koodali

Sunday, June 1, 2014

కాలకృత్యాలను ఆపుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు....

 
 
ఇంతకు  ముందు  టపాలో  కొన్ని  విషయాలను  వ్రాసాను.  కొనసాగింపుగా  ఈ  విషయాలను  వ్రాస్తున్నాను. 

 మా  పేరెంట్స్  వేరే  రాష్ట్రంలో  ఉంటున్నారు.    బంధువుల  ఇళ్ళలో    ఫన్క్షన్లు ,  ఇంకా  కొన్ని      కారణాల  వల్ల     అక్కడకు  
ఇక్కడకు  తరచూ   ప్రయాణాలు  చేస్తూ  ఉంటారు. 


  మన  రైళ్ళలో   టాయిలెట్స్  విపరీతమైన  గబ్బు  కొడుతుంటాయి  కదా  !  అందువల్ల,   ట్రైన్  ఎక్కితే  ఇక  దిగే  వరకూ  కొన్ని  గంటలు   అయినా  సరే,   బాత్రూం  కు  వెళ్ళటానికి  మా  అమ్మగారు  అంతగా  ఇష్టపడరు. 



 బస్సు  ఎక్కితే  మరీ   ఇబ్బంది.   బస్సు   మనకు  అవసరమైనప్పుడల్లా   ఆపరు  కదా  ! బస్టాండ్లలో  టాయిలెట్స్   కూడా  అశుభ్రంగానే  ఉంటాయి.

....................................

మా  నాన్నగారు    ప్రభుత్వ  ఉన్నత  పాఠశాలలో  ఉపాధ్యాయునిగా  చేసి  రిటైర్  అయ్యారు.

 మా  అమ్మగారు    గర్ల్స్  హైస్కూల్   టీచర్ గా  చేసి  వాలంటరీ  రిటైర్మెంట్  తీసుకున్నారు. ( బాలికల  ప్రభుత్వ  పాఠశాలలో   పిల్లలకు   ఆటలు , వ్యాయామం ,  డ్రిల్ ... నేర్పించేవారు. )


 మా  అమ్మగారు   ఉద్యోగం  చేసే  రోజుల్లో  ,  ఉదయం  స్కూల్ కు  వెళితే  తిరిగి  సాయంత్రం  ఇంటికి  వచ్చేవరకూ  టాయిలెట్  వెళ్ళేవారు  కాదట. 

 ఇదంతా  ఎందుకు  వ్రాశానంటే  ,  ఇలా  కాలకృత్యాలను  ఆపుకోవటం  వల్ల  కూడా  కిడ్నీలు  పాడయ్యే  అవకాశాలు  ఉన్నాయట. 

...........................................


ఇంతకు  ముందు  మాకు  కిడ్నీ  జబ్బు  గురించి    ఏమీ  తెలియదు. అక్కడ  హాస్పిటల్స్ లో  చూస్తే  చాలా  మంది  ఈ  వ్యాధితో  బాధపడేవాళ్ళున్నారు.  


చిన్నవయస్సు  వారికి  కూడా  ఈ  వ్యాధి  వస్తుందట.
.......................

 ఈ  రోజుల్లో  స్కూళ్ళలో  పిల్లల్ని  టాయిలెట్ కు  కూడా  పంపకుండా    వరసగా   గంటల  తరబడి  చదువు    చెబుతున్న  టీచర్లు  ఉన్నారు.  



 అర్జంటుగా  టాయిలెట్ కు  వెళ్ళాలి  పర్మిషన్  ఇవ్వండి  టీచర్  ...ప్లీజ్  !  అని   పిల్లలు  ప్రాధేయపడినా  పర్మిషన్  ఇవ్వకుండా ...


టాయిలెట్కు   తరువాత  వెళ్దువు .. కూర్చుని  పాఠం  విను ... అనే  టీచర్లూ  ఉంటారు.

ఇలాంటి   టీచర్లు  ఏమంటారంటే,  కొందరు  పిల్లలు   క్లాస్  నుంచి  బయటకు  వెళ్ళటం  కోసం  టాయిలెట్  అని  అడుగుతారు.  అంటారు.  అయితే    అందరు  పిల్లలూ    అలా  ఉండరు  కదా  !



నిజంగా  టాయిలెట్  వెళ్ళవలసిన  పిల్లల్ని   అర్జంటుగా   పంపకపోతే  పిల్లలు  ఎలా  ఆపుకోగలరు  ?  ఆపుకోలేక  క్లాస్ రూములో    చేస్తే   మళ్ళీ  పిల్లల్నే  తిట్టేస్తారు. 

................................


చాలా  కాలేజీల్లో  కూడా    సరైన  టాయిలెట్స్  ఉండక  ఎందరో  టీనేజ్  పిల్లలు  ఇబ్బందులను   అనుభవిస్తున్నారు. 


 ఇక  హాస్టల్స్  లో  ఉండే  పిల్లలకు  ఉదయం  టాయిలెట్స్  ఖాళీ  ఉండక   అలాగే  కాలేజీలకు  వచ్చేస్తుంటారట.

ఇందువల్ల  భవిష్యత్తులో  కిడ్నీ  ప్రాబ్లెంస్  వచ్చే  అవకాశముంది.

....................................


మాకు  తెలిసిన  ఒకామె  బాంకులో  జాబ్  చేసేది.  ఆమెకు   కిడ్నీ   జబ్బు  బాగా  ముదిరే  వరకూ    తెలుసుకోలేకపోయారు.

 ఈ  రోజుల్లో  చాలామంది  ఉద్యోగినులు     ఆఫీసుల్లో  సరైన    టాయిలెట్   సదుపాయాలు  లేక  కాలకృత్యాలను  ఆపుకుని  జబ్బులు    తెచ్చుకుంటున్నారు.  


ఇంట్లో  ఉండే  ఆడవాళ్ళు  కూడా  కొందరు  పూజలు  అంటూ  కాలకృత్యాలను  ఆపుకుంటారు.  


 కారణాలు  ఏమైనా ,   కాలకృత్యాలను  బలవంతంగా  ఆపుకోవటం  వల్ల  జబ్బులు  వచ్చే  అవకాశాలున్నాయంటున్నారు  .


..........................................

  కాలకృత్యాలను   ఆపుకోవటం   ఆరోగ్యానికి  మంచిది  కాదు  కాబట్టి ,  ఈ  విషయంలో  అందరూ  జాగ్రత్తలు   తీసుకోవాలి. 

.................................................

ఇంతకు  ముందు  టపా........
బాధాకరమైన సంఘటన ...తద్వారా మంచి జరగటము ...



No comments:

Post a Comment