koodali

Friday, June 22, 2012

దైవప్రార్ధన ,రుద్రాక్షలు ,యోగ....ఆరోగ్యం.

ఓం,
శ్రీ లలితా దేవి సహస్రనామ  స్త్రోత్ర  పఠనం   ,   అందులోని  కొన్ని  నామములను  ప్రత్యేకంగా  పారాయణం  చెయ్యటం  వల్ల  అనారోగ్యమును  పోగొట్టుకోవచ్చని  పండితులు  చెబుతున్నారు.

 

శ్రీ సూర్యనారాయణస్వామి  (  సూర్యుడు  )  ఆరోగ్య  ప్రదాత.  రోజూ  కొద్దిసేపైనా  సూర్యరశ్మి  శరీరానికి  తగలటం  ఎంతో  మంచిది.  సూర్యనమస్కారాలు  ,  సూర్య స్త్రోత్ర   పఠనం వల్ల  అనారోగ్యమును  పోగొట్టుకోవచ్చని  పండితులు  చెబుతున్నారు.

 

రుద్రాక్షలు  ఎంతో  మహిమ  గలవని  పెద్దలు  చెప్పటం  జరిగింది.  రుద్రాక్ష  ధారణ   వల్ల  అనారోగ్యం  దూరమవుతుందని  కూడా  అంటారు.

 

 రుద్రాక్షల  మహిమ  గురించి  ,  వాటివల్ల  అనారోగ్యం    తగ్గటం  గురించి     విన్న  తరువాత   నాకు  ఏమనిపిస్తుందంటే ,  కాన్సర్  వంటి  రోగులకు  ఈ  రుద్రాక్ష  ధెరపీ  ప్రయత్నిస్తే   బాగుంటుంది  కదా  !  అనిపించింది.  



అయితే  డూప్లికేట్   రుద్రాక్షలు    కాకుండా  అసలైన  రుద్రాక్షలతో  ఈ  ప్రయత్నం  చేస్తే  చక్కటి  ఫలితాలు  వస్తాయి. రుద్రాక్షలతో  తయారయిన  పిరమిడ్  ఆకారపు  కప్పు  ఉన్న  మండపాలలో  రోజూ  కొద్దిసేపు  ధ్యానం  చేయటం  ఎంతో  మంచిదట.
 

   రుద్రాక్షల  వల్ల  కాన్సర్  వంటి  జబ్బులు  కొంతయినా  తగ్గు  ముఖం  పడితే  బాగుంటుంది.     డాక్టర్స్  కూడా  మందులు    ఇచ్చి  ఆహారవిహార  విషయాల్లో  నియమాలను  చెబుతారు  .



  మందులు  వేసుకుంటూ  మన  ఇష్టం  వచ్చినట్లు  ఏదిపడితే అది  తిని  తిరిగితే  రోగం  తగ్గదు  కదా  !  రోగాలు  తగ్గాలంటే   రుద్రాక్ష  ధెరపీతో  పాటూ   ఆహారవిహారాల్లో  కూడా  చక్కటి  నియమాలను  పాటించాలి. 


 (   ఈ  రుద్రాక్షలను  అన్ని  వేళల్లోనూ  శరీరంపై  ధరించవచ్చునా  ?  అనే  విషయాలు  నాకు  అంతగా  తెలియవండి.  ) 

 

 ఏ  ఆధునిక  వైద్యానికి  తగ్గని  జబ్బులు  యోగా    వల్ల  తగ్గాయని  కొందరు  ప్రముఖులు   తమ  అనుభవాల  ద్వారా  చెబుతున్నారు.


B K S Iyengar - Home

  BKS Iyengar.....అనే ఆయన  బాగా  పేరున్న  యోగా  గురువు.  యోగా   వంటివి    నిపుణులైన  వారి  వద్ద  నేర్చుకుని  మాత్రమే  చేయాలి.  ఇదే  అసలు  సమస్య.  ఈ  రోజుల్లో  ఎవరు  అసలు  నిపుణులో  ఎవరు  నకిలీ  వాళ్ళో  సరిగ్గా  తెలియటం    లేదు.  

 
 ఈ  రోజుల్లో  కాన్సర్  వంటి  జబ్బులకు  సరైన  మందులు  లేవు. ఆయుర్వేదంలో కాన్సర్ ను  రాచకురుపు  అంటారు.  కాన్సర్ కు   ఆయుర్వేదంలో  మందు  ఉండే  ఉంటుంది.    అయితే  దాని  గురించి   ఇప్పుడు  మనకు  తెలియదు.  మన  నిర్లక్ష్యం  ఫలితంగా  ఎంతో   ప్రాచీన  విజ్ఞానం  మనకు  దూరమయ్యింది.

 

  మాకు  కొంచెం  దూరపు  పరిచయం  ఉన్న  ఒకామె  కొద్దికాలం  క్రిందట  మూత్రపిండాల  వ్యాధితో  మరణించారు. ఆమె  ఉద్యోగం  చేసేవారు.  ( ఉద్యోగస్తులైన  స్త్రీలకు  పనిచేసే  చోట  సరైన  టాయిలెట్  సౌకర్యాలు  లేకపోవటం  వల్ల   కూడా  మూత్రాశయ  జబ్బులు  వచ్చే  అవకాశం  ఉందట.  ) . 

