koodali

Saturday, June 28, 2014

పురాణేతిహాసాలలో కొన్ని సంఘటనలు...

 పరాయి  స్త్రీని  తల్లిగా  గౌరవించమని  పెద్దలు   గట్టిగా   తెలియజేశారు. అలాంటప్పుడు  ఇతరుల   భార్యను   కోరటం  అనేది  పెద్దలు  ఏర్పరిచిన  ఆచారం  కాదని  గట్టిగా  చెప్పవచ్చు.  అలాంటప్పుడు పరాయి స్త్రీని కోరుకునే ఆచారాలు సమాజంలో ఏర్పడటానికి కారణం ప్రజల ఆశలు, కోరికలే......

ప్రజలు తమ కోరికలకు అనుగుణంగా ఆచారాలను మార్చివేస్తారని అర్ధమవుతోంది.

పురాణేతిహాసాలలో  కొన్ని  సంఘటనలు   గిట్టనివాళ్ళు  చేర్చిన  ప్రక్షిప్తాలు  కూడా  కావచ్చు.  పోనీ  నిజమే  అనుకుంటే   ఇలా  కూడా  ఆలోచించవచ్చు....


  ఆ నాటి సంఘటనల నుంచీ ..... ఈ నాటి టెస్ట్ ట్యూబ్ బేబీలు , సర్రొగేట్ మదర్స్ వరకు ...... సంతానం కొరకు తరతరాల నుంచి ....ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయని తెలుస్తోంది...
 
ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలు    స్పెర్మ్  బేంకుల  సాయంతో  సంతానాన్ని  పొంతుదున్నారు.  అరుదుగా  కొందరు   మగవారు    సరోగేట్ మదర్  సాయంతో    సంతానాన్ని  పొందారని  వార్తలలో  విన్నాము. ( విదేశీ  సెలబ్రిటీ )

పూర్వం  కూడా  కొందరు  పురుషులు  సంతానం  కోసం   స్త్రీల  అద్దెగర్భాల  పద్ధతిలో  సంతానాన్ని  పొందేవారేమో  ?
........................


బృహస్పతి  వారి  విషయంలో  దేవరన్యాయం  అనేమాట  ఉపయోగించారు.  కాబట్టి  సంతానం  కోసమే  బృహస్పతి  మమత  అనే  ఆమెను  అడిగి  ఉంటారు.

అయితే,  బృహస్పతి    ఎందుకు  అలా  అడిగారో  తెలియదు.  అప్పుడు  నిజంగా  ఏం  జరిగిందో  మనకు  తెలియదు.  ఈ  కధ  గురించి  విభిన్నమైన  కధనాలు  ఉన్నట్లున్నాయి.  ఒక్కొక్కదగ్గర  వేరేవేరేగా  ఉంది.  ఏది  నిజమో  తెలియటం  లేదు.

 ఉదా.. ( గర్భిణిఅయిన యుతద్యుడనే ముని భార్య మమతను దేవరన్యాయంగా బృహస్పతి సంతతికోసం సంగమం కోరుతాడు. గర్భస్థుడైన బాలకుడిది అన్యాయమని ఎదిరిస్తాడు. .)  అని    ఒక  దగ్గర     చదివాను.

ఇక్కడ  నాకు  ఒక  సందేహం  వచ్చింది.    అప్పటికే  గర్భవతిగా  ఉన్న  స్త్రీ వల్ల  మరల సంతానాన్ని ఎలా పొందగలరో తెలియటం లేదు.

పోనీ  బృహస్పతి  మమతను   వాంచించారు  అనుకుంటే ?

 గొప్ప  వ్యక్తులలో  కూడా  కొందరు ,  కొన్నిసార్లు  తప్పులు  చేసే  అవకాశం  ఉందనీ  .. అందువల్ల  జాగ్రత్తగా  ఉండాలనే  నీతిని  మనము  తెలుసుకోవచ్చు.

......................

12  రకాల  పుత్రులలో  కొందరి  విషయం...

  స్త్రీకి కు  వివాహం  కాక  పూర్వమే  సంతానం  కలిగినా  ఫరవాలేదు  అని  పూర్వీకుల  అభిప్రాయం  కాదని  గట్టిగా  చెప్పవచ్చు.

ఉదా..  వివాహానికి  పూర్వమే   సంతానాన్ని  పొందటానికి   స్త్రీకి  సమాజంలో  హక్కు    ఉండి   ఉన్నట్లయితే ,  కుంతీదేవి  కర్ణుని   చక్కగా  పెంచుకునేది  కానీ,   బయట  వదిలేసేది  కాదుకదా  ! 

వివాహానికి  పూర్వమే  సంతానాన్ని  పొందటమనేది  ఆ  రోజుల్లో  కూడా  నిషిద్ధమే  అని  తెలుస్తోంది.

 అయితే,  12  రకాల  పుత్రుల  విషయంలో  వీరిని  ఎందుకు  చేర్చారంటే,  అభంశుభం  తెలియని  పిల్లలు  అనాధలు  కాకూడదనే  ఉద్దేశంతో    అలా  చెప్పి  ఉంటారు.  చాటుగా  పిల్లల్ని  కని  వదిలేస్తే  పిల్లలు  అనాధలుగా  పెరగవలసి  వస్తుంది. ఇలాంటి  పరిస్థితి  వల్ల  సమాజంలో  ఎన్నో  సమస్యలు  వస్తాయి.  ఇవన్నీ  ఆలోచించి  వాళ్ళనూ  పుత్రులుగా  చెప్పి ఉంటారు. 

స్త్రీలు  శారీరికంగా  బలహీనులు. అరటాకు  ముల్లు  సామెత  ప్రకారం  స్త్రీలు  ఏదో  కారణం  వల్ల (  బహుశా  పురుషుల  బలవంతం  వల్ల   కూడా  )   గర్భాన్ని  ధరిస్తే  ఆ  పుట్టిన  సంతానం  అనాధలు  కాకూడదనే  ఉద్దేశంతో  పూర్వీకులు  12  రకాల  సంతానంలో  కొందరిని ( ఉదా..  కానీనుడు,  సహోఢుఢు..వంటి వారిని  ) చేర్చి   ఉంటారు. 

అంతేకానీ,  స్త్రీలు  వివాహం  కాకముందే  పిల్లల్ని  కనవచ్చు,  లేక  వివాహం  తరువాతా   పరాయి  సంబంధాల  ద్వారా  పిల్లల్ని  కనవచ్చు ... అని  పెద్దల  అభిప్రాయం  కాదు.
.......................

