంటుంది. రోజుల్లోఇవన్నీ సైంటిస్ట్స్ కనిపెడుతున్నారుకదా.

ఎన్నో వందల సంవత్సరముల మన ఆచారములలో......... తెలిసీ తెలియని కొంతమంది......... చెడ్డ ఆచారములుప్రవేశపెట్టడము వల్ల మనము అన్ని ఆచారములు తప్పని చెప్పకూడదు.

మీ అందరికి థాంక్స్. నా అభిప్రాయములు చదివినందుకు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యటము సరిగ్గా రాదండి. దయచేసి తప్పులు క్షమించండి.

.ప్లాస్టిక్ మామిడి ఆకులు బదులు నిజమయిన ఆకులు వాడుదాము....


విడాకుల వలన లాభమా....


అసలు 90 పర్సెంట్ ఆడవాళ్ళు, 90 పెర్సెంట్ మగవాళ్ళు దగ్గరదగ్గర ఒకే రకమయిన మెంటాలిటి కలిగి ఉంటారని నా అభిప్రాయము.

కొంతమందిరెండు, మూడు పెండ్లిండ్లు చేసుకున్నాక అప్పుడు తత్వము తెలుసుకుంటారు. ఇక చేసేదిలేక అప్పుడు సర్దుకుపోవటమునేర్చుకుంటారు. తాము చాలా సంతోషముగా ఉన్నట్లు ప్రపంచానికి కనిపిస్తారు.

సర్దుకుపోవటము మొదటిపెండ్లివారితోనే అయితే కనీసము వారి తల్లితండ్రులు,పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు.

సారి భార్యాభర్తలూ మీమద్య గొడవ వచ్చినప్పుడు ............మీరు ముసలి వారు అయ్యాక, మీ పిల్లలు,కోడళ్ళు,అల్లుళ్ళు, లేక........... వ్రుద్దాశ్రమములో ఎవరయినా మిమ్ములను విసుక్కోవటము ,మీరు ఓపికలేక నోరుమూసుకుని సర్దుకుపోవటము ఇదంతా .......ఊహించుకోండి.( ఇది పెద్దయ్యాక ప్రతి ఒక్కరికి తప్పని పరిస్థితి .) అప్పుడు భార్యాభర్తల మధ్యన కూడా సర్దుకుపోవటం అలవాటవుతుంది.


మరి
వారందరిమాట వినే మనము భార్య మాటభర్త, భర్తమాటభార్య వింటే తప్పేమిటి.ఇంకా మీ మనసు మీ మాట వినక పోతే భగవంతుని సహాయము చెయ్యమని ప్రార్దించండి.

ఇక మరీ తప్పని పరిఖర్మ ప్రకారము విడిపోవాలిసివస్తే......... వేరే వారి కాపురము లో చిచ్చుపెట్టకుండా గౌరవముగా జీవిస్తే బాగుంటుంది. అప్పుడుఅందరూ గౌరవిస్తారు.

అందరి కాపురములు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ...

Saturday, March 27, ౨౦౧౦

జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..


రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము.

ఈ రోజుల్లో పిల్లలు వారి జీవితాంతం అమ్మా,నాన్న ఉంటారాలేక.............. వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని ............అతి చిత్రమయిన పరిస్థితిలో నేడు చాలామంది పిల్లలు ఉన్నారు.

అంటే మరి........ తల్లితండ్రి విడిపోయి, ఎవరికి వారు వేరే పెండ్లి చేసుకుంటే......... పిల్లలకు కొత్తా అమ్మానాన్న వస్తారు కదా........ అలా అన్నమాట.

ఇది రాయటానికి నాకు చాలా బాధగా ఉంది.

రోజుల్లో భార్యాభర్తలను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. రకరకముల ప్రాబ్లంస్ ,ఒకోసారి బంధువుల పంతాలు ,పట్టింపులు వలన కూడా
భార్యాభర్తల మధ్యన పెద్దపెద్ద గొడవలవుతాయి.


ఏదిఎలా ఉన్నా ఒక జంట గుర్తుంచుకోవాల్సింది ఏమంటే......... మనము జీవితములో చిన్నతనములో పెద్దల మాటగౌరవిస్తాము.................. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,అల్లుళ్ళను చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటేఅప్పుడు మనకు ఒపిక ఉండదు కాబట్టి.


మరిఈ మద్య కాలంలో......... జీవితములో ఎంతో మందితో , అంటే ఆఫీసులలో పై వారితో, ఇరుగు పొరుగు వారితోనూ ,పనివారితోను,కూరలవారితోను,మనసొంతపిల్లలతోను, ఇలాఎంతో మందితోసర్దుకుపోతుంటాము....మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.

మరి భార్యాభర్తలు కూడా ఇలా......... సర్దుకుపోతే ఈప్రపంచములో చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారిజీవితము ఎంతో సంతోషముగా ఉంటుంది.

నాకుతెలుసు.......ఇది కష్టమయిన పని అని. కాని కొంచము ప్రయత్నించిచూడండి...........

కుటుంబం అన్నాక రకరకాల కారణాల వల్ల , ఆర్దిక సమస్యలవల్లా భార్యాభర్తలకు తప్పక గొడవలు వస్తాయి.... బయటివారికి ఇవన్నీ ఉండవు ........కాబట్టి ఇన్నిసమస్యలు రావు,

మనము మన చిన్నతనములో మన అమ్మమ్మా,నాయనమ్మా ఊర్లు వెళ్తే,......... వారు ఎంత ఆప్యాయముగా మనల్నిచూసారో మనపిల్లలకు కధలుగా చెపుతాము.

మరి మన పిల్లలకు మనము ఇలాంటి ప్రేమలు ఇవ్వాలంటే........... మన పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు....... మనఆప్యాయతలు పొంది సుఖముగాపెరగాలంటే.... ఈనాటి భార్యాభర్తలు కూడా సర్దుకుపోకతప్పదు.

మనపెద్దలు సర్దుకుపోయారు కాబట్టి......... మనము ఇలాసంతోషముగా ఉన్నాము.

మనపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తమసొంత అమ్మ బదులు వేరే అమ్మ ,................సొంతనాన్న బదులు వేరే నాన్న........... ఉంటే వారి మనస్సూ ఎంత భాధగాఉంటుందో ఆలోచించండి. కొత్తగా వచ్చిన వారు ఎంత బాగా చూసినా సరే..

ఈసారి పోట్లాటలు వచ్చినప్పుడు బయట అయితే కోపము ఎలా అణుచుకుంటామో గుర్తు తెచ్చుకోండి. అందరి కాపురములు సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను. ...


Friday, March 26, ౨౦౧౦

హక్కులు పెద్దలకేనా..పిల్లలకు వుండవా..

రోజుల్లో ప్రపంచము లో సంస్క్రుతి బాగా మారిపోయింది.ఇప్పుడు ఎక్కువ మంది భార్యాభర్తలు తమ హక్కుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.మరి పిల్లలకు కూడా బాధలు ,భయములు ఉంటాయి కదా.

డబ్బు ఉన్న వాళ్ళు కూడా.............. నాడు తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగములకు వెళ్ళటము వల్ల చాలా చిన్న పిల్లలను క్రెచ్లలోవదిలి వెళ్తారు. అక్కడకొన్ని దగ్గర బాగా చూస్తారు. కొన్నిదగ్గర సరిగ్గా చూడకపోవచ్చు....
ఎంతయినా వారు తల్లిలా చూస్తారా..


మరి పిల్లలకు తమ భాధలు చెప్పుకోవటానికి.... భగవంతుడే దిక్కు... పెద్దవాళ్ళు చెప్పే జవాబు..... మేము వాళ్ళ కోసమే డబ్బు సంపాదిస్తున్నామని.


ఇప్పుడు ప్రశ్న ఏమంటే .........ఇదే పెద్దలు వారి ముసలితనములో వారి పిల్లలు వారిని వ్రుద్దాశ్రములలో చేర్పిస్తే మాత్రము, ఎంతఘోరం........... మాపిల్లలు మమ్మల్ని ప్రేమగా చూడటము లేదు, మాకు డబ్బు కాదు ప్రేమ కావాలి వయసులో ........ అని అందరికి చెప్పి భాధ పడుతారు.


కొంతమంది పిల్లలపైన కేస్ కూడా వేస్తారు. వీరికి తమ పిల్లల చిన్నతనములో పిల్లలతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు............... మరిఇప్పుడు వారి పిల్లలకు వీరితో మాట్లాడటానికి టైం ఉండదు.
ఏమంటే పిల్లలు వారికి పుట్టిన పిల్లలకు సంపాదించటములో బిజీగా ఉంటారు కాబట్టి..


పెద్ద వయసులో మనముపిల్లల ప్రేమను కోరుకున్నప్పుడు..... మరి పిల్లలు వారి చిన్నతనాన్నితల్లిదండ్రులకు దూరంగా బయటెక్కడో ఎందుకు గడపాలి... ఎందుకంటేవారికి మాటలు రావు కాబట్టి..... వారికి హక్కులు తెలియవు కాబట్టి.


మనకు గాని మన పిల్లలకు గానిజీవితములో ఎప్పుడయినా , ఏదైనా కష్టము వచ్చినప్పుడు అది పోవాలంటే... భగవంతుడు మన కోట్లఆస్తిని చూసి మనల్ని కాపాడడు.... మనము ఎన్ని మంచి పనులు చేసామో చూసి వాటిని బట్టి రక్షిస్తాడు.


అందుకని నా అభిప్రాయము ఏమంటే..... మనము జీవితములో సుఖముగా ఉండాలంటే మన కోరికలను తగ్గించుకోవాలి. ... మనమేమో ప్రక్రుతిని సర్వనాశనము చేసేసి భూమిని తవ్వేసి చందమామను కూడాను పొల్యూట్ చెయ్యటానికి కూడా రడీ అయిపోతున్నాము.

విషాదమేమంటే ఇన్ని సౌకర్యాలు పెరిగినా ఒక్కరికి మనశ్శాంతి లేదు............

మనము మనకు సరిపడినంత ఆస్తి మాత్రముసంపాదించుకుని..... నలుగురికి సహాయపడితే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనకు కూడా ఎంతోసంతోషముగాఉంటుంది.

ఏదో నాకు తోచింది రాసేసాను,దయచేసి ఎవరి మనసునైనా కష్టపెడితే క్షమించండి...


ఇవి నేను ఇంతకుముందు రాసిన పాత టపాలే నండి..మళ్లీ పోస్ట్ చేసాను.....

9 comments:

  1. మన ఆచారాలమీద మీరు వ్రాసినవి నేను నిజంగా మెచ్చుకుంటాను. ఆచారాలు ఎలా వచ్చాయి అనే వాటిమీద నేననుకునేది చెప్తాను. ఏ కాలం లోనయినా పండితులు పామరులూ ఉంటారు. పండితులు చెయ్యాల్సిన పని మంచి సంగతులను గ్రహించి వాటిని పామరులతోసహా అందరికీ చెప్పటం, వాళ్ళచేత పాటింప చేయటం. దేశ కాల పరిస్థితుల బట్టి అవే ఆచారాలు గ వచ్చాయి ఎందుకంటే అందరికీ పరిగ్రహణ శక్తీ ఒక విధంగా ఉండదు. ఆ పండితులని నిజంగా మెచ్చుకోవాలి. అందుకనే ఆలోచించకుండా అన్ని ఆచారాలని తిట్టటం తప్పు.

    ReplyDelete
  2. మీకు నా ధన్యవాదములండి. నిజమేనండి. ఆలోచించకుండా అన్ని ఆచారములను తిట్టడము తప్పు.

    కొంతకాలం క్రిందట సంక్రాంతి పండుగ వస్తే తప్పనిసరిగా ఇంటికి సున్నం వేసేవారు. భోగి పండుగ నాడు ఇంట్లోని పాతవైపోయిన చెక్క సామాను లాంటివి భోగి మంటలో వేసేవారు. ఈ విధముగా పాతవైపోయిన సామాను పోయి ఇల్లు శుభ్రముగా ఉంటుంది.

    ప్రతి సంక్రాంతికి ఇంటికి సున్నం వెయ్యటం వల్ల ఇంటి గోడలు బాక్టీరియా లేక శుభ్రముగా ఉండేవి. ఇప్పుడు అభివృద్ది పేరుతో ప్రతి సంవత్సరం రంగులు వెయ్యకుండా, నాలుగయిదు సంవత్సరాలకు ఒక్కసారే వెలిసిపోని రంగులు వేస్తున్నారు. రంగులు వెలిసిపోవు , నిజమే కానీ ........ నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రంగులు వేస్తే ఆ సంవత్సరమంతా ఇంటి గోడలకు పట్టిన మురికి సంగతి ఏమిటి ?

    ప్రాచీనులు ఎంతో తెలివిగలవాళ్ళు కాబట్టె పండుగ పేరుతో ప్రతిసంవత్సరం ఇంటికి సున్నం వేయటం ఆచారంగా ఏర్పాటు చేసారు. పండుగ కు సున్నం వెయ్యకపోతే ఏమవుతుందోనన్న భయంతో అయినా అందరూ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు.....

    ReplyDelete
  3. please watch & subscribe
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete
  4. @anrd గారూ
    మన ఆచారాలని పండితులు పామరుల కోసం సింపుల్ భాషలో చెప్పటం, తరువాత వాటిని గ్రంధీకరించటం లేక పోవటం మూలంగా, ఎందుకు అలా చెప్పారో కారణాలు మనకి కనిపించక అవన్నీ తెలివి తక్కువ, తప్పు అని చాలా మంది అనుకోవలసి వస్తోంది. మీకు వీలయితే మీరు గుర్తించిన వన్నీ ఒక పుస్తకం లో వ్రాయండి. వీటిని గ్రంధీకరించిన వాళ్ళు అవుతారు.

    ReplyDelete
  5. మీకు నా ధన్యవాదములండి. మీరు వ్రాసినది తప్పక చూస్తానండి.

    ReplyDelete
  6. మీకు నా ధన్యవాదములండి.

    ReplyDelete
  7. మీకు నా ధన్యవాదములండి. ఏదో ఈ మాత్రం రాస్తున్నాను అంతే కానీ , పుస్తకం వ్రాసేంత విషయములు నాకు తెలియవండి... అంతా భగవంతుని దయ..

    ReplyDelete