koodali

Monday, February 27, 2017

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

Wednesday, January 29, 2014 

 ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? 

పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. 

ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  

ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు .

ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది. 

బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
.................. 
పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.
 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ 
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 

 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)

ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  క్రెచ్ లోనో  వదిలి  పరిగెడుతుంటారు.   ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 

  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  క్రచ్ లోనే  వదలాలి.  

..................
ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 

  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 

 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి.   ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .

కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు.

 ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు.  నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ? 
................. 

ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  

 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 

ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .

*******************
పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ? రెండవ భాగం.
ఈ రోజుల్లో  దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము.  పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  

ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 

 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.

( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )

అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది. 

ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.

కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు.   కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి.    పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.  

అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా.

ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.

చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 

 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.   ఇప్పుడు  సెల్ ఫోన్స్  లో  కూడా  అసభ్యకరమైన దృశ్యాలు   చూసే  వీలు  వచ్చేసింది. అనభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల   ప్రభావం  ఎంతో  ఉంటుంది. 

 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.

 పెద్దవాళ్ళయిన    ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల    రక్షణ   గురించి  కూడా  ఆలోచించండి.

.........................

విచిత్రం ఏమిటంటే  ఈ మధ్య  కొందరు  ఆడవారు  కూడా  మత్తు  పదార్ధాలను   తీసుకుంటున్నారు . ఈ  మధ్య  ఒక  అమ్మాయి  మత్తులో  రోడ్డుపై  పడి  గొడవ  చేసిన  విషయాన్నీ  మీడియాలో  చూసాము కదా ! ఇది  మరింత  ప్రమాదకరం .

Friday, February 24, 2017

ఓం ..

ఓం 

మహాశివరాత్రి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు.Tuesday, February 21, 2017

ఓం ..కొన్ని విషయములు..

 జీవితంలో మంచి జరగాలంటే చెడ్డపనులు చేయకుండా మంచిగా ప్రవర్తించటం అవసరం.  మంచిగా జీవించటానికి కనీసం ప్రయత్నించాలి.
****************
 అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో.......

* పురాణేతిహాసాలలోని   చరిత్రలను  తెలుసుకుంటుంటే,   దైవము మరియు   పెద్దలు  మన  కోసము   ఎంతగా   ఆలోచిస్తారో కదా  !  అనిపిస్తుంది. ప్రపంచములోని   ప్రతి ఒక్కరూ  మంచి   ప్రవర్తనను  కలిగి   దైవానికి   దగ్గరవ్వాలని (  మోక్షాన్ని  పొందాలని  ) వారి   అభిప్రాయం.

* ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు ఉంటారు  , ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో   ఒక్కో విధముగా    ప్రవర్తించవలసి ఉంటుంది.   అందుకే  ప్రాచీనులు  రకరకాల  కధలను  తెలియజేసారు.

* ప్రాచీన  గ్రంధాలలోని  కొన్ని   కధలలో  దైవ  నామాన్ని  స్మరించటం  వల్ల,   ఎన్నో   పాపాలు  చేసిన  వాళ్ళు  కూడా  నరకానికి  పోకుండా  స్వర్గానికి  వెళ్తారు.  అని  ఉంటుంది.  ఉదా..అజామిళుని  కధ. 

* అజామిళుడు   ఎన్నో  పాపాలు  చేసాడు.  అయితే,   మరణించే  ముందు ,  నారాయణా.....అని    కొడుకు  పేరును  పిలవటం  వల్ల  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడని  కధలో  ఉన్నది. * మరి  కొందరు వ్యక్తులు   ఎన్నో  పాపాలు  చేసినా , మరణానికి  ముందు   అనుకోకుండా  శివాలయంలో  దీపపు  వత్తిని  వెలిగించటం  వల్ల    నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళారని  కధలో  ఉన్నది.* (   ఇలాంటి  వాళ్ళు   చివరిలో  అనుకోకుండా  దైవనామస్మరణ  చెయ్యటానికి   కొన్ని  కారణాలు  ఉండవచ్చు.  ఉదా...బహుశా  వీళ్ళు   పూర్వజన్మలో   చేసిన  పుణ్యం  వల్లకానీ,  వీరి  తల్లితండ్రులు  చేసిన  పుణ్యం  వల్ల  కానీ  వీరికి  అనుకోకుండా  దైవస్మరణ  చేసే  అవకాశం  లభిస్తుందేమో అనిపిస్తుంది.  )

* ప్రాచీనులు ,  అజామిళుని  కధ   వంటి   కధలను   చెప్పటంలో  ఎన్నో  అర్ధాలున్నాయి.* ఎన్ని  పాపాలు  చేసిన  వారికైనా   మంచిగా   పరివర్తన   చెందటానికి  కొంత  అవకాశం  కలిగించాలని  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.  ఇలాంటి  ఆశ  లేకపోతే    పాపాత్ములు  నిరాశానిస్పృహలతో    మరింతగా  పాపాలు  చేసే  అవకాశం  కూడా  ఉంది.

* కొందరు  అనేక  చెడ్డపనులు  చేస్తూ  ఉంటారు.  అయినా  వారికి  మనస్సులో  ఒక  మూలన  కొంచెం  పాపభీతి  ఉండే  అవకాశం  ఉంది. వాళ్ళు  ఎన్నో పాపాలు చేసిన   తరువాత   తమ  తప్పు   తెలుసుకుని,   అయ్యో !  మనకు దైవ పూజ చేసి  ఉత్తమగతులు  పొందే   అర్హత ఉందో  ? లేదో  ?  అనుకుంటారు.

* ఇలాంటి  వాళ్ళకు    కూడా  దైవపరమైన  ఆశను  కలిగించి,   మంచిమార్గంలోకి  వచ్చే  విధంగా  చేస్తాయి  ఇలాంటి  కధలు.

* అజామిళుడి  వంటి  పాపాత్ముడే  నారాయణ  నామస్మరణం  చేత  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడనే  కధను  చదివిన  కొందరు  చెడ్డవాళ్ళకు  ............ తాము  కూడా  నారాయణ  నామ  స్మరణం  చేస్తే,   మరణించిన  తరువాత నరకానికి  బదులు స్వర్గానికి  వెళ్ళవచ్చు  కదా  !  అనే  ఆలోచన  మొదలవుతుంది. 

* ( ఎన్ని  తప్పులు  చేసిన  వాళ్లకయినా   నరకానికి  వెళ్ళటం  అంటే  ఇష్టం  ఉండదు  కదా ! )

* ఇలాంటి  వాళ్ళు  కూడా     దైవ  నామ  స్మరణాన్ని  ,  పూజలు  చేయటాన్ని  మొదలుపెట్టి ,   అలా   పూజలు  చేస్తూచేస్తూ....  ఉండటం   వల్ల  క్రమంగా  ఆ  పాపాత్ములలో  మార్పు  వచ్చి  మంచిగా  పరివర్తన  చెందుతారు.

* మందులు  మనకు  ఇష్టం  ఉండి  వేసుకున్నా,  ఇష్టం  లేక  మ్రింగినా   అనారోగ్యాన్ని  పోగొడతాయి  కదా  !  అలాగే  ఏ  కారణంతో  దైవనామస్మరణాన్ని  మొదలుపెట్టినా   ఫలితం  లభిస్తుంది. 

అయితే,  దైవనామ  స్మరణం  చేసే  వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు ,  నీతినిజాయితీలను  బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి.  కొందరికి  ఒక  జన్మలో  మంచి  మార్పు  కనిపిస్తే,   మరి  కొందరిలో  కొన్ని  జన్మలు  పట్టవచ్చు. *  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   కొందరికి   రోగం  త్వరగా  తగ్గుతుంది.  కొందరికి   ఆలస్యంగా  తగ్గుతుంది.  మందులు   సరిగ్గా  వేసుకోకుండా,  పధ్యం  సరిగ్గా  పాటించని  వారికి  రోగం  త్వరగా  తగ్గకపోవచ్చు  కూడా.

* ఈ   కధలను  విని  , జీవితమంతా  పాపాలు  చేస్తూ   కొద్దిగా   దైవనామాన్ని  స్మరించితే  చాలు....  ఇక  పాపాలన్నీ  పోయి,  స్వర్గానికి  వెళతాం  కాబోలు .... అని    అపార్ధం  చేసుకోకూడదు .

*  తప్పులు  చేసినవాళ్ళు  తాము  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,   ఇకనుంచి    చెడ్డపనులను  చేయటం  మాని,  పుణ్యకార్యాలు  చేయటం  మొదలుపెడితే ,  అప్పుడు  వారికి  పడే  శిక్ష  గణనీయంగా  తగ్గే  అవకాశం  ఉంది.