ఇక,  సత్యవతీ,  కుంతి మొదలైన  వారి  విషయంలో  మాతృస్వామ్యం  కనిపిస్తోందని  కొందరంటున్నారు.  

 మాతృస్వామ్యం  అంటే  స్త్రీలకు  రాజ్యపాలన  ఉండాలి  కదా ! 

మరి,   సత్యవతి లేక  అంబా,  అంబాలికలు   రాజ్యపాలన  చేయలేదు  కదా  ?   ఇవన్నీ  గమనిస్తే , మాతృస్వామ్యం, పితృస్వామ్యం  అని  వేరేగా  లేవని  తెలుస్తుంది.

..............................


దయచేసి ఈ  లింకునూ  చూడగలరు..గోవు ...గృహప్రవేశం.

 
దయచేసి
గోవు ...గృహప్రవేశం.  పోస్ట్  వ్యాఖ్యలనూ  చూడండి.
.......................

ఇంకా,  ఏమనిపిస్తుందంటే,

వివాహం జరిగిన తరువాత స్త్రీ " అర్ధాంగి " అవుతుంది. .......అంటే భర్తలో అర్ధ భాగం అని. పెద్దలు చెప్పటం జరిగింది.
సనాతనమైన వేదాలలోనే ఏకపత్నీ, ఏకపతీ........గురించి చెప్పబడిందట.
వివాహమంత్రాలు ఇంకా " నాతిచరామి ........ " వంటివి గమనిస్తే భార్యాభర్తలు విషయంలో పెద్దల అభిప్రాయం అర్ధమవుతుంది.

పర స్త్రీని తల్లిలా గౌరవించాలని కూడా పెద్దలే తెలియజేసారు.
అలాంటప్పుడు పరాయి స్త్రీని కోరుకునే ఆచారాలు సమాజంలో ఏర్పడటానికి కారణం ప్రజల ఆశలు, కోరికలే......

ప్రజలు తమ కోరికలకు అనుగుణంగా ఆచారాలను మార్చివేస్తారని అర్ధమవుతోంది.
..................


* ' ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన కొన్ని ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. " .....అని కొందరు అంటారు.

* ఏది అసలైన విషయమో భగవంతునికే తెలియాలి....ద్రౌపది

పురాణేతిహాసాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజానికి  చక్కటి  సందేశాలు  తెలుస్తాయి.  పెడర్ధాలతో  అర్ధం  చేసుకుని  చెప్పటం  వల్ల  సమాజానికి  కీడు  చేసిన  వాళ్ళవుతారు. పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకోకుండా  సరిగ్గా  అర్ధం  చేసుకున్నప్పుడు  సమాజానికి  ఎంతో  మేలు  జరుగుతుంది.


ఈ రోజుల్లో  కొందరు  పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకుంటూ  వాటిని  తమకు  తోచినట్లు  వక్రీకరించి  చెబుతున్నారు.  ఉదా...ద్రౌపది  విషయంలో  చూస్తే  ఆమె     కర్ణుడు  తనకు  భర్తగా  అయితే  బాగుంటుంది  అని  ఆలోచించినట్లు  ప్రచారం  చేస్తున్నారు.  కర్ణుడు  మరణించిన  తరువాతే  అతను  కుంతి  కుమారుడని  ద్రౌపదికి  తెలుస్తుంది. ఇక,  కర్ణుడు   తన  భర్త  అయితే  బాగుండునని  ఆమె  ఎలా  ఆలోచించగలదు ?  ఇలా  ఉన్నవీలేనివీ  కల్పించి  చెబుతూ న్నారు.


link... ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.


న్యాయానికి తర..తమ, పేద..గొప్ప వంటి తేడాలు లేవనీ....

ఈ  సంవత్సరపు  శుభప్రదమైన  అమరనాధ్  యాత్ర  ప్రారంభమయింది.

...............

లోకంలో  కొందరు  ఏమనుకుంటారంటే,   తాము  ఎన్నో పూజలు  చేస్తాము  కాబట్టి  ...    తప్పులు  చేసినా    కూడా  తమకు  కష్టాలు  రావనీ  భ్రమపడుతుంటారు.

అయితే,  దైవం  ధర్మాన్ని   కాపాడే   విషయంలో  ఎంతో  ఖచ్చితంగా  ఉంటారు.

శ్రీ  కృష్ణుడికి  ఎంతో  ఆప్తులైన  పాండవులు  పాచికలాటలో  పందేన్ని  ఓడి,  వనవాసానికి  వెళ్ళవలసి  వచ్చింది. ఇక్కడ  మనకు   ఒక  సందేహమొస్తుంది. ఎన్నో  మహిమలు  కలిగిన  శ్రీ  కృష్ణుడు  తలుచుకుంటే  పాచికలాటలో  పాండవులు  ఓడిపోకుండా  చేయవచ్చుకదా ? అనిపిస్తుంది.పాండవులు  అడవులకు  వెళ్ళిన  తరువాత  వారికి  సాయంగా  అక్షయ  పాత్రను  ప్రసాదించారు  దైవం .   అంతేకానీ,   పాచికలాటలో  పాండవులు  ఓడిపోకుండా   సాయం  చేయలేదు. కృష్ణుడు   ధర్మరాజును  గెలిపించటానికి  మహిమను  చూపలేదు  ..ధర్మరాజు  ఓడిపోయారు.  ..పాండవులు  వనవాస కష్టాలను  అనుభవించారు.ఈ  విషయాన్ని  గమనించితే  నాకు  ఏమనిపించిందంటే,   పై  సంఘటన  ద్వారా  పాచికలాట  పందెముల  ద్వారా  ఎన్ని  నష్టాలు  ఉంటాయో   పెద్దలు  మనకు  తెలియజేసారు.    అనిపించింది.   పురాణేతిహాసాలను  పరిశీలిస్తే,  ఎంత  గొప్ప వాళ్ళైనా  సరే  తప్పులను  చేస్తే,  వాటికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించే  ప్రమాదం  ఉందనీ,  న్యాయానికి  తర..తమ,  పేద..గొప్ప  వంటి  తేడాలు  లేవనీ  మనము  తెలుసుకోవచ్చు.
..........................ధృతరాష్ట్రునికి    పాచికలాటకు  పాండవులను  పిలవటం  అంతగా  ఇష్టం  లేకపోయినా,  పుత్రప్రేమను  అణచుకోలేక  ఒప్పుకున్నాడు. అందుకు  తగ్గ  మూల్యాన్ని  చెల్లించారు.

