koodali

Friday, June 25, 2010

కొన్ని యాత్రా విశేషాలు ........
ఫోటోస్ మేము శ్రీ అమర్ నాధ్, మాతా వైష్ణవీ దేవీ యాత్రలు చేసినప్పటివండి. ఫోటోస్ ను మేము మళ్ళీ సెల్ల్ ఫోన్ తోతీసి ఇక్కడ పెట్టడం వల్ల అంతబాగా కనిపించటం లేదండి. మూడవ ఫోటో వైష్ణవి దేవి గుడి ఉన్న ప్రాంతము .


మాతా వైష్ణవీదేవీ దర్శనం క్యూ లైన్ లో త్వరత్వరగాపంపించటం వల్ల, ఇంకా కొన్ని కారణాలవల్ల మేము అమ్మవార్లను అంత బాగా చూడలేకపోయాము. మనకు అంతవరకేప్రాప్తం అని సరిపెట్టుకున్నాము .వైష్నవీ దేవీ దర్శనము అయ్యాక అక్కడకు కొంతదూరంలో భైరన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనము చేసుకుంటెనేగాని యాత్ర పూర్తి అయినట్లు కాదంట. ఇలా అని అమ్మవారి వద్ద భైరన్ నాధ్ వరాన్నికోరుకోవటం
జరిగిందట. మేము ఈ గుడికి కూడా వెళ్ళాము లెండి.

అమర్నాధ్ వెళ్ళటానికి ఇప్పుడు రెండు దారులు ఉన్నాయండి. ఒకటి పహల్గాం ద్వారా, రెండు బాల్టాల్ ద్వారా .. ....బాల్టాల్ ద్వారా గుహ దగ్గర. .... ,పహల్గాం నుండి గుహ దూరమే కానీండి పహల్గాం రూట్ ట్రెడిషనల్ రూట్ అట. మేము ఈ రూట్ ద్వారానే వెళ్ళాము.......... అమర్నాధ్ గుహ ముఖ ద్వారం దగ్గరదగ్గర రెండు అంతస్తుల మేడ అంత ఎత్తు ఉంటుంది. గుహలోపల చాలా విశాలముగా ఉంటుంది .అమరనాధుని రూపం చక్కగా ఏర్పడిందండి. . క్యూలో దర్శనం అయ్యాక ప్రక్కకువచ్చి గుహలో ఎక్కువసేపే ఉన్నాము.


గుహలో చాలా భాగం బండ రాళ్ళతో పరిచారండి. కాళ్ళ క్రింద చాలా చల్లగాఉంటుంది. గుహలో అంత చల్లగా ఉన్నా ఒక రాతి పలక దగ్గర మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుందట. విషయంఅక్కడి వారికి కూడా చాలామందికి తెలియదని ఒక పుస్తకములో చదివాను. కానీ తీరా అక్కడికి వెళ్ళాక విషయమేమర్చిపోయాను. ఇలాంటప్పుడు ఏమని అనిపిస్తుందంటేనండీ మనం ఎంత తాపత్రయపడినా మనకు ఎంత ప్రాప్తమోఅంతే ప్రాప్తిస్తుందని. మేము కేవలం దైవ భక్తితో మాత్రమే కాక లౌకికపరమైన కోరికలతో కూడా యాత్రలుచేశాములెండి.ఇంకో విషయం చెప్పాలండి ..... రోజుల్లో చాలా దేవాలయాల్లో క్యూ లైన్లలో త్వరత్వరగా దర్శనంచేసుకోవాల్సి వస్తోందికదా ... మనలో చాలామందికి ఒక అలవాటుంది. గుడిలో దేవుని వద్దకు వెళ్ళగానే కళ్ళుమూసుకుని దేవునికి నమస్కరించటము చేస్తుంటాము. దీనివల్ల దైవం ముందు ఉన్న కొద్దిసమయములో దేవునిసరిగ్గా చూడలేము. అలా కాకుండా కొద్దిసేపు దేవుని చక్కగా చూడాలి. కావాలంటే తరువాత ప్రక్కకు వచ్చికళ్ళుమూసుకుని దైవాన్ని ప్రార్దించుకోవచ్చు. ఇంకో విషయం దైవదర్శనం చేసుకునేటప్పుడు వీలైనంతవరకు వేరేఆలోచనలు లేకుండా దైవదర్శనం చేసుకుంటే భగవంతుని చక్కగా చూడగలం.అమర్నాధ్ యాత్ర కు చాలామందిఆడవాళ్ళు, చిన్నపిల్లలు కూడా వచ్చారండి. కొంతమంది కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో లేకచేతులసహాయంతో మంచులో వెళ్ళటం చూశాక మాకు ఏమనిపించిందంటేనండి .... మాదీ ఒక భక్తేనా అని... వాళ్ళుఅంత కష్టపడుతూ కూడా యాత్ర చేస్తున్నారు కదా అని.


అక్కడి పర్వతాలలోని నీరు మినరల్ వాటర్ కన్నా చాలాస్వచ్చంగా ఉంటుంది. శ్రీ బాబా అమర్ నాధ్ యాత్రా, మాతా వైష్నవీ దేవీ యాత్రలు జీవితంలో అధ్బుతమయినయాత్రలు. నేనయితే జన్మలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. ఏదో భగవంతుని దయ అంతే. నేను మాకుదగ్గరలోని దేవాలయానికే ఎప్పటినుంచో వెళ్ళలేకపోతున్నాను


. అయితే ఇలాంటి యాత్రలు కుదిరితే వెళ్ళటము మంచిదేకాని కొన్ని కారణాలవల్ల కుదరనప్పుడు మనం బాధ పడకూడదు. ఏమంటే తీర్ధయాత్రలు చేసి దైవపూజ చెయ్యటంఎంతగొప్పో, మన మనస్సులో, ఇంట్లో దైవ పూజ చెయ్యటం కూడా అంతే గొప్ప. నిజమయిన భక్తునికి హృదయంలోనే భగవంతుడు కొలువై ఉంటాడట.


