koodali

Wednesday, June 6, 2012

మహా చైతన్యం మనల్ని గమనిస్తోంది......


సుభద్రకీర్తి  బ్లాగులో  " శ్రీశైలమల్లికార్జునుడు నాకు విధించిన శిక్ష "  అనే    టపా  చదివిన  తరువాత  నాకూ  ఈ  టపా  రాయాలనిపించిందండి.

 
ఒకసారి  మేము  తిరువణ్ణామలై  వెళ్ళాము. గర్భగుడి వద్దకు   వెళ్ళి  దైవం    ముందర  నిలుచున్నాము.  అప్పుడు   అర్చన  టికెట్   కొనటం   కోసం  అనుకుంటా..    ఇప్పుడు  సరిగ్గా  గుర్తు  లేదు,  నా  భర్త    తిరిగి  గుడి ఆవరణ వద్దకు     వెళ్ళారు.  


భక్తులు  క్యూలో    వెళ్తుంటే  నేను  ఒక  ప్రక్కన  నిలబడ్డాను.  దైవాన్ని   ఎక్కువసేపు  చూడటానికి  అది  నాకు  చక్కటి  అవకాశం.


  అయితే ,  నేను  కొద్దిసేపు    దైవాన్ని   చూసి , ఇక   కొద్దిగా  విసుగుతో  నా  భర్త  రావటానికి  ఇంత  ఆలస్యం   అయిందేమిటి  ?  అని   మనసులో  ఆలోచిస్తూ  నిల్చున్నాను .  కొద్దిసేపటికి  తను  రావటం,   పిల్లలు   మేము    దైవదర్శనం  చేసుకుని     ప్రసాదం  తీసుకుని  బయటకు  రావటం  జరిగింది.

   తరువాత     తిరువణ్ణామలై  వెళ్ళినా  కూడా  గిరిప్రదక్షిణ  చేసాము  కానీ,  విపరీతమైన  రష్  వంటి  కారణాల  వల్ల     దైవ దర్శనం  లభించలేదు. .   మళ్ళీ     తిరువణ్ణామలై  వెళ్ళినా  దైవదర్శనం   లభించలేదు.  

ఎప్పుడో   చాలా  కాలానికి  మళ్ళీ  దైవదర్శనం  చేయగలిగాము.


  ఇదంతా   ఆలోచిస్తే   నాకు ఏమనిపించిందంటే , ఆ రోజు   దైవం    ఎదుటే   ఉండి  కూడా  ,  నేను  మనసులో  ప్రదర్శించిన  నిర్లక్ష్యం  వల్లే  చాలాకాలం  దైవదర్శనం  నాకు  కలగలేదు  అనిపించింది. 


 ఇలాంటి  సంఘటనలు  జరిగినప్పుడు  చాలా  ఆశ్చర్యం  కలుగుతుంది.  దైవం  అనే  మహాచైతన్యం  మనల్ని అనునిత్యం    గమనిస్తుందనే  సత్యం  మనకు  తెలిసి  వస్తుంది. 


 ఇది  కాకతాళీయం  అని  కొందరు  అనుకుంటారు.   కానీ  కాకతాళీయం  ఎంతమాత్రం  కాదు  ........అని  ఇలాంటి  విషయాలు  అనుభవానికి  వచ్చిన  వారికి  తెలుస్తుంది.  చాలామంది    భక్తులు  కూడా    ఇలాంటి  అనుభవాలను  చెబుతుంటారు.


  నేను   జీవితంలో     మంచిపనులు  చేసినప్పుడు  నాకు   మంచి  జరగటం,      పొరపాట్లు  చేసినప్పుడు నేను    దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించటం     కూడా   చాలాసార్లు  జరిగింది. 


 దైవం  ఎవరు  చేసిన  పాపపుణ్యాలకు  తగ్గ  ఫలితాన్ని   వారికి  చక్కగా  బేరీజు  వేసి  ఇస్తారు.  ఈ  లోకంలోని  న్యాయమూర్తుల  తీర్పులలో     ఒకోసారి  పొరపాట్లు  రావచ్చేమో  కానీ  ,   దైవం  ఇచ్చే    తీర్పులో  ఎలాంటి  పొరపాట్లు  ఉండవు  . 


 .సమాజంలో  కొందరు  పాపాత్ములు  సిరిసంపదలతో  జీవించటం,  మంచివారు  కష్టాలు  పడటం  మనం  చూస్తుంటాము.

  పాపాత్ములు  ఇప్పుడు  సుఖపడటానికి  పూర్వజన్మలో  వారు  చేసుకున్న  పుణ్యం  కారణం  అయుంటుంది.  ఇప్పుడు  వారు  చేసిన  పాపం    క్రమంగా   అనుభవంలోకి  వస్తుంది. 


   మంచివారు  ఇప్పుడు  కష్టాలు  పడుతున్నారంటే  వారి  పూర్వజన్మ   పాపఫలితాన్ని  ఇప్పుడు  అనుభవిస్తున్నారన్న  మాట.  ఇప్పుడు  చేసిన  పుణ్యం  ఎక్కడికీ  పోదు.  తప్పక  అనుభవంలోకి  వస్తుంది.  


 అందుకే    అందరూ  చాలా  జాగ్రత్తగా  జీవించాలి.  కనీసం  అలా  జీవించటానికి    ప్రయత్నించాలి...



10 comments:

  1. చిరకాలం ఉండేది మన మంచి మాత్రమే.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరన్నది నిజం.
    చిరకాలం ఉండేది మన మంచి మాత్రమే.

    ReplyDelete
  3. నా బ్లాగ్ స్పూర్తితో ఈ పొస్ట్ వ్రాసాను అని చూడగానే ఇలానన్నా స్వామి కొందరి మనస్సులను అలోచింప చేయుస్తున్నారు. మీరు తెలిపిన సంఘటనకు మూలం ప్రాప్తం. మీరు తెలిపిన దానికి పూర్తి విరుద్ధముగా నాకు రామేశ్వరములో జరిగినది అదే రేపటి పొస్ట్ గా తెలియ చేస్తాను. ఇది కొద్ది రోజుల తరువాత తెలియ చేద్దామని అనుకున్నా కాని పాఠకులకు మన అనుభవాలు కంటిన్యూగా చదివితే వాళ్ళ అనుభవాలు చర్చిస్తారు. పాఠక సౌలభ్యం గిరించి మాత్రమే. మీపొస్ట్ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  4. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.మీరన్నది నిజం. god is great

      Delete
  5. నేను జీవితంలో మంచిపనులు చేసినప్పుడు నాకు మంచి జరగటం, పొరపాట్లు చేసినప్పుడు నేను దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించటం కూడా చాలాసార్లు జరిగింది.
    --------------------------
    ఇవన్నీ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాలు అని నేను నమ్ముతాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరన్నది నిజం.

      ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుతూ దైవం అందరినీ మోక్షమార్గాన నడిపిస్తారు.

      కొందరు ముందే మోక్షాన్ని చేరుకుంటే కొందరు ఆలస్యంగా చేరుకుంటారు.

      ఎప్పటికైనా అందరూ ఆ మోక్షాన్ని పొందవలసినవారే.

      అదే అందరి అంతిమలక్ష్యం.

      Delete
  6. This is called positive thinking?

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీ వ్యాఖ్య నాకు సరిగ్గా అర్ధం కాలేదండి.

    ReplyDelete