koodali

Monday, June 25, 2012

కొన్ని విషయములు.....ఇంకా,. వ్యాఖ్య.....కూడా పోస్ట్ లో...

  అద్భుతమైన   అమరనాధ్  యాత్ర  ప్రారంభమయింది.    దైవం  దయ వల్ల కొంతకాలం  క్రిందట   మేము  అమరనాధ్  యాత్ర,  వైష్ణవీదేవి  యాత్రలు  చేసి  వచ్చాము.
..................

 
నిన్నటి  టపాలో   ఆరోగ్యం   గురించి   కొన్ని  విషయాలను    వ్రాసాను.  ఆరోగ్యమే  మహాభాగ్యం  అన్నారు  పెద్దలు.
 

అనారోగ్యం  రావటానికి  ఎన్నో  కారణాలు  ఉంటాయి.  వ్యక్తులు   పూర్వం  చేసిన  పాపాల  వల్ల  కూడా  అనారోగ్యం  వస్తుందట.  



పాపకార్యాలను  చేయటం  మాని ,    దైవప్రార్ధన,  ఇతరులకు  సహాయం  చేయటం  , వంటి  పుణ్యకార్యాలను  ఆచరిస్తూ  వైద్యసహాయం   తీసుకోవటం   వల్ల  ఆరోగ్యాన్ని  తిరిగి పొందవచ్చట.
 

అనారోగ్యం  పోవాలంటే   మందులు  వాడుతూనే, రుద్రాక్షధెరపీ,  దైవప్రార్ధన,  యోగా  వంటివి  చేస్తూ  ఆహారవిహారాల్లో  జాగ్రత్తలు  పాటిస్తే   రోగాలు  తగ్గే  అవకాశం  ఉంది.

 జాగ్రత్తలు  పాటించకపోతే  అంతగా  ఫలితం   కనిపించదు.

 

ఉదా......ఊపిరితిత్తుల  జబ్బు  ఉన్న  వ్యక్తి  బోలెడు  రుద్రాక్షమాలలు  ధరించి  ఆపకుండా  సిగరెట్లు    పీలుస్తూ  ఉంటే  ఎన్ని  రుద్రాక్ష  మాలలు  వేసుకున్నా,  ఎంత  యోగా  చేసినా,  ఎన్ని   మందులు  వాడినా  జబ్బు  తగ్గదు  కదా  ! 

 

సిగరెట్ ను    పీల్చే వారితో   పాటు  ప్రక్కన  ఉన్నవారికి  కూడా  ఆ  పొగ  వల్ల  జబ్బులు  వస్తాయట.  



అలాగే  కొందరు  చేస్తున్న  వాతావరణ  కాలుష్యం  వల్ల     చక్కటి  జీవనసరళితో  ఎంతో  జాగ్రత్తగా  ఉండే  వారికి  కూడా   జబ్బులు  వస్తున్నాయి.   రోగాలు  తగ్గాలంటే    వాతావరణ  కాలుష్యాన్ని  పెంచే  విధానాలను  ప్రోత్సహించకూడదు.
 

మాకు  చుట్టుప్రక్కల  ఉండే  ఒక  ఆమెకు , సడన్  గా  కాన్సర్  అని  బయటపడింది.  కొన్ని  నెలలలోపే  ఆమె  మరణించింది.  కాన్సర్  అని  తెలియక  ముందు  ఆమెకు  ఆ  జబ్బు  ఉన్నట్లుగా    లక్షణాలు  ఏమీ  తెలియలేదట.  ఎంతో  ఉత్సాహంగా  తిరిగేది.  ఈ  రోజుల్లో  ఇలా  జబ్బు  ముదిరేవరకూ  తెలియటంలేదు.  



 ఇంకొక  ఆయన  ఉద్యోగరీత్యా  కుటుంబానికి  దూరంగా  ఉంటున్నారు.  ఆయన  వేళకు  సరిగ్గా   తినీతినకా  అనారోగ్యం  పాలై  మరణించారు. 



నేను  ఇలాంటి  విషాదవార్తలు  వ్రాస్తున్నానని  తప్పుగా  అనుకోవద్దండి. 

ఎందుకంటే,  ఆరోగ్యమే  మహాభాగ్యం  .  ఆరోగ్యం  ఉన్నంతవరకే  మనం  ఏమైనా  చేయగలం.  అనారోగ్యం  వస్తే    బంధువులే  సరిగ్గా  పట్టించుకోరు.   అంటే,   ఈ  రోజుల్లో  ఎవరికీ  సమయం  చాలటం  లేదు  కదా  ! 

