koodali

Friday, February 28, 2014

ఓం నమఃశ్శివాయ.....

ఓం .
శ్రీ విశ్వనాధాష్టకం...

గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధంతేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..


ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.

శ్రీ గణేశ స్తుతి...

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్

ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..

హే స్వామినాధ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసమేత  మమదేహి కరావలంబం..

దేవాదిదేవనుత దేవగణాధినాధ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మా త్ప్రదాన  పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

దేవాదిదేవ రధమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృంద వంద్య

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః


పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః


పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ


వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః.

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..

ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


సంతాన ఫల మంత్రం..

సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా !

జరత్కారుప్రియాఽఽ
స్తీకమాతా విషహారేతి చ 


మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ !

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!

శ్రీ కాల భైరవాష్టకం..
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మ్యై మకారాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మ్యై శికారాయ నమశ్శివాయ.

వశిష్ట కుంభోధ్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

తస్మ్యై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. 

 

Wednesday, February 19, 2014

తెలుగువాళ్ళలో ఐక్యత ...

ఆంధ్రప్రదేశ్ లో  సీమాంధ్ర...తెలంగాణా  అనే  రెండే  ప్రాంతాలు  ఉండి  ఉంటే  బహుశా  విభజన  వ్యవహారం  ఇంత  క్లిష్టంగా  తయారయ్యేది  కాదేమో ? తెలంగాణా  విడిపోతే  సీమాంధ్రకు  ఒక  రాజధానిని  ఏర్పాటు  చేస్తే  అభివృద్ధి  చేసుకునే వారు. 


 మన  దురదృష్టం  ఏమిటంటే  ,   తెలుగువారిలో  ....తెలంగాణా  వారు ,  రాయలసీమ వారు ,  కోస్తా  వారు,  ఉత్తరాంధ్ర  వారు  అనే  భేదాలు  ఉన్నాయి.  అలా   ఎందుకు  ఉన్నాయో  ?  తెలుగువారు  అందరూ  ఒకటే  అనుకుంటే  ఈ  బాధలు  లేకుండా  ఒకే  రాజధానితో  విశాలాంధ్రగా  ఉండేవాళ్ళం.


 తెలంగాణా  కోసం , సమైక్యాంధ్ర  కోసం  అంటూ... ఉద్యమాలు,  బందులతో  ఇప్పటి  వరకూ  చాలా కాలం  గడిచిపోయింది.  ఇక  సీమాంధ్రలో  కొత్త  రాజధాని  కోసం   ఉద్యమాలు,  బందులూ  మొదలవుతాయేమోనని  భయంగా  ఉంది. 


 రాజధానిని  మా  ప్రాంతంలో  పెట్టాలంటే  మా  ప్రాంతంలో  పెట్టాలంటారు. మా  ప్రాంతంలో  రాజధాని  ఏర్పాటు  చేయకపోతే  మేము  వేరే  రాష్ట్రం  కోరతామని  కొందరు  అంటూన్నారు.మళ్ళీ  ప్రత్యేక  రాష్ట్రవాదాలు   వచ్చే  అవకాశం  కూడా  ఉంది. ఈ  గొడవలతో  ఎంతకాలం  వేగాలి  ? ప్రజాసమస్యలకు  పరిష్కారం  లేకుండా  విభజన  ఉద్యమాలతోనే  సంవత్సరాలు  గడిచిపోయేలా  ఉన్నాయి.  ఇక  ప్రజాసమస్యలను   పట్టించుకునేదెప్పుడు   ? ఎలాగూ  తెలంగాణా  విడదీస్తామంటున్నారు.  పనిలోపనిగా  కోస్తాను,  రాయలసీమను,  ఉత్తరాంధ్రానూ  కూడా  విడదీసెయ్యండి.  విడిపోయి  రాజధానులను  ఏర్పాటు  చేసుకుని  ఎవరి  బ్రతుకులు  వారు  బ్రతుకుతారు.    
అంతేకానీ ,  మళ్ళీ  సీమాంధ్రకు  ఎక్కడో  ఒక  దగ్గర  రాజధానిని  ఏర్పాటు చేయటం,  దానిని  అభివృద్ధి  చేయటం...కొంతకాలానికి,  అదిమాదే  మీరు  వేరే  రాజధానిని  వెతుక్కోండి .... అని  ఎవరైనా  అంటే  తట్టుకునే  శక్తి  జనాలకు  లేదు.ఇలా  జరగకుండా  ఉండాలంటే  కొత్త రాజధానిని  ఎక్కువగా  అభివృద్ధి  చేయకుండా   రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలనూ  సమానంగా   అభివృద్ధి  చేయాలి. అవసరమైతే  ఉపరాజధానులను    ఏర్పాటు చేయాలి .   ప్రజలు  రాష్ట్రంలోని  ఇతర  ప్రాంతాలకు  ఎక్కువగా  వలస  పోకుండా  ఎక్కడికక్కడ  ఉపాది  అవకాశాలను  కల్పించాలి.