ధర్మరాజుకు  పాచికలాట  ఆడటం  ఇష్టం  లేదు. అయితే,  పెదతండ్రి  అయిన  ధృతరాష్ట్రుని  ఆహ్వానం  మేరకు  ,  ఆయన  ఆహ్వానాన్ని  తిరస్కరించకూడదని వచ్చి,  పాచికలాట  ఆడటం  జరిగింది.

 ఈ  విషయాలు  ఈ  లింక్  ద్వారా  చదువవచ్చు..... మహా భారతము

(తెలుగు )

Mahabharata - Wikipedia, the free encyclopedia

దయచేసి  ఈ లింక్   కూడా  చదవగలరు.. 

ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...

 

 

Tuesday, June 24, 2014

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ..శిరిడి సాయిబాబా..

శిరిడి  సాయిబాబాను    గురించి  అనేక  వాదములను  వినిపిస్తున్నారు.

శ్రీ పాద శ్రీ వల్లభ  సంపూర్ణ చరితామృతము  ..అనే  గ్రంధములో ( 45 వ అధ్యాయము లో ..)  శిరిడి  సాయిని  గురించిన  వివరములు  వివరంగా   ఉన్నాయి.  తెలుసుకోదలచిన  వారు  ఈ  గ్రంధము  ద్వారా  తెలుసుకోవచ్చును.

ఈ  గ్రంధమునకు  కాపీరైట్స్  ఉన్నవి.  అందువల్ల  ఇప్పుడు  అందులోని  విషయములను  వ్రాయటానికి  కుదరకపోవచ్చు.  ఈ  గ్రంధము  పిఠాపురములో   కూడా  లభిస్తుంది.

...........................


 ఇంతకు  ముందు  వ్రాసిన  టపాను  తిరిగి  ప్రచురిస్తున్నాను.. 


గతజన్మ పాపఫలితములనుండి భక్తులను కాపాడిన సంఘటనలు .....


తెండూల్కర్ కుటుంబము.

బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరు బాబా యందు భక్తి కలిగియుండిరి.


సావిత్రీబాయి తెండూల్కర్ , "శ్రీ సాయి భజనమాల " యను మరాఠీ గ్రంధమును 800 అభంగములు , పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నియు వర్ణించబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను.


వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను.కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి.ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి శిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను.ఇది విని బాబా యామె కిట్లనెను. " నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులొక ప్రక్కకు ద్రోసి , తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉతీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము. "
తల్లి యింటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను గానీ, సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన నిష్టపడలేదు.కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాతపరీక్షలో ఉతీర్ణుడాయెననియు, నోటిపరీక్షకు రావలెననియు ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనము విని యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను.
గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడాయెను.సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును : మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.
........................................భీమాజీ పాటీలు

పూనాజిల్లా, జున్నరు తాలూకా నారాయణ గ్రాం గ్రామమందు భీమాజీ పాటీలు 1909 వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన చాతీ జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్నిరకముల ఔషధములను వాడెను గానీ ప్రయోజనము లేకుండెను.


నిరాశ చెంది " ఓ భగవంతుడా ! నారాయణా ! నాకిప్పుడు సహాయము చేయుము. " అని ప్రార్ధించెను. మన పరిస్థితులు బాగుండువరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనలను ఆవరించునపుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజి కూడ భగవంతుని స్మరించెను.


ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా చేయవలెననుకొనెను. కావున వానికి తన జబ్బు యొక్క వివరములన్నియు తెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయమడిగెను.బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాచందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి శిరిడీ పోవుటకేర్పాటు లన్నియు చేసెను. అతనిని శిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు బెట్టిరి. నానాసాహెబు శ్యామ గూడ నచ్చట ఉండిరి.ఆ జబ్బు వాని గత జన్మలోని పాప కర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను. కానీ రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షములకై వేడుకొనెను." ఆగుము , నీ యాతురతను పారద్రోలుము.; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడయితే మసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరినీ ప్రేమతోను దయతోనూ , కాపాడెదరు.'"ప్రతి యయిదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొకసారియైనను రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను.వానిని భీమాభాయి యింటిలో బసచేయుమని బాబా జెప్పెను. అది సదుపాయమైనదిగాని, యారోగ్యమైనది గాని కాదు. కాని బాబా యాజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునప్పుడు బాబా రెండు స్వప్నములలో వాని రోగము కుదిర్చెను.మొదటి స్వప్నములో వాడొక పాఠశాలా విద్యార్ధిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టుచున్నట్లు కనిపించెను.రెండవ స్వప్నములో వాని చాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాల బాధ కలుగుచున్నట్లు జూచెను.స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడప్పుడు శిరిడీ వచ్చుచుండెను.బాబా వానికి జేసిన మేలును జ్ఞప్తి యందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను.


బాబా తన భక్తుల నుండి యేమియు కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమన , భక్తులు పొందే మేలును జ్ఞప్తి యందుంచుకొనుటయు, మార్పు లేని గట్టి నమ్మకమును, భక్తియును.మహారాష్ట్ర దేశములో నెలకొకసారిగాని. పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట యలవాటు. కానీ భీమాజీ పాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను..

..........................

గతజన్మ పాపఫలితములనుండి భక్తులను కాపాడిన సంఘటనలు "శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణచరితామృతము " గ్రంధము మరియు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములలో కూడా ఉన్నవి.

**********************

Tuesday, May 4, 2010


ఈశ్వరుడు , , లోని " ఈశా " అన్న అక్షరములను తిరగవేస్తేశాఈ (సాయి)...............

కొంచెం సేపు క్రితం t.v లో సాయిబాబా గురించిన ప్రోగ్రాం చూశారా అండీ?గుంటూరు నుంచి ఒక ఆయన సాయి హిందూ దేవుడు కాదని,సాయి అన్న పేరు హిందు లో లేదని అంటున్నారు. ఇంకా సాయిబాబా ను హిందువులు పూజించ రాదని అన్నారు.


ఈశ్వరుడు అన్న పదములోని " ఈశా " అన్న అక్షరములు తిరగవేసి చదివితే " " 'శాఈ " ( సాయి ) అని వస్తుంది.రామాయణములో వాల్మీకి మహర్షి, మహర్షి అవ్వకముందు రామనామమును మరా,మరా.... అని పలికినట్లు.....

..సాయి మాంసము అవి తినేవారు అంటున్నారు. హిందు మతములో కూడా కొందరు దేవతలకు మాంసమును నైవేద్యముగా ఉంచుతారు. అల్లా పేరు పలుకుతారు అంటే ఆయన శ్రీరామనవమి పూజ కూడా చేయించేవారు.

హిందు,ముస్లింస్ సఖ్యత కోసం సాయి క్రుషి చేశారు. దుని కూడా వెలిగించేవారు.ఊదీ అందులోనుండే వస్తుంది కదా.....


అమర్ నాధ్ గుహ పూర్వ కాలమునుండి ఉన్నదే అయినా , ఈ కాలములో కొత్తగా ఒక ముస్లిం వారే కనుక్కున్నారు. నాకు ఏమని అనిపించిందంటే ఆ దేవుడే అన్ని మతముల వారు కలిసి ఉండాలని ఈ విధముగా సందేశము ఇచ్చారేమోనని.

అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేవారు కూడా స్వామి స్నేహితుడుగా చెప్పబడే వావర్ అనే ముస్లిం ఆయన గుడికితప్పక వెళ్తారని అంటారు.


క్రీస్తు,క్రిష్ణుడు అనే పదములకు కూడా పోలిక కనిపిస్తుంది నాకు. ఇక ముస్లింస్ తో గొడవలంటే మనలో మనము మాత్రము బాగా విరగబడి కలిసిఉంటున్నామా....

అమర్నాధ్ గుహ దగ్గర ముస్లింస్ పూజా సామాగ్రి అమ్ముతారు. అక్కడ చాలా మతసామరస్యముగా బాగుంది. ఇవి అన్ని నేను పాత పోస్ట్ లో వ్రాశాను అండి.నేను ఇలా వ్రాస్తున్నందుకు చాలా మందికి కోపం వస్తుందేమో. వస్తుంది లెండి. అయితే మనము మతమేమీ మారటము లేదు కదా ......... .....మాకు సాయి అంటే నమ్మకము.

దేవుని ఏరూపములో అయినా పూజించవచ్చు. అన్ని మతముల వారు కలిసి గొడవలు లేకుండా ఉండాలి. .. .. వేరే దారి కూడా లేదు... 

********************

మరికొన్ని  విషయములను  చేర్చుతున్నానండి..

శ్రీ  విష్ణుచిత్తుల  వారి  కుమార్తె  అయిన  గోదాదేవికి  శ్రీ  రంగనాధునితో  పరిణయం  జరిగింది.  గోదాదేవి  చరిత్రలో  చెప్పబడిన  శ్రీ  విల్లిపుత్తూరులో  శ్రీ వటపత్ర శాయి  ఆలయం  ఉన్నది.  వటపత్ర శాయి,  శేష
శాయి..నామములలో  కూడా  శాయి  అని  ఉన్నది  కదా  !Friday, June 20, 2014

మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవటం చేతకాని చవటలం కాదు మనం ...


  కొన్ని  దేశాలు    నాగరికతకు  దూరంగా  ఉన్న  సమయంలోనే  ఈ  దేశంలో  అద్భుతమైన  నాగరికత    వెల్లివిరిసింది.

   ఈ  దేశాన్ని  అభిమానించే  ప్రజలు ,  ఈ  దేశ   ప్రాచీన  సంస్కృతిని  ప్రేమించే  ప్రజలు,  మన  పూర్వీకులు  అపారమైన  మేధస్సు  కలవారనే  నిజాన్ని  గ్రహించి  గొప్పగా  చెప్పుకునే    ప్రజలు,  ప్రాచీన  గ్రంధాలలోని  విజ్ఞానాన్ని  గ్రహించే   ప్రజలు ,   పుణ్యభూమి  నా  దేశం  ... అని మనస్సు  ఉప్పెంగేలా  చెప్పుకునే  ప్రజలు   ఈ  దేశానికి  కావాలిప్పుడు.  అప్పుడే  దేశం  మళ్ళీ  పూర్వ  వైభవాన్ని  పొందుతుంది.


...................................

 భారతదేశ  ప్రజలు  కూడా  ఒక  విషయాన్ని  గుర్తుంచుకోవాలి.  ప్రతిదానికి  మాది  పేదదేశం ... మాకు  సాయం  చేయండి  ........అంటూ  విదేశాల  వాళ్ళను కానీ,  ప్రపంచ  బేంకును  కానీ  దేబిరించుకోవటం  మానుకోవాలి.

మన  దేశాన్ని   అభివృద్ధి  చేసుకోవటం  చేతకాని  చవటలం  కాదు  కదా  మనం  ? 

...................... 

 ఈ  దేశానికి  కావలసినది  నీతిమంతులు,  కష్టపడి  పనిచేసే  ప్రజలు. 
............................. 


  దేశంలో  సంపదకు  కొదువ లేదు.   అయితే  కొందరు   ద్రోహులు  ప్రజల  సొమ్మును  దిగమింగి     దాచుకుంటున్నారు.  అందువల్లే  దేశంలో  పేదరికం  అలాగే  ఉంది.
................................


ప్రజలు ఎన్నో  సమస్యలను  ఏకరువు  పెడుతున్నారు. మాకు  నీళ్ళు  లేవు.  సరుకులు  లేవు.  మురుగు  నీరు  పోదు....... ఇలా  ఒకటా  రెండా..అనేక  సమస్యలు.  


నిజమే  ఎటు  చూసినా  సమస్యలే.  మరి  ఇవన్నీ  పరిష్కరించాలంటే  ఎవరు  చేస్తారు  ?   అంటే   ప్రభుత్వం చేయాలి  అంటారు.

 ప్రభుత్వం  అంటే  అదేమీ  మంత్రదండం  కాదు. ప్రజాస్వామ్యంలో  ప్రభుత్వం   కూడా  ప్రజలే  కదా !  


పాలకులు,  అధికారులు,  సాధారణ  ప్రజలు..అందరూ  కలిసి  ఎవరి  పనిని  వారు  సవ్యంగా  చేస్తేనే  సమాజం  సజావుగా  సాగుతుంది.
....................................