భగవంతుని నిజరూపదర్శనం, స్వప్నదర్శనం పొందిన గొప్ప వాళ్ళు ఎంతోమందిఉన్నారు. కావలసింది దైవం నందు ప్రేమభక్తి మాత్రమే. ..... ...........

Friday, June 18, 2010

శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..
ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నానండి. ఇది సుమారు అయిదు సంవత్సరముల క్రిందట జరిగింది.


అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి. మా ఫ్రిజ్ లో ఎప్పుడు అందరికిలానే అయిస్ ఫార్మ్ అవుతుంది. కానీ ఒకసారి అయిస్ పెద్ద ఆకారములో దగ్గరదగ్గర శ్రీ అమర్‌నాధ్ శివలింగం ఆకారములో ఏర్పడిందండి. డీప్ ఫ్రిజ్లో నీరు బొట్లుబొట్లుగా పడుతూ రెండు ఆకారములు ఏర్పడ్డాయి. ముందు నేను గమనించలేదు. తర్వాత చూసి ఆశ్చర్యపోయామండి. ఒక ఆకారానికి ముఖము లాగ కూడా అనిపిస్తోంది.
. ప్రక్కన వాళ్ళకు చూపిస్తే ఫొటోస్ తియ్యమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు తరువాత ఆ అయిస్ కరిగించి నీరు శ్రీ పిడారి నవశక్తి కాళీ అమ్మన్ అమ్మవారి గుడిలోని చెట్టు మొదట్లో పోశానండి. గుడివారికి ఈ విషయములు చెప్పలేదండి. ఈ ఫ్రిజ్లోని అయిస్ తో ఏర్పడ్డ ఆకారములను కొందరికి మాత్రమే చూపించామండి. అంటే అసలే రోజులు బాగాలేదు కదా ఎవరికయినా చెప్పినా నమ్మకపోగా మేమే ఇలా అయిస్ తో ఏర్పాటు చేశామని అన్నా అంటారు. ఎందుకొచ్చిందని ఊరుకున్నామండి.కానీ తరువాత ఏమనిపించిందంటే భగవంతుని కి సంబందించిన వింతలు ఇతరులుకు కూడా చూపిస్తే మంచిది కదా అని. అలా కొందరికి ఫోటోస్ ను మెయిల్ చేశాము. ఈ ఫోటోస్ ను చూస్తే నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది ఎందుకంటేనండి. అప్పుడు వీడియో తీయించుకోలేకపోయాము. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది కదా... ఇప్పుడు మాకు వీడియో కెమెరా ఉంది కానీ అలా మళ్ళీ ఏర్పడలేదు. . . . . .నేను అయితే ఇది అద్భుతం అనుకుంటాను. .ఇది సహజంగానే అలా ఏర్పడిందండి. ఇక నమ్మటం నమ్మకపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది. .ఆ భగవంతుని దయవలన క్రితం సంవత్సరం మేము ,పిల్లలతో శ్రీ అమర్ నాధ్ జీ యాత్ర, శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారి యాత్రలు చేసి వచ్చామండి. ..... .
....

Wednesday, June 16, 2010

పరమ ధర్మం.......పరమధర్మసుఖం...............

అందరికి నా నమస్కారములు అండి. ఇంతకు ముందు రాసిన వ్యాసం గురించి ఒక బ్రదర్ కామెంట్స్ రాస్తూ ధర్మ బధ్ధ సుఖములు అంటే ఏమిటి అని అడిగారండి. నేనేమో నాకేదో పెద్ద పాండిత్యం ఉన్నట్లు దాని గురించి రాస్తూ ...ఇతర ప్రాణులను బాధ పెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం అనేవి ధర్మబధ్ధమైన సుఖములు" అని కూడా రాశానండి. కానీ తరువాత ఆలోచిస్తే నేను రాసినది సరయినదిగా నాకు అనిపించలేదు. మనము ఆహారం కోసం మొక్కలనయినా బాధపెడతాము కదా అనిపించింది. అంటే ధర్మంలో కూడా హింస ఉంటుందా....ఇలా ఎన్నో ఆలోచనలు...
ఈ ఆలోచనలు మీతో చెప్పాలని ఇలా రాస్తున్నానండి . ధర్మం గురించి పెద్దలు అనంతకాలముగా ఎన్నోవిధాలుగా చెబుతూనేఉన్నారు. వర్ణాశ్రమధర్మములు, కులధర్మములు, .... ఇలా ఎన్నోరకముల ధర్మములు ఉన్నాయి. ధర్మము యుగమును బట్టి మారుతుంది. ధర్మం సందర్భమును బట్టికూడా మారుతుంది. ధర్మబధ్ధమైన సుఖములు అంటే పెద్దలు చెప్పిన ధర్మం ప్రకారం కర్మలను చేస్తూ సుఖాలను అనుభవించటం. ఇతరులు ఏపని చేస్తే మనము బాధపడతామో దానిని సాధ్యమయినంతవరకు ఇతరుల పట్ల చెయ్యకపోవటం. ఇతర ప్రాణులను సాద్యమైనంతవరకు బాధపెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం ఇలా ....... ఇందులో ఒక్కోసారి కొంచెము హింస ఉంటుంది. అంటే ఆహార సంపాదన, ,ఇలాంటి కొన్ని సందర్భములలే..హింస ఉంటుంది..........
..మరి హింస లేకుండా ధర్మం ఉండదా? ఉంటుంది... దాని పేరే పరమధర్మం ...... అంటే పరమాత్మ.