* అంతే  కానీ,  ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అనుకోకూడదు.

*  అలాగైతే  రావణాసురుడు   కూడా  పూజలు    చేసాడు. అతను    దైవపూజలు    చేసాడు  కదా  !  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.  ఎన్ని  పూజలు  చేసినా  కూడా ,  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు.* అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.
 ..................

*చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,  ఇక ముందు  పాపాలు  చేయకూడదని  భావించి , మంచి  మార్గంలోకి  రావాలనుకునే  వారికోసం,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఇలాంటి  కధలను  పెద్దలు  అందించారు  అంతే కానీ  ,  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపడకుండా , పూజలు  చేస్తూనే    మళ్ళీ  మళ్ళీ  చెడ్డపనులు  చెయ్యాలనుకునే  వారి  కోసం  ఇలాంటి  కధలు  చెప్పబడలేదు. 

..................................

* దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు.

*  (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )

* శ్రీకృష్ణుడు  శిశుపాలుని  నూరు  తప్పుల  వరకూ  క్షమించి,   అప్పుడు  సంహరించారు.

*   శివుని అంశ కలిగిన హనుమంతుడు మరియు అంగదుడు ..   లంకకు  వెళ్ళి  హితవు  చెప్పినా  కూడా   రావణుడు  వినిపించుకోలేదు.  రాములవారి  వద్దకు  సీతాదేవిని  పంపించలేదు.  అప్పుడు   ఇక,   రాముడు  రావణుని  సంహరించటం  జరిగింది.
...............................

* అందుకని ,     తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి. 

*  జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.Wednesday, February 15, 2017

ఓం ..శనిదేవులు దయామయులు. . శ్రీ శనిదేవుని వ్రత కధ..

ఓం ..శనిదేవులు దయామయులు. . శ్రీ శనిదేవుని వ్రత కధ..
ఓం
పూర్వము అయోధ్యను పాలించే దశరధమహారాజు కొలువై ఉండగా అందలి జ్యోతిషశాస్త్రజ్ఞులు రాజుగారితో ఇట్లనిరి. ఓ రాజా! గ్రహములలో కడు క్రూరుడైనటువంటిన్నీ , దేవరాక్షసులకు సైతము భయము గొల్పునటువంటిన్నీవాడైన శనైశ్చరుడు కృత్తికాంతమును ప్రవేశించి రోహిణీశకటమును భేదింపబోవుచున్నాడు. దానివలన 12 సంవత్సరములు దుర్భిక్షము కలుగును.

  ఆ మాటలు విని దశరధుడు మంత్రి పురోహితులతో ఆలోచించి జగద్రక్షణార్ధమై - వశిష్టమహర్షీ ! దీనినెట్లు నివారించుట? అనగా విని వశిష్టుడు - రాజా ! ఈ యోగము తప్పించుట బ్రహ్మేంద్రాదులకు కూడ శక్యము కాదు అని పలికెను.

   అప్పుడు దశరధుడు అతిసాహసుడై ధనుర్బాణములను ధరించి రధమెక్కి సూర్యమండలమునకు పైన నాల్గులక్షల మైళ్ళ దూరమున గల నక్షత్రమండలమందలి రోహిణీ శకటమును దాటి యప్పుడు శని కృత్తికాంతమునుండి రోహిణీ శకటమును ప్రవేశించుచున్నాడని యెఱిగి
కోపముఖము గల శనికెదురుగా నిల్చి మహాస్త్రము విడువగా శని నవ్వి రాజా ! నీ పరాక్రమమునకు మెచ్చితిని. నా దృష్టి సోకినచో దేవగంధర్వసిద్ధసాధ్య విద్యాధరాదులు కూడా నశించెదరు.నీ కిష్టమగు వరమును కోరుకొమ్మనెను.  

 అంత దశరధుడు ఓ మందా ! ప్రపంచముండువరకు నీవు రోహిణిని భేదింపకుము అని కోరగా శని శాశ్వతవరమిచ్చెను. దశరధుడప్పుడు మహానందమును పొంది తనవలన ఇక ద్వాదశవర్ష దుర్భిక్షమెన్నడు రాదు కదా ! అని సంతసించెను. పిదప ధనుస్సు విడచి శనికి నమస్కరించి యిట్లు ప్రార్ధించెను.