 పాలకుల్లోనూ  మంచి  ఆశయాలు  కలవారుంటారు.  అధికారుల్లోనూ 
మంచి  ఆశయాలు  కలవారుంటారు. ప్రజలలోనూ    మంచి  ఆశయాలు  కలవారుంటారు.  

 అందరూ  కూడా   ఆడంబరాలను,  అత్యాశలను  కొంచెం  తగ్గించుకుని    తలోచెయ్యి  వేస్తేనే  సమాజం  బాగుపడుతుంది.
.......................................

ఈ  నీతులు   అందరికీ  తెలిసినవే .  


 మనం,  మనదేశం,  మన  బ్రతుకులు  బాగుపడి  ప్రపంచంలో  గర్వంగా  తలెత్తుకుని  నిలబడాలంటే,  మనకు  తెలిసిన  నీతులను  సాధ్యమైనంతవరకు  ఆచరించాలి. అప్పుడే  సమాజంలో సుఖమూ,  శాంతీ   వెల్లివిరుస్తాయి. 

Thursday, June 19, 2014

దేశం తప్పక అభివృద్ధిలోకి వస్తుందనటంలో.............

మనదేశం  ఇప్పుడు  పేదదేశం  అని  అంటున్నారు. డబ్బుతో  లెక్కలు  వేస్తే  మనది  పేదదేశం  అనిపిస్తుందేమో  కానీ , సహజసంపదలు  ఎన్నో  ఉన్నదేశం  పేదదేశం  ఎలా  అవుతుంది  ?


 దేశంలో  ఎందరో మేధావులు  ఉన్నారు.  అయినా  దేశం  ఇలా  సమస్యలు  ఉన్నాయంటే  ఎంతో  సిగ్గుపడవలసిన  విషయం.

మనలో  మనకు  ఐకమత్యం  తక్కువ.  మన  ప్రాచీన  సంస్కృతిని  మనం  కించపరిచినంతగా  ఏ  దేశం వాళ్ళూ   తమ  ప్రాచీన సంస్కృతిని  కించపరచటం  జరగదేమో..మనదేశంలో  వినోదం  కూడా  ఎక్కువయ్యింది.  ప్రజలు  వినోదంలో  మునిగితేలుతున్నారు.  సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం, సెల్ ఫోన్స్   ...అంతటా  వినోదమే.ఇంట్లో  టీవీ  చానల్స్,  బయటకెళ్తే ..  బస్టాండ్,  రైల్వే స్టేషన్, బస్సులో వీడియో  ... ఇలా  చాలా  చోట్ల   వినోదకార్యక్రమాలు  ఉంటాయి .  ఇక  జనం  వాటికేసి  కళ్ళప్పగించి  చూస్తుంటారు.చిన్నపిల్లల్ని  సినిమా  పరిజ్ఞానం ,
సినిమా పాటల   పరిజ్ఞానం  గురించి   నేర్పిస్తూ, పోటీలు  పెడుతూ  తల్లితండ్రులు  తెగ హైరానా  పడుతుంటారు.


ఇప్పుడు  ఈ  దేశం  అభివృద్ధి  చెందాలంటే  ప్రధాని,  ముఖ్యమంత్రులు  మాత్రమే  బాగా  పనిచేస్తే  చాలదు. ప్రతి  ఒక్కరూ  కష్టపడి  పనిచేయాలి.  అందరూ  పూనుకుని  కష్టపడితే  దేశం  ఎందుకు  అభివృద్ధి  చెందదు  ? మన  ప్రాచీన గ్రంధాలను  అదేపనిగా  చదవటం  మాత్రమే  కాదు  వాటినుంచి  మనం  ఎన్నో  నేర్చుకోవాలి. 


 ఉదా..హనుమంతుడు  సీతమ్మను  వెదకటానికి  వెళ్ళే  సమయంలో ... తన  దైవమైన  రాముని  యందు   భారం  వేసి,   లక్ష్యం  పట్ల  ఎంతో  ఏకాగ్రతగా   , పట్టుదలగా    కార్యాన్ని  సాధిస్తారు. వెళ్ళే  దారిలో  మైనాకుని  ఆతిధ్యాన్ని  స్వీకరించటానికి  కూడా   సమయాన్ని  వృధా  చేయలేదు.    


హనుమంతునికున్నంత    పట్టుదల  మనకు  లేకపోయినా    మనమూ  దైవం   యందు   భారం  వేసి,  మనకు  చేతనైనంతలో    పనిచేస్తే  దేశం  తప్పక  అభివృద్ధిలోకి  వస్తుందనటంలో  ఎటువంటి   సందేహమూ  లేదు. జపాన్  చూడండి  రెండవ  ప్రపంచయుద్ధంలో  ఎంతో  నష్టపోయినా  కూడా  త్వరగానే  కోలుకుంది.  అక్కడ  వాళ్ళు  మనలా  ఎప్పుడూ  వినోదమాధ్యమాన్ని   అంటిపెట్టుకుని  కూర్చోరు  అనుకుంటా.మనదేశంలో   చిన్న,  పెద్ద  అందరికీ  క్రికెట్  లేక  సినిమాలపై  ఉన్న  ఆసక్తి  సమాజంలోని  సమస్యల  పరిష్కారం  గురించి  ఆలోచించటంలో  ఉండదు.  ఇలాంటివి  మాట్లాడాలంటే  బొర్  ఫీలవుతారు.  వినోదం  అవసరమే.  అయితే  రోజూ  టీవీలు  చూసినా  పరీక్షల  సమయంలోనైనా   టీవీ  చూడటం  తగ్గిస్తాము  కదా  ! పరీక్షలు  జరిగేటప్పుడు  చదివీచదివీ   రిలాక్స్  అవటానికి  కొంతసేపు  వినోదకార్యక్రమాలను  చూస్తాము.  అంతేకానీ,  రోజూ  చూసినంతసేపు  చూడము  కదా  !

 ఇప్పుడు మనదేశానికీ  పరీక్షా  సమయమే.


  ఈ  దేశానికి  అపారమైన  సహజవనరులున్నాయి.   ఖనిజవనరులను  ఖాళీ  చేయకుండా  పొదుపుగా  వాడుకోవాలి.

చాలాదేశాలకు  లేని    అపారమైన  సూర్యరశ్మి  మనకు   ఉంది.  మనకు  లేనిదల్లా  ఒక్కటే. మనమీద  మనకు  ఆత్మవిశ్వాసం. 