 

అందుకని  అందరూ     ఆరోగ్యాన్ని   జాగ్రత్తగా  కాపాడుకోవాలి.   సంపాదన  అంటూ  ఒళ్ళు  హూనమయ్యేంతగా  పనిచేసి  ఆనక  అనారోగ్యం  వస్తే  ఎంత  డబ్బు  ఉన్నా    ఉపయోగం  ఉండదు  కదా !
 
..................

 
* "ఏక పత్ని "వ్యవస్థ ఎలా ఎర్పడినది?    అన్న   "  సుభద్ర కీర్తి  "  గారి  టపా  గురించి ......... నా  అభిప్రాయాలను ,    వ్యాఖ్యలను 
దయచేసి    చదవండి......

* వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట.

మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !



ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి..... .వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.



ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు......ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో....)



పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు. )


పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !



.రామాయణంలో రావణాసురుడు అతిధి ( భిక్షువు ) రూపంలో శ్రీరాముని ఇంటికి వచ్చి సీతాదేవిని ....ఆశించాడు. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు.
 


 విష్ణుదేవుని  అంశ  అయిన  శ్రీ రాముడు రావణాసురుని వంశాన్నే నాశనం చేసి , తద్వారా పరాయి స్త్రీని కోరుకోవటం అధర్మమని లోకానికి చాటి చెప్పారు....

( హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసి వచ్చిన తరువాత సీతాపహరణం గురించిన విషయాలు తెలిసిన తరువాత రాముడు రావణాసురుని సంహరించారు. )
 

సుభద్రకీర్తి గారు వ్రాసిన కధలో ..... అలా జరగటానికి వెనుక ఏవో సామాజిక కారణాలు ఉండి ఉంటాయి.


 బహుశా శ్వేతకేతు అనే వారు ఏకపత్నీవ్రతాన్ని పునరుద్ధరించి ఉంటారు.

ప్రాచీన కాలంలో కూడా కొందరు కొన్ని మూఢాచారాలను పాటించినట్లుగా తెలుస్తుంది.

ఉదా.. తమ ఇంటికి అతిధి వస్తే ఆ అతిధిని  గౌరవించి, అతిధి ఏం కోరినా ఇవ్వాలనే పద్ధతిని కొందరు పాటించేవారన్నట్లుగా తెలుస్తుంది.

ఉదా..అతిధి ఇంటి యజమాని భార్యను కోరుకుంటే కూడా ఆ కోరికను తీర్చే విధంగా పద్ధతి ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇలాంటి పద్ధతి ఖచ్చితంగా మూఢాచారమే.ఇలాంటివాటిని ఖండించాలి.

ఎంత గొప్ప స్థాయి వారైనా కూడా మూఢాచారాలను పాటిస్తే వారిది తప్పే.

అతిధిని గౌరవించాలి. అలాగని వాళ్ళు ఏం కోరితే ఆ కోరికను తీర్చాలనుకోవటం సరైన పద్ధది కాదు.  

ఉదా.. శ్వేతకేతు కధను గమనిస్తే.. ఇలాంటి మూఢ పద్ధతిని నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి పద్ధతిని నిలిపివేసి శ్వేతకేతు మంచి పని చేసారు. 

అయితే, ప్రాచీన గ్రంధాలలో కూడా కొన్ని మార్పులుచేర్పులు జరిగి ఉండవచ్చని అంటారు.అలాంటి మార్పులుచేర్పులను ప్రక్షిప్తాలు అంటారట. 

శ్వేతకేతు కధలోని మూఢాచారం విషయం.. ప్రక్షిప్తమా ? కాదా ? అనేది తెలియదు. 

లోకహితం కోరి ఎన్నో ధర్మాలను ఏర్పరిచి పెద్దలు లోకానికి అందించారు. మానవులు తమ మనస్సును అదుపులో పెట్టుకోలేక పోవటం వల్ల, లేక పరిస్థితుల ప్రాబల్యం వల్ల, లేక మరేవో ఇతర కారణాల వల్ల ....... లోకంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. తద్వారా ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు.


మానవులకు అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని పొందాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి చేతనైనంతగా ప్రయత్నించాలని పెద్దలు చెప్పటం జరిగింది. మనస్సు అదుపులో ఉండాలంటే దైవకృపను పొందటం అవసరం.. దైవకృప లభించాలంటే సత్ప్రవర్తన అవసరం.



ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment