koodali

Friday, June 15, 2012

దేవతలు, వారి యొక్క వాహనాల విషయంలో....


  దేవతల  వాహనాలను    చూసినప్పుడు  మనకు  చిత్రమైన  ఆలోచనలు  వస్తుంటాయి.  ఉదాహరణకు    వినాయకుని  వాహనం  ఎలుక,  శనిదేవుని   వాహనం   కాకి  ....... ఇవి  చిన్న   శరీరం  కల  జీవులు  కదా  ! .  మరి  అవి  దేవతలను    ఎలా  మొయ్యగలవు ? అనిపిస్తుంది.   

 చిన్నపిల్లలకు  ఇలాంటి  సందేహాలు  వస్తుంటాయి.   ఒకోసారి  పెద్దవాళ్ళకు  కూడా  ఇలాంటి  సందేహాలు  వస్తుంటాయి.
 

 దేవతలు,  వారి  యొక్క   వాహనాల  విషయంలో  చాలా  అంతరార్ధాలు  ఉంటాయట.  అవన్నీ  నాకు  అంతగా  తెలియదు.  ఆ  అంతరార్ధాలు  అంతగా  తెలియని  నాలాంటి  వారికి   దేవతల   వాహనం  చిన్నగా  ఉంటే  ఎలా  ?  వంటి    సందేహాలు  వస్తుంటాయి.    
                                                                                                                                        


SHANI DEV KI KATHA - YouTube... ..లో   శనిదేవుని  వాహనాన్ని   చూసి  ఈ  వాహనం  చిన్నగా  ఉంది  కదా  ! శనిదేవుని  ఎలా  మొయ్యగలదు  ?  అని  ఆలోచిస్తుండగా  నాకు  కొన్ని  ఆలోచనలు  వచ్చాయి.


   శనిదేవుని  వాహనమైన  కాకి  చిన్నది .  అని  మనకు  తెలుసు. కానీ  భూమిపై  ఒకప్పుడు  డైనోసార్స్  వంటి  పెద్ద  జంతువులు  ఉండేవట.   డైనోసార్స్   కాలంలో  మిగతా  పశుపక్షాదులు  కూడా  భారీసైజుతో  ఉండేవట.     కాకులు  వంటి  పక్షులు  కూడా  పెద్ద  సైజులో భారీ  శరీరాన్ని  కలిగి   ఉండవచ్చు.  

 భూలోకంలోని   జీవులే  పెద్ద  సైజులో ఉన్నప్పుడు , ఇతర  లోకాల్లోని  దేవతల  వాహనాలైన  ఎలుక,  కాకి  వంటివి  భారీ  శరీరంతో  పెద్దగా  ఉండే  అవకాశాలున్నాయి. 


వినాయకుడు,  శనిదేవుడు, వీరంతా  దేవతలు.  వారి  వాహనాలు  అయిన  ఎలుక,  కాకి  కూడా  దేవతా  సంబంధమైనవే  అయ్యుండవచ్చు.


 కలియుగంలో  కాకులు  చిన్న  శరీరంతో  చిన్నగా  కనిపిస్తాయి.  కానీ,  సత్యయుగం,  త్రేతాయుగం,  ద్వాపరయుగం,  కలియుగం  ఇలా  నాలుగు  యుగాల్లోని   మనుషులు,  పశుపక్షాదులు  వారి  జీవితకాలం,  శరీరం   విషయాల్లో  ఎన్నో  తేడాలుంటాయట. 


 త్రేతాయుగం  మనుషుల   జీవితకాలం ...      10,000 ..సంవత్సరాలు  అయితే ,   కలికాలం  లోని   మనుషుల  జీవితకాలం ......100  సంవత్సరాలు.  ఇలా  వారికీ  మనకీ  ఎన్నో  తేడాలున్నాయి.


  నాలుగు  యుగాలకు  చెందిన  మనుషుల్లోనే  ఎన్నో  తేడాలున్నప్పుడు ,   వేరే  లోకాలకు  చెందిన  దేవతలకు,  వారి  వాహనాలకు ....భూలోకంలోని  మనుషులకు  ,  ఇక్కడి  పశుపక్ష్యాదులకు  ఎన్నో  తేడాలుంటాయి  కదా  !  అందుకని  దేవలోకాల్లోని  వారిని   మనతో  పోల్చుకోవటం   అనవసరం  అని  నాకు  అనిపించింది.   


అయితే, దేవతలు  సంకల్పమాత్రం  చేతనే  తాము  కోరుకున్న  ఆకారాన్ని  పొందగలరు.    పురాణేతిహాసాల్లో    భారీ  శరీరాలు కలిగిన  జీవులు ,  ఎక్కువ  కాలం  జీవించిన  పశుపక్ష్యాదుల  గురించి కూడా   వివరాలున్నాయి. 
 

 దేవతలు,  వారి  యొక్క   వాహనాల  విషయంలో  చాలా  అంతరార్ధాలు  ఉంటాయట.  అవన్నీ  నాకు  అంతగా  తెలియదు. కానీ  ,   ఇతర  లోకాల్లోని  దేవతల  వాహనాలైన  ఎలుక,  కాకి  వంటివి  భారీ  శరీరంతో  పెద్దగా  ఉండే  అవకాశాలున్నాయి.   అప్పుడు  అంత  పెద్ద  శరీరం  గల   కాకి  వాహనంగా  చక్కగా  పనికొస్తుంది  కదా  !  అనిపించి  నా  సందేహం  తీరింది.
 ........................

    * List of numbers in Hindu scriptures  *.



4 comments:

  1. ద్రవిడ దేవతలు కనిపించే జంతువులు. ఆర్యుల దేవతలు ఇప్పుడు మనం చూసే ప్రముఖ దేవుళ్ళు. ఆర్యులు ద్రావిదులని జయించి వారి దేవతలకు వీరి దేవతలని వాహనాలుగా మార్చారు అని ఎక్కడో చదివాను

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పిన విషయం గురించి నాకు తెలియదండి. అయితే దేవతల యొక్క వాహనాల విషయంలో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయట.

    ఉదాహరణకు .... సరస్వతీ దేవి వాహనమైన హంసకు నీటిని , పాలను వేరు చేసి పాలను స్వీకరించే శక్తి ఉంటుంది అని అంటారు...అలా మానవులు కూడా చక్కటి జ్ఞానాన్ని కలిగి జీవించాలి అంటారు.

    ఇలా కొంతవరకూ దేవతల వాహనముల గురించి సింబాలిక్ గా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అంటారు.

    Hindu vehicles, Hindu gods vahana's, Ganesh, Shiva, Lakshmi ...

    ఈ లింకులో దేవతల వాహనాల గురించి కొన్ని వివరములు ఉన్నాయండి.

    ReplyDelete
  3. ఎన్నెన్నో తెలియని మంచి విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు అండి..

    ReplyDelete
  4. సాయిగారు. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయ.

    ReplyDelete