ఉమ్మడి  రాజధాని  మాదే ... అని  ఇకమీదట  ఎవరూ  అనకుండా  ముందే  ఖచ్చితంగా  మాట్లాడుకోవాలి.

............................ కేజ్రీవాల్  గారు  తేవాలనుకున్న   జనలోక్ పాల్  బిల్లును  ఉమ్మడిగా  వ్యతిరేకించి...బీజేపీ..కాంగ్రెస్  దొందూదొందే  అని   నిరూపించుకున్నాయి.

ఈ  రాష్ట్రం  విషయంలోనూ  బీజేపీ..కాంగ్రెస్  దొందూదొందే  అని   మరోసారి  నిరూపించుకున్నాయి.

.....................................

  పార్లమెంట్లో  జరిగిన  గొడవలు చూసి  దేశంలో  చాలా  మందికి   మనస్సు  బాధతో  నిండిపోయిందట.  


 నిజమే  పార్లమెంటులో  జరిగిన  విషయాలు   బాధాకరమైనవే.  అయితే  పరిస్థితి  ఇంతవరకూ  వచ్చేలా  చేసిందెవరు ?


 దేశానికి  చెందిన   లక్షల  కోట్ల  సంపద  విదేశాల్లో  మూలుగుతున్న  వార్తలను,  దేశంలో  జరిగిన  లక్షల  కోట్ల  రూపాయల  అవినీతి  స్కాముల  గురించి  తెలుసుకున్నప్పుడు  కూడా   దేశ  ప్రజల  మనస్సు   ఎంతో   బాధతో  భారంగా  ఉంటోంది.


పార్లమెంటులో  జరిగిన  గొడవ  వల్ల   దేశం  పరువుపోయిందంటూ  గగ్గోలు  పెడుతూ  తెలుగువాళ్ళను  నిందిస్తున్న  మిగతారాష్ట్రాల  వాళ్ళు ,  జర్నలిస్టులు...దేశంలో  జరిగిన  అవినీతి  స్కాముల  పట్ల  ఎందుకు  గట్టిగా  మాట్లాడరు ? దేశంలో  జరిగిన  అవినీతి  స్కాముల   వల్ల  దేశం  పరువు  పోలేదా  ?  అందరికీ  తెలుగువాళ్ళే  అలుసైపోయారా  ?


సీమాంధ్రులు   కూడా   కొన్ని  విషయాలను  గ్రహించాలి.    గత  కొన్ని  సంవత్సరాల  నుంచీ  సమస్యను  సరిగ్గా  పట్టించుకోకుండా ,  ఇప్పుడు   చట్టసభల్లో  గొడవలు  చేయటం  వల్ల  సమస్య  పరిష్కారం  అవ్వకపోగా  సీమాంధ్రుల  సమస్య  ప్రక్కకు  వెళ్ళి,  సానుభూతిని  కోల్పోయే  అవకాశం   ఉంది . అయితే, సీమాంద్రులు  తమ  సమస్యల  పరిష్కారం  కోసం  సరైన పద్ధతిలో  ప్రయత్నించుకోవటంలో  తప్పులేదు. 
  

  తెలుగువాళ్ళలో  ఐక్యత  తక్కువని  ఇప్పటికే  అందరికీ  తెలుసు. ఈ  విషయం  మళ్ళీ  మరొకసారి  నిరూపితమయింది  అంతే.
Sunday, February 16, 2014

జరిగే పరిణామాలను .....

ఒక  రాష్ట్రం  యొక్క  రాజధానిని  ఏర్పాటుచేయాలంటే  రాష్ట్రంలోని  ఏదో  ఒక ప్రాంతంలో  ఏర్పాటుచేస్తారు.  

 రాజధాని   అంటే  అక్కడ  అన్ని  ప్రాంతాల  వారికి   సమానమైన  స్వేచ్చ  ఉంటుంది.  ఉదా..  దేశరాజధాని  అయిన  ఢిల్లీ  అన్ని  రాష్ట్రాల  వారికి  రాజధాని.
............................


మీ ఇంట్లో  ఇద్దరు  పిల్లలు  ఒకరితో  ఒకరు  గొడవపడుతుంటే  మీరు    ఎవరివైపు  సపోర్ట్  చేస్తారు  ?  


తల్లితండ్రులకు  బిడ్డలు  ఇద్దరూ  సమానమే.  ఒకరికి  సపోర్ట్  చేస్తే  రెండవ  వారికి  కోపమొస్తుంది.  ఇలాంటి  పరిస్థితిలో  తల్లితండ్రి  పరిస్థితి   నిస్సహాయంగా  ఉంటుంది.  ప్రస్తుతం  రాష్ట్ర  పరిస్థితి  ఇలాగే  ఉంది.రాష్ట్రం  సమైక్యంగా  ఉండాలంటుంటే  తెలంగాణా  వారికి  కోపమొస్తోంది.  విడిపోవాలంటే  సీమాంధ్ర  వాళ్ళకు  కోపమొస్తోంది.  అన్నిప్రాంతాలలోనూ  ఆత్మీయులు,  బంధువులు  ఉన్నవారి  పరిస్థితి  ఇప్పుడు  నిస్సహాయంగా  ఉంది.ఇప్పటి  రాష్ట్ర  పరిస్థితిలో   తెలంగాణా  వారి  అభిప్రాయాలు  ఏమిటో  సీమాంధ్ర   వాళ్ళూ  గమనించాలి.  సీమాంధ్ర  వారి  అభిప్రాయాలు  ఏమిటో 
తెలంగాణా  వాళ్ళూ  గమనించాలి.  


    తెలంగాణా  వారు  తాము సీమాంధ్ర  వారిగా  భావించి  ఆలోచించాలి.  సీమాంధ్ర  వాళ్ళు  తాము  తెలంగాణా  వారిగా  భావించి  ఆలోచించాలి.

............................


 ఒకసారి  ఉమ్మడి రాజధానిగా  ఒప్పుకున్నాక   రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాల  వారికి  ఆ  నగరం  తమది  అనే  అనుబంధం  ఉంటుంది  కదా  ! 50  సంవత్సరాలకు  పైగా  ఉమ్మడి  రాజధానిగా   అనుబంధం  ఉన్న    హైదరాబాద్  మన  రాజధాని   కాదు  అనుకోవాలంటే   బాధగానే  ఉంటుంది.

  కొత్త  రాజధాని  ఏర్పాటుచేసుకోవాలంటే  ఎన్నో  కష్టాలు  ఉంటాయి.   ఎన్నో   నిధులు  అవసరమవుతాయి.  గత  50 సంవత్సరాల  కాలంలో  హైదరాబాద్లో  ఎన్నో  కేంద్ర  ప్రభుత్వరంగ  సంస్థలు   ఏర్పాటయ్యాయి.  విద్యా,  ఉపాధి  అవకాశాలు  హైదరాబాద్ లోనే  ఎక్కువగా  ఉన్నాయి.  సీమాంధ్రలో  విద్యా , ఉపాధి  అవకాశాలు  తక్కువగా  ఉన్నాయి .

అయితే  సీమాంధ్ర  వాళ్ళు  కూడా  కొన్ని  విషయాలను  అర్ధం  చేసుకోవాలి..   తెలంగాణా  వారి  అభిప్రాయాలు  స్పష్ఠంగా  తెలుసుకున్న  గత  10  సంవత్సరాల  నుంచీ  అయినా  సీమాంధ్రులు  హైదరాబాద్  పై  ఆధారపడకుండా  తమ  ప్రాంతాలలో  ఉన్నత  విద్యావకాశాలను,  ఉపాధి  అవకాశాలను  అభివృద్ధి  చేసుకుని  ఉంటే  ఇప్పుడిలా  లబోదిబోమనే  పరిస్థితి  వచ్చుండేది  కాదు.  ప్రభుత్వాలు  అన్ని  ప్రాంతాలలోనూ    ఉపాధి  అవకాశాలను  కల్పించి  అభివృద్ధి  చేసి  ఉంటే  ఇప్పటి  గొడవ  ఉండేది  కాదు  కదా  !

.............................