  శనైశ్చర ! కోణ ! పింగళ !బభ్రు ! కృష్ణ !రౌద్ర ! అంతక ! యమ ! సౌరి ! మంద ! అను నీ దశనామములు స్తోత్రము చేయువారికి కష్టములు కలుగవు. నీచే పీడితులు కారు. నీవు సంతోషింతివేని రాజ్యమొసగెదవు. కోపగించెదవేని మొదటికే నాశనము చేయుదువు. దేవాసుర నరాదులు, సప్తఋషులు నీచే చూడబడిరేని స్థానభ్రంశము కలిగి దైన్యమొందుదురు. నీ కిదే వందనము ! వరార్ధినై వచ్చితిని. అనుగ్రహింపుము. అనెను.
 
 ఆ స్తోత్రమునకు సంతసించి శని నీ కిష్టమగు వరము కోరుకొమ్మనెను.

   అప్పుడు దశరధుడు ఓ శనైశ్చరా ! గ్రహరాజా ! ఇది మొదలుగా నీవెవ్వరిని బాధింపకుము అనెను. ఆ వాక్యములు విని మందస్మితుడై శని యిట్లనెను. గ్రహము అనగా పట్టునది, పీడించునది. కావున ఎవరీ స్తోత్రమును ఒక  సారియైనను రెండుమారులైనను చదువుదురో వారు నా వలని పీడచే బాధింపబడరు. శ్రావణమాసములోని శనివారమున స్నానపానాదులొనర్చి నల్లని వస్త్రము, నువ్వులు దానమొనర్చుట గాని లేదా తైలాభిషేకము చేయుట గాని జరిగించువారి జోలికి నేను పోను. నా బాధ గల స్త్రీపురుషులీ కధను వినినచో చిక్కుల నుండి దాటించెదను.
 
 నా పూజను భక్తి శ్రద్ధలతో చేయువారిని నావలనను, ఇతర గ్రహముల వలనను గలుగు దుష్ఫలితములనుండి కాపాడెదను. అని పలికిన శని పల్కులకు దశరధుడు సంతోషించి వరద్వయసిద్ధిబొంది తన ఇల్లు చేరెను.

  మా వద్ద  ఒక పుస్తకంలో ఉన్న .. శనిదేవుని వ్రత కధ లో..  కొన్ని విషయములను వ్రాసాను.

 *******************
  పై విషయములను గమనిస్తే,
 తన వద్దకు వచ్చిన దశరధుని పట్ల కోపాన్ని ప్రదర్శించలేదు. దశరధుడు లోకక్షేమం కొరకు తన వద్దకు వచ్చారని తెలిసికొని వరములను అనుగ్రహించారు.
* శనిదేవుడు ఎంతో దయగలవారని తెలుస్తుంది.

 **************
 దశరధుల వారు చేసిన శనిస్తోత్రం గురించి ..అంతర్జాలంలో గానీ , పుస్తకంలోగానీ, లేక ఎవరైనా పండితుల ద్వారా  అడిగి తెలుసుకోవచ్చు.

........

కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు..

     shani-6.wmv.flv అనే లింకును..   

Download Video shani-6.wmv.flv - Download MP3-3GP-MP4-FLV (8 ...

 అని ఉన్న దగ్గర చూడగలరు.

*******************
వ్రాసిన విషయములలో అచ్చు తప్పుల
వంటివి ఉన్నచో దయచేసి  క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

Monday, February 13, 2017

శ్రీ శనిదేవుడు కరుణామయులు..

పరమశివునిపూజ కాళికాదేవిపూజ, శ్రీ కృష్ణుని పూజించటం శ్రీ వేంకటేశ్వరుని పూజ..వల్ల శనిదేవుని దయ కూడా పొందవచ్చంటారు.
ఒకప్పుడు, శివాంశసంభూతుడైన ఆంజనేయస్వామి ..  శనిదేవునికి సహాయం చేశారంటారు. అందువల్ల శ్రీరాముని పూజించటం హనుమంతుని పూజ వల్ల శనిదేవుని దయకూడా పొందవచ్చంటారు.

ఒకప్పుడు దశరధుడు శనిదేవుని వద్దకు వెళ్ళి ప్రార్ధించగా..శనిదేవుడు వరాలను ఇచ్చారని తెలుస్తోంది..దశరధుల వారు  చేసిన శని స్తోత్రాన్ని చదవటం (లేక వినటం).. శ్రావణ మాసంలోనిశనివారమున నల్లనివస్త్రము, నువ్వులు దానం చేయటం లేదా తిలతైలాభిషేకము చేయటం...ద్వారా భక్తులకు మంచి జరుగుతుందని.. తెలుస్తోంది.
శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము..  గ్రంధము ద్వారా మరికొన్ని   విషయములు తెలుసుకోవచ్చు.

 మంచిపనులు చేసినా శనిదేవుడు మెచ్చుకుంటారు.

శనైశ్చరుడు న్యాయరక్షణలో ..  కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. అయితే, శనిదేవుడు దయామయులు.

అహంకారం ,ద్వేషాలు.. మొదలైన వాటివల్ల మనుషులు ఎన్నోతప్పులు చేస్తారు. గతజన్మలలో చేసిన పాపపుణ్యాలకు తగ్గ జన్మలను ఎత్తుతూ ఉంటారు. జననమరణచక్రం నుండి తప్పించుకోవాలని ఉన్నాకూడా, మనస్సును అదుపులో ఉంచుకోలేక నిస్సహాయులై మరల మరల తప్పులు చేస్తూనే ఉంటారు చాలామంది.
చెడ్డపనులు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది అన్నప్పుడు ప్రజలు తప్పులు చేయటానికి భయపడే అవకాశం ఉంది...

కష్టాలు వస్తాయనే గట్టి భయం ఉంటే.. చాలామంది తప్పులు చేయకుండా ఉండటానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తారు.

ఉదా..  కష్టాలు వస్తాయేమోననే భయంతో .. దానధర్మాలు వంటి మంచి పనులు చేయటం, సాధ్యమయినంతలో చెడ్దపనులను తగ్గించటానికి ప్రయత్నిస్తారు.

ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపిస్తుందంటే, మనుషులను మంచిగా మార్చటానికి కొన్నిసార్లు.. దైవం.. జీవులకు కొద్దిపాటి కష్టాలు తెప్పించి కూడా వారిని మంచిదారిలోకి తేవటం జరుగుతుందేమో?అనిపిస్తుంది.
************

మనుషులు అనుభవించే మంచిచెడులకు కారణం ..వాళ్ళు గతంలో చేసిన పాపపుణ్యాలు. ఎవరి గతజన్మ కర్మఫలాలకు తగ్గ జన్మను వాళ్ళు పొందుతారు. అలాంటప్పుడు తాము చేసుకున్న పాపాలకు ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం ఏమిటి ?

శనిదేవుడు అంటే కష్టాలు కల్పిస్తారు అని అనుకోవటం తప్పు.

 జీవులు గతంలో ఎక్కువగా మంచి కర్మలు చేసి ఉన్నట్లయితే, ప్రస్తుత జన్మకుండలిలో ఎక్కువ విషయాలు అనుకూలంగానే ఉండేవి. అనుకూలంగా లేవంటే అందుకు జీవులు చేసుకున్న పాపాలే కారణం. అందుకు గ్రహదేవతలను నిందించటం అంటే మరింత పాపం చేయటమే అవుతుంది.
**************

జీవుల జన్మకుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉంటే మంచి జరుగుతుందంటారు. శనిగ్రహమైనా జన్మకుండలిలో అనుకూలస్థానంలో ఉంటే మంచి జరుగుతుందంటారు. అనుకూలస్థానంలో లేనప్పుడు ఏ గ్రహమైనా కష్టాలు వస్తాయంటారు.

ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే , కష్టాలు తప్పించుకోవాలంటే ఇకమీదటైనా సాధ్యమైనంతవరకూ చెడ్దపనులను చేయకుండా .. మంచిగా జీవించటానికి ప్రయత్నించాలి. 

Friday, February 10, 2017

శ్రీ శనిదేవుని మహిమలు......రెండవ భాగము.

Friday, July 13, 2012శ్రీ శనిదేవుని మహిమలు......రెండవ భాగము.ఓం.

....శ్రీ  శనేశ్వరులు  నికృష్ఠు ,  వికృత  రూపుడు కాడు.  తపోగ్నిచే  దహించబడిన  స్వర్ణ  కాంతి  కాయుడు  సర్వాంతర్యామి,  సర్వ  సాక్షీభూతుడు. పరిపూర్ణ  అహింసామూర్తి...
 