 
కొన్ని  సంవత్సరాలు  మనలో  మనం  కొట్లాడుకోవటం  మాని  ,  వినోదాన్ని  కొంత  తగ్గించుకుని ,  మన  కుటుంబం  కోసం  కొంత  దాచుకుని ,  సమాజ  అభివృద్ధి  కోసం  కూడా  కష్టపడితే  మన  దేశం  బంగారు భారతదేశమై  సగర్వంగా  తిరిగి  పూర్వవైభవాన్ని  సంతరించుకుంటుంది.   అందరికి  ఆహారం, ఆరోగ్యం, విద్య, రక్షణ..ఇలా  అభివృద్ధి  చేసుకోగల  సత్తా  మనకుంది.


Tuesday, June 17, 2014

మా బామ్మగారు..


మా  అమ్మగారు  ప్రభుత్వబాలికల  పాఠశాలలో  ఉద్యోగం  చేసేవారు. ( చాలాకాలం  ఉద్యోగం  చేసిన  తరువాత  వాలంటరీ  రిటైర్మెంట్  తీసుకున్నారు.  )

ఉద్యోగం  చేసే  స్త్రీలకు  పిల్లల్ని  పెంచటం  విషయంలో  ఇబ్బందులు  ఉంటాయి  కదా  !

మా  పేరెంట్స్  నన్ను  చూసుకోవటానికి  ఒక  అమ్మాయిని  పనిలో  కుదుర్చుకున్నారట.  అయితే  ఆ  అమ్మాయికి   సరిగ్గా  చూడటం  చేతయ్యేదికాదట. 

ఈ  బాధలన్నీ  ఎందుకని  మా  అమ్మగారి  తరపు  బంధువయిన  ఒక  బామ్మగారు  మా  ఊరు  వచ్చేసారు. వేరే  ఇల్లు  తీసుకుని  ఉండేవారు. మా  అమ్మగారు  ఉదయం  స్కూలుకు  వెళ్ళేటప్పుడు   పిల్లల్ని  బామ్మగారి  ఇంటివద్ద  వదలటం  సాయంత్రం  మళ్ళీ  ఇంటికి  తీసుకురావటం  జరిగేది.

మా  బామ్మగారికి  పిల్లలు  లేరు. అయితేనేం  మమ్మల్నీ  మా  బంధువుల  పిల్లల్నీ  తన   సొంత పిల్లలుగా  చూసుకున్నారు.మేము , మా  బంధువుల  పిల్లలం   పెద్దయిన  తరువాత  కూడా  బామ్మగారింటికి  తరచూ  వెళ్ళేవాళ్ళం.  కాలేజీకి  సెలవిస్తే  బామ్మగారింటికి  వెళ్ళేవాళ్ళం. మా  బామ్మగారు  జోక్స్  వేసేవారు.  పిల్లలం  పొట్ట  నొప్పి  పుట్టేంతగా  నవ్వే  వాళ్ళం. అయితే,  కొన్ని  విషయాలలో  స్టిక్ట్ గా  కూడా  ఉండేవారు. ఆమె  వంట  చాలా  బాగా  చేసేది.ఆమె  ఎన్నో  నియమాలను  పాటించేవారు.  ఆమె  ఒక  దగ్గర  దీక్ష   తీసుకున్నారని   బంధువుల  ద్వారా  విన్నాను.మా  బామ్మ  వల్ల  మేము  క్రెచ్  ల  లోనో  లేక  పనివాళ్ళ  వద్దో  కాకుండా  ఇంటివద్దే  పెరిగాము.    ఆమె  సుమారు  80 సంవత్సరాల  వరకూ  జీవించారు.


  మా  తాతగారునాయనమ్మగారు ,   మా  తాతగారుఅమ్మమ్మగారు వాళ్ళు  పల్లెటూరిలో  ఉండేవారు.   వాళ్ళు  మా ఊరు  వచ్చినప్పుడు  ఊరి నుంచి  ఎన్నో  తినుబండారాలను  తెచ్చేవారు.  మేము  వేసవి  సెలవులకు  వాళ్ళ  ఊళ్ళు  వెళ్ళేవాళ్ళం. ఎంతో  సరదాగా  ఉండేది.

వాళ్ళ  దగ్గరికి   వెళ్ళటానికి  సెలవులు  ఎప్పుడిస్తారా  అని  సంవత్సరమంతా  ఎదురుచూసేవాళ్ళం.  మా  అమ్మమ్మగారి  ఊరు  వెళ్ళేటప్పుడు  మా  బామ్మగారు (మా  తాతగారికి  అక్క (  మా  అమ్మకు  మేనత్త ) ) కూడా  వచ్చేవారు.Tuesday, June 10, 2014

సంతాన ఫల మంత్రం...మరి కొన్ని విషయములు.

ఈ  సంతాన  ఫల మంత్రం  ఎంతో  మహిమ  కలది. 

మా  బంధువులలో   ఒక  జంటకు  వివాహం  జరిగిన  చాలా  సంవత్సరాల  వరకూ  సంతానం  కలుగలేదు.  సంతానం  లేదని ఎంతో  బాధపడేవారు.  వాళ్ళు    ఎంతో  డబ్బు  ఖర్చుపెట్టి  వైద్య  సలహాలను  పాటించారు.
ఒకసారి   సంతానఫలమంత్రాన్ని  వాళ్ళకు  పంపించాను.  తరువాత  వాళ్ళకు  బాబు పుట్టాడు.  వాళ్ళు  ఎంతో సంతోషంగా  ఆ  విషయాన్ని  నాకు   తెలియజేశారు.  ఆమె  సంతానఫలమంత్రాన్ని  చదువుకుందట. ఆ  విషయాన్ని  నాకు  తెలియజేసింది.
ఇందులో  నేను  చేసింది  తక్కువ.  వాళ్ళు  చేసుకున్న  పూజలు పుణ్యాల  వల్ల  సంతానఫలమంత్రం  వారికి  అందటం  జరిగి   దైవానుగ్రహం  వల్ల   సంతానాన్ని  పొందారు. మా  బంధువులలో  ఇంకొక  ఆమెకు  కూడా  ఈ  సంతాన  ఫల మంత్రం  చదువుకున్న  తరువాత  అంతకుముందు   ఉన్న  ఇబ్బంది  తొలగి  సంతానం  కలిగింది.   అంతా  దైవం  దయ. ఇవన్నీ   నాకు  ఎంతో  సంతోషాన్ని  కలిగించాయి .  అంతా  దైవం  దయ. 
..............

ఇంకొక  విషయం .. నిన్ననే  వ్రాయాలనుకుని  మర్చిపోయి  ఇప్పుడు  వ్రాస్తున్నానండి.

  ఈ  సంతానఫలమంత్రాన్ని  ఇంతకు  ముందే  రెండు సార్లు  బ్లాగులో  వేసాను.

 అయితే,   అప్పుడు   విషహారేతి చ.....  అన్న  దగ్గర  విహహారేతి చ ......... అని  వేయటం  జరిగింది.  ఇలా     ఎలా  జరిగిందో  ?  నాకు  తెలియదు. 


( చిత్రమేమిటంటే ,  ఎంత  జాగ్రత్తగా  ఉన్నా  కొన్నిసార్లు  పొరపాట్లు  జరుగుతుంటాయి.)

ఈ  మంత్రాన్ని  మళ్లీ  వేయాలనిపించి  చూస్తే  జరిగిన  పొరపాటు  కనిపించింది .
  పొరపాటును   సరిదిద్దాను.
Monday, June 9, 2014

సంతాన ఫల మంత్రం..


సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,


జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ .

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ..

జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ .

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ..

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ .

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ.

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు వంటివి  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.Tuesday, June 3, 2014

ఆయుర్వేదం ఎంతో గొప్పది.


కొన్ని  సంవత్సరాల  క్రితం  మా  నాన్నగారు  ఇల్లు  కట్టించే  సమయంలో  పై  నుంచి  క్రింద  పడ్డారు.   ఎత్తు  నుంచి   క్రింద  పాతి  ఉన్న  ఇనుపచువ్వల  పైన  పడటం  వల్ల    ప్రక్కటెముకలు  కొన్ని  దెబ్బతిన్నాయట.  
 ఆయుర్వేద  వైద్యుని  సంప్రదించగా  కొన్ని  మందులు  ఇచ్చారట.  విరిగాయనుకున్న  ఎముకలు   కొన్ని  రోజులలో    అతుక్కున్నాయట. (  అందరినీ    శ్రమపెట్టడం  ఎందుకని , జరిగిన   విషయాలను  మాకు  ఎవరికీ  వెంటనే    చెప్పకుండా  కొన్ని  రోజుల  తరువాత  తెలియజేసారు.    )పెద్దపెద్ద  కట్లు, బోలెడు  డబ్బు  ఖర్చు  లేకుండానే    ఆశ్చర్యకరంగా  ఆయుర్వేద  మందులతో  అంత  పెద్ద  దెబ్బలు   తగ్గిపోయాయి.ఆయుర్వేదం   ఎంతో  గొప్పది.   పూర్వకాలంలో   సుశ్రుతుడు  వంటి   ఆయుర్వేదవైద్యులు  శస్త్రచికిత్సలు  కూడా  చేసేవారట.  


ఉదా..యుద్ధాలలో  గాయపడ్డ  సైనికులకు  శస్త్రచికిత్సలు  చేయటం  వంటివి.


పూర్వకాలంలో   ఇప్పటిలా  రోగాన్ని  కనుగొనటానికి  స్కానింగులు  వంటివి  లేకపోయినా ,  రోగి  యొక్క  ముఖాన్ని  పరిశీలించి  లేక  రోగలక్షణాలను    బట్టి   చక్కగా  రోగనిర్ధారణ  చేసే  గొప్ప  వైద్యులు  ఉండేవారట. మన  దురదృష్టం  వల్ల  ఆయుర్వేదాన్ని  ఎంతో  నిర్లక్ష్యం  చేశాం.  ఇప్పుడిప్పుడే  మళ్ళీ   ఆయుర్వేదం,  యోగా  వంటి   వాటిపట్ల    ఆసక్తి  పెరుగుతోంది.  ఇది  మంచి  పరిణామం.Monday, June 2, 2014

పెద్దవాళ్ళు చేసిన పుణ్యఫలం పిల్లలకు కూడా వస్తుందంటారు.

మా  తల్లితండ్రికి   చేతనైనంతలో   ఇతరులకు  సహాయం  చేయాలనే  తపన  ఎక్కువ.

తోటివాళ్ళు  బాధపడుతుంటే  ..  మనకు  చేతనైనంతలో  సాయం  చేయాలి .  అంటారు. 

మా  చిన్నతనంలో    మా  ఇంటికి  బంధువులు,  పరిచయస్తులు  ఎక్కువగా  వస్తుండేవారు.

(   అందులో  కొందరు ,   కష్టాలలో  ఉన్నామని  చెప్పి    ధన  సహాయాన్ని  పొంది , తీసుకున్న  డబ్బును    మళ్ళీ  తిరిగి   ఇచ్చేవారు  కాదు. మరి  కొందరయితే   మాట  సాయాన్ని  పొందిన తరువాత,    వాళ్ళు  చేసిందేముంది..అని  తేలికగా  మాట్లాడేవారు. )  మా  అమ్మగారికి  పనివత్తిడి  ఎక్కువగా  ఉండేది.   వచ్చిన  వాళ్ళకు  ఫలహారాలు,  భోజనాలు  వండి  పెట్టి  స్కూలుకు   ఉద్యోగానికి   వెళ్ళేవారు.   మా  నాన్నగారి  బంధువులు,   మా  అమ్మ గారి   బంధువులు  అనే  తేడా  లేకుండా  ఇరుప్రక్కల  వారికి    మా  పేరెంట్స్  ఎంతో  సహాయం  చేసారు.  తోటి వారికి  సహాయం  చేస్తే  దైవం  మనకు  సహాయం  చేస్తారని  మా  పేరెంట్స్   అభిప్రాయం.   పెద్దవాళ్ళు  చేసిన  పుణ్యఫలం  పిల్లలకు  కూడా   వస్తుందంటారు.    ఈ  రోజు  మేము  మంచిగా   జీవిస్తున్నామంటే  దాని  వెనుక    మా  పేరెంట్స్  చేసిన  పుణ్యకార్యాల  ఫలితం  ఎంతో  ఉన్నది.
Sunday, June 1, 2014

కాలకృత్యాలను ఆపుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు....

