koodali

Monday, February 13, 2017

శ్రీ శనిదేవుడు కరుణామయులు..


 
పరమశివునిపూజ కాళికాదేవిపూజ, శ్రీ కృష్ణుని పూజించటం శ్రీ వేంకటేశ్వరుని పూజ..వల్ల శనిదేవుని దయ కూడా పొందవచ్చంటారు.
ఒకప్పుడు, శివాంశసంభూతుడైన ఆంజనేయస్వామి ..  శనిదేవునికి సహాయం చేశారంటారు. అందువల్ల శ్రీరాముని పూజించటం హనుమంతుని పూజ వల్ల శనిదేవుని దయకూడా పొందవచ్చంటారు.


ఒకప్పుడు దశరధుడు శనిదేవుని వద్దకు వెళ్ళి ప్రార్ధించగా..శనిదేవుడు వరాలను ఇచ్చారని తెలుస్తోంది..దశరధుల వారు  చేసిన శని స్తోత్రాన్ని చదవటం (లేక వినటం).. శ్రావణ మాసంలోనిశనివారమున నల్లనివస్త్రము, నువ్వులు దానం చేయటం లేదా తిలతైలాభిషేకము చేయటం...ద్వారా భక్తులకు మంచి జరుగుతుందని.. తెలుస్తోంది.
శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము..  గ్రంధము ద్వారా మరికొన్ని   విషయములు తెలుసుకోవచ్చు.


 మంచిపనులు చేసినా శనిదేవుడు మెచ్చుకుంటారు.


శనైశ్చరుడు న్యాయరక్షణలో ..  కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. అయితే, శనిదేవుడు దయామయులు.


అహంకారం ,ద్వేషాలు.. మొదలైన వాటివల్ల మనుషులు ఎన్నోతప్పులు చేస్తారు. గతజన్మలలో చేసిన పాపపుణ్యాలకు తగ్గ జన్మలను ఎత్తుతూ ఉంటారు. జననమరణచక్రం నుండి తప్పించుకోవాలని ఉన్నాకూడా, మనస్సును అదుపులో ఉంచుకోలేక నిస్సహాయులై మరల మరల తప్పులు చేస్తూనే ఉంటారు చాలామంది.
చెడ్డపనులు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది అన్నప్పుడు ప్రజలు తప్పులు చేయటానికి భయపడే అవకాశం ఉంది...

కష్టాలు వస్తాయనే గట్టి భయం ఉంటే.. చాలామంది తప్పులు చేయకుండా ఉండటానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తారు.


ఉదా..  కష్టాలు వస్తాయేమోననే భయంతో .. దానధర్మాలు వంటి మంచి పనులు చేయటం, సాధ్యమయినంతలో చెడ్దపనులను తగ్గించటానికి ప్రయత్నిస్తారు.

ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపిస్తుందంటే, మనుషులను మంచిగా మార్చటానికి కొన్నిసార్లు.. దైవం.. జీవులకు కొద్దిపాటి కష్టాలు తెప్పించి కూడా వారిని మంచిదారిలోకి తేవటం జరుగుతుందేమో?అనిపిస్తుంది.
************

మనుషులు అనుభవించే మంచిచెడులకు కారణం ..వాళ్ళు గతంలో చేసిన పాపపుణ్యాలు. ఎవరి గతజన్మ కర్మఫలాలకు తగ్గ జన్మను వాళ్ళు పొందుతారు. అలాంటప్పుడు తాము చేసుకున్న పాపాలకు ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం ఏమిటి ?

శనిదేవుడు అంటే కష్టాలు కల్పిస్తారు అని అనుకోవటం తప్పు.


 జీవులు గతంలో ఎక్కువగా మంచి కర్మలు చేసి ఉన్నట్లయితే, ప్రస్తుత జన్మకుండలిలో ఎక్కువ విషయాలు అనుకూలంగానే ఉండేవి. అనుకూలంగా లేవంటే అందుకు జీవులు చేసుకున్న పాపాలే కారణం. అందుకు గ్రహదేవతలను నిందించటం అంటే మరింత పాపం చేయటమే అవుతుంది.
**************

జీవుల జన్మకుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉంటే మంచి జరుగుతుందంటారు. శనిగ్రహమైనా జన్మకుండలిలో అనుకూలస్థానంలో ఉంటే మంచి జరుగుతుందంటారు. అనుకూలస్థానంలో లేనప్పుడు ఏ గ్రహమైనా కష్టాలు వస్తాయంటారు.

ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే , కష్టాలు తప్పించుకోవాలంటే ఇకమీదటైనా సాధ్యమైనంతవరకూ చెడ్దపనులను చేయకుండా .. మంచిగా జీవించటానికి ప్రయత్నించాలి. 

2 comments:

  1. జీవులు జన్మ ఎత్తడం అంటేనే ఎంతో కొంత కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు ఏమీ లేకుండా ఉండాలంటే మోక్షం పొందటం మాత్రమే మార్గం. మోక్షాన్ని పొందాలంటే మాటలుకాదు.

    లోకంలో ఒక పెద్ద చదువు చదవాలన్నా, ఒక పెద్ద పదవి పొందాలన్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి.కొంత కష్టపడాలి. అలాంటిది అత్యున్నతమైన మోక్షాన్ని పొందాలంటే మాటలా..

    మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి.

    ReplyDelete
  2. వ్రాసిన విషయాలలో అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete