koodali

Friday, June 4, 2010

మన పూర్వీకులు ఆరోగ్యవంతులే .....

 

అందరికి నా నమస్కారములు అండి. నేను ఈ మద్య ఊరు వెళ్ళానులెండి. ఆ భగవంతుని దయ వల్ల , ఏ విధమయిన యాక్సిడెంట్ జరగలేదు. ఇప్పుడే పోస్ట్స్ చూశాను అండి. నేను అసలు వేరే టాపిక్ గురించి రాద్దామనుకున్నాను, పోస్ట్స్ చదివాక ఇలా రాస్తున్నాను ...... ముందు ప్రిపేర్ కాలేదు తప్పులు వస్తాయేమో మరి..

నేను రాసినది సార్ లక్కరాజు గారికి నచ్చినందుకు థాంక్స్ అండి. బ్రదర్ అబ్రకదబ్ర గారు రాసిన విషయం గురించి నాకు తెలిసినంతవరకు ఏదో రాస్తాను అండి. అసలు పూర్వ కాలంలో మన పురాణములలో వారి ఆయుర్దాయం చాలా ఎక్కువ ఉండేదంట. ఉదాహరణకు వారు 120 ఏళ్ళు వయస్సు కన్నా వారు ఎంతో ఎక్కువ కాలం బ్రతికేవారంట. వారి వయస్సు ,ఆరోగ్యం ఇవి చెప్పాలంటే అబ్బో చాంతాడంత విషయం అవుతుంది. నాకు అవి చెప్పేఅంత నాలెడ్జ్ లేదండి.


పాత కాలం వారి ఆరోగ్యం గురించి చాలా పుస్తకాలలో మనం గొప్పగా చదివాము కదండీ. అప్పట్లో కూడా ఆపరేషన్స్ అవి ఉండేఉంటాయి, లేకపోతే అన్నన్ని రోజులు యుధ్ధాలు చేసేటప్పుడు తగిలిన దెబ్బలు ఎలా వారు తగ్గించుకోగలుగుతారు. మనకు ఆ మందులు ఇప్పుడు తెలియవు అంతే. పురాణాలలోని వారు వంద సంవత్సరములు అలా రాజ్యము పాలించేవారని మనం చదువుతూ ఉంటాము. కాని కొంతమంది అవి నమ్మరు కదా .


కాని ఈ మద్య కాలంలో మనకు తెలిసిన వారి గురించి చెప్పటం ఈజీ కదా.... ఈ మద్య పాత కాలం వారి ని చూస్తే చాలా మంది చక్కటి ఎత్తు , బలంగా ఉండేవారు. మ్యూసియంస్ లో పాతకాలం వారి దుస్తులు ,బూట్స్ వీటిని చూస్తే వారు చాలా ఆజానుబాహులని తెలుస్తుంది. ఈ రోజుల్లో చూడండి పిల్లలు చాలామంది పొట్టిగా ,ఎత్తుపళ్ళతో , కళ్ళకు అద్దాలతో బలహీనంగా ఉంటున్నారు..అప్పుటి కాలం వాళ్ళు మంచిగా పొలాల్లో పనులు అలా కష్టపడటంవల్ల శరీరం బలంగా ఉండేది. మనము కష్టపడితే శరీరం బలంగా అవుతుంది. మనమేమో ఎప్పుడూ యంత్రాలతో పనిచేయించటం అలవాటు చేసుకుని మనకి పని ఏమీలేక పిచ్చి,పిచ్చి ఆలోచనలతో మైండ్ పాడు చేసుకుంటున్నాము.



ఇప్పుడు పిల్లలు జామకాయలు ,చెరకు ఇలాంటి గట్టి పదార్దములు తినటం మాని కేక్స్ లాంటి మెత్తని పదార్దములు అలవాటు చేసుకోవటం వల్ల పళ్ళు అవి పనిలేక బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి మరి.



మా అమ్మమ్మ,నానమ్మ గార్లు మా తాతగార్లు ఇద్దరూ వాళ్ళకు అనారోగ్యం అంత ఏమీ వచ్చేది కాదు. వారు సేవేంటి ఫైవ్ ఇయర్స్ వరకు ఆరోగ్యం గానే ఉన్నారు . అమ్మమ్మ గారికి ఇప్పుడు 85ఏళ్ళు. ఆమె ఇప్పటికి పళ్ళ డాక్టర్ దగ్గరకు ఒకటి,రెండుసార్లు మాత్రం వెళ్ళారు. వాళ్ళు వేపపుల్లలతో పళ్ళు తోముకునేవారంట. అదే ఇప్పుడు చిన్నపిల్లలే చాలామంది తరచుగా పళ్ళ డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు..మా నాయనమ్మా గారు పది సంవత్రముల క్రితం చనిపోయారు గాని ఆ వయస్సులో కూడా ఆవిడ తల జుట్టు నల్లగా ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ళకే తలకు రంగు వేసుకుంటున్నారు కదండీ..

ఇప్పటి తరం వాళ్ళం రానురాను పొట్టిగా అవుతున్నారు గమనించారా...

అప్పటి వాళ్ళు ఎక్కువ యుధ్ధాలు ఇలాంటి వాటి వల్ల తొందరగా చనిపోయేవారు కానీ జబ్బుల వల్ల కాదు. . ఇప్పుడు కూడ కాన్సర్, ఎయిడ్స్, మూత్రపిండాలు పాడవటం ఇలా చాలా వాటికి పూర్తి క్యూర్ లేదు కదా.. ఇంకా కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి.


మన ఆయుర్వేదంలో ను , ఈనాటి గిరిజన తెగల వారిలో కూడా మనకు తెలియని మందులు ఎన్నో ఉన్నాయంట. అవి వాళ్ళు అందరికి చెప్పరంట. వాళ్ళలో కూడా కొంతమంది పెద్దలకే తెలుస్తాయంట. కొంతమంది అవి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.


అప్పటి తిండి బలమయినది అని నేను ఎందుకు అన్నానంటేనండి, ఉదాహరణకు అప్పటి వాళ్ళది నిజమయిన ప్రక్రుతి సహజమయిన తిండి బలము, ... మనది విటమిన్ల, టాబ్లెట్స్ .... టానిక్స్ బలం ఈ రెండిటిలో ఏది మంచిదో మనకందరికి తెలుసు కదండీ......నేను ఏదో గబగబా తొందరగా రాశానండి తప్పులను క్షమించండి

. నా ఉద్దేశ్యము యంత్రములు కనిపెట్టవద్దని కాదు మన శక్తి ఉన్నంతవరకు మనము పనిచేసుకుంటే అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి., ప్లస్ మనకు ఆరోగ్యము కూడా.. మన శక్తికి మించిన కష్టమయిన పనులకు మాత్రమే యంత్రములు వాడాలని నా అభిప్రాయమండి...... ... .

 

 

No comments:

Post a Comment