koodali

Friday, February 14, 2014

గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.



ఇప్పుడు  తెలుగువారు  అందరికీ  అలుసైపోయారు.   ఎవరెవరో  వచ్చి   ఈ   రాష్ట్రాన్ని    మేము   విడదీస్తాం  అంటే    మేమే  విడదీస్తాం  అంటూ  ఉత్సాహంగా  స్టేట్ మెంట్స్  ఇచ్చేస్తున్నారు. 


 అయినా  ,  తెలుగువాళ్ళు  తమలో  తాము  తిట్టుకుంటుంటే   బయటి  రాష్ట్రాల  వాళ్ళను  అనుకుని  ఏం  లాభం?


  నీటివాటా  విషయంలోనూ  తెలుగువారికి  అన్యాయం  జరిగింది . అయినా  బుద్ధి  రాని   తెలుగువాళ్ళు  తమలోతాము  గొడవలు  పడుతూనే  ఉన్నారు.
 
 ఇప్పుడు  రాష్ట్రంలో    అయోమయ  పరిస్థితి   నెలకొని  ఉంది.  ఇలాంటప్పుడు    పై వారి  ప్రవర్తన  మరింత  రెచ్చగొట్టేలా  ఉంది. 


   ఎవరైనా  సరే  మా  తీర్మానికి  కట్టుబడాల్సిందే ... అంటూ  రెచ్చగొట్టే  ప్రకటనలు  చేస్తున్నారు. 

విభజనకు  ఒప్పుకోవాలి  అనుకునే  సీమాంధ్రులను   కూడా  రెచ్చగొట్టేలా  ప్రకటనలు  చేస్తున్నారు.

............................

  ఈ  విభజన  అంశం  ఒక్క  తెలుగువారి  సమస్య  మాత్రమే  కాదు. ఈ  సమస్య  దేశమంతా  విస్తరించే  అవకాశం  ఉంది..

బాధాకరమైన  విషయమేమిటంటే, దేశం  గురించి  ఎవరూ  మాట్లాడటం  లేదు. 


భవిష్యత్తులో,   రాజధాని   చుట్టుప్రక్కల   జిల్లాల   వాళ్ళు  రాజధానితో  సహా  విడిపోతామని  ఉద్యమాలు  చేసే  ప్రమాదముంది   కదా  !    అని  జాతీయపార్టీల  వారు  కూడా   అనుకోవటం  లేదు.   వారి  ఓట్లు  వారికి  ముఖ్యమయ్యాయి.


  ఇకముందు  నుంచి   రాజధానుల  విషయంలో  దేశమంతటా  ఒక  ఖచ్చితమైన  విధానాన్ని  ఏర్పరుచుకోవాలి. 
..................................................


హైదరాబాద్  వ్యవహారం  వల్ల   ఎన్నో  గుణపాఠాలు  నేర్చుకోవలసి  ఉంది.  ఇక  ముందు  ఏ  రాజధానిని  ఎక్కువగా  అభివృద్ధి  చేయకూడదు.  

 విద్యా,  ఉపాధి  అవకాశాలు    రాష్ట్రంలోని   అన్ని  ప్రాంతాలలోనూ   అభివృద్ధి  చెందాలి. 
....................................

 
యూపీఏ  నాయకత్వం   ఇంతకు  ముందు   అణు  ఒప్పందం  బిల్లును,  దేశంలో  రిటైల్  వర్తకానికి  విదేశీ  సంస్థలకు  మార్గం  సుగమం  చేసే  బిల్లును  పంతంగా  నెగ్గించుకుంది.  

దేశ  ప్రజల  ఖర్మ  వల్ల  దేశంలోని  మేధావులు  అని  చెప్పుకుంటున్న  వారు   కొందరు  ఆ బిల్లులకు  మద్దతును  ఇచ్చారు.   

  ప్రమాదకరమైన  అణువిద్యుత్  ను   అభివృద్ధి  చెందిన  దేశాలే  తగ్గించుకుంటుండగా  మన దేశంలో  ప్రవేశపెట్టాలని  ప్రయత్నాలు  ఎందుకు ?  


ఇక్కడ  యువత  ఉపాధి  లేక  నిరుద్యోగంతో  అల్లాడుతుంటే  చిల్లర  వర్తకుల  పొట్టలు  కొట్టే   విధంగా  రిటైల్  వర్తక  రంగంలో  విదేశీ  సంస్థలకు    తలుపులు  తెరవాలనే  తాపత్రయం  ఎవరి  బాగుకోసం  ? 
 
..........................................
ఇక,    బీజేపీ  వాళ్ళు  వల్లభభాయ్  పటేల్  గారిని  గుర్తు  చేస్తూ  యూనిటీ  అంటూన్నారు.  ఒకపక్క    విభజన  వాదన  వినిపిస్తూ   ఐక్యతే  మా  ఎజెండా  అనటం    ఏమిటో  ?
..................................


  ఎవరో  ఒకరికి  ఓటు  వేయాలి  కాబట్టి  మనకు  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  ఎవరో   ఒకరికి  వేయవలసి  వస్తోంది. 
 ..................................................