..."  తన  కర్మ  శేష  ఫలితముగా  అయితేనేమి,  కుకర్మల  కారణముగా  నైతేనేమి   మానవుడు  రోగి  లేక  భోగి  అవుతున్నాడు   మానవుల  కుకర్మల  ఫలితమే  రోగము.  రోగము  నుండి  విముక్తి  పొందాలంటే  వైద్యున్ని  ఆశ్రయించాలి.  రోగమూలము  నిర్ధారణ  చేసి  వైద్యము  చేసి  రోగి  నుండి  రోగాన్ని  పారద్రోలడమే  వైద్యుని  కర్తవ్యము.  కాని  రోగితో  గాని  రోగముతో  గాని  వైద్యునికి  ఎలాంటి  సంబంధము  లేదు.  ఈ  విధంగానే  బహుబంధాలు  ,  బహుబాధలు  మానవ  జనిత  కర్మ  ఫలములే.  కాని  శని  కృతము  కాదు. గ్రహదేవుడు  బాధిస్తాడా  ?  వేధిస్తాడా ?  ఎంతటి  అజ్ఞాన  భావన.  వీటినుండి  ముక్తి  పొందాలంటే  గ్రహదేవుని  పాదాల కడ   సమర్పణ  భావముతో  ప్రార్ధించడం  ఉత్తమం...."

.(  ఈ  విషయములు  శ్రీ  శనేశ్వర  దేవతా  మహాత్యము    గ్రంధము  లోనివి.  )

....ఈ  గ్రంధ  కర్త  శ్రీ  మహాజన్ స్వామి రావు  గారు.  వీరు  షిరిడి  సాయిబాబా  గారి  భక్తులు  కూడానట. ఈ  గ్రంధము   శింగణాపూర్  శ్రీ  శనేశ్వరాలయము  పబ్లిక్  ట్రస్ట్  వారి  సౌజన్యముతో  ముద్రితమైనదట.  ఈ  గ్రంధములో    శనిదేవుని  గురించిన    మహిమలు  ఉన్నాయి. 
 
...............................
 
కొందరు  ఏమనుకుంటారంటే,  శనిదేవుడు  ప్రజలను  శిక్షిస్తారు  అంటారు.  అలా  అనుకోవటం  తప్పు.  నాకు  ఏమనిపిస్తుందంటే,
 
  శనిదేవుడు  న్యాయ  పరిరక్షకుడు.  కాబట్టి  ,  ఎవరైనా  పాపాలు  చేస్తే  వారికి  తగ్గ  శిక్షను  విధించి,   తద్వారా  వారిని  మంచి  మార్గానికి  తీసుకు  వస్తారు.
 లోకంలో    శిక్షలంటూ  లేకపోతే  ప్రజలలో  పాపభీతి  తగ్గిపోతుంది  కదా  ! న్యాయస్థానాలలో  జడ్జీలు  కూడా  శిక్షలను  విధిస్తారు .

.............................
 
శ్రీ  శనిదేవుడు  శ్రీ  క్షేత్ర  శింగణాపూర్  లో   వెలిసారు.
మేము  ఒకసారి  షిరిడి  వెళ్ళినప్పుడు  శ్రీ  శని  శింగణాపూర్  కూడా  వెళ్ళి  వచ్చాము...  .

 ఈ ఊరిలోని అంగళ్ళకు తాళములు వేయరట.

ఇక్కడ దొంగతనములు జరగవు.
................

శింగణాపూర్  సందర్శించే  భక్తులకు  కొన్ని  ముఖ్య  సూచనలలో  కొన్ని  .....
భక్తులు  తమ  వెంట  మద్యమాంసాదులు  తీసుకెళ్ళుట  దైవాపరాధము  అని  చెప్పబడింది....

ఇక్కడ  కుల,  మత  , వర్ణ  ,వర్గ  వ్యత్యాసాలు  పాటించతగదని పెద్దలు  తెలియజేసారు.

పవిత్ర  ప్రసాదమును  మూఢభావాలతో  తిరస్కరించడము  దైవాపరాధమని  పెద్దలు  తెలియజేసారు.
............
 
  ఎన్నో  ప్రత్యేకతలున్న  క్షేత్రము  శ్రీ  శని  శింగణాపూర్....
 
ఈ  రోజుల్లో  కూడా  ఇలాంటి  ఊరు  ఉన్నదని  ఎందరో  ఆస్తికులు,  నాస్తికులు  కూడా ఈ  ఊరును  దర్శిస్తుంటారట..
..............
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను...

