koodali

Wednesday, June 9, 2010

ధరలు తగ్గాలంటే ఇలా చేస్తే .........

 
ఆ మద్య జీతాలు పెరిగిన కొందరిలో మా బంధువులు కూడా ఉన్నారులెండి. అయితే జీతాలు పెరిగిన దాని గురించి నేను పూర్తిస్తాయిలో సంతోషించలేదని వారు బాధపడ్డారు కూడా... నాకు వారికి దీని గురించి చిన్న డిస్కషన్ కూడ జరిగింది.


అసలు నేను ఏమన్నానంటే దేశంలో ఇంతమంది పేదవారుంటే ఇంకా జీతం పెంచమనటం తప్పు అనీ,  ఒక ప్రక్క వేరే దేశాలలో ఉద్యోగాలు ఊడిపోతుంటే మనం ఉద్యోగం ఉన్నందుకు సంతోషించక జీతం పెంచమనటం అన్యాయం అని ....(భారతీయులకున్న పొదుపు చేసే గుణం వల్ల ఆర్ధిక మాంద్యం నుండి పెద్దగా ప్రాబ్లం రాలేదని అంటున్నారు కదండి)

వారేమో ఆ.... మేము ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ ఎంతో కష్టపడుతున్నాము అని అన్నారు.

నేనేమో మీరు ఎ.సి రూంస్ లో పనిచేస్తూ ఇంత బాధపడుతుంటే చాలామంది కార్మికులు, కర్షకులు, చిన్నపనివారు ఎండలో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు వాళ్ళకు జీతాలు ఎవరూ పెంచరు అని ఇలా.....



* అసలు నా అభిప్రాయమేమిటంటేనండీ ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలండి.


డబ్బంతా కొంతమంది జీతాలకే పోతే పేదవారు ఏమి కావాలి. వారి కష్టం కష్టం కాదా....

జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...ఇదొక అంతులేని కధ....

ఒక ఉద్యోగికి 40వేలు నెలకు వస్తే ఒక చిన్న కార్మిక, చిన్న వ్రుత్తి వారికి 4 వేలు నెలకు వస్తే పెరిగిన జీతంవల్ల పెద్ద ఉద్యోగికి బాధ ఉండదు. కాని చిన్న ఉద్యోగి ఎలా బ్రతకాలి......? ఉద్యోగం లేని వారికి జీతాలు ఎవరు పెంచుతారు. 


 రైతుల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారిని ఎవరూ పట్టించుకోరు. పేదవారు , కూలీలు వీరు ఈ రేట్లతో ఎలా బ్రతకాలి...? అందరి కష్టం ఒకటి కాదా ? 

 .జీతం పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా అని నా అభిప్రాయం.

 ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు లేక ధరలు తగ్గాయి కదా..

ఇంటి అద్దెలు కూడా తగ్గాయి. .కొంతమంది చిన్న, మద్య తరగతి వాళ్ళు ఇళ్ళు కొనుక్కున్నారు కూడ..

అసలు ధరలు తగ్గించటం వల్ల వ్యాపారులకు కూడా లాభం. ధరలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది సరుకులు కొంటే ధరలు తగ్గిస్తే 20 మంది వస్తువులు కొనే చాన్సుంది. అందరికి అన్నీ అందుబాటులోకి వస్తాయి.


అందరూ పల్లకీ ఎక్కితే మోసేదెవ్వరూ... ఏ వ్రుత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయములులలో ఇంత పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు. 


 పరమాత్మ ద్రుష్టిలో రాజుకు, బంటుకు, ఒకే రకమయిన విలువవుంటుంది....

రానురాను మన దేశంలో పేదలు మరీ పేదలుగాను, ధనికులు మరీ ధనికులు గాను అవ్వటం చూసి ఇలా నాకు తోచింది రాస్తున్నాను. నాకు ఇందులో తప్పులు ఉంటాయని భయమే కానీ నా అభిప్రాయములు మీతో చెప్పుకోవటానికి రాస్తున్నానంతేనండి. తప్పులను దయచేసి క్షమించండి.



7 comments:

  1. tappulevi levu andi. chala baga mee mansulo unna bhavanni ila vyakteekarincharu. dhanyavadaalu.
    kani ikkada nenu cheppadalachukunnadentante, paramatma drustilo andaru okkate gani karma siddhantam prakaram evari karma taggattu varu jeevistaru. so,baga batakali ani aa paramatma evari nudutuna raste, vaaru variki tagattu sahayam cheyali gani. evari patiki dabbulu daachukonte, aa kutumbam baagupadutundemo gani desam eppatiki kadu.
    emantaru ?

    ReplyDelete
  2. ఆనందం గారు: నిర్భయంగా మీ భావలు చెప్పారు. నెనర్లు!
    ఆదిత్య గారు, మీరన్నది నిజమే!

    ReplyDelete
  3. అసలు మీరు దీని గురించి చక్కగా రాసినందుకు అభినందించాలి. ప్రభుత్యోద్యోగులకి జీతాలు తగ్గిస్తే, ధరలు అవే తగ్గుతాయి. వేలకి వేలు జీతాలు తీసుకున్నది చాలక, మళ్ళీ మామూళ్ళొకటి. పాపం ఎర్రటి ఎండలో కష్టపడే వాడికి పది రూపాయిలు ఎక్కువ ఇవ్వడానికి సవాలక్ష బేరాలు, ఏ.సీ రూంలో సంతకాలు పెట్టేవాడికి లక్షల ఆదాయం. ఇంతటి దారుణం మానవ చరిత్రలో ఎప్పుడూ ఉండివుండదు.

    ReplyDelete
  4. మీరు ఈ బ్లాగ్ చదివినందుకు థాంక్స్ అండి. మీరు చెప్పినది నిజమే. అందరు చేతనయినంత ప్రక్కవారికి సహాయం చేయాలి. దానివల్ల వారికే లాభం. మనం ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మన కష్టాలకు అడ్డుపడుతుంది. మనం ఎప్పుడైనా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు సహాయంకోసం దేవుని ప్రార్ధిస్తే ఆ భగవంతుడు మనం చేసిన మంచిపనులను చూసి కాపాడతాడు కాని మనవెనకున్న ఆస్తిని చూసికాదు.

    ReplyDelete
  5. మీరు ఈ బ్లాగ్ చదివినందుకు థాంక్స్ మేడం. నేను మీ బ్లాగ్ చదువుతుంటానండి.చాలా బాగా రాస్తారండి. అయితే నాకు కామెంట్స్ రాయటం అంటే కొంచెము భయము సరిగ్గా రాయలేనని...... మీరు అందరూ బ్లాగ్స్ లో చక్కని భాష వ్రాస్తారు. నాకు అంత రాదండి.

    ReplyDelete
  6. బ్రదర్, బ్లాగ్ చదివినందుకు థాంక్స్ అండి. నేను మీ బ్లాగ్ కూడా చదువుతుంటాను. చాలా చక్కగా వ్రాస్తారు. నాకు మీఅందరి అంత రాకపోయినా ఏదో నాకు తోచినది రాస్తుంటానండి....

    ReplyDelete
  7. andaru melaga ceppevare kani evaraina pedalaku sayam chese varu vunnara?enduku sir vurike samajam meda prema vunnatlu natistaru.melkondi sir,

    ReplyDelete