ఆంధ్రప్రదేశ్  ఏర్పడినప్పుడు   హైదరాబాదును  రాష్ట్రానికి  ముఖ్య రాజధానిగా  చేసి,  విజయవాడ,  కర్నూల్,  వైజాగ్,  కరీం నగర్,  ఖమ్మం .....  మొదలైన  పట్టణాలను  ఉపరాజధాని  స్థాయిలో  అభివృద్ధి  చేసి  ఉంటే  ఉపాధి  కోసం  అందరూ  హైదరాబాదుకు   వచ్చేవారు  కాదు.   ఏ  ప్రాంతం  వారికి  ఆ  ప్రాంతములో    ఉపాధి  అవకాశాలను  ఏర్పరిస్తే     రాజధానికి    ఎక్కువగా  వలస   రారు.  

.......................................... 


ఢిల్లీ  మనకు  చాలా  దూరంలో  ఉంది. ప్రతి  చిన్నపనికి  ఢిల్లీ  వెళ్ళాలంటే  దక్షిణాది  రాష్ట్రాల  వారికి  ఇబ్బందిగా  ఉంటుంది.   ఎంతో  దూరదృష్టి గల  అంబేద్కర్  గారు   హైదరాబాదును  దేశానికి    రెండవ  రాజధాని  చేస్తే  బాగుంటుందని  పేర్కొన్నారు.  అలా  చేస్తే  హైదరాబాద్  అంతర్జాతీయ   స్థాయిలో  అభివృద్ధి  చెందుతుంది. 

అయితే, మిగతా  దక్షిణాది  రాష్ట్రాలు  హైదరాబాద్కు  ఆ  అవకాశాన్ని  ఇవ్వనిస్తారా ?
..........................


కొందరు ,   మద్రాస్  నుంచి  ఆంధ్ర  రాష్ట్రం  విడిపోయిన  సంఘటనను  ఇప్పటి  పరిస్థితితో  పోలుస్తున్నారు.  ఈ  పోలిక  ఎలా  కుదురుతుంది ?

 మద్రాస్  రాష్ట్రం  నుంచి  ఆంధ్ర    విడిపోయినప్పుడు    విభజన  కోరుకున్న  తెలుగువారికి  రాజధాని  అయిన  మద్రాస్  నగరాన్ని  ఇవ్వలేదు  కదా  ! 
 

భాషాప్రయుక్త  రాష్ట్రాలు  ఏర్పడక  ముందు  మద్రాస్  పేరు  చెన్నపట్నం  అనేవారట.  ఒక  తెలుగు  వ్యక్తి  పేరు  మీద  చెన్నపట్నం  అనే  పేరు  వచ్చిందంటారు.  తరువాత  బ్రిటిష్  వాళ్ళు  మద్రాస్  అని  పేరు  మార్చారట.
..................................

 మన రాష్ట్రంలోని  ప్రజలు  ఒకరినిఒకరు   దోపిడీ  చేయలేదు.. రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలూ  వెనుకబడే  ఉన్నాయి.   అన్ని  ప్రాంతాల  ప్రజలూ   వెనుకపడే  ఉన్నారు.

  రాష్ట్రంలోని   అన్ని  ప్రాంతాలకు  చెందిన   కొందరు  పెట్టుబడిదారులు  మాత్రమే  సంపదను  ప్రోగేసుకున్నారన్నది  అందరూ   తెలుసుకోవలసిన  విషయం.

...................................


రాష్ట్రాన్ని  విభజించమని  కోరుకోవటానికి  .....ఉమ్మడి  రాజధానితో  సహా  విభజించమని  కోరుకోవటానికి   తేడా  ఉంది.

అందరిదీ  అని  భావించే  ఉమ్మడి  రాజధానిని  కొందరు  తీసుకుని  వెళ్ళిపోతే  మిగతా  వారికి  అన్యాయం  జరుగుతుంది.   ఎప్పటికప్పుడు  కొత్త  రాజధాని  వెతుక్కోవటమూ  కష్టమే.

  రాజధానుల  విషయంలో  సమస్యలు  రాకుండా  ఉండాలంటే  కొన్ని  విధివిధానాలను  నిర్ణయించాలి.
....................

 మన  రాష్ట్ర   విషయం  తేలితే  తామూ  విభజన  డిమాండులు  మొదలెట్టాలని  ఎందరో  రాష్ట్రాల  వాళ్ళూ  వేచి  చూస్తున్నారు.

కొత్త రాజధానులు  ఏర్పాటు  చేయటానికి  అవసరమైన  భారీ  ప్యాకేజీలకు   కావలసిన నిధులను  కేంద్రం సరిగ్గా ఇస్తుందా   ?


 జార్ఖండ్  వంటి  రాష్ట్రాలలో  ప్రకటించిన  ప్యాకేజీలను  ఇప్పటి  వరకూ  సరిగ్గా  ఇవ్వనేలేదట.  
..................................................