5 comments:

 1. శని దేముడు ఏమిటండీ!? ఆయన ఒక గ్రహము. పరమేశ్వరుని కింకరుడు ఆయన. "శనైశ్చరుడు" సరి అయిన పదం. చాలా మంది శనీశ్వరుడు అంటారు. అది తప్పు. గ్రహములకు ఈశ్వరుని అంత స్థాయి లేదు. ఈశ్వరుని అనుఙ్ఞ మేరకు గ్రహములు మనని ప్రభావితం చేస్తాయి. రాజు క్రింద పనిచేసే వారందరినీ రాజా అని పిలవడం సరికాదు కదా!
  ReplyDelete

 2. * మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను.. రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి..

  * నాకు తెలిసిన విషయాలు తక్కువ....నాకు తెలిసినంతలో రాసానండి.

  * ఆదిపరాశక్తిపరమాత్మ అయిన ఆది దైవం అన్నింటికీ మూలం.

  * దైవాన్ని ఎలాగైనా పూజించుకోవచ్చునని పెద్దలు చెబుతుంటారు. దైవాన్ని కొందరు ఒక్క నామము, ఒక్క రూపంతో భావించి ఆరాధిస్తారు. మరి కొందరు రకరకాల నామములు, రూపాలతో దైవాన్ని భావించి ఆరాధిస్తారు. ఎవరి ఓపిక , ఆసక్తి వారిది.

  * ఒక్క నామంతో ఒక్క రూపంతో దైవాన్ని ఆరాధించినా లేక విభిన్న నామములతో రూపములతో ఆరాధించినా ఫలితం ఒకటిగానే వస్తుంది. భగవంతుని మెప్పించేది భక్తి మాత్రమే.

  * కొందరు ఆదిపరాశక్తి అయిన పరమాత్మను ఆరాధిస్తారు. కొందరు శివుణ్ణి ఆరాధిస్తారు. కొందరు విష్ణువును ఆరాధిస్తారు. కొందరు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. కొందరు హనుమంతుని ఆరాధిస్తారు. కొందరు చాలా దేవతలను ఆరాధిస్తారు.

  * సంధ్యావందనం చేయటం, గాయత్రిని అర్చించటం మాత్రం చాలా మంది చేస్తారు.

  * సీతాదేవిని తీసుకురావటం కోసం లంకకు వెళ్ళేముందు విష్ణుమూర్తి అంశ అయిన రాముడు ఆదిత్యహృదయం ద్వారా సూర్యుని ఉపాసించారట.

  * రాముడంతటి వారే సూర్యదేవుని ఆరాధించినప్పుడు సామాన్య మానవులు సూర్యుని దేవునిగా ఆరాధించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ సూర్యదేవుని పుత్రుడే శనిదేవుడు.

  * శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట.

  * నవగ్రహాల అధిపతులు దేవుళ్ళుగా నవగ్రహ పూజ పెద్దలు ఏర్పరిచిందే కదండి.

  * సత్యనారాయణస్వామి వారి పూజలో కూడా నవగ్రహ పూజ జరుగుతుంది.

  * శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిఃలో ఇలా ఉన్నాయండి.
  ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
  ఓం చంద్రమండల సంస్థితాయై నమః
  ఓం వహ్ని మండల మధ్యస్థాయై నమః
  ఓం వాయు మండల మధ్యస్థాయై నమః

  * ఇవన్నీ గమనిస్తే దైవం సర్వాంతర్యామి అని తెలుస్తోంది. ఎవరి ఓపికను బట్టి వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

  * ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ పరమదైవాన్ని ఆరాధించినట్లే. ఎందుకంటే ఆదిదైవం నుంచే అన్ని దైవరూపాలూ వచ్చాయి కాబట్టి....

  * ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నన్ను పరీక్షించటానికి ఇలా వ్యాఖ్యానించారని నేను భావిస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించండి.
  ReplyDelete

  Replies

  1. శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట....

   .(...శనిదేవుడు శ్రీ కృష్ణునికి భక్తులట.)
   Delete 3. chala baga vivarincharandi........
  ReplyDelete

 4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
  ReplyDelete
Wednesday, February 8, 2017

శ్రీ శనిదేవుని మహిమలు ...... రెండవ భాగము .

ఓం

Friday, July 13, 2012

   Delete

 3. chala baga vivarincharandi........
  ReplyDelete

 4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
  ReplyDelete