మరి హింస లేని ధర్మబధ్ధ సుఖం ఉండదా....ఉంటుంది దానిపేరే పరమ ధర్మబధ్ధసుఖము ....... అంటే పరమాత్మను పొందటం. .ఇలాంటిదే ...ఇంద్రుడు,దేవతలు నిజముగా అమరులు కాదట. వారు మానవులు కన్నా అధిక ఆయుఃప్రమాణము కలవారు కాబట్టి మాత్రమే వారిని అమరులు అంటారట. .పరిపూర్ణమైన అమరత్వం లేకపోలేదు....చింతామణి గృహంలో నివసించే శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి (పరమాత్మ) అమరులు.ఇంకా ఇలా అనిపించిందండి. ..... ధర్మబధ్ధ సుఖములో హింస ఉండే అవకాశం ఉంది. .

,1. హింస లేని ధర్మం పేరు ......... పరమ ధర్మం ......... అంటే పరమాత్మ.
2. హింస లేని ధరబధ్ధసుఖము పేరే...... పరమధర్మబధ్ధసుఖము. ....... అంటే పరమాత్మను పొందటమే ........ పరమ ధర్మబధ్ధ సుఖం. .


పరమాత్మ పరిపూర్ణులు.....పరమాత్మతత్వం పరిపూర్ణతత్వం. ఎవరయినా పరిపూర్ణత్వమును, ఏమాత్రము దుఃఖము లేని పరిపూర్ణసుఖమును పొందాలనుకుంటే మాత్రం ఆ పరమాత్మను పొందటము ద్వారా మాత్రమే అది సాధ్యము. దానినే మోక్షము అంటారేమో. అందుకే మన పెద్దలు మోక్షమునకు అంత ప్రాధాన్యతని ఇచ్చారు...
ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలండి. తల్లి పిల్లలకు ఆడుకోవటానికి బొమ్మలను,. ఇస్తుంది. పిల్లవాడు తోటి పిల్లలతో ఆటలలోపడి తల్లిదండ్రులు పిలిచినా వెళ్ళడు. అలా ఆడగా,ఆడగా తనకే విసుగు కలిగి ఒక్కసారి అన్ని ఆటలను, తోటిపిల్లలను వదిలి అమ్మానాన్నను చేరుతాడు. అలాగే జీవులు కూడా ఎన్నోజన్మలు గడవగా,గడవగా ఒక్కసారి విసుగు పుట్టి ఆ జగన్మాతాపితరులను చేరుకుంటారు. ఆ జగన్మాతాపితరులు తమ బిడ్డలు త్వరగా ఒకజన్మలోనే తమ వద్దకు రావాలని కోరుకుంటారు. కొందరు ఒక్క జన్మలోనే పరమాత్మను పొందుతారు. కొందరికి ఎన్నోజన్మలు పట్టవచ్చు. సరి అయిన దారిలో నడిచిన పిల్లలు త్వరగా ఇల్లు చేరుతారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యముగా ఇల్లు చేరుతారు. ఏది ఏమైనా అందరికి ఇల్లు చేరటం తప్పనిసరి..
జగన్మాతాపితరులను అంటే పరమాత్మను పొందటమే అన్ని జీవులకు పరమావధి, పరమధర్మం, పరమధర్మబధ్ధసుఖం. దీనినే మోక్షము అంటారేమో తెలియదండి..ధర్మబధ్ధజీవితముతో నిష్కామముగా జీవితములను గడిపిన ఎందరో మహానుభావులు చరిత్రలో ఉన్నారు. అందులో గృహస్థులు, సాధువులు, సన్యాసులు ,యోగులు ఇలా అన్ని వర్గములవారు ఉన్నారు. శ్రీశ్రీమహావతార్ బాబాజీ గారు ,శ్రీశ్రీ లాహిరీ మహాశయులను ఆదర్శ గృహస్థ యోగికి నిర్వచనమని తెలిపారు. శ్రీషిర్డి సాయిబాబా గారు గొప్ప మహానుభావులు. ఇంకా హిమాలయములలో ఎందరో యోగులు తపస్సు చేస్తూ ఉంటారంట. వారు తమ తపస్సును లోక కల్యాణానికి కూడా వినియోగిస్తారంట..


.నేను రాసిన చాలా విషయములు భగవంతుని దయవలన, పెద్దల నుండి నేర్చుకున్నవేనండి....
నేను గత రెండు రోజులనుండి కొన్ని కారణముల వల్ల నెట్ కూడా చూడలేదండి. ఈ వ్యాసం రాయటానికి నేను పొందిన కొన్ని అనుభూతులకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప ఏమి చెయ్యగలను ..... అంతా ఆ భగవంతుని దయ.. .. తప్పులను ఆ భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నాను. ... ఈ సంవత్సరం అమర్ నాధ్ యాత్ర గురించి ప్రకటించారండి. అది అధ్బుతమయిన యాత్ర.......Friday, June 11, 2010

సుఖాలు అనుభవించే కొద్దీ.....పుణ్యక్షయం...................కష్టాలు అనుభవించే కొద్దీ....పాపక్షయం......

నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదే మరి.. నా వ్యాసాలను చదివి ఎవరయినా బాధ పడ్డారేమోనని కొంచెము ఫీలయ్యాను. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలలోను మంచివారు, దైవభక్తులు, సాటి ప్రజలయదు దయగలవారు చాలామంది ఉంటారు గదా.... వీళ్ళందరూ నన్ను అపార్ధము చేసుకోకూడదని ........... నా అభిప్రాయములు వ్యవస్త గురించె గాని వ్యక్తుల గురించి కాదని దయచేసి గ్రహించగలరు.మన వ్యవస్ధ ఇలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు సంపద ప్రభుత్వం దగ్గర కొంత భాగం, మిగతా ప్రజల అందరి వద్దా సమానంగా ఉండాలి.ఇప్పుడేమో ప్రభుత్వం, ప్రజల వద్ద కన్నా ప్రైవేట్ కంపెనీల వద్ద ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు?ఇవన్నీ ఆలోచించి పాత కాలం నాయకులు జమీందారీ వ్యవస్త రద్దు, భూపరిమితి చట్టం ఇలా చాలా చేశారు. ఇప్పుడు దానికి వ్యతిరేకముగా జరుగుతోంది.


ఇలా పేదరికం పెరిగిపోటానికి ఎన్నో కారణాలున్నాయి.


ప్రజలలో కూడా లగ్జరీస్ అంటే వ్యామోహం బాగా పెరిగిపోయింది. అవన్నీ తీర్చటం అంటే ప్రభుత్వానికయినా అసాధ్యమే. ప్రాధమిక అవసరాలు తీరని చాలామంది ఉన్నారు.ప్రభుత్వం ముందు వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి.నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ దేవీ భాగవతములో ఇలా చెప్పారండి.
దేవేంద్రుడు ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు , బృహస్పతి    దేవేంద్రుని    ఓదార్చిన సందర్భములో చెప్పిన విషయమిది.

విషయం గురించి ఎక్కువ వివరించే శక్తి నాకు లేదు కానీ అండి, కొంచెం చెప్పగలను. మనము సుఖములు అనుభవించేకొద్దీ మనం చేసుకున్న పుణ్యం యొక్క మొత్తం తగ్గుతూ వస్తుందట. కష్టాలు అనుభవించినప్పుడు పూర్వ జన్మలో చేసిన పాపం తగ్గుతూ వస్తుందంట. అంటే సుఖములు అనుభవించే కొద్ది వారి యొక్క పుణ్యం త్వరగా అయిపోతుంది అన్నమాట.
మనం ఎప్పుడూ సుఖముగా ఉండాలంటే ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తూనే ఉండాలి. కష్టాలలో ఉన్నవారు తమ పూర్వ జన్మ పాపం తగ్గిపోతోందని తమకు తాము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరయినా ధర్మబధ్ధమైన సుఖాలు మాత్రమే అనుభవించాలి.

కొద్ది మంది మహానుభావులు సాత్విక కర్మలతోసహా అన్ని కర్మలను త్యజించి దైవం ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటారంట. మహానుభావులు ఎక్కడో ఉంటారు.
తల్లి,తండ్రి చేసిన పుణ్యం,పాపం పిల్లలకు తగులుతాయంటారు. దయచేసి అందరూ తమ పిల్లల సుఖం కోసమయినా ధర్మ కార్యాలు మాత్రమే చేయ్యాలి. చెడ్డ పనులు చేసి సంపాదించిన డబ్బుతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా కష్టాలు రావచ్చని పెద్దలు చెపుతున్నారు మరి. భగవంతుడు గుడిలోనే కాదు మన యొక్కధర్మ నడవడిలో కూడా ఉంటారు అండి.......,........

 

Wednesday, June 9, 2010

ధరలు తగ్గాలంటే ఇలా చేస్తే .........

ఆ మద్య జీతాలు పెరిగిన కొందరిలో మా బంధువులు కూడా ఉన్నారులెండి. అయితే జీతాలు పెరిగిన దాని గురించి నేను పూర్తిస్తాయిలో సంతోషించలేదని వారు బాధపడ్డారు కూడా... నాకు వారికి దీని గురించి చిన్న డిస్కషన్ కూడ జరిగింది.


అసలు నేను ఏమన్నానంటే దేశంలో ఇంతమంది పేదవారుంటే ఇంకా జీతం పెంచమనటం తప్పు అనీ,ఒక ప్రక్క వేరే దేశాలలో ఉద్యోగాలు ఊడిపోతుంటే మనం ఉద్యోగం ఉన్నందుకు సంతోషించక జీతం పెంచమనటం అన్యాయం అని ....(భారతీయులకున్న పొదుపు చేసే గుణం వల్ల ఆర్ధిక మాంద్యం నుండి పెద్దగా ప్రాబ్లం రాలేదని అంటున్నారు కదండి)

వారేమో ఆ.... మేము ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ ఎంతో కష్టపడుతున్నాము అని అన్నారు.

నేనేమో మీరు ఎ.సి రూంస్ లో పనిచేస్తూ ఇంత బాధపడుతుంటే చాలామంది కార్మికులు, కర్షకులు, చిన్నపనివారు ఎండలో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు వాళ్ళకు జీతాలు ఎవరూ పెంచరు అని ఇలా.....* అసలు నా అభిప్రాయమేమిటంటేనండీ ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలండి.


డబ్బంతా కొంతమంది జీతాలకే పోతే పేదవారు ఏమి కావాలి. వారి కష్టం కష్టం కాదా....

జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...ఇదొక అంతులేని కధ....