పోలవరం  వంటి  భారీ  ముంపు  ప్రాజెక్ట్స్  విషయంలో  ఎంతో  అటవీ  భూమి  మునిగిపోతుంది.  ఎందరో  గిరిజనుల  బ్రతుకు  అస్తవ్యస్తమైపోతుంది. 

 
పర్యావరణం  చక్కగా  ఉండాలంటే  అడవులు  ఎంతో  ముఖ్యం.   నీళ్ళ  కోసం  నేలను  ముంచుకుంటూ   పోతే  ఎలా  ?  మనకు  నీళ్లు  ఎంత  ముఖ్యమో    భూమి  కూడా  అంతే  ముఖ్యం.

 పోలవరం  ప్రాజెక్ట్   వల్ల  ఎక్కువ  భూమి  ముంపుకు  గురి  కాకుండా  డిజైన్  మార్చుకోవాలి.  భారీ  నీటి  ప్రాజెక్ట్స్  కన్నా  చెరువులు,  చెక్  డ్యాంస్    అభివృద్ధి  చేసుకుంటే  మంచిది.


మనుషులకు  తాగటానికి  నీళ్ళు  లేకపోయినా    పరిశ్రమలకు    ఎంతో  నీటిని  ఇస్తున్నారు. 
 .......................
 ఇతరులకు  అన్యాయం  చేసిన  వాళ్ళకు  ఆస్తి  ఉన్నాకూడా     మనశ్శాంతి  మాత్రం  ఉండదనేది   చరిత్ర  చెబుతున్న  సత్యం.



5 comments:

  1. స్వార్ధమే నేటి రాజకీయం.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల ఆలస్యంగా జవాబిస్తున్నందుకు క్షమించండి.

      నిజమే, మీరన్నట్లు స్వార్ధమే నేటి రాజకీయంలో ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.


      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. భాజపా చిన్న రాష్ట్రాల్ని సమర్ధించటం వెనకా IMF ప్రమేయమే ఉంది. రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంతో పాటు వాళ్ళు ఆ ప్రభుత్వాల్ని కూదా బతిమి లాడుకోవాలి.అదే రాష్ట్రాలు చిన్నవిగా తక్కువ మంది పార్లమేంటు సభ్యులతో మాట చెల్లుబడి లేనివిగా ఉంటే ఒక్క కేంద్రంతో సై అనిపించుకుంటే చాలు. చాప కింద నీరులా మధ్య యుగాల్లో ఈ దేశంలో యేం జరిగిందో అదే మళ్ళీ పురరావృతం కాబోతున్నది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. పనివత్తిడి వల్ల ఆలస్యంగా జవాబిస్తున్నందుకు క్షమించండి.

      నిజమే, మీరన్నట్లు రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంతో పాటు వాళ్ళు ఆ ప్రభుత్వాల్ని కూదా బతిమి లాడుకోవాలి.అదే రాష్ట్రాలు చిన్నవిగా తక్కువ మంది పార్లమేంటు సభ్యులతో మాట చెల్లుబడి లేనివిగా ఉంటే ఒక్క కేంద్రంతో సై అనిపించుకుంటే చాలు.

      పూర్వం ఆధునిక టెక్నాలజీ లేకముందు కాలంలో కూడా పెద్ద రాజ్యాలను సమర్ధవంతంగా పాలించారు కొందరు పాలకులు. ఇప్పుడు ఈ - గవర్నెన్స్ వంటి సదుపాయాలు వచ్చిన రోజుల్లో పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు కావాలి అంటున్నారు కొందరు.

      ఒకప్పుడు అద్వానీ గారు చిన్నచిన్న రాష్ట్రాల వల్ల దేశంలో అస్థిరత పెరుగుతుందని అన్నారట.

      రాష్ట్రాలను విభజించుకుంటే పోతే వాటన్నింటికీ రాజధానులు కావాలి. ఒక్కొక్క రాజధానిని నిర్మించటానికి లక్షల కోట్ల డబ్బు కావాలి. ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు లేదంటున్నవారు కొత్త రాజధానుల నిర్మాణానికి డబ్బెక్కడనుంచి తెస్తారు ?

      ఒక చిన్న రాష్ట్రాన్ని ఇవ్వటం మొదలుపెడితే అన్ని డిమాండ్లను ఒప్పుకోవాలి కదా ! చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఎక్కువగా వస్తే అందరి డిమాండ్లను ఆమోదిస్తారా ?

      ఇలాగైతే రాష్ట్రాలను విభజించటంతోనే సమయం సరిపోతుంది. ఇక ప్రజల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ?

      అసలు చిన్న రాష్ట్రం అంటే ఏమిటో వారికే తెలియాలి. 10 జిల్లాలా? లేక 5 జిల్లాలా ? అలాగైతే, దేశంలో 10 జిల్లాల కంటే ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాలన్నింటినీ విభజిస్తారా ? రాయలసీమ రాష్ట్రం , గిరిజనులకు రాష్ట్రం డిమాండ్లు వస్తే అంగీకరిస్తారా ? వీటన్నింటికీ సమాధానం వారికే తెలియాలి.


      Delete