  జరుగుతున్న  పరిణామాల  నుంచి  ప్రజలు   కూడా  కొన్ని  విషయాలను  నేర్చుకోవాలి.

ఒకే  భాషను  మాట్లాడే  తెలుగువారు  ఒకరితో  ఒకరు    కలిసి  ఉండలేని  పరిస్థితి  చూస్తుంటే  విదేశాలకు  వలస  వెళ్ళి  ఉంటున్న వారిని ...  అక్కడి  స్థానికులు  గెంటేసే  పరిస్థితి  త్వరలోనే  వస్తుందేమో...జాగ్రత్త. ఇక్కడ  నుంచి  వెళ్ళి  అక్కడి వారి  ఉద్యోగాలను,  వారి  ఉపాధి  అవకాశాలను  మనం  దెబ్బకొడుతుంటే  వాళ్ళు  మాత్రం  ఎందుకు  ఊరుకుంటారు ?  


  విదేశాలకు   వెళ్ళిన  తెలుగువాళ్ళను    కూడా వలసవాదులుగా  , దోపిడీదారులుగా   భావించి   వెళ్ళగొట్టే  అవకాశం  ఉంది  మరి.
...................................

ఈ   టపాలో గానీ  ఇంతకుముందు  టపాలోగానీ  నేను   వ్రాసిన  కొన్ని  విషయాలు  కొందరికి  నచ్చక  పోవచ్చు.   ఇలా  వ్రాయటం  వలన  నాకు  ఆత్మీయులైన  వారు  కొందరు  నన్ను  తిట్టుకుంటారేమో  ?  ఎవరి  మనోభావాలను  నొప్పించాలని   నాకు  లేకపోయినా  తప్పనిసరి  పరిస్థితిలో  ఇలా  వ్రాయవలసి  వచ్చింది. 

ఇప్పుడు ప్రజల మధ్య  ఆవేశకావేషాలు   ఎక్కువగా  ఉన్నాయి.  అవి   తగ్గితే బాగుండునని  చాలామంది ఆశ పడుతున్నారు.

విభజన  లేక  సమైక్యత  అంటూ  ఎంతో  ఓపికగా  ఉద్యమాలను  చేస్తున్నారు.   దీనికన్నా  ప్రజాసమస్యలను  పరిష్కరించాలని  ఉద్యమాలు  చేసినట్లైయితే  ఎంతో  బాగుండేది  అనిపిస్తోంది .
Friday, February 14, 2014

గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.ఇప్పుడు  తెలుగువారు  అందరికీ  అలుసైపోయారు.   ఎవరెవరో  వచ్చి   ఈ   రాష్ట్రాన్ని    మేము   విడదీస్తాం  అంటే    మేమే  విడదీస్తాం  అంటూ  ఉత్సాహంగా  స్టేట్ మెంట్స్  ఇచ్చేస్తున్నారు.  అయినా  ,  తెలుగువాళ్ళు  తమలో  తాము  తిట్టుకుంటుంటే   బయటి  రాష్ట్రాల  వాళ్ళను  అనుకుని  ఏం  లాభం?  నీటివాటా  విషయంలోనూ  తెలుగువారికి  అన్యాయం  జరిగింది . అయినా  బుద్ధి  రాని   తెలుగువాళ్ళు  తమలోతాము  గొడవలు  పడుతూనే  ఉన్నారు.

 
 ఇప్పుడు  రాష్ట్రంలో    అయోమయ  పరిస్థితి   నెలకొని  ఉంది.  ఇలాంటప్పుడు    పై వారి  ప్రవర్తన  మరింత  రెచ్చగొట్టేలా  ఉంది.    ఎవరైనా  సరే  మా  తీర్మానికి  కట్టుబడాల్సిందే ... అంటూ  రెచ్చగొట్టే  ప్రకటనలు  చేస్తున్నారు. 


విభజనకు  ఒప్పుకోవాలి  అనుకునే  సీమాంధ్రులను   కూడా  రెచ్చగొట్టేలా  ప్రకటనలు  చేస్తున్నారు.

............................

  ఈ  విభజన  అంశం  ఒక్క  తెలుగువారి  సమస్య  మాత్రమే  కాదు. ఈ  సమస్య  దేశమంతా  విస్తరించే  అవకాశం  ఉంది..

బాధాకరమైన  విషయమేమిటంటే, దేశం  గురించి  ఎవరూ  మాట్లాడటం  లేదు. భవిష్యత్తులో,   రాజధాని   చుట్టుప్రక్కల   జిల్లాల   వాళ్ళు  రాజధానితో  సహా  విడిపోతామని  ఉద్యమాలు  చేసే  ప్రమాదముంది   కదా  !    అని  జాతీయపార్టీల  వారు  కూడా   అనుకోవటం  లేదు.   వారి  ఓట్లు  వారికి  ముఖ్యమయ్యాయి.
  ఇకముందు  నుంచి   రాజధానుల  విషయంలో  దేశమంతటా  ఒక  ఖచ్చితమైన  విధానాన్ని  ఏర్పరుచుకోవాలి. 
..................................................హైదరాబాద్  వ్యవహారం  వల్ల   ఎన్నో  గుణపాఠాలు  నేర్చుకోవలసి  ఉంది.  ఇక  ముందు  ఏ  రాజధానిని  ఎక్కువగా  అభివృద్ధి  చేయకూడదు.  


 విద్యా,  ఉపాధి  అవకాశాలు    రాష్ట్రంలోని   అన్ని  ప్రాంతాలలోనూ   అభివృద్ధి  చెందాలి. 

....................................

 
యూపీఏ  నాయకత్వం   ఇంతకు  ముందు   అణు  ఒప్పందం  బిల్లును,  దేశంలో  రిటైల్  వర్తకానికి  విదేశీ  సంస్థలకు  మార్గం  సుగమం  చేసే  బిల్లును  పంతంగా  నెగ్గించుకుంది.  


దేశ  ప్రజల  ఖర్మ  వల్ల  దేశంలోని  మేధావులు  అని  చెప్పుకుంటున్న  వారు   కొందరు  ఆ బిల్లులకు  మద్దతును  ఇచ్చారు.   


  ప్రమాదకరమైన  అణువిద్యుత్  ను   అభివృద్ధి  చెందిన  దేశాలే  తగ్గించుకుంటుండగా  మన దేశంలో  ప్రవేశపెట్టాలని  ప్రయత్నాలు  ఎందుకు ?  ఇక్కడ  యువత  ఉపాధి  లేక  నిరుద్యోగంతో  అల్లాడుతుంటే  చిల్లర  వర్తకుల  పొట్టలు  కొట్టే   విధంగా  రిటైల్  వర్తక  రంగంలో  విదేశీ  సంస్థలకు    తలుపులు  తెరవాలనే  తాపత్రయం  ఎవరి  బాగుకోసం  ? 
 
..........................................

ఇక,    బీజేపీ  వాళ్ళు  వల్లభభాయ్  పటేల్  గారిని  గుర్తు  చేస్తూ  యూనిటీ  అంటూన్నారు.  ఒకపక్క    విభజన  వాదన  వినిపిస్తూ   ఐక్యతే  మా  ఎజెండా  అనటం    ఏమిటో  ?
..................................


  ఎవరో  ఒకరికి  ఓటు  వేయాలి  కాబట్టి  మనకు  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  ఎవరో   ఒకరికి  వేయవలసి  వస్తోంది.  ..................................................

పోలవరం  వంటి  భారీ  ముంపు  ప్రాజెక్ట్స్  విషయంలో  ఎంతో  అటవీ  భూమి  మునిగిపోతుంది.  ఎందరో  గిరిజనుల  బ్రతుకు  అస్తవ్యస్తమైపోతుంది. 


 

పర్యావరణం  చక్కగా  ఉండాలంటే  అడవులు  ఎంతో  ముఖ్యం.   నీళ్ళ  కోసం  నేలను  ముంచుకుంటూ   పోతే  ఎలా  ?  మనకు  నీళ్లు  ఎంత  ముఖ్యమో    భూమి  కూడా  అంతే  ముఖ్యం.


 పోలవరం  ప్రాజెక్ట్   వల్ల  ఎక్కువ  భూమి  ముంపుకు  గురి  కాకుండా  డిజైన్  మార్చుకోవాలి.  భారీ  నీటి  ప్రాజెక్ట్స్  కన్నా  చెరువులు,  చెక్  డ్యాంస్    అభివృద్ధి  చేసుకుంటే  మంచిది.మనుషులకు  తాగటానికి  నీళ్ళు  లేకపోయినా    పరిశ్రమలకు    ఎంతో  నీటిని  ఇస్తున్నారు. 
 .......................

 ఇతరులకు  అన్యాయం  చేసిన  వాళ్ళకు  ఆస్తి  ఉన్నాకూడా     మనశ్శాంతి  మాత్రం  ఉండదనేది   చరిత్ర  చెబుతున్న  సత్యం.


Wednesday, February 12, 2014

న్యాయం, సమాజ సంక్షేమం, సమాజ సమగ్రత ముఖ్యం.


అనగనగా..పూర్వం  ఒకానొక  కాలంలో  ఒక  పొలం  మధ్య  నిలబడి  ఇద్దరు  వ్యక్తులు  వాదించుకుంటున్నారట. ఆ ఇద్దరు  వ్యక్తులలో  ఒక  వ్యక్తి  ఆ  పొలాన్ని  కొన్న  వ్యక్తి.  రెండవ  వ్యక్తి  పొలాన్ని అమ్మిన  వ్యక్తి.విషయమేమిటంటే  కొత్తగా  పొలాన్ని  కొన్న  వ్యక్తి  పొలాన్ని  తవ్వుతుంటే  నేలలో  వజ్రాలు,  బంగారంతో  నిండిన  లంకెల  బిందెలు  దొరికాయి.  వెంటనే  పరిగెత్తికెళ్ళి  పొలం  యొక్క  పాత  ఓనరును  పిలుచుకు  వచ్చి  బిందెలను  తీసుకోమన్నాడు. లంకెల  బిందెలను  తీసుకోవటానికి  పాత  ఓనరు  సమ్మతించటంలేదు.  పాత  ఓనర్  ఏమంటాడంటే   నేను  పొలాన్ని  నీకు అమ్మిన  తరువాత  దొరికాయి  కాబట్టి  ఆ   సంపద  పొలాన్ని  కొన్న  నీకే చెందాలి  అని  అంటున్నాడు.నేను  నీ  దగ్గర  పొలాన్ని  కొన్నాను  గానీ  పొలం  క్రింద  ఉన్న  సంపదను  కొనలేదు  కాబట్టి  ఆ  సంపద   పూర్వపు  యజమానివైన  నీకే   చెందుతుందని  కొత్త  యజమాని  వాదన.

పూర్వం  ఇంతటి  ధర్మాత్ములు  ఉండేవారు. 


......................

   ఈ రోజుల్లో   స్వంత  లాభం   కోసం  ఎంతకైనా  దిగజారే   స్థాయి  పరిస్తితులు  పెరుగుతున్నాయనిపిస్తోంది. అడ్దదార్లలో  డబ్బు  సంపాదిస్తున్నారు.  సమాజాన్ని  దోచుకుంటున్నారు.  ఇతరుల  కడుపు  కొట్టి  తాము  బ్రతుకుతున్నారు.

డబ్బు  కోసం,  అధికారం  కోసం   సమాజాన్ని  అతలాకుతలం  చేస్తున్నారు.  వీరందరూ  బాగుపడతారా  ?  


.....................


ఇలాంటి  సమాజంలో  న్యాయం  చెప్పవలసిన  పెద్దవాళ్ళకు      కొన్నిసార్లు    విపరీతమైన   వత్తిడులు    ఎదురయ్యే    అవకాశముంది.   తీర్పు  చెప్పే  న్యాయమూర్తులకు  తనవారు,పరాయివారు  అనే  పక్షపాతం ,బంధు ప్రీతి  మొదలైనవి... ఉండకూడదు.  ధర్మానికి  అనుగుణంగా  మాత్రమే  తీర్పులను  వెలువరించవలసి  ఉంటుంది.తమకు  అనుగుణంగా  తీర్పును  ఇవ్వమని  కొందరు  క్లయింట్స్  బ్రతిమలాడుతారు. తమకు  అనుగుణంగా  తీర్పును  ఇచ్చి   తీరవలసిందేనని కొందరు  క్లయింట్స్  బెదిరిస్తారు.     న్యాయాన్ని చెప్పే  పెద్దవాళ్ళు  ఒత్తిళ్ళకు, బెదిరింపులకు,  బ్రతిమలాటలకు, ప్రలోభాలకు.. లొంగకుండా  నిష్పక్షపాతంగా  తీర్పులను  ఇవ్వవలసి  ఉంటుంది.  ఎందుకంటే, తాము  ఇచ్చే  తీర్పుల  ప్రభావం  సమాజంపై  ఎంతో  ఉంటుంది.  ఒకవేళ  భవిష్యత్తులో మరిన్ని  గొడవలు, ఉద్యమాలు  వస్తే  ముందటి  తీర్పులను  పరిశీలిస్తారు  కాబట్టి.  సమాజాన్ని  అంతటినీ  దృష్టిలో  పెట్టుకుని  ధర్మబద్ధమైన  తీర్పులను  ప్రకటించినప్పుడే  సమాజం  సజావుగా  కొనసాగుతుంది.