ఒక ఉద్యోగికి 40వేలు నెలకు వస్తే ఒక చిన్న కార్మిక, చిన్న వ్రుత్తి వారికి 4 వేలు నెలకు వస్తే పెరిగిన జీతంవల్ల పెద్ద ఉద్యోగికి బాధ ఉండదు. కాని చిన్న ఉద్యోగి ఎలా బ్రతకాలి......? ఉద్యోగం లేని వారికి జీతాలు ఎవరు పెంచుతారు. 


 రైతుల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారిని ఎవరూ పట్టించుకోరు. పేదవారు , కూలీలు వీరు ఈ రేట్లతో ఎలా బ్రతకాలి...? అందరి కష్టం ఒకటి కాదా ? 

 .జీతం పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా అని నా అభిప్రాయం.

 ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు లేక ధరలు తగ్గాయి కదా..

ఇంటి అద్దెలు కూడా తగ్గాయి. .కొంతమంది చిన్న, మద్య తరగతి వాళ్ళు ఇళ్ళు కొనుక్కున్నారు కూడ..

అసలు ధరలు తగ్గించటం వల్ల వ్యాపారులకు కూడా లాభం. ధరలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది సరుకులు కొంటే ధరలు తగ్గిస్తే 20 మంది వస్తువులు కొనే చాన్సుంది. అందరికి అన్నీ అందుబాటులోకి వస్తాయి.


అందరూ పల్లకీ ఎక్కితే మోసేదెవ్వరూ... ఏ వ్రుత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయములులలో ఇంత పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు. 


 పరమాత్మ ద్రుష్టిలో రాజుకు, బంటుకు, ఒకే రకమయిన విలువవుంటుంది....

రానురాను మన దేశంలో పేదలు మరీ పేదలుగాను, ధనికులు మరీ ధనికులు గాను అవ్వటం చూసి ఇలా నాకు తోచింది రాస్తున్నాను. నాకు ఇందులో తప్పులు ఉంటాయని భయమే కానీ నా అభిప్రాయములు మీతో చెప్పుకోవటానికి రాస్తున్నానంతేనండి. తప్పులను దయచేసి క్షమించండి........
..


అందరికి నా కృతజ్ఞతలు.....

అందరికి క్రుతజ్ఞతలండి.మీ విలువయిన టైంలో కొంచం ఆనందం బ్లాగ్ చదవటం కోసం స్పెండ్ చేస్తున్నందుకు నా క్రుతజ్ఞతలండి.ఈ బ్లాగ్ చదువుతున్న వారికి, ఫాలోవర్స్ కు, కూడలి వారికి, చదివి మీ విలువయిన అభిప్రాయములు తెలుపుతున్న వారికి అందరికి థాంక్స్ అండి. ఈ మద్య తెలుగు వెబ్ మీడియా లో నా వ్యాసాలు కూడా ప్రచురించినందుకు క్రుతజ్ఞతలు చెప్పటం నా భాద్యత. వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ థాంక్స్ అండి.


నా వ్యాసాలు చదివి మీ అభిప్రాయములు తెలిపిన వారి ద్వారా నేను ఆ భగవంతుని దయవల్ల చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానండి. నాకు వారి కామెంట్స్ ద్వారా కొత్త ఆలోచనలు వచ్చాయి. అందుకని సద్విమర్శలు వల్ల మనకు లాభమే కలుగుతుంది. నేను చాలా మంది బ్లాగ్స్ చదువుతానండి. ఎంతో గొప్పగా రాస్తున్నారు. వారంత కాకపోయినా నాకు తెలిసినంతవరకు నా ఆలోచనలు కొంతమందికయినా చెప్పుకోగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకు చాలా ఆనందముగా ఉన్నది. దీనికి కారణమైన ఆ భగవంతునికి, ప్రోత్సహిత్సున్నా అందరికి నా క్రుతజ్ఞతలండి...

Monday, June 7, 2010

ఒక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 100 కోట్ల భారతీయులకు 1000000000000000 రూపాయల ఆస్తి (ప్రాధమిక అవసరాలు తీరటం) .

మనది పేద దేశం కాదు సిరి సంపదలు గల ఎంతో   గొప్ప  దేశం. కేవలం మన అలక్ష్యం వల్ల ఇలా ఉంది అంతే. మన సిటీల్లో చూశారా ఒక పక్కన ఆకాశాన్నంటే ఆకాశహర్మ్యాలు ,ఆ ప్రక్కనే స్లంస్ లో  మురికి గొట్టాలలో అర్ధాకలితో బ్రతుకుతున్న ప్రజలు. ఈ పరిస్తితిని మనం మార్చలేమా....ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నమండి.మీకు బోర్ కొట్టకుండా సాధ్యమయినంత తక్కువ పదాలతో రాయటానికి ప్రయత్నిస్తానండి.


మనం ముందు ప్రాధమిక అవసరాలయిన ఆహారం, ఆవాసం, విద్య, వైద్యం రక్షణ......ఇలాంటివాటికి బడ్జెట్లో ఎక్కువ ప్రాదాన్యాన్ని ఇస్తూ మన లగ్జరీస్ ను కొంతకాలం తాత్కాలికంగా తగ్గించుకోవాలి.


1.ఆహారం....నాకేమనీనిపిస్తుందంటే చెట్లు, మొక్కలు విస్తారంగా నాటి వాటిని రక్షించుకుంటే ఆహారకొరత ఎందుకు ఉంటుందనేది ఎప్పట్నించో అర్ధం కాని విషయం.


2.నీరు........చీమలు లాంటి చిన్న జీవులు వర్షాకాలంలో ఆహార కొరత రాకుండా వేసవిలో ఆహారాన్ని దాచుకుంటాయి.అలాంటిది మనం వర్షాకాలంలో ఊర్లు మునిగేంత వరదలు వచ్చినా వాటిని రిజర్వాయర్స్లో దాచుకును వేసవిలో వాడుకోవటానికి ఎందుకు విఫలమవుతున్నాము.నాగార్జునసాగర్ లాంటి పెద్ద ఆనకట్టలు కట్టకుండా ఆడబ్బుతో మన రాష్ట్రం నాలుగు ప్రాంతాలయిన కోస్తా,, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్రా లలో నాలుగు మధ్యతరగతి ఆనకట్టలు కడితే బాగుండేదని నా అభిప్రాయం.3.విద్య...ఇది అసలయిన విషయం. భుక్తికి కావాల్సిన వ్రుత్తి విద్యలు నేర్పించటంతోపాటు పిల్లలకు ధర్మం....దాన్ని పాటించటం లాంటి విషయాలు గట్టిగా నేర్పిస్తే సమాజంలో అవినీతి లాంటి సమస్యలు ఉండవు. మంచి భావి తరాల పౌరులు తయారవుతారు. అందుకే మన పెద్దలు ధర్మానికి అంత విలువను ఇచ్చారు.4.వైద్యం...అల్లోపతి తో   పాటు ,  ఈ రోజుల్లో మీడియాలో ఆయుర్వేదం, ఆరోగ్యం, హోమియో వీని గురించి   ఎన్నో మంచి విషయాలు ఎంతో మంది పెద్దలు చెబుతున్నారు.ఇవి తక్కువ ఖర్చుతో కూడిన గొప్ప ఫలితాలనిస్తాయి.ప్రజలు వీటిని పాటించటం నేర్చుకోవాలి.   ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం సమర్ధవంతముగా అమలుచేయాలి.5.రక్షణ...ఇది అత్యవసరం తప్పదు కాబట్టి డబ్బు ఖర్చు గురించి భాధపడకూడదు. పొరుగు దేశాలతో సాధ్యమయినంత స్నేహ భావంతో మెలగాలి.వారికి ,మనకి మంచి బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధించాలి. కొంతమంది ఇది చూసి నవ్వినా ఎక్కువ మంది చేసే మంచి ప్రార్ధన తప్పక ఫలిస్తుంది.6. ఆవాసం...ఇల్లు...మన దేశం ఎంతో మురికి మయంగా అయిపోయింది. మురికి వాడలు లేకుండా వారికి ప్రభుత్వ భూములలో ఇళ్ళు కట్టించాలి. ఈ మధ్య తేలికపాటి ఇటుకలతో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టే విధానాలు వచ్చాయి.
ఊరి మధ్య   కొన్ని  కట్టడాలు  కట్టడం మాని అయినా ఆ స్థలంలో బీదలకు ఇళ్ళు కట్టివ్వాలి.  ఒకవేళ , ఊరి మధ్య ప్రభుత్వ భూములు ఖాళి లేకపోతే పేదలకు ఊరికి కొంచెం దూరంగా ఇళ్ళు కట్టి , వారు ఊరిలోకి వచ్చి పనులు చేసుకోవటానికి వీలుగా ఫ్రీ బస్, ట్రైన్ పాస్ ఇవ్వాలి.ఇక ఇంధనానికి మనకు అపారమయిన సౌర శక్తి ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డబ్బు ఖర్చు ఉండదు. ఖర్చు ఎక్కువయిన ఇదే మనదేశానికి కరెక్ట్ పధ్ధతి.మనశాస్త్రజ్ఞులను తక్కువ కర్చుతో సౌరశక్తి పొందటానికి తగిన ప్రయోగాలు చెయ్యటానికి ప్రోత్సహించాలి.ఇవన్ని జరగాలంటే డబ్బు ఎలా అన్నది అసలు సమస్య .మనదేశంలో సహజవనరుల రూపంలో అపారమయిన సంపద ఉంది. ముందు మనమందరం ఒక లక్ష్యం ఏర్పరుచుకోవాలి. ప్రతిఒకరికి 10లక్షల రూపాయల ఆస్తి చొప్పున 100కోట్లమంది భారతీయులకు 1000000000000000 రూపాయల ఆస్తి ఏర్పరచటం. ఇది అసంభవమేమీ కాదు .నిజమే.
మన రాష్ట్రములో ఇప్పుడు కడుతున్న నీటి ప్రాజక్ట్స్ ఖర్చే ఒక లక్ష కోట్ల రూపాయలు అవుతుందని పేపర్లో చదివాను. 

 

మనదేశంలో లక్షల ఎకరాల భూమి ,  ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యాపారాలు ... ఇవి అన్నీ కలిపితే   చాలా  సంపద  ఉంటుంది.
వాని పైన వచ్చే వడ్డి ని    (  ఆదాయం   )  ప్రజలకు ఒకరికి నెలకు 10వేలచొప్పున అందేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.   అంటే  ,  కొంతమందికి వ్యవసాయానికి పొలం రూపంలో, కొంతమందికి వ్యాపారానికి రుణం రూపంలో, కొంతమందికి ఉద్యోగాలిచ్చి జీతం రూపంలో ..... ఆ  ఆదాయాన్ని   అందించాలి. అలా   అమ్దరికీ  పని  కల్పించాలి .


అందరికి ప్రాధమిక విద్య నిర్భంధం చేసి వ్రుత్తి విద్యలు నేర్పించాలి. ఆడవారికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి రుణాలని ఇవ్వాలి. ఇవన్నీ సమర్ధవంతముగా చేస్తే ఒక నలుగురు ఉన్న కుటుంబానికి నెలకు 40వేల ఆదాయం వస్తుంది. నెమ్మదిగా మన లక్ష్యం పెంచుకోవచ్చు. ఇది ఆస్తి రూపంలో చూస్తే ....అవసరాల ప్రకారం చూస్తే ప్రజల ప్రాధమిక అవసరాలు తీరటం మన మొదటి లక్ష్యం కావాలి.ఇవన్నీ సరిగ్గా అమలు జరగాలంటే స్వామి వివేకానందులవారు చెప్పినట్లు సచ్చీలత, క్రమశిక్షణ ,ప్రజాసేవే పరమావధి కలిగిన కొంతమంది వ్యక్తులు కావాలి.వీరితో ఏర్పడేవి ప్రజాకమిటీలు. వీరు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచెయ్యాలి. * మనకు ప్రజాసంక్షేమ పధకాలు చాలా ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు పరచలేకపోవటం నేటి అసలు సమస్య .సామాన్య ప్రజలకు, చాలామంది చదువుకున్న వారికి కూడా ప్రభుత్వ పధకాల గురించి ఏమీ తెలియదు.ఈ ప్రజాకమిటీ సభ్యులకు వీటి గురించి శిక్షణ ఇచ్చి ప్రతి ఒక గ్రామానికి 10మంది చొప్పున, ఒక టౌంకు 100మంది, ఒక సిటీకు 1000 చొప్పున నియమించి ,ప్రభుత్వ పధకాలు సక్రమంగా పూర్తి అయ్యేటట్లు ఏర్పాటు చేయాలి. వీరికి జీతం ఏర్పాటు చేయాలి. వీరు ప్రతి కుటుంబాన్ని కలసి వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందేటట్లు .......అవినీతి   లేకుండా  సమస్యలు అన్నీ తీరేటట్లు చేయటం వీరి ఉద్యోగం ఈ  కమిటీలు ....... అధికారులకు, ప్రభుత్వానికి ,ప్రజలకు తొందరగా సమస్యలు తీరటంలో సహాయ పడతాయి. .... శ్రీ క్రిష్ణ కమిటిలో ముగ్గురు సభ్యులే ఉన్నా ఎంతోమంది అభిప్రాయాలు కనుక్కుంటున్నారు  కదా  !.ఇవన్ని చేస్తే తప్పకుండా కొద్దికాలంలోనే ప్రజల ప్రాధమిక అవసరాలు తీరుతాయి.
ప్రభుత్వం తన సంస్తలను ప్రైవేట్ కంపెనీల్లాగా సమర్ధవంతముగా నిర్వహించాలి. ప్రభుత్వం చేతిలో సంపద ఉంటే ప్రజలకు డబ్బు ఉన్నట్లే. ఈ మద్య బీద రైతుల నుంచి కూడా భూములు తీసుకుని సెజ్ లు పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. .ఇది అన్యాయము. ఇలాంటి వాని వల్ల ముందుముందు ప్రజలు,ప్రభుత్వం డబ్బు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.మన రాజకీయ పార్టీల వారు ప్రజల ఓట్ల కోసం ఎంతో శ్రమ పడతారు. ప్రజల కష్టాలు వారు తీరిస్తే ప్రజలు వారికి వద్దన్నా ఓటు వేస్తారు. వారిని ఎంతో ఆరాధిస్తారు ఒక వేళ ప్రజలు వారిని గుర్తించకపోయినా మంచిపనులు చేసేవారిని భగవంతుడు తప్పక మెచ్చుకుంటాడు. భగవంతుని మెచ్చుకోలు కన్నా ఎవరికయినా కావలసినదేమూంటుంది.

ఒక్కసారి ఊహించుకోండి.... చల్లని చెట్ల వరుసలు, శుభ్రమయిన రోడ్లు, పచ్చటి పొలాలు, చెరువులతో కూడిన ఊర్లు, ధర్మ గుణం తో మంచి మనస్సు కలిగిన ప్రజలు ఇలాంటి బంగారు భారతదేశం ఎప్పుడు ఏర్పడుతుందో....

 పొరపాట్లు  ఉంటే  మంచి మనస్సుతో మన్నిస్తారని కోరుతూ..... .......Friday, June 4, 2010

మన పూర్వీకులు ఆరోగ్యవంతులే .....

అందరికి నా నమస్కారములు అండి. నేను ఈ మద్య ఊరు వెళ్ళానులెండి. ఆ భగవంతుని దయ వల్ల , ఏ విధమయిన యాక్సిడెంట్ జరగలేదు. ఇప్పుడే పోస్ట్స్ చూశాను అండి. నేను అసలు వేరే టాపిక్ గురించి రాద్దామనుకున్నాను, పోస్ట్స్ చదివాక ఇలా రాస్తున్నాను ...... ముందు ప్రిపేర్ కాలేదు తప్పులు వస్తాయేమో మరి..

నేను రాసినది సార్ లక్కరాజు గారికి నచ్చినందుకు థాంక్స్ అండి. బ్రదర్ అబ్రకదబ్ర గారు రాసిన విషయం గురించి నాకు తెలిసినంతవరకు ఏదో రాస్తాను అండి. అసలు పూర్వ కాలంలో మన పురాణములలో వారి ఆయుర్దాయం చాలా ఎక్కువ ఉండేదంట. ఉదాహరణకు వారు 120 ఏళ్ళు వయస్సు కన్నా వారు ఎంతో ఎక్కువ కాలం బ్రతికేవారంట. వారి వయస్సు ,ఆరోగ్యం ఇవి చెప్పాలంటే అబ్బో చాంతాడంత విషయం అవుతుంది. నాకు అవి చెప్పేఅంత నాలెడ్జ్ లేదండి.


పాత కాలం వారి ఆరోగ్యం గురించి చాలా పుస్తకాలలో మనం గొప్పగా చదివాము కదండీ. అప్పట్లో కూడా ఆపరేషన్స్ అవి ఉండేఉంటాయి, లేకపోతే అన్నన్ని రోజులు యుధ్ధాలు చేసేటప్పుడు తగిలిన దెబ్బలు ఎలా వారు తగ్గించుకోగలుగుతారు. మనకు ఆ మందులు ఇప్పుడు తెలియవు అంతే. పురాణాలలోని వారు వంద సంవత్సరములు అలా రాజ్యము పాలించేవారని మనం చదువుతూ ఉంటాము. కాని కొంతమంది అవి నమ్మరు కదా .


కాని ఈ మద్య కాలంలో మనకు తెలిసిన వారి గురించి చెప్పటం ఈజీ కదా.... ఈ మద్య పాత కాలం వారి ని చూస్తే చాలా మంది చక్కటి ఎత్తు , బలంగా ఉండేవారు. మ్యూసియంస్ లో పాతకాలం వారి దుస్తులు ,బూట్స్ వీటిని చూస్తే వారు చాలా ఆజానుబాహులని తెలుస్తుంది. ఈ రోజుల్లో చూడండి పిల్లలు చాలామంది పొట్టిగా ,ఎత్తుపళ్ళతో , కళ్ళకు అద్దాలతో బలహీనంగా ఉంటున్నారు..అప్పుటి కాలం వాళ్ళు మంచిగా పొలాల్లో పనులు అలా కష్టపడటంవల్ల శరీరం బలంగా ఉండేది. మనము కష్టపడితే శరీరం బలంగా అవుతుంది. మనమేమో ఎప్పుడూ యంత్రాలతో పనిచేయించటం అలవాటు చేసుకుని మనకి పని ఏమీలేక పిచ్చి,పిచ్చి ఆలోచనలతో మైండ్ పాడు చేసుకుంటున్నాము.ఇప్పుడు పిల్లలు జామకాయలు ,చెరకు ఇలాంటి గట్టి పదార్దములు తినటం మాని కేక్స్ లాంటి మెత్తని పదార్దములు అలవాటు చేసుకోవటం వల్ల పళ్ళు అవి పనిలేక బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి మరి.మా అమ్మమ్మ,నానమ్మ గార్లు మా తాతగార్లు ఇద్దరూ వాళ్ళకు అనారోగ్యం అంత ఏమీ వచ్చేది కాదు. వారు సేవేంటి ఫైవ్ ఇయర్స్ వరకు ఆరోగ్యం గానే ఉన్నారు . అమ్మమ్మ గారికి ఇప్పుడు 85ఏళ్ళు. ఆమె ఇప్పటికి పళ్ళ డాక్టర్ దగ్గరకు ఒకటి,రెండుసార్లు మాత్రం వెళ్ళారు. వాళ్ళు వేపపుల్లలతో పళ్ళు తోముకునేవారంట. అదే ఇప్పుడు చిన్నపిల్లలే చాలామంది తరచుగా పళ్ళ డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు..మా నాయనమ్మా గారు పది సంవత్రముల క్రితం చనిపోయారు గాని ఆ వయస్సులో కూడా ఆవిడ తల జుట్టు నల్లగా ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ళకే తలకు రంగు వేసుకుంటున్నారు కదండీ..

ఇప్పటి తరం వాళ్ళం రానురాను పొట్టిగా అవుతున్నారు గమనించారా...

అప్పటి వాళ్ళు ఎక్కువ యుధ్ధాలు ఇలాంటి వాటి వల్ల తొందరగా చనిపోయేవారు కానీ జబ్బుల వల్ల కాదు. . ఇప్పుడు కూడ కాన్సర్, ఎయిడ్స్, మూత్రపిండాలు పాడవటం ఇలా చాలా వాటికి పూర్తి క్యూర్ లేదు కదా.. ఇంకా కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి.


మన ఆయుర్వేదంలో ను , ఈనాటి గిరిజన తెగల వారిలో కూడా మనకు తెలియని మందులు ఎన్నో ఉన్నాయంట. అవి వాళ్ళు అందరికి చెప్పరంట. వాళ్ళలో కూడా కొంతమంది పెద్దలకే తెలుస్తాయంట. కొంతమంది అవి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.


అప్పటి తిండి బలమయినది అని నేను ఎందుకు అన్నానంటేనండి, ఉదాహరణకు అప్పటి వాళ్ళది నిజమయిన ప్రక్రుతి సహజమయిన తిండి బలము, ... మనది విటమిన్ల, టాబ్లెట్స్ .... టానిక్స్ బలం ఈ రెండిటిలో ఏది మంచిదో మనకందరికి తెలుసు కదండీ......నేను ఏదో గబగబా తొందరగా రాశానండి తప్పులను క్షమించండి

. నా ఉద్దేశ్యము యంత్రములు కనిపెట్టవద్దని కాదు మన శక్తి ఉన్నంతవరకు మనము పనిచేసుకుంటే అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి., ప్లస్ మనకు ఆరోగ్యము కూడా.. మన శక్తికి మించిన కష్టమయిన పనులకు మాత్రమే యంత్రములు వాడాలని నా అభిప్రాయమండి...... ... .