koodali

Friday, June 29, 2012

వివేకానందుల వారి గురువైన రామకృష్ణ పరమహంస గురించి.....

శ్రీ రామకృష్ణ  పరమహంస,  శ్రీ  శారద  మాత ,  
  శ్రీ వివేకానందుల వారికి  అనేక  నమస్కారములు,


 శ్రీ  వివేకానందుల  వారి    గురువైన  రామకృష్ణ  పరమహంస జీవితంలో   జరిగిన  ఒక  సంఘటన  ఇది.  

ఒక  తల్లి  తన  చిన్న  కొడుకును  తీసుకుని  రామకృష్ణ పరమహంస  వద్దకు  వస్తుంది. 


ఆ  బాబు  తీపి   పదార్ధాలను  అతిగా  తింటుంటాడు.  అది   అనారోగ్యం  కాబట్టి,  ఆ    అలవాటును   ఎలా  మానిపించాలో  సలహా  చెప్పమని  ఆ  తల్లి   రామకృష్ణుల  వారిని  అడుగుతుంది.


 అప్పుడు  రామకృష్ణులు ,  వారిని    మరునాడు  రమ్మని  చెబుతారు.   ఈ  విధంగా    కొద్దిరోజులు  గడిచిన  తరువాత  ,  ఒక  రోజు  రామకృష్ణుల  వారు  ఆ  బాబుతో .... తీపి  అతిగా  తినవద్దని  చెబుతారు.    ఈ    విషయం  చెప్పటానికి  ఇన్నిరోజులు  ఎందుకు  ?  ముందు రోజే  చెప్పవచ్చు  కదా  !  అని  ఆ  తల్లికి  సందేహం  వచ్చి అడిగితే,


  రామకృష్ణుల  వారు  ., ..తల్లీ  నాకూ  తీపి  అతిగా  తినే  అలవాటుంది.  ఆ  అలవాటును  నేను  తగ్గించుకోకుండా  ఇతరులకు  ఎలా  సలహా  ఇవ్వగలను  ?  ఆ  అలవాటును  తగ్గించుకోవటానికి  నాకు  ఇన్ని  రోజుల  సమయం  పట్టింది  .  అని  చెబుతారు. 

  

Wednesday, June 27, 2012

..సతీసహగమనం....


సతీసహగమనం.

పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు..  కానీ,  .ఇలాంటివి   సమాజంలో  వ్యాపించటానికి  కారణం  ప్రజలే.....

ఒకరిని  చూసి  ఒకరు   ......   అనుకరించే  ప్రజల  ప్రవృత్తే.


పూర్వం  రాజుల  కాలంలో  శత్రురాజుల   దండయాత్రల  వల్ల,     రాజు,  రాజ్యం  శత్రురాజుల  అధీనంలోకి    వెళ్ళినప్పుడు   రాణి  మొదలైన  స్త్రీలు  ,     శత్రు  రాజుల  చేతికి  చిక్కకుండా   తామే  ఆత్మార్పణం  చేసుకునేవారు.


  భర్త  చనిపోతే   తట్టుకోలేని  
కొందరు  స్త్రీలు తమకు  తామే  సహగమనం   చేసేవారు.

 భర్త  పోయిన  స్త్రీల  జీవితం  కష్టంగా  ఉంటుందని  భావించిన  కొందరు  స్త్రీలు  కూడా  తమకు  తామే  సహగమనం   చేసేవారు.ఇలా  కొందరు  తమ  ఇష్టపూర్వకంగా  సహగమనం  చేయటం  వల్ల,  ఇక  కాలక్రమేణా  అది  ఒక  ఆచారంగా  మొదలయి  ఉంటుంది.  అంతేకానీ  భర్త    పోయిన  స్త్రీలందరూ  సహగమనం  చేయాలని  పెద్దలు   చెప్పరు  కదా  !పెద్దలు  ఇలాంటి  సతీసహగమనం  వంటి  ఆచారాలను  ప్రోత్సహించలేదు  .

* ఉదా   ......రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !* భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చెయ్యలేదు.


* తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం చెయ్యలేదు కదా!


* అంటే ,  ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.* పాండురాజు  చనిపోవటానికి  తానూ  కారణమని  భావించిన  మాద్రి    తన  ఇష్టంతోనే  సహగమనం   చేసింది.  ...(..తన  సంతానమైన  నకుల,  సహదేవుల  సంరక్షణను    కుంతీదేవికి  అప్పగించి ..... )

ఇలా ....మరి  కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ,.............ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.


 (నేను  పాత  టపాలో సతీసహగమనం  గురించి  క్లుప్తంగా  వ్రాసాను. )
............................................

ఇతరులను   గుడ్డిగా  అనుకరించటం  గురించి  పెద్దలు  ఒక  కధ  చెబుతారు..

ఒక  సాధువు  నదిలో  స్నానం  చేయటానికి  వచ్చి  , నది  ఒడ్డున  ఒక  చిన్న  గొయ్యి  తవ్వి  తన  కమండలాన్ని  అందులో  దాచి  పెడతాడు. ( భద్రత   కోసం.  ) దాచిపెట్టిన  ప్రదేశానికి    గుర్తుగా  దాని  పైన  ఇసుకను  గోపురం  ఆకారంలో  కుప్పగా  పోసి  స్నానానికి  నదిలోకి  వెళ్తాడు. 


 ఇదంతా  దూరం  నుంచి  చూసిన  భక్తులు  కొందరు ,  సాధువు  చేసినట్లు  ఇసుకను  గోపురం  ఆకారంలో  తయారుచేస్తే  పుణ్యం  వస్తుందని  భావించి,   తామూ  అలా  చేయటం  మొదలుపెడతారు, 

 (  సాధువు   అలా  ఎందుకు  చేసారో  అసలు  విషయం   వాళ్ళకు  తెలియదు.  ) 


ఇలా  ఒకరిని  చూసి  ఒకరు     చేయటం  వల్ల  , నది  ఒడ్డున   చాలా  ఇసుక  గోపురాలు  తయారవుతాయి.  సాధువు  స్నానం  చేసి  ఒడ్డుకు  తిరిగి  వచ్చి  తన  కమండలం  కోసం  చూసేసరికి ,
 

 ఇంకేముంది.... ఎన్నో  గోపురాలు  కనిపిస్తాయి.   ఆలోచించగా..... ఆయనకు  విషయం  అర్ధమయి ,  ఇక   చేసేదేమీ  లేక  కమండలం లేకుండానే   ఉత్తచేతులతో  తిరిగి  వెళతారు.

  సాధువు   తన  కమండలం   యొక్క   భద్రత   కొరకు   గోపురం  చేస్తే  , ఆ  విషయం   తెలియని  మిగతావారు    అనుసరించినట్లుగా...... 


 కొన్ని  విపరీత  ఆచారాలు  కూడా   పెద్దలు  ఏర్పరిచినవి  కాదు.  వాటికవే  సమాజంలో  మొదలయ్యి  మూఢాచారాలుగా  పాతుకుపోయి  ఉండవచ్చు..   

దురాచారాలు  పెరగటానికి      కారణం  ప్రజలయితే,  ఇలాంటి   దురాచారాలను   పెట్టారని    ప్రాచీనులను  ఆడిపోసుకుంటారు.Monday, June 25, 2012

కొన్ని విషయములు.....ఇంకా,. వ్యాఖ్య.....కూడా పోస్ట్ లో...

  అద్భుతమైన   అమరనాధ్  యాత్ర  ప్రారంభమయింది.    దైవం  దయ వల్ల కొంతకాలం  క్రిందట   మేము  అమరనాధ్  యాత్ర,  వైష్ణవీదేవి  యాత్రలు  చేసి  వచ్చాము......
 
..................


 
నిన్నటి  టపాలో   ఆరోగ్యం   గురించి   కొన్ని  విషయాలను    వ్రాసాను.  ఆరోగ్యమే  మహాభాగ్యం  అన్నారు  పెద్దలు. 

 

అనారోగ్యం  రావటానికి  ఎన్నో  కారణాలు  ఉంటాయి.  వ్యక్తులు   పూర్వం  చేసిన  పాపాల  వల్ల  కూడా  అనారోగ్యం  వస్తుందట.  పాపకార్యాలను  చేయటం  మాని ,    దైవప్రార్ధన,  ఇతరులకు  సహాయం  చేయటం  , వంటి  పుణ్యకార్యాలను  ఆచరిస్తూ  వైద్యసహాయం   తీసుకోవటం   వల్ల  ఆరోగ్యాన్ని  తిరిగి పొందవచ్చట.
 

అనారోగ్యం  పోవాలంటే   మందులు  వాడుతూనే, రుద్రాక్షధెరపీ,  దైవప్రార్ధన,  యోగా  వంటివి  చేస్తూ  ఆహారవిహారాల్లో  జాగ్రత్తలు  పాటిస్తే   రోగాలు  తగ్గే  అవకాశం  ఉంది.

 జాగ్రత్తలు  పాటించకపోతే  అంతగా  ఫలితం   కనిపించదు.

 

ఉదా......ఊపిరితిత్తుల  జబ్బు  ఉన్న  వ్యక్తి  బోలెడు  రుద్రాక్షమాలలు  ధరించి  ఆపకుండా  సిగరెట్లు    పీలుస్తూ  ఉంటే  ఎన్ని  రుద్రాక్ష  మాలలు  వేసుకున్నా,  ఎంత  యోగా  చేసినా,  ఎన్ని   మందులు  వాడినా  జబ్బు  తగ్గదు  కదా  ! 

 

సిగరెట్ ను    పీల్చే వారితో   పాటు  ప్రక్కన  ఉన్నవారికి  కూడా  ఆ  పొగ  వల్ల  జబ్బులు  వస్తాయట.  అలాగే  కొందరు  చేస్తున్న  వాతావరణ  కాలుష్యం  వల్ల     చక్కటి  జీవనసరళితో  ఎంతో  జాగ్రత్తగా  ఉండే  వారికి  కూడా   జబ్బులు  వస్తున్నాయి.   రోగాలు  తగ్గాలంటే    వాతావరణ  కాలుష్యాన్ని  పెంచే  విధానాలను  ప్రోత్సహించకూడదు.
 

మాకు  చుట్టుప్రక్కల  ఉండే  ఒక  ఆమెకు , సడన్  గా  కాన్సర్  అని  బయటపడింది.  కొన్ని  నెలలలోపే  ఆమె  మరణించింది.  కాన్సర్  అని  తెలియక  ముందు  ఆమెకు  ఆ  జబ్బు  ఉన్నట్లుగా    లక్షణాలు  ఏమీ  తెలియలేదట.  ఎంతో  ఉత్సాహంగా  తిరిగేది.  ఈ  రోజుల్లో  ఇలా  జబ్బు  ముదిరేవరకూ  తెలియటంలేదు.   ఇంకొక  ఆయన  ఉద్యోగరీత్యా  కుటుంబానికి  దూరంగా  ఉంటున్నారు.  ఆయన  వేళకు  సరిగ్గా   తినీతినకా  అనారోగ్యం  పాలై  మరణించారు. నేను  ఇలాంటి  విషాదవార్తలు  వ్రాస్తున్నానని  తప్పుగా  అనుకోవద్దండి.
 

ఎందుకంటే,  ఆరోగ్యమే  మహాభాగ్యం  .  ఆరోగ్యం  ఉన్నంతవరకే  మనం  ఏమైనా  చేయగలం.  అనారోగ్యం  వస్తే    బంధువులే  సరిగ్గా  పట్టించుకోరు.   అంటే,   ఈ  రోజుల్లో  ఎవరికీ  సమయం  చాలటం  లేదు  కదా  ! 

 

అందుకని  అందరూ     ఆరోగ్యాన్ని   జాగ్రత్తగా  కాపాడుకోవాలి.   సంపాదన  అంటూ  ఒళ్ళు  హూనమయ్యేంతగా  పనిచేసి  ఆనక  అనారోగ్యం  వస్తే  ఎంత  డబ్బు  ఉన్నా    ఉపయోగం  ఉండదు  కదా !

 
..................

 
* "ఏక పత్ని "వ్యవస్థ ఎలా ఎర్పడినది?    అన్న   "  సుభద్ర కీర్తి  "  గారి  టపా  గురించి ......... నా  అభిప్రాయాలను ,    వ్యాఖ్యలను 
దయచేసి    చదవండి......

* వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట.

మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి..... .వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు......ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో....)పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు. )


పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !.రామాయణంలో రావణాసురుడు అతిధి ( భిక్షువు ) రూపంలో శ్రీరాముని ఇంటికి వచ్చి సీతాదేవిని ....ఆశించాడు. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు.
 


 విష్ణుదేవుని  అంశ  అయిన  శ్రీ రాముడు రావణాసురుని వంశాన్నే నాశనం చేసి , తద్వారా పరాయి స్త్రీని కోరుకోవటం అధర్మమని లోకానికి చాటి చెప్పారు....


( హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసి వచ్చిన తరువాత సీతాపహరణం గురించిన విషయాలు తెలిసిన తరువాత రాముడు రావణాసురుని సంహరించారు. )

 

సుభద్రకీర్తి గారు వ్రాసిన కధలో ..... అలా జరగటానికి వెనుక ఏవో సామాజిక కారణాలు ఉండి ఉంటాయి. బహుశా శ్వేతకేతు అనే వారు ఏకపత్నీవ్రతాన్ని పునరుద్ధరించి ఉంటారు.లోకహితం కోరి ఎన్నో ధర్మాలను ఏర్పరిచి పెద్దలు లోకానికి అందించారు. మానవులు తమ మనస్సును అదుపులో పెట్టుకోలేక పోవటం వల్ల, లేక పరిస్థితుల ప్రాబల్యం వల్ల, లేక మరేవో ఇతర కారణాల వల్ల ....... లోకంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. తద్వారా ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు.మానవులకు అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని పొందాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి చేతనైనంతగా ప్రయత్నించాలని పెద్దలు చెప్పటం జరిగింది. మనస్సు అదుపులో ఉండాలంటే దైవకృపను పొందటం అవసరం.. దైవకృప లభించాలంటే సత్ప్రవర్తన అవసరం.ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను...Friday, June 22, 2012

దైవప్రార్ధన ,రుద్రాక్షలు ,యోగ....ఆరోగ్యం.

ఓం,
శ్రీ లలితా దేవి సహస్రనామ  స్త్రోత్ర  పఠనం   ,   అందులోని  కొన్ని  నామములను  ప్రత్యేకంగా  పారాయణం  చెయ్యటం  వల్ల  అనారోగ్యమును  పోగొట్టుకోవచ్చని  పండితులు  చెబుతున్నారు.

 

శ్రీ సూర్యనారాయణస్వామి  (  సూర్యుడు  )  ఆరోగ్య  ప్రదాత.  రోజూ  కొద్దిసేపైనా  సూర్యరశ్మి  శరీరానికి  తగలటం  ఎంతో  మంచిది.  సూర్యనమస్కారాలు  ,  సూర్య స్త్రోత్ర   పఠనం వల్ల  అనారోగ్యమును  పోగొట్టుకోవచ్చని  పండితులు  చెబుతున్నారు.

 

రుద్రాక్షలు  ఎంతో  మహిమ  గలవని  పెద్దలు  చెప్పటం  జరిగింది.  రుద్రాక్ష  ధారణ   వల్ల  అనారోగ్యం  దూరమవుతుందని  కూడా  అంటారు.

 

 రుద్రాక్షల  మహిమ  గురించి  ,  వాటివల్ల  అనారోగ్యం    తగ్గటం  గురించి     విన్న  తరువాత   నాకు  ఏమనిపిస్తుందంటే ,  కాన్సర్  వంటి  రోగులకు  ఈ  రుద్రాక్ష  ధెరపీ  ప్రయత్నిస్తే   బాగుంటుంది  కదా  !  అనిపించింది.  అయితే  డూప్లికేట్   రుద్రాక్షలు    కాకుండా  అసలైన  రుద్రాక్షలతో  ఈ  ప్రయత్నం  చేస్తే  చక్కటి  ఫలితాలు  వస్తాయి. రుద్రాక్షలతో  తయారయిన  పిరమిడ్  ఆకారపు  కప్పు  ఉన్న  మండపాలలో  రోజూ  కొద్దిసేపు  ధ్యానం  చేయటం  ఎంతో  మంచిదట.
 

   రుద్రాక్షల  వల్ల  కాన్సర్  వంటి  జబ్బులు  కొంతయినా  తగ్గు  ముఖం  పడితే  బాగుంటుంది.     డాక్టర్స్  కూడా  మందులు    ఇచ్చి  ఆహారవిహార  విషయాల్లో  నియమాలను  చెబుతారు  .  మందులు  వేసుకుంటూ  మన  ఇష్టం  వచ్చినట్లు  ఏదిపడితే అది  తిని  తిరిగితే  రోగం  తగ్గదు  కదా  !  రోగాలు  తగ్గాలంటే   రుద్రాక్ష  ధెరపీతో  పాటూ   ఆహారవిహారాల్లో  కూడా  చక్కటి  నియమాలను  పాటించాలి. 


 (   ఈ  రుద్రాక్షలను  అన్ని  వేళల్లోనూ  శరీరంపై  ధరించవచ్చునా  ?  అనే  విషయాలు  నాకు  అంతగా  తెలియవండి.  ) 

 

 ఏ  ఆధునిక  వైద్యానికి  తగ్గని  జబ్బులు  యోగా    వల్ల  తగ్గాయని  కొందరు  ప్రముఖులు   తమ  అనుభవాల  ద్వారా  చెబుతున్నారు.


B K S Iyengar - Home

 

 BKS Iyengar.....అనే ఆయన  బాగా  పేరున్న  యోగా  గురువు.  యోగా   వంటివి    నిపుణులైన  వారి  వద్ద  నేర్చుకుని  మాత్రమే  చేయాలి.  ఇదే  అసలు  సమస్య.  ఈ  రోజుల్లో  ఎవరు  అసలు  నిపుణులో  ఎవరు  నకిలీ  వాళ్ళో  సరిగ్గా  తెలియటం    లేదు.  
 

 ఈ  రోజుల్లో  కాన్సర్  వంటి  జబ్బులకు  సరైన  మందులు  లేవు. ఆయుర్వేదంలో కాన్సర్ ను  రాచకురుపు  అంటారు.  కాన్సర్ కు   ఆయుర్వేదంలో  మందు  ఉండే  ఉంటుంది.    అయితే  దాని  గురించి   ఇప్పుడు  మనకు  తెలియదు.  మన  నిర్లక్ష్యం  ఫలితంగా  ఎంతో   ప్రాచీన  విజ్ఞానం  మనకు  దూరమయ్యింది.

 

  మాకు  కొంచెం  దూరపు  పరిచయం  ఉన్న  ఒకామె  కొద్దికాలం  క్రిందట  మూత్రపిండాల  వ్యాధితో  మరణించారు. ఆమె  ఉద్యోగం  చేసేవారు.  ( ఉద్యోగస్తులైన  స్త్రీలకు  పనిచేసే  చోట  సరైన  టాయిలెట్  సౌకర్యాలు  లేకపోవటం  వల్ల   కూడా  మూత్రాశయ  జబ్బులు  వచ్చే  అవకాశం  ఉందట.  ) . 

 

ఆమె  చనిపోయే  కొద్దినెలల  ముందు  కూడా  బాగానే  ఉంది.  జబ్బు  ఉన్నట్లు  ఆమెకు  ఏమీ    తెలియలేదట.  సడన్  గా  జబ్బు  బయటపడి  ఇక   ఏ  ట్రీట్మెంట్  పనిచేయలేదు.  మరొక   ఆయనకు   పనివత్తిడి  తట్టుకోలేక  ఆఫీసులోనే  గుండె  నొప్పి  వచ్చింది,   ఇలా    సమాజంలో  ఎన్నో  సంఘటనలు  జరుగుతున్నాయి. ఈ  రోజుల్లో   వాతావరణకాలుష్యం,   పనివత్తిడి,  టార్గెట్ గోలలు,  ఎక్కువైపోయాయి  కదా  ! ఈ  రోజుల్లో  ఆరోగ్యం  గురించి  శ్రధ్ధ  తీసుకోవటానికి  కూడా  సమయం  చాలటం   లేదంటున్నారు.
 

 మూత్రపిండాల  వ్యాధి,  కాన్సర్  వంటి  వ్యాధులు    వచ్చినవారికి  వ్యాధి  ముదిరేవరకూ  తెలియటం  లేదు.  అప్పటివరకూ  బాగానే  ఉండి  సడన్  గా  వ్యాధి  బయటపడి  ప్రమాదకర  స్థితిలోకి  వెళ్తున్నారు.

 

  ఇవన్నీ  చూస్తుంటే     కాన్సర్,   కిడ్నీ  జబ్బులు  వంటి  కేసుల్లో   ఇతర  మందులు  వాడుతూనే    రుద్రాక్ష  ధెరపీ   ,  యోగా  వంటివి  కూడా  ప్రయత్నించి  చూస్తే     బాగుంటుంది  కదా  !  అనిపించింది...


   జబ్బులు  వచ్చిన  తరువాత  బాధపడటం  కన్నా, అనారోగ్యం  రాకుండా  ముందే  జాగ్రత్తలు   తీసుకోవటం  ఎంతో   మంచిది.   వాతావరణ  కాలుష్యాన్ని  తగ్గించటం,  ఆహారవిహారాలలో  విచక్షణ,  సత్ప్రవర్తన  ........ఇలాంటివి  జాగ్రత్తలు. .....*********************

Wednesday, June 20, 2012

భరతుడు ( జడభరతుడు.)


*భరతుడు  (  జడభరతుడు.) ...... సూర్యవంశానికి  చెందిన  ఈయన   గొప్ప  చక్రవర్తి.......ఈ  భరతుని    (జడభరతుని )  గొప్పతనం  గురించి  ఎన్నో  ప్రాచీన  గ్రంధాలలో  ఉందట..   జైన  మతంలో  కూడా  వీరి  గురించి  వివరములు  ఉన్నాయట.

 

ఈయన   గొప్ప  దైవభక్తుడు. ఈయన  సూర్యవంశానికి  చెందిన  వారట.   అయితే  సూర్యవంశానికి  చెందిన  దశరధమహారాజుకు  వీరికి  ఎలాంటి  బంధుత్వం   ఉన్నదో  ఆ  వివరాలు  నాకు  తెలియవు.

 

  ఒకరోజు  భరతుడు  ప్రమాదకర  పరిస్థితిలో  ఉన్న  ఒక  జింక పిల్లను చూస్తారు.  ఆ  జింకపిల్లను    రక్షించి  అల్లారుముద్దుగా  పెంచుకుంటారు. జింక  అంటే  ఎంతో  ఇష్టాన్ని  పెంచుకుంటారు.    అప్పటివరకూ  ఉన్న    దైవప్రార్ధన    తగ్గిపోతుంది.  భరతుడు  తన  అవసాన  దశలో  కూడా  జింక  గురించి   ఆలోచిస్తూ   మరణిస్తాడు.


 
 భరతుడు   తరువాత  జన్మలో  జింకగా  జన్మిస్తాడు.  పూర్వపుణ్యం  వల్ల   ఈ  జింకగా  జన్మించిన   భరతునికి     తన   గతజన్మ  గుర్తు  ఉంటుంది  . గతజన్మలో  తాను  మోక్షం  పొందనందుకు   బాధపడుతుంది.

 

జింక  జన్మ  తరువాత  భరతుడు    ఒక  బ్రాహ్మణునికి  కుమారుడుగా  జన్మిస్తాడు.   ఈ  జన్మలో  కూడా  భరతునికి      తన  గత  జన్మల  గురించి  గుర్తు  ఉంటుంది.  ఈ  జన్మలో నైనా     మోక్షం  పొందాలని  భరతుడు  గట్టిగా  అనుకుంటాడు. 

 

 అతనికి  అన్ని  విద్యలు  వచ్చినా  ఏమీ  తెలియని  వాడిలా  అమాయకంగా  ప్రవర్తిస్తాడు.  అందరూ  అతనిని  జడభరతుడు  అంటుంటారు. ఇతరులు  తిట్టినా,  అవహేళన  చేసినా    బాధపడడు.  పొగిడినా  పొంగిపోడు.  ఆహారం  యొక్క  రుచులు  పట్టించుకోడు.   జడభరతుడు  ఒకసారి   అడవిలో   తిరుగుతుండగా  కొందరు  దొంగలు  పట్టుకుని  కాళికాదేవికి  బలి  ఇవ్వాలని    ప్రయత్నించగా  , అమ్మవారు  ప్రత్యక్షమయ్యి  ఆ  దొంగలను  చంపి   భరతుణ్ణి  రక్షిస్తుంది.  
 

భరతుడు     అలా  వెళ్తుండగా  ఒక  రాజుగారి పల్లకిని  మోయటానికి  ఒక బోయీ      కావలసి  వచ్చి  ఈ  జడభరతుణ్ణి  పిలుస్తారు  .
  భరతుడు  ఒక  ప్రక్క  పల్లకిని  మోస్తూ  దారిలో  కాలిక్రింద  చీమలు  చనిపోతాయని  భావించి ,  వాటిని  త్రొక్కకూడదనే  ప్రయత్నంలో  కొంచెం  అటూఇటూగా  నడుస్తుంటాడు.  అందువల్ల  పల్లకీ   కుదుపులు  వస్తుంటాయి.


  ఇదంతా  చూసి  పల్లకిలో  కూర్చున్న  రాజు  భరతుణ్ణి  విసుక్కోవటం  జరుగుతుంది. 
 

 అప్పుడు  జడభరతునికి  రాజుకు  మధ్య  ఆసక్తికరమైన  సంభాషణ    జరుగుతుంది.   భరతుని  మాటలు  విన్న   రాజు ,  జడభరతుణ్ణి  గొప్ప  జ్ఞానిగా  గుర్తించి   పల్లకి  దిగి  వచ్చి  క్షమించమని  అడుగుతాడు.  ఆ  జన్మ  తరువాత  జడభరతునికి  మోక్షం  లభిస్తుంది. ఈ  కధను  చాలా  క్లుప్తంగా  వ్రాసాను.
 

 ఈ  కధలోని  భరత  చక్రవర్తి  వల్లే  భారతదేశానికి  ఈ  పేరు  వచ్చిందని  కొందరంటారు.   శకుంతలా  దుష్యంతుని  కుమారుడైన  భరతుని  వల్ల  కూడా    భారతదేశానికి  ఈ    పేరు  వచ్చిందని  కొందరంటారు...  జడభరతుడు   శకుంతలాదుష్యంతుల  కుమారుడైన  భరతుని  కన్నా  పూర్వులు..

నేను  ఎక్కువ  గ్రంధాలు  చదవలేదండి.  నాకు  తెలిసినంతలో  రాసాను.  పొరపాట్లు  ఉంటే  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
Monday, June 18, 2012

దేవతలు, వారి యొక్క వాహనాల విషయంలో.... 2వ భాగము.


 దేవతల యొక్క వాహనాల విషయంలో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయట.

    ఉదాహరణకు .... సరస్వతీ దేవి వాహనమైన హంసకు నీటిని , పాలను వేరు చేసి పాలను స్వీకరించే శక్తి ఉంటుంది అని ,....అలా మానవులు కూడా చక్కటి జ్ఞానాన్ని కలిగి జీవించాలి అంటారు.

 

    ఇలా కొంతవరకూ దేవతల వాహనముల గురించి సింబాలిక్ గా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అంటారు.

 

    Hindu vehicles, Hindu gods vahana's, Ganesh, Shiva, Lakshmi ...    ఈ లింకులో దేవతల వాహనాల గురించి కొన్ని వివరములు   ఉన్నాయి.

 

  శని  దేవుని  వాహనం  గురించి   ఇలా  చెప్పారు.....    Raven / Vulture / Crow.....అని.

 ఇంకా  ,గృధృ  వాహనాయ  అని  గ్రంధములో  ఉన్నది.


 
 శనిదేవుడు  జంతువాహనాన్ని  కూడా  అధిరోహించి  ఉండటం  కొన్ని  చిత్రాల్లో  కనిపిస్తుంది.

 

శని  భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో ఖచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.

 

 శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం. అని   పెద్దలు  తెలియజేసారు..

 
 
సుబ్రహ్మణ్య స్వామికి  నెమలి  వాహనం.  ఆ  నెమలి  ఒకప్పుడు  శూరపద్ముడనే  రాక్షసుడట.  తారకాసుర  వధ  సమయంలో  సుబ్రహ్మణ్యస్వామి  శూరపద్ముని  జయించి  అతనిని  నెమలిగా  తన  వాహనంగా  చేసారని  చెబుతారు.  ఈ  విషయంలో    మరికొన్ని  కోణాలలో  కూడా  అర్ధములు  చెప్పారు  కొందరు.. 

 

   పురాణేతిహాసాల్లో  ప్రతి  విషయానికి  ఎన్నో   కోణాలు,  ఎన్నో అంతరార్ధాలు  ఉంటాయి.  అందుకే  పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి.

 

శ్రీ  దత్తాత్రేయ  స్వామి  వారు  పశుపక్ష్యాదుల  నుంచి  కూడా  మనం  ఎన్నో  విషయములను  నేర్చుకోవచ్చని  చెప్పటం  జరిగింది..ఈ  లింక్ లో  ఆ  వివరములు  ఉన్నాయి........

24 Preceptors of Shri Dattatreya


******************

Friday, June 15, 2012

దేవతలు, వారి యొక్క వాహనాల విషయంలో....


  దేవతల  వాహనాలను    చూసినప్పుడు  మనకు  చిత్రమైన  ఆలోచనలు  వస్తుంటాయి.  ఉదాహరణకు    వినాయకుని  వాహనం  ఎలుక,  శనిదేవుని   వాహనం   కాకి  ....... ఇవి  చిన్న   శరీరం  కల  జీవులు  కదా  ! .  మరి  అవి  దేవతలను    ఎలా  మొయ్యగలవు ? అనిపిస్తుంది.   

 చిన్నపిల్లలకు  ఇలాంటి  సందేహాలు  వస్తుంటాయి.   ఒకోసారి  పెద్దవాళ్ళకు  కూడా  ఇలాంటి  సందేహాలు  వస్తుంటాయి.
 

 దేవతలు,  వారి  యొక్క   వాహనాల  విషయంలో  చాలా  అంతరార్ధాలు  ఉంటాయట.  అవన్నీ  నాకు  అంతగా  తెలియదు.  ఆ  అంతరార్ధాలు  అంతగా  తెలియని  నాలాంటి  వారికి   దేవతల   వాహనం  చిన్నగా  ఉంటే  ఎలా  ?  వంటి    సందేహాలు  వస్తుంటాయి.      
                                                                                                                                           


SHANI DEV KI KATHA - YouTube... ..లో   శనిదేవుని  వాహనాన్ని   చూసి  ఈ  వాహనం  చిన్నగా  ఉంది  కదా  ! శనిదేవుని  ఎలా  మొయ్యగలదు  ?  అని  ఆలోచిస్తుండగా  నాకు  కొన్ని  ఆలోచనలు  వచ్చాయి.


   శనిదేవుని  వాహనమైన  కాకి  చిన్నది .  అని  మనకు  తెలుసు. కానీ  భూమిపై  ఒకప్పుడు  డైనోసార్స్  వంటి  పెద్ద  జంతువులు  ఉండేవట.   డైనోసార్స్   కాలంలో  మిగతా  పశుపక్షాదులు  కూడా  భారీసైజుతో  ఉండేవట.     కాకులు  వంటి  పక్షులు  కూడా  పెద్ద  సైజులో భారీ  శరీరాన్ని  కలిగి   ఉండవచ్చు.  

 భూలోకంలోని   జీవులే  పెద్ద  సైజులో ఉన్నప్పుడు , ఇతర  లోకాల్లోని  దేవతల  వాహనాలైన  ఎలుక,  కాకి  వంటివి  భారీ  శరీరంతో  పెద్దగా  ఉండే  అవకాశాలున్నాయి. వినాయకుడు,  శనిదేవుడు, వీరంతా  దేవతలు.  వారి  వాహనాలు  అయిన  ఎలుక,  కాకి  కూడా  దేవతా  సంబంధమైనవే  అయ్యుండవచ్చు.


 కలియుగంలో  కాకులు  చిన్న  శరీరంతో  చిన్నగా  కనిపిస్తాయి.  కానీ,  సత్యయుగం,  త్రేతాయుగం,  ద్వాపరయుగం,  కలియుగం  ఇలా  నాలుగు  యుగాల్లోని   మనుషులు,  పశుపక్షాదులు  వారి  జీవితకాలం,  శరీరం   విషయాల్లో  ఎన్నో  తేడాలుంటాయట. 


 త్రేతాయుగం  మనుషుల   జీవితకాలం ...      10,000 ..సంవత్సరాలు  అయితే ,   కలికాలం  లోని   మనుషుల  జీవితకాలం ......100  సంవత్సరాలు.  ఇలా  వారికీ  మనకీ  ఎన్నో  తేడాలున్నాయి.


  నాలుగు  యుగాలకు  చెందిన  మనుషుల్లోనే  ఎన్నో  తేడాలున్నప్పుడు ,   వేరే  లోకాలకు  చెందిన  దేవతలకు,  వారి  వాహనాలకు ....భూలోకంలోని  మనుషులకు  ,  ఇక్కడి  పశుపక్ష్యాదులకు  ఎన్నో  తేడాలుంటాయి  కదా  !  అందుకని  దేవలోకాల్లోని  వారిని   మనతో  పోల్చుకోవటం   అనవసరం  అని  నాకు  అనిపించింది.   


అయితే, దేవతలు  సంకల్పమాత్రం  చేతనే  తాము  కోరుకున్న  ఆకారాన్ని  పొందగలరు.    పురాణేతిహాసాల్లో    భారీ  శరీరాలు కలిగిన  జీవులు ,  ఎక్కువ  కాలం  జీవించిన  పశుపక్ష్యాదుల  గురించి కూడా   వివరాలున్నాయి. 
 

 దేవతలు,  వారి  యొక్క   వాహనాల  విషయంలో  చాలా  అంతరార్ధాలు  ఉంటాయట.  అవన్నీ  నాకు  అంతగా  తెలియదు. కానీ  ,   ఇతర  లోకాల్లోని  దేవతల  వాహనాలైన  ఎలుక,  కాకి  వంటివి  భారీ  శరీరంతో  పెద్దగా  ఉండే  అవకాశాలున్నాయి.   అప్పుడు  అంత  పెద్ద  శరీరం  గల   కాకి  వాహనంగా  చక్కగా  పనికొస్తుంది  కదా  !  అనిపించి  నా  సందేహం  తీరింది.
 ........................

    * List of numbers in Hindu scriptures  *.Wednesday, June 13, 2012

పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు........పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు వచ్చారని భావించటం తప్పేమో అనిపిస్తుంది.

రామాయణ కాలంలో ఎంతో పరిణతి చెందిన వానరుల గురించి పెద్దలు చెప్పారు. 


 ఆంజనేయస్వామి  ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని పెద్దలు చెప్పటం జరిగింది.


రామాయణంలో చెప్పబడ్డ వానరులు దగ్గరదగ్గర మానవుల లాగే ఎంతో పరిణతి చెందినవారు. 

బహుశా ఇలాంటి వానరుల గుర్తులు చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు,   మానవులు ........వానరుల నుండి పరిణామం చెందారని అనుకుంటున్నారేమో ?


మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే ......అలా పరిణామం చెందలేదని చెప్పే శాస్త్రవేత్తలు కూడా బాగానే ఉన్నారు.

 1..... "AGAINST EVOLUTION "

2.......17 EVIDENCES AGAINST EVOLUTION.......అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వివరాలు ఉన్నాయి.

. ఇతర గ్రహాలలో జీవులు ఉన్నారని, ఆ జీవుల ద్వారా కూడా భూమిపై జీవం ఏర్పడి ఉండవచ్చని ఈనాటి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ( ఇతర గ్రహములలో  ఉన్నవారు  పురాణేతిహాసములలో  చెప్పబడ్డ  దేవతలు,  రాక్షసులు    .......కావచ్చునని  కొందరు  భావిస్తారు.)


జీవులలో పరిణామక్రమం గురించి డార్విన్ చెప్పినది కొంత వరకు   నిజమే కావచ్చు.  

  ఏదైనా  జీవి  తను  ఉన్న  పరిసరాల  నుంచి  కొత్త  ప్రదేశానికి  వెళ్ళినప్పుడు  ఆ  కొత్త  వాతావరణానికి  తగ్గట్లు  తనను  తాను  కొద్దిగా  మార్చుకుని జీవించినప్పుడు  ఆ  జాతి  అంతరించకుండా  ఉంటుంది.


 అలా   జీవించటానికి  అనుగుణంగా   కొద్దిపాటి  మార్పులు చేర్పులు    చెందటానికి  తగ్గ  శక్తిని ,  అవకాశాన్ని   దైవం  కల్పించి  ఉండవచ్చు.


 అంతే కానీ,  మనిషి కోతినుంచి పరిణామం చెందాడని  భావించటం తప్పేమో అనిపిస్తుంది.  మనిషి  అలా పరిణామం చెందినట్లయితే ఆ పరిణామం అతి నెమ్మదిగా  శాస్త్రవేత్తలు  చెప్పే  దాని  ప్రకారం  కొన్ని  లక్షల  సంవత్సరాలు   జరిగింది కాబట్టి ,....... ఆ పరిణామక్రమాన్ని అనుసరించి వివిధ ఆకారాల్లో శిలాజాలు పెద్దమొత్తంలో లభించాలికదా ! ( అలా లభించలేదట )....అతి తక్కువ శిలాజాల.. భాగాలు మాత్రం దొరికాయట.ఇది ఆశ్చర్యం కదా ! ( ఆ శిలాజాలు మనిషివో ? చింపాంజీలవో  ? లేక  అలాంటి  వేరే  జీవులవో ? ఎవరికీ తెలుసు? ) ... మిస్సింగ్   లింక్   అంటారట.


నేను నెట్లో కొన్ని వ్యాసాలు చదివితే నాకు అర్ధమయినంతలో ఏమనిపించిందంటే ,  కోతినుంచి మనిషి పరిణామం చెందిన విషయంలో కూడా శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. కొందరు శాస్త్రవేత్తలు కూడా మనిషి కోతినుండి పరిణామం చెందలేదు అని గట్టిగా అంటున్నారట.


శాస్త్రవేత్తలు  ప్రతిపాదించిన  చాలా  సిద్ధాంతాల  విషయంలో  వాళ్ళలో  వాళ్ళకే  భిన్నాభిప్రాయాలుంటాయి. 
ఏది నిజమో ? ఏది కాదో ?


 వీటన్నిటి బట్టి చూస్తే మనిషి కోతి నుండి పరిణామం చెందలేదని  అనుకోవచ్చు.

.....................................

ఈ  పరిణామక్రమం  గురించి  నేను  పాత  టపాలలో  రాసాను....
.................................

 Monday, November 21, 2011
పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... ఒకటవ భాగం.....


డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .


నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.


పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,


ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని   అన్నారు కదా..  పరిణామసిద్దాంతం   కొంతవరకూ   నిజమే కావచ్చు.


అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.


ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,

ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.


(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )


అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.


ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?


1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.


కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )


2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.


మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )


3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి కొద్దిగా  పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)


అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’


౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.


.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?
( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)


కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?

ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,


మానవులలో   జంతువుల శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.


ఉదా.. మానవుల్లో వ్యర్ధ భాగంగా భావిస్తున్న
coccyx ( tail bone ) గతకాలపు అవశేషం కాదేమో ?  జంతువుగా పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.... ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు , ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.


౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.


దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........
సీతాకోకచిలుక.

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.


దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".. ...Monday, June 11, 2012

1..నీటిపై తేలియాడుతూ రామాయణ ప్రవచనం..2... ఒక ప్రయాణం.

ఓం.జగన్మాతాపితరులకు  నమస్కారములు.

శ్రీశైల  మహాక్షేత్రంలోని  శివాజీ  స్ఫూర్తి  కేంద్రం  వద్దనున్న  సూర్యబలిజ  నిత్యాన్నదాన  సత్రంలో  విజయనగరం  జిల్లాకు  చెందిన  సత్యజ్ఞానానంద  దశాశ్రమ  పీఠాధిపతి  శ్రీ  యోగానంద  మహాభారతి  స్వామి  జలస్థంభన  విద్యను  ప్రదర్శించారట.....


మత్శ్యాసనంలో  నీటిపై  తేలియాడుతూ  రామాయణ  మహాకావ్యాన్ని  సుమారు  గంటకు  పైగా  ఉపన్యసించారట....ఇది  ఎంతో  గొప్ప  విషయం.  
 ఇలాంటివి    చూస్తుంటే    భారతీయ  విద్యలు  ఎంత  గొప్పవో  కదా  !  అని  ఆశ్చర్యంగా  అనిపిస్తుంది.  ఇంతటి  గొప్ప  విద్యలను  మనం  ఎంత  నిర్లక్ష్యం  చేస్తున్నామో  అని  బాధా  కలుగుతుంది.

* పై  విషయానికి  ఈ  క్రింద  రాసిన  విషయానికి  సంబంధం  లేదులెండి.

కొంతకాలం  క్రిందట   మేము  ఒక   అడవి  మార్గంలో  కారులో   ప్రయాణిస్తున్నాము. (  మాది  కొంచెం  పాత  కారు.  ) అలా     క్రమంగా    చీకటి  క్రమ్ముకుంది..  అడవి  ఇంకా  ఘాట్  రోడ్  కూడా ఉంది .  అలా  వెళ్తూ  ఉండగా    కొంచెం  సేపు  గడిచాక   నా  భర్త , మా  అబ్బాయి  నెమ్మదిగా   ఏదో   మాట్లాడుకుంటున్నారు.  విషయమేమిటో    చెప్పమని  నేను  అడగగా  ,    ప్రయాణానికి  ముందు  బండిని  చెక్  చేసే  తీసుకువచ్చాము. మెకానిక్   అంతా  బాగానే  ఉందన్నాడు .  కానీ ,  ఇప్పుడు  చూస్తే     కారు  ప్రాబ్లం  ఇస్తుందేమో  అని   అనుమానంగా  ఉంది  . అన్నారు..
 

   అలాగే  వెళ్తుండగా   కొద్దిదూరం  వెళ్ళాక  కారు  ఆగీఅగి..  వెళ్ళటం  మొదలయ్యింది.  అసలే  అడవిలో  రాత్రి  ప్రయాణం.  ఇక  కారు  ఆగిపోతే  ఏమిటి  మా  గతి  ? దేవుడే  దిక్కు.  అలాగే  నెమ్మదిగా    వెళ్తే  అడవి   దాటి  ఏదైనా    చిన్న  ఊరు  చేరుకోగలమన్న  మా  ఆశలను  భగ్నం  చేస్తూ  కారు  ఆగిపోయింది.  ఆ  పరిస్థితి  తలుచుకుంటే  ఇప్పటికీ  ఒళ్ళు  జలదరిస్తుంది. 


 

 కారు  తోయటానికి    మా  అబ్బాయి  క్రిందికి  దిగాడు.    నా  భర్త  డ్రైవింగ్  చేస్తున్నారు.  అమ్మాయి  లోపల  కూర్చుంది.   చుట్టూ  అడవి  కదా  !  రాత్రి  పూట   క్రిందికి  దిగాలన్నా  భయమే,.  రాత్రి  సమయంలో  అడవి  జంతువులు  తిరుగుతాయంటారు.   నేను  కూడా  క్రిందికి  దిగి  కారును   తోయటానికి  ప్రయత్నించాను.  

 

   ఘాట్  రోడ్    అని  ముందే  తెలుసు  కాబట్టి , నేను  ఇంటినుంచి " శ్రీపాద  శ్రీవల్లభ  సంపూర్ణ చరితామృతము " గ్రంధాన్ని  తీసుకువెళ్ళాను.  ఆ  గ్రంధాన్నీ  ఒక  చేత్తో  పట్టుకుని  కారు  దిగి  తోయటం  మొదలుపెట్టాను.   చుట్టూ  చీకటి,  నిశ్శబ్దం.   కారు  స్టార్ట్  కావటం  లేదు.

 ఇక  ఏం  చేయాలో  తెలియక  కారును  తోయటం  ఆపి  కారులో  కూర్చోబోతుండగా  .....మా  ఆశలకు  ఊపిరి   పోస్తూ  ....దైవం  దయవల్ల  కారు  స్టార్ట్  అయ్యింది.
  అలా   వెళ్తుండగా  మా  వెనుక  ఒక  R.T.C. బస్  వచ్చి  వెళ్ళింది.   కారును  వదిలి  అందులో  వెళ్దామనుకున్నాము.  కానీ  ,  మళ్ళీ  మా  కారులోనే    వెళ్ళాము.

  కానీ    ఆ  బస్సును  చూడగానే  మాకు  ధైర్యం  వచ్చింది.   దైవమే  మాకు  తోడుగా ఆ  బస్సును  పంపారేమో  అని  నాకు   అనిపించింది.     అలా   నెమ్మదిగా  అడవి  దాటి  ఒక  ఊరు  చేరాము.
  ఊరు  చేరే  వరకూ  కారు  ఆగకూడదని     దైవాన్ని  ఎంతలా  కోరుకున్నానంటే....ఆర్తితో  కూడిన  భక్తి  అంటే  అలాగుంటుంది  అనిపించింది.  . మనకి  కష్టసమయాల్లోనే  కదా  భక్తి  విపరీతంగా    కలుగుతుంది.
 
   ఊరులోకి  వచ్చాక  షాప్స్  మూసేసి  ఉన్నాయి.  మెకానిక్  లు  కనిపించలేదు.  ఒక  మెకానిక్  షాప్  బయట    ఫోన్  నంబర్   వ్రాసి  ఉంది.  అతనికి  ఫోన్  చేస్తే  అతను  వేరే  ఊళ్ళో  ఉన్నాడట.     మేము    ఫోన్  చేస్తే  విసుక్కోకుండా    తనకి  తెలిసిన  ఇంకొక  మెకానిక్
అడ్రస్   చెప్పి  అక్కడకు  వెళ్ళమన్నాడు. 
 

 అతను  చెప్పిన  అడ్రస్ కు  వెళ్ళి    కార్  చూపించాము.   కారు   పరిస్థితి  బాగుంటే  కారులో  వెళ్దాము.  లేకపోతే  కారును  అక్కడ  ఉంచి,  బస్  స్టాండ్ కు  వెళ్ళి   బస్సులో  వెళ్దాము  అనుకున్నాము.  

 

 ఆ  మెకానిక్    కారును   పరీక్ష  చేసి    ఇలాంటి  పరిస్థితిలో    ఘాట్  రోడ్     నుండి  ఎలా  రాగలిగారో  ఆశ్చర్యంగా  ఉంది   ,    ఇక   ప్లెయిన్   రోడ్      కదా   !  నెమ్మదిగా  వెళ్ళండి  ఏం  కాదు . అనగా,  మేము    బయల్దేరాము.   మొత్తానికి  దైవం  దయ  వల్ల  క్షేమంగా  ఇంటికి  చేరాము.    అలాంటి  సమయాల్లో  మాకు  ధైర్యం  చెప్పిన   ఆ  మెకానిక్  లు   భగవంతుడు  పంపినట్లే  అనిపించారు   మాకు.  
 

ఇంతకు  ముందు  కూడా  ఒకసారి  ఇలాగే  రాత్రి  సమయంలో  వెళ్తుంటే  జోరున  వాన  పట్టుకుంది.  ఆ  వానలో  కొండల  మధ్యన  కారు  ఆగిపోయింది. ఇక    సాయిసాయి .. అని  దైవ  ప్రార్ధన  చేయగా     దైవం  దయ  వల్ల     కారు  స్టార్ట్    అయ్యి  ఇంటికి  చేరగలిగాము. 

 

కారు  ఆగిపోయినప్పుడు  గుర్తొచ్చిన  అందరు  దేవుళ్ళనూ  ప్రార్ధించాము.  పేరు  ఏదైనా  అందరు  దేవుళ్ళు  ఒకటే   . 

   గ్రంధాలను  ఎప్పుడూ  పట్టుకెళ్ళటానికి  కుదరదు  కదా!   దైవాన్ని  మనసులో   స్మరించుకున్నా  చాలు .

 
అంతా  దైవం  దయ.  

Friday, June 8, 2012

హరిశ్చంద్రుని గురించి, మరియు ఇంకా కొన్ని విషయాలు....టపా చివర....


లోకహితం  కోసం  రాజ్యాన్ని  తృణప్రాయంగా  వదిలేసి  కష్టాలను  ఆహ్వానించిన  హరిశ్చంద్రుడు , వారి  కుటుంబసభ్యులు  ఎంతో  గొప్పవారు. 

  తరతరాల  నుంచి  ఎందరికో   స్పూర్తినిచ్చింది  హరిశ్చంద్రుని  చరిత్ర.  ......ఈ   కధ    తనకు  జీవితంలో  ఎంతో  స్పూర్తినిచ్చిందని  గాంధీ  గారు  చెప్పారు.  హరిశ్చంద్రుని  వంటి   త్యాగమూర్తుల  నుండి  స్పూర్తిని  పొంది   ఎందరో   వ్యక్తులు  తామూ  తమకు  చేతనైనంత   త్యాగాలు  చేసారు.


  ధర్మం  కోసం  రాజ్యసంపదను   కూడా   అవలీలగా    వదిలేసిన  హరిశ్చంద్రుని  వంటి వారి  గురించి  తెలుసుకోవటం  వల్ల,  మోసంచేసి    ఇతరులను  సంపదను  కూడా   మింగేసి   బతికే  వారి  సంఖ్య   కొంతైనా  తగ్గే  అవకాశం  ఉంది. .(  అలాంటి  వారు  మంచిగా  మారే  అవకాశం  కూడా  ఉంది.  )    


 రాజే  అసత్యవంతుడైతే , యధారాజా  తధాప్రజా   అన్నట్లు ...సమాజం  అబధ్ధాలు,  మోసాలతో  అస్తవ్యస్తమైపోతుంది.  ఆ  పాపఫలితంగా  ప్రజలు   నరకానికే  పోతారు.   ఇలాంటి  పాపాలు  ప్రజలు  చెయ్యకుండా  వారికి    ధర్మాన్ని  నేర్పించటానికి   హరిశ్చంద్రుడు   వారి  కుటుంబసభ్యులు    ఎన్నో   కష్టాలను  సహించారు.  

  హరిశ్చంద్రుడు, వారి  కుటుంబసభ్యులు  బాధలు  పడటం  బాధాకరమే  కానీ, ఇలాంటి  వారి  త్యాగాల  వల్ల  లోకం  ఇంకా  చక్కగా    ఉంది.


  స్వాతంత్రోద్యమం   సమయంలో  ఎందరో దేశ భక్తులు   తమ  ఆస్తులను  కోల్పోయి, తమ    కుటుంబసభ్యులను  వారి  మానాన  వారిని  వదిలి ,  తాము  దేశం   కోసం    జైలులో  గడిపారు.  భగత్  సింగ్  వంటి  యువకులు  తమ  నిండు జీవితాన్ని  కోల్పోయారు. ఇలాంటి వారి  కుటుంబసభ్యులు   కూడా  త్యాగాలు  చేయవలసి  వస్తుంది.


 ఇలాంటి  త్యాగమూర్తులందరి  త్యాగాల ఫలితంగా  ఇప్పుడు  మనందరం  స్వేచ్చగా  జీవిస్తున్నాము. 


   ( ఎందరో  పేదలు  తిండిలేక  అల్లాడుతుంటే  , 
   అర్ధనగ్న దృశ్యాలు   ఉన్న   సినిమాలు ,  అర్ధరాత్రి   పాటలు    వంటివి  చూస్తూ  కోటిరూపాయల  కార్లు,  లక్షల  విలువ  చేసే  నగలు  ధరించి  కులాసాగా  బతుకుతున్నాము.. )
.............................

హరిశ్చంద్రుని  కధలోని  కొన్ని  విషయాలు.
................................

.....విశ్వామిత్రుడు  తన  బాకీ  తీర్చమని  అడిగినప్పుడు,  హరిశ్చంద్రుడు  తన   భార్యతో ...

దేవీ...సత్యానికే  కట్టుబడి  ఉందాం.  అయితే   ఈ  రుణం   తీర్చే  ఉపాయమేమిటి  ..?  అని  వారిద్దరూ  పరిపరివిధాలా  ఆలోచిస్తారు. 


విశ్వామిత్రుడు   వచ్చి  హరిశ్చంద్రునితో  ........

రాజా !  ధైర్యంగా   బతకాలనుకుంటే  ముందు  నా  అప్పు  తీర్చు.  సత్యానికి  కట్టుబడి  ఉండటమంటే  మాటలనుకొంటున్నావా  ? సత్యం  వల్లనే  సూర్యుడు  ప్రకాశిస్తున్నాడు.  సత్యం  వల్లనే  భూగోళం  నిలబడింది. సత్యంలోనే  ఉత్తమ  ధర్మం  ఉంది.  సత్యంలోనే  స్వర్గమూ  ఉంది. నూరు  అశ్వమేధాలనీ   ఒక  సత్యాన్ని  చెరొకవైపూ   వేసి  తూచితే  సత్యం  వైపే  మొగ్గు  ఉంటుంది.  ......సూర్యుడు  అస్తమించేలోగా  నా  దక్షిణ  నాకివ్వకపోయావో  శపించానన్నమాటే.....అని  బెదిరించి  వెళ్ళిపోయాడు.


ఆ  తరువాత దక్షిణ  ఇవ్వటం    ఎలాగా  ?  అని   భార్యాభర్త  ఎన్నో  విధాలుగా  ఆలోచిస్తారు.

 అప్పుడు   హరిశ్చంద్రుని  భార్య  తనని  ఎవరికైనా  అమ్మి  అప్పు  తీర్చమని  చెప్పి, ..... నాధా  !  నా  మాట  విను.  కాదనకు.  ఆట్టే  వ్యవధి  లేదు.  సూర్యాస్తమయమే  గడువు. విప్ర  శాపాగ్నిలో  దహించుకుపోయి  నీచత్వం  పొందకు.  నన్ను  అమ్ముతున్నది  జూదం  కోసం  కాదు,  మద్యం  కోసం  కాదు,  రాజ్యం  కోసం  కాదు,  భోగం  కోసం  కాదు,  గురు  ఋణం  తీర్చడానికి,  సత్యవ్రతం  సఫలం  చేసుకోడానికి,  కాబట్టి  కించపడవలసింది  లేకపోగా   ఇది  గర్వించదగిన  అంశం.  దయచేసి  నా  మాట  ఆలకించు.  నన్ను  ఎవరికైనా  అమ్మేయ్.  ఇలా  ఆమె  పోరగా పోరగా   కట్టకడపటికి   గతిలేక  హరిశ్చంద్రుడు  అంగీకరించాడు.తరువాత  విశ్వామిత్రుడు  వచ్చినప్పుడు   భార్యను,  కొడుకును  అమ్మగా  వచ్చిన  సొమ్మును  విశ్వామిత్రునికి  ఇవ్వగా  ఇంకా  కొంచెం   బాకీ    మిగిలే  ఉంటుంది.

మిగిలిన  బాకీని    తీర్చటం  గురించి  విశ్వామిత్రుడు  హరిశ్చంద్రుని  తీవ్రంగా  వత్తిడి  చేస్తాడు.  హరిశ్చంద్రుడు  గడువు  పెంచమని  అడిగినా  ఒప్పుకోడు.

హరిశ్చంద్రా  !  గడువు  పెంచడం  కుదరదు.  ఈ  రోజుకి   ఇంకా  నాల్గవ  భాగం  మిగిలి  ఉంది.  అది  ముగిసేలోగా  నువ్వు  సంపాదించడమూ   నాకు  చెల్లించడమూ  అవ్వాలి.  అంతకు  మించి  క్షణం  ఆగను.  నువ్వు  ఏమి  చెప్పకు  నేను  వినను..అంటాడు  విశ్వామిత్రుడు.హరిశ్చంద్రునికి....  తనను  తాను  అమ్ముకోవడం  తప్ప  వేరే  ఉపాయం  కనిపించలేదు.  అదే  అరుగుమీద  నిలబడి    ,  తలదించుకుని   బిగ్గరగా  అరిచాడు.  ......"సేవకుడుగా   నన్ను  కొనుక్కుని  సుఖపడదలచిన  వారు   ఉంటే  త్వరపడండి.  సూర్యాస్తమయానికి      ఇంక  ఒక  జాము  మాత్రమే  ఉంది.  "  అని  ప్రకటించాడు.


వాక్యం  ముగిసే  సమయానికి  యమధర్మరాజు  ఒక  చండాలుడుగా  అక్కడికి  వచ్చాడు.  విశ్వామిత్రుని  బాకీ    తీర్చేస్తాడు  హరిశ్చంద్రుడు.  విశ్వామిత్రుడు  అటువెళ్ళగానే  ప్రవీరుడు  హరిశ్చంద్రుడి   చేతులకి  బంధం  వేసి  తాడుకొస  చేత్తో  పట్టుకున్నాడు. ...........అతడిని  ప్రవీరుడు  తన  పేటలోకి  లాక్కుపోయాడు. గుడిసె  ముందు  నిలబెట్టాడు.  కాళ్ళకు  కూడా  బంధం  వేశాడు.   అలా  వదిలేసి  తాను    వెళ్ళి  గుడిసెలో  దూరి  కుక్కి  మంచం  మీద  హాయిగా  పడుకుని  నిద్రపోయాడు.  .........అయిదవనాడు  చండాలుడికి  రవ్వంత  దయ  కలిగినట్టుంది.  బంధాలు  విప్పేశాడు.


(  తరువాత  శ్మశానంలో  కాటికాపరిగా  పని  అప్పగించాడు.)

హరిశ్చంద్రుని  భార్య  బ్రాహ్మణుని  ఇంట  పని  చేసుకుని  జీవిస్తోంది.  ఒకరోజు  హరిశ్చంద్రుని  కుమారుడు 
రోహితుడు   విప్రబాలురతో  అడవికి  వెళ్ళి  తిరిగి  వచ్చేటప్పుడు  సమిధల  మోపును  మోస్తూ , ఆ  బరువు  వల్ల   అందరికన్నా  వెనకకా  నడిచి  వస్తుండగా,   ఒక  చెరువును  చూసి  దాహం  వేసి  ఆ  మోపును  ఒక  పుట్టవద్ద  జారవిడిచి , దాహం  తీర్చుకుని  మోపును  ఎత్తుకోబోతుండగా ,   విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు  ఒక  కృష్ణసర్పం  రోహితుణ్ణి  కాటు  వేస్తుంది.  అమ్మా  ! అని   దిక్కులు  అదిరేలా     అరిచి  పిల్లవాడు  పడిపోతాడు .ముందు  వెడుతున్న  బాలురు  ఈ  కేకను  గుర్తు  పట్టి    రోహితుడికి  ఏమో  అయ్యిందని      పరుగుపరుగున  వచ్చారు.  ......(  జరిగినదంతా  చూసారు.) ....భయం  వేసింది. .అందరూ  ఒక్క  ఉదుటున  పరుగు  లంకించుకున్నారు. రొప్పుతూ  రోజుతూ  ఇంటికి  వచ్చారు.  వస్తూనే.....


దాసీ  !  దాసీ  ! మాతో  ఆడుకోడానికి  వచ్చాడు  కదా  ! రోహితుడు  అడవిలో  పాము  కరిచింది  చనిపోయినట్టున్నాడు . అని  చెప్పేసి  లోపలికి  వెళ్ళిపోయి  గదిలో  దూరి  తలుపులు  వేసేసుకున్నారు. కుమారుని  మృతి  విని  శోకిస్తున్న  హరిశ్చంద్రుని  భార్యను  ఆ  విప్రుడు  ,

 ఏమిటే  దాసీదానా  !  సందెవేళ  ఈ  శోకన్నాలు?......ఇలా .... మాట్లాడతాడు.

ఇంకా.......

....దుష్టులారా  !  కోటి  నిష్కాలు  నీ  మొగుడి  మొగాన  పోసి  కొన్నాను.  ఇంకా  ఏడాది  కాలేదు.  అప్పుడే  నన్ను  ముంచేసేట్టున్నావు. ఇంటిపనులు  చెయ్యటానికి  అంత  ఓపిక  లేని  దానివైతే  నా  సొమ్ము    ఎందుకు  తీసుకున్నారే    ?  వెళ్ళు,  పట్టుకురా  నా  డబ్బు.  నా  కోటి టంకాలూ  నాకు  పడేసి  ,  నీ  దారిన  నువ్వు  పో  కొడుకును  కూడా  తీసుకుపోయేట్టయితే   ఆ  ధనం  కూడా  తెచ్చి  ఇచ్చేసేయ్.  డబ్బు  కావాలి ,  చాకిరీ  మాత్రం  పనికిరాదు. ..ఎలా    కుదురుతుంది  ?  అవ్వా బువ్వా  కావాలంటే  వస్తాయా  ?  ఇలా .... మాట్లాడతాడు.   


అప్పుడు   ఆమె.,.... నేను  పనిచేయలేక  ఏడవటం  లేదయా!  నా  కొడుకుని  పాము  కరిచిందట.  అడవిలో  పాము  కరిచిందట.  చచిపోయాడుట.  వాణ్ణి  చూసొస్తానయా! ఒక్కసారి  ఈ  పూటకి  అనుమతి  ఇవ్వు...........అని  అడిగినా. ....   ఓసీ    !  నీచురాలా దుర్వార్తలు  చెప్పకు.  కల్లబొల్లి  కబుర్లూ  ఏడుపులూ   నా  దగ్గర  కాదు. పని  ఎగ్గొట్టడానికి  మీరు  ఎంతలేసి  అబద్దాలన్నా  ఆడతారు. ...........ఇలా  మాట్లాడతాడు.

  ఇంటి  పని  అయిన  తరువాత  , 

ఒసేవ్ !  ఇప్పుడు  వెళ్ళు.  నీ  కొడుకును  చూసుకో.  చచ్చిపోయాడు అంటున్నావుగా.   వెళ్ళు   దహనక్రియలూ  అవీ   పూర్తి  చేసి  త్వరగా  వచ్చెయ్.  తెల్లవారుజామున పాచిపనికి  అందుకోవాలి  సుమా  !  ఆలస్యం  అయితే  ఊరుకునేది  లేదు.  వెళ్ళిరా....అన్నాడు.


  హరిశ్చంద్రుని  భార్య  అడవికి  వెళ్లి  ,   కొడుకు  మృతదేహాన్ని    శ్మశానికి  తీసుకురావటం ,  అక్కడ   భార్యాభర్తలు  ఒకరినొకరు   గుర్తుపట్టి ,  ఇక  ఈ  బాధలు  పడలేమని  నిర్ణయించుకుని   మరణించటానికి  సిధ్ధపడగా ,  దేవతలు  ప్రత్యక్షమయి  వారి  కుమారుని  బతికించి  వారికి  ఎన్నో  వరాలనిస్తారు. 

హరిశ్చంద్రుడు . వారి  కుటుంబసభ్యులు  కూడా  ఎన్ని     కష్టాలు  ఎదురైనా ,   ధర్మరక్షణ  కోసం   సహించి ,   చరిత్రలో  నిలిచిపోయారు. (  ఈ  విప్రుడు  ఇదంతా  విశ్వామిత్రుని  ఏర్పాటే.  ఇలా  సతాయిస్తే  తట్టుకోలేక   హరిశ్చంద్రుడు  మాట  తప్పుతాడని   విశ్వామిత్రుని  అయిడియా..)    

  (  హరిశ్చంద్రుని  భార్యను  కొన్న  విప్రుడు    తన  డబ్బులు  తనకు  ఇచ్చేసి  హరిశ్చంద్రుని  భార్యను,  కొడుకును  వెళ్ళిపొమ్మనటం  గమనిస్తే   ....  డబ్బు  ఇస్తే  హరిశ్చంద్రుడు  తన  భార్యా ,  కుమారుని  తిరిగి  తెచ్చుకోవచ్చు  కాబట్టి  ..... ఇది  అమ్మకం  కాదు   అనిపిస్తుంది.  )

 
.....................................

.   ఇంకా  కొన్ని  విషయాలు.......
....................................

1... Yuga - Wikipedia, the free encyclopedia............
Sri Yukteswar's teachings on the yugas............అన్న  దగ్గర  చూస్తే  సత్యయుగం.,  త్రేతాయుగం  ,ద్వాపరయుగం,  కలియుగం  .....వీటి    గురించి   వివరాలున్నాయి. 
.........................
2...

Floating Buddhist Monk Woman of Kanchanaburi, ,Thailand

Woman of Kanchanaburi, ,Thailand ....ఇది  వీడియో.
............