Saturday, February 8, 2014

సూర్యరశ్మి చంద్రునిపై పడటం..మరియు .. నెలల తరబడి నిలువ ఉండే ఆవుపాలు..

* యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః ! భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః !!

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !


  చంద్రునికి  స్వయంప్రకాశత్వం  లేదని  చంద్రుని   వెన్నెలకు  కారణం  సూర్యరశ్మి    చంద్రునిపై   ప్రసరించటం  అని....    పాఠ్య పుస్తకాలలో   చదువుకుంటున్నాము.  

 

పై  విషయాలను  గమనించితే,  ఆధునిక  విజ్ఞానం  కంటే  ముందే  ప్రాచీనులకు  ఈ  విషయాల  గురించి  చక్కగా  తెలుసని  తెలుస్తోంది.

.....................................

  ఆవుపాలను  కొన్ని  నెలలు  నిలువ  ఉండేలా  ప్యాక్  చేసి  అమ్ముతున్నారు.    దేవాలయాలలో  అభిషేకాలు   వంటి  సందర్భాలలో    కొందరు  ప్రజలు  ఈ  ఆవుపాల  పేకెట్   కొని  తెచ్చి  అభిషేకం  చేస్తుంటారు.  అయితే  ఇలా  పాలను  నిలువ  ఉంచాలంటే  కొన్ని  రసాయనాలను  కలుపుతారేమోనని  నాకు  అనుమానం.  ఇలాంటి  నిలువ   చేసిన   పాలను  అభిషేకాలకు  వాడటం  వల్ల  ఫలితాలు  ఎలా  ఉంటాయో  ?

 ఉదా...ఆ మధ్య  కొన్ని   శివలింగముల  ఆకారాలలో  మార్పులు  రావటాన్ని  గురించిన  వార్తలు  వచ్చాయి  కదా  ! ఇలా  మార్పులు  రావటానికి   అభిషేకాలు  కూడా  ఒక  కారణమని  అంటున్నారు.    తాజా  ఆవుపాలు  సరిగ్గా  లభించకపోవటం  వల్ల  ప్రజలు  ఇలా  నెలలతరబడి  నిలువ  చేసిన  పాలను  వాడుతున్నారు.   సాధ్యమయినంతవరకు  అభిషేకాలకు  రసాయనాలు  కలుపని  పాలను  వాడితే  మంచిది.  పాలతో  పాయసం  వంటివి  చేసేటప్పుడు  కూడా  ఈ  జాగ్రత్తలను  పాటిస్తే  ఆరోగ్యానికి  మంచిదనిపిస్తోంది. 
Wednesday, February 5, 2014

మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు ....

ఓం.
సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.

దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు.

సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.

శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.ఈ  లింక్ వద్ద..  Monday, February 3, 2014

ఓం. సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము...
ఓం
..................
సరస్వతీ  ద్వాదశనామ  స్తోత్రము.

 
సరస్వతీ మయం  దృష్ట్వా వీణా  పుస్తకధారిణీమ్
హంసవాహ సమాయుక్తా  విద్యా  దానకరీ మమ..1
ప్రధమం  భారతీ నామ  ద్వితీయం  చ  సరస్వతి 

తృతీయం  శారదాదేవి   చతుర్ధం  హంసవాహినీ ..2
పంచమం  జగతీ  ఖ్యాతా  షష్టం  వాగీశ్వరీ  తధా
 కౌమారీ  సప్తమం  ప్రోక్తా   అష్టమం బ్రహ్మచారిణీ..3
నవమం  బుద్ధిదాత్రీ చ  దశమం  వరదాయినీ
 ఏకాదశే  క్షుద్రఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ..4
బ్రాహ్మీ  ద్వాదశ నామాని  త్రిసంధ్యం  యఃపఠేన్నరః
సర్వ సిద్ధికరీ   తస్య  ప్రసన్నా  పరమేశ్వరీ..5
సా మే వసతు  జిహ్వాగ్రే  బ్రహ్మరూపా  సరస్వతి 
ఇతి  శ్రీ  సరస్వతి  ద్వాదశనామ స్తోత్రం  సంపూర్ణము  .


ఫలం: సర్వవిద్యా  ప్రాప్తి -  వాక్శుద్ధి.

 వ్రాసిన  విషయాలలో అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.