ఇంతకు  ముందు  టపాలో  కొన్ని  విషయాలను  వ్రాసాను.  కొనసాగింపుగా  ఈ  విషయాలను  వ్రాస్తున్నాను. 


 మా  పేరెంట్స్  వేరే  రాష్ట్రంలో  ఉంటున్నారు.    బంధువుల  ఇళ్ళలో    ఫన్క్షన్లు ,  ఇంకా  కొన్ని      కారణాల  వల్ల     అక్కడకు  
ఇక్కడకు  తరచూ   ప్రయాణాలు  చేస్తూ  ఉంటారు.   మన  రైళ్ళలో   టాయిలెట్స్  విపరీతమైన  గబ్బు  కొడుతుంటాయి  కదా  !  అందువల్ల,   ట్రైన్  ఎక్కితే  ఇక  దిగే  వరకూ  కొన్ని  గంటలు   అయినా  సరే,   బాత్రూం  కు  వెళ్ళటానికి  మా  అమ్మగారు  అంతగా  ఇష్టపడరు. 
 బస్సు  ఎక్కితే  మరీ   ఇబ్బంది.   బస్సు   మనకు  అవసరమైనప్పుడల్లా   ఆపరు  కదా  ! బస్టాండ్లలో  టాయిలెట్స్   కూడా  అశుభ్రంగానే  ఉంటాయి.

....................................

మా  నాన్నగారు    ప్రభుత్వ  ఉన్నత  పాఠశాలలో  ఉపాధ్యాయునిగా  చేసి  రిటైర్  అయ్యారు.

 మా  అమ్మగారు    గర్ల్స్  హైస్కూల్   టీచర్ గా  చేసి  వాలంటరీ  రిటైర్మెంట్  తీసుకున్నారు. ( బాలికల  ప్రభుత్వ  పాఠశాలలో   పిల్లలకు   ఆటలు , వ్యాయామం ,  డ్రిల్ ... నేర్పించేవారు. ) మా  అమ్మగారు   ఉద్యోగం  చేసే  రోజుల్లో  ,  ఉదయం  స్కూల్ కు  వెళితే  తిరిగి  సాయంత్రం  ఇంటికి  వచ్చేవరకూ  టాయిలెట్  వెళ్ళేవారు  కాదట. 

 ఇదంతా  ఎందుకు  వ్రాశానంటే  ,  ఇలా  కాలకృత్యాలను  ఆపుకోవటం  వల్ల  కూడా  కిడ్నీలు  పాడయ్యే  అవకాశాలు  ఉన్నాయట. 

...........................................ఇంతకు  ముందు  మాకు  కిడ్నీ  జబ్బు  గురించి    ఏమీ  తెలియదు. అక్కడ  హాస్పిటల్స్ లో  చూస్తే  చాలా  మంది  ఈ  వ్యాధితో  బాధపడేవాళ్ళున్నారు.  


చిన్నవయస్సు  వారికి  కూడా  ఈ  వ్యాధి  వస్తుందట.
.......................


 ఈ  రోజుల్లో  స్కూళ్ళలో  పిల్లల్ని  టాయిలెట్ కు  కూడా  పంపకుండా    వరసగా   గంటల  తరబడి  చదువు    చెబుతున్న  టీచర్లు  ఉన్నారు.   అర్జంటుగా  టాయిలెట్ కు  వెళ్ళాలి  పర్మిషన్  ఇవ్వండి  టీచర్  ...ప్లీజ్  !  అని   పిల్లలు  ప్రాధేయపడినా  పర్మిషన్  ఇవ్వకుండా ...టాయిలెట్కు   తరువాత  వెళ్దువు .. కూర్చుని  పాఠం  విను ... అనే  టీచర్లూ  ఉంటారు.

ఇలాంటి   టీచర్లు  ఏమంటారంటే,  కొందరు  పిల్లలు   క్లాస్  నుంచి  బయటకు  వెళ్ళటం  కోసం  టాయిలెట్  అని  అడుగుతారు.  అంటారు.  అయితే    అందరు  పిల్లలూ    అలా  ఉండరు  కదా  !నిజంగా  టాయిలెట్  వెళ్ళవలసిన  పిల్లల్ని   అర్జంటుగా   పంపకపోతే  పిల్లలు  ఎలా  ఆపుకోగలరు  ?  ఆపుకోలేక  క్లాస్ రూములో    చేస్తే   మళ్ళీ  పిల్లల్నే  తిట్టేస్తారు. 

................................చాలా  కాలేజీల్లో  కూడా    సరైన  టాయిలెట్స్  ఉండక  ఎందరో  టీనేజ్  పిల్లలు  ఇబ్బందులను   అనుభవిస్తున్నారు.  ఇక  హాస్టల్స్  లో  ఉండే  పిల్లలకు  ఉదయం  టాయిలెట్స్  ఖాళీ  ఉండక   అలాగే  కాలేజీలకు  వచ్చేస్తుంటారట.

ఇందువల్ల  భవిష్యత్తులో  కిడ్నీ  ప్రాబ్లెంస్  వచ్చే  అవకాశముంది.

....................................మాకు  తెలిసిన  ఒకామె  బాంకులో  జాబ్  చేసేది.  ఆమెకు   కిడ్నీ   జబ్బు  బాగా  ముదిరే  వరకూ    తెలుసుకోలేకపోయారు.

 ఈ  రోజుల్లో  చాలామంది  ఉద్యోగినులు     ఆఫీసుల్లో  సరైన    టాయిలెట్   సదుపాయాలు  లేక  కాలకృత్యాలను  ఆపుకుని  జబ్బులు    తెచ్చుకుంటున్నారు.  ఇంట్లో  ఉండే  ఆడవాళ్ళు  కూడా  కొందరు  పూజలు  అంటూ  కాలకృత్యాలను  ఆపుకుంటారు.   కారణాలు  ఏమైనా ,   కాలకృత్యాలను  బలవంతంగా  ఆపుకోవటం  వల్ల  జబ్బులు  వచ్చే  అవకాశాలున్నాయంటున్నారు  .


..........................................

  కాలకృత్యాలను   ఆపుకోవటం   ఆరోగ్యానికి  మంచిది  కాదు  కాబట్టి ,  ఈ  విషయంలో  అందరూ  జాగ్రత్తలు   తీసుకోవాలి. 

.................................................

ఇంతకు  ముందు  టపా........
బాధాకరమైన సంఘటన ...తద్వారా మంచి జరగటము ...