koodali

Wednesday, June 20, 2012

భరతుడు ( జడభరతుడు.)


*భరతుడు  (  జడభరతుడు.) ...... సూర్యవంశానికి  చెందిన  ఈయన   గొప్ప  చక్రవర్తి.......ఈ  భరతుని    (జడభరతుని )  గొప్పతనం  గురించి  ఎన్నో  ప్రాచీన  గ్రంధాలలో  ఉందట..   జైన  మతంలో  కూడా  వీరి  గురించి  వివరములు  ఉన్నాయట.

 

ఈయన   గొప్ప  దైవభక్తుడు. ఈయన  సూర్యవంశానికి  చెందిన  వారట.   అయితే  సూర్యవంశానికి  చెందిన  దశరధమహారాజుకు  వీరికి  ఎలాంటి  బంధుత్వం   ఉన్నదో  ఆ  వివరాలు  నాకు  తెలియవు.

 

  ఒకరోజు  భరతుడు  ప్రమాదకర  పరిస్థితిలో  ఉన్న  ఒక  జింక పిల్లను చూస్తారు.  ఆ  జింకపిల్లను    రక్షించి  అల్లారుముద్దుగా  పెంచుకుంటారు. జింక  అంటే  ఎంతో  ఇష్టాన్ని  పెంచుకుంటారు.    అప్పటివరకూ  ఉన్న    దైవప్రార్ధన    తగ్గిపోతుంది.  భరతుడు  తన  అవసాన  దశలో  కూడా  జింక  గురించి   ఆలోచిస్తూ   మరణిస్తాడు.


 
 భరతుడు   తరువాత  జన్మలో  జింకగా  జన్మిస్తాడు.  పూర్వపుణ్యం  వల్ల   ఈ  జింకగా  జన్మించిన   భరతునికి     తన   గతజన్మ  గుర్తు  ఉంటుంది  . గతజన్మలో  తాను  మోక్షం  పొందనందుకు   బాధపడుతుంది.

 

జింక  జన్మ  తరువాత  భరతుడు    ఒక  బ్రాహ్మణునికి  కుమారుడుగా  జన్మిస్తాడు.   ఈ  జన్మలో  కూడా  భరతునికి      తన  గత  జన్మల  గురించి  గుర్తు  ఉంటుంది.  ఈ  జన్మలో నైనా     మోక్షం  పొందాలని  భరతుడు  గట్టిగా  అనుకుంటాడు. 

 

 అతనికి  అన్ని  విద్యలు  వచ్చినా  ఏమీ  తెలియని  వాడిలా  అమాయకంగా  ప్రవర్తిస్తాడు.  అందరూ  అతనిని  జడభరతుడు  అంటుంటారు.



 ఇతరులు  తిట్టినా,  అవహేళన  చేసినా    బాధపడడు.  పొగిడినా  పొంగిపోడు.  ఆహారం  యొక్క  రుచులు  పట్టించుకోడు.


   జడభరతుడు  ఒకసారి   అడవిలో   తిరుగుతుండగా  కొందరు  దొంగలు  పట్టుకుని  కాళికాదేవికి  బలి  ఇవ్వాలని    ప్రయత్నించగా  , అమ్మవారు  ప్రత్యక్షమయ్యి  ఆ  దొంగలను  చంపి   భరతుణ్ణి  రక్షిస్తుంది.  
 

భరతుడు     అలా  వెళ్తుండగా  ఒక  రాజుగారి పల్లకిని  మోయటానికి  ఒక బోయీ      కావలసి  వచ్చి  ఈ  జడభరతుణ్ణి  పిలుస్తారు  .


  భరతుడు  ఒక  ప్రక్క  పల్లకిని  మోస్తూ  దారిలో  కాలిక్రింద  చీమలు  చనిపోతాయని  భావించి ,  వాటిని  త్రొక్కకూడదనే  ప్రయత్నంలో  కొంచెం  అటూఇటూగా  నడుస్తుంటాడు.  అందువల్ల  పల్లకీ   కుదుపులు  వస్తుంటాయి.


  ఇదంతా  చూసి  పల్లకిలో  కూర్చున్న  రాజు  భరతుణ్ణి  విసుక్కోవటం  జరుగుతుంది. 
 
 అప్పుడు  జడభరతునికి  రాజుకు  మధ్య  ఆసక్తికరమైన  సంభాషణ    జరుగుతుంది.  



 భరతుని  మాటలు  విన్న   రాజు ,  జడభరతుణ్ణి  గొప్ప  జ్ఞానిగా  గుర్తించి   పల్లకి  దిగి  వచ్చి  క్షమించమని  అడుగుతాడు.  ఆ  జన్మ  తరువాత  జడభరతునికి  మోక్షం  లభిస్తుంది. ఈ  కధను  చాలా  క్లుప్తంగా  వ్రాసాను.
 

 ఈ  కధలోని  భరత  చక్రవర్తి  వల్లే  భారతదేశానికి  ఈ  పేరు  వచ్చిందని  కొందరంటారు.   శకుంతలా  దుష్యంతుని  కుమారుడైన  భరతుని  వల్ల  కూడా    భారతదేశానికి  ఈ    పేరు  వచ్చిందని  కొందరంటారు...  


జడభరతుడు   శకుంతలాదుష్యంతుల  కుమారుడైన  భరతుని  కన్నా  పూర్వులు..

నేను  ఎక్కువ  గ్రంధాలు  చదవలేదండి.  నాకు  తెలిసినంతలో  రాసాను.  పొరపాట్లు  ఉంటే  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


4 comments:

  1. మొన్న మీరు జడభరతుడు అన్నపుడు రాదామనుకున్నా, బాగా చెప్పేరు

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    జడభరతుడు ఎంతో గొప్ప జ్ఞాని. అలాంటి మహాభక్తులను తలచుకున్నా ఎంతో పుణ్యం వస్తుంది. నేను చాలా క్లుప్తంగా రాసాను.

    మీరు ఎన్నో గ్రంధాలు చదివి ఉంటారు కాబట్టి , మీరు వ్రాస్తే మాలాంటి వారికి గ్రంధాలలో ఉన్న మరెన్నో విషయాలు తెలుస్తాయి.

    మీకు వీలయితే తప్పక జడభరతుని గురించి వ్రాయండి.

    ReplyDelete
  3. మీరు రాసిన విషయం చాలా విలువైనది. నాకు చాలా కాలంగా భరతుల మద్య వ్యత్యాసం తెలిసేది కాదు. సర్, మీ పేరు తెలీలేదు సరిగా అర్ధం కాలేదు, మంచి విషయాలు రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నాపేరు అనూరాధ.

      Delete