 

ఆమె  చనిపోయే  కొద్దినెలల  ముందు  కూడా  బాగానే  ఉంది.  జబ్బు  ఉన్నట్లు  ఆమెకు  ఏమీ    తెలియలేదట.  సడన్  గా  జబ్బు  బయటపడి  ఇక   ఏ  ట్రీట్మెంట్  పనిచేయలేదు.  మరొక   ఆయనకు   పనివత్తిడి  తట్టుకోలేక  ఆఫీసులోనే  గుండె  నొప్పి  వచ్చింది,   ఇలా    సమాజంలో  ఎన్నో  సంఘటనలు  జరుగుతున్నాయి. 



ఈ  రోజుల్లో   వాతావరణకాలుష్యం,   పనివత్తిడి,  టార్గెట్ గోలలు,  ఎక్కువైపోయాయి  కదా  ! ఈ  రోజుల్లో  ఆరోగ్యం  గురించి  శ్రధ్ధ  తీసుకోవటానికి  కూడా  సమయం  చాలటం   లేదంటున్నారు.
 

 మూత్రపిండాల  వ్యాధి,  కాన్సర్  వంటి  వ్యాధులు    వచ్చినవారికి  వ్యాధి  ముదిరేవరకూ  తెలియటం  లేదు.  అప్పటివరకూ  బాగానే  ఉండి  సడన్  గా  వ్యాధి  బయటపడి  ప్రమాదకర  స్థితిలోకి  వెళ్తున్నారు.

 

  ఇవన్నీ  చూస్తుంటే     కాన్సర్,   కిడ్నీ  జబ్బులు  వంటి  కేసుల్లో   ఇతర  మందులు  వాడుతూనే    రుద్రాక్ష  ధెరపీ   ,  యోగా  వంటివి  కూడా  ప్రయత్నించి  చూస్తే     బాగుంటుంది  కదా  !  అనిపించింది...


   జబ్బులు  వచ్చిన  తరువాత  బాధపడటం  కన్నా, అనారోగ్యం  రాకుండా  ముందే  జాగ్రత్తలు   తీసుకోవటం  ఎంతో   మంచిది.   వాతావరణ  కాలుష్యాన్ని  తగ్గించటం,  ఆహారవిహారాలలో  విచక్షణ,  సత్ప్రవర్తన  ........ఇలాంటివి  జాగ్రత్తలు. .....

*********************

6 comments:

  1. లలితా సహస్రనామ స్తోత్రం నిత్య పారాయణ చేస్తే మండలం తిరిగేటప్పటికి మంచి ఫలితం కనపడుతుంది.

    ReplyDelete
  2. చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
    అమ్మవారి స్తోత్ర పఠనం చేయగలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం.

    ReplyDelete
  3. మందులు పనిచేస్తయ్యో లేదో కనుక్కునే పరిశోధనలలో కొందరికి పరిశోధించే మందు ఇచ్చి కొందరికి పంచదార బిళ్ళలు (placebo) ఇస్తారు. కొంతకాలం అయిన తరువాత ఫలితాలు చూస్తే పంచదార బిళ్ళలు తీసుకున్న వాళ్లకి కూడా వ్యాధులు తగ్గుట గమనించారు. దీనిని placebo effect అంటారు.

    ఎందువల్ల వ్యాధులు తగ్గినయ్యి అనే దానికి కారణం మనస్సు అని తేల్చారు. మందులు తీసుకున్నాను తగ్గుతుందని గట్టిగా అనుకుంటే వ్యాధి తగ్గటానికి, మనస్సు తగిన సంకేతాలు పంపించి మన శరీరములో సరిఅయిన రసాయన పదార్దములు తయారు చేయించి వ్యాధిని తగ్గిస్తుందని నిర్ధారించారు.

    మన లలితా సహస్ర నామ జపాలూ రుద్రాక్షమాల జపాలూ యోగా నిష్టగా చేస్తే తగ్గటానికి కారణం విజ్ఞాన శాస్త్ర పరంగా placebo effect లాంటిదని చెప్పొచ్చు అని అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్య చూసాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు క్షమించండి.

      నిజమేనండి, మీరు అన్నట్లు మనస్సు చాలా శక్తివంతమైనది. ఏదైనా జబ్బు వచ్చిన కొత్తలో శరీరం దానికదే తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందట, తెల్ల రక్తకణాల వంటివి అందుకే ఏర్పాటు చేయబడ్డాయంటారు. అయితే మన అశ్రధ్ధ వల్ల ఒక లిమిట్ దాటి అనారోగ్యం పెరిగిపోతే వ్యాధి నివారణ కొంచెం కష్టం అవుతుందేమో .. అప్పుడు శరీరం, మనస్సు బలహీనమైపోతాయి.

      మన లలితా సహస్ర నామ జపాలూ రుద్రాక్షమాల జపాలూ యోగా వంటి వాటికి చాలా శక్తి ఉంటుందంటారు పెద్దలు.

      దైవనామముల నుండి వెలువడే ఆ మంత్ర శక్తి, రుద్రాక్షల నుంచి వెలువడే శక్తి, యోగా వల్ల కలిగే శక్తి , మీరు చెప్పిన placebo effect .....వీటన్నింటి వల్లా మానసిక. శారీరిక స్థైర్యం పెరుగుతుందని అనిపిస్తోంది.

      " ఒక యోగి ఆత్మ కధ " లో ....... మన భావం .... మనస్సును, శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందన్న విషయం గురించి ఉందండి.

      Delete
  4. చాల చక్కని విషయములు దన్యవాదములు జైగనేశ్

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్య చూసాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు క్షమించండి. జైగనేశ్.

    ReplyDelete