koodali

Monday, August 31, 2015

పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ..


రామాయణ,  భారతములు  ముందే  ఒక ప్రణాళిక   ప్రకారం   జరిగాయని  అంటారు.

మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే .. (క్లుప్తంగా.)


ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు ..... దేవతలు మరియు భూదేవి .. ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.


అప్పుడు అమ్మవారు ..... దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.


శ్రీకృష్ణ జననం గురించి ,  పాండవుల జననం గురించి ,  ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.


ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.

అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.


 పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ....... లోకానికి   ఎన్నో గొప్పగొప్ప   విషయాలు అందించబడ్డాయి.


  మనము    పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా  ....చక్కగా అర్ధం చేసికొని    జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.


ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు , ఆ పరిష్కారం ద్వారా ప్రజలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకునే విధంగా సమస్యను పరిష్కరించటం దైవానికే సాధ్యమవుతుంది...

................

పురాణేతిహాసాల  గురించి  ఇంకా  నాకు  ఏమనిపిస్తుందంటే, 


 పిల్లలకు    నీతి కధలు  బోధించేటప్పుడు    కొన్నిసార్లు , పెద్దవాళ్ళు   ఆ కధలలోని    పాత్రధారులుగా   తామే    అభినయించి చూపిస్తారు   కదా! 


అలాగే   పెద్దలకు  నీతికధల  వంటి  , పురాణేతిహాసాల  ద్వారా     దైవం    మానవులకు   దిశానిర్దేశం  చేసారనిపిస్తుంది.


 (  లోకహితం  కొరకు   పురాణేతిహాసాలలోని   జీవిత కధలలో  దేవతలు   కూడా   పాత్రలను  పోషించారు ) .


రావణుడిని   సంహరించటం  కొరకు    సీతాపహరణం   వంటి  సంఘటనలు      జరగనవసరం  లేదు.  ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే    పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.


  లోకాన్ని  పీడించిన  ఎందరో  రాక్షసులను  అవలీలగా  సంహరించిన  దైవానికి  రావణుని,  దుర్యోధనుని  వంటివారిని   చంపటం    పెద్దపనేమీ  కాదు. 


అయితే.. రామాయణం,  భారతం  లోని  కధలను   ఒక  పధ్ధతి   ప్రకారం  అలా  నడిపించటం  ద్వారా   ,   ఆ   కధలలోని  పాత్రలు,  వారి  జీవితాలలో  జరిగిన    రకరకాల      సంఘటనల     ద్వారా .....  ఎన్నో  విషయాలను   దైవం,  పెద్దలు  ,   రాబోయే  తరాలకు       తెలియజేశారనిపిస్తుంది.


పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. వాటిని  మనకు  అందించిన    దైవానికి ,  పెద్దలకు  అనేక   కృతజ్ఞతలు.


Wednesday, August 26, 2015

ఓం..


శ్రావణ శుక్రవారం  వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ..హయగ్రీవ జయంతి..ఈ సంవత్సరపు శుభప్రదమైన  అమరనాధ్ యాత్ర  శ్రావణ పౌర్ణమికి  పూర్తవుతుంది..శ్రావణ శనివారం శనిదేవుని పూజ..శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉంటాయి.

Thursday, August 20, 2015

అద్భుతమైన విజ్ఞానమ్..

గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవరు ? అంటే, ఈ కాలంలో వాళ్లు చాలామంది న్యూటన్ అని చెబుతారు. అయితే, ప్రాచీన భారతీయ గ్రంధాలలో ఈ విషయం గురించి ఉన్నది.

బ్రహ్మగుప్తుడు రచించిన  'బ్రహ్మస్పుఠ సిద్ధాంతం'లో...

" వస్తువులు భూమి వైపు ఆకర్షింపబడతాయి.నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో , అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది.అని చెప్పటం జరిగింది.

జగద్గురువు ఆదిశంకరుల వారు వారి'ప్రశ్నోపనిషత్' భాష్యంలో 'అపాన'శక్తి గురించి రాస్తూ ..

"ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో..అటులనే పైకి లాగబడే 'ప్రాణ'శక్తిని 'అపాన'శక్తి కిందకు లాగుతోంది.(3-8 శ్లో||)అని చెప్పారు.

శ్లో || "తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా
పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ
అపకర్షేణ అనుగ్రహం కుర్వతీ వర్తత ఇత్యర్ధః |
అన్యధా హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గచ్చేత్ ||"

న్యూటన్ కంటే ఎన్నో సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ గురించి భారతీయ విజ్ఞానం తెలియజేసింది.
......................

ఆధునిక కాలంలో.. సెల్ ఫోన్లు,  రేడియోలు,  టీవీలు ,  శాటిలైట్లు, చివరకు  బ్లూటూత్  వ్యవస్థలన్నీ  వైర్ లెస్ విధానం  ఉపయోగించే  పనిచేస్తున్నాయి.

 ఈ  విధమైన  తంత్రీరహితమైన  (Wireless)  ప్రసారపద్ధతిని    ముందు  కనుగొన్నది  భారతీయుడైన  సుప్రసిద్ధ  శాస్త్రవేత్త ' జగదీశ్  చంద్రబోస్  '.

  క్రీ.శ.1896,సెప్టెంబర్21న  బోస్  ఇంగ్లండ్ లో  రాయల్ ఇన్ స్టిట్యూట్ లో  ఒక  ప్రదర్శన,  ప్రసంగం  ఇచ్చారట.

'ఒక యోగి ఆత్మ కధ' పుస్తకంలో భారతీయ శాస్త్రవేత్త అయిన జగదీశ్ చంద్ర బోస్ గారి గురించిన వివరములు ఉన్నాయి.

 భారతీయుడైన బోస్ గారి గురించి ఎక్కువమంది భారతీయులకు కూడా తెలియకపోవటం అత్యంత బాధాకరం.


ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS...

భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు.....అనే  పుస్తకాన్ని , మాకు  తెలిసిన వారు  మాకు  ఇచ్చారు.

 ఈ  పుస్తకాన్ని  వివేకానంద  లైఫ్  స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారు  సమర్పించారు.    ఈ  పుస్తకంలో  ఎన్నో  గొప్ప  విషయాలు  ఉన్నాయి.

  ప్రాచీన  భారత  దేశపు  గొప్పదనం  గురించి,  ఇంకా  ఎన్నో  విషయాలను  సేకరించి ,  ఈ  గ్రంధం  ద్వారా అందించారు .

వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని కోరుతున్నాను.

మరిన్ని విషయాల కొరకు దయచేసి ఈ లింకుల వద్ద చూడగలరు.Sunday, August 16, 2015

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే....


 • డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .

  పరిణామవాదం గురించి ఈ మధ్య శాస్త్ర విజ్ఞానం వారి బ్లాగులో చదివాక నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.


  నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.


  పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,


  ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని ఇలాగ.........అన్నారు కదా.. నిజమే పరిణామసిద్ధాంత నిజమే కావచ్చు.


  అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.


  ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

  ఇంకా,

  ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.


  (నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )


  అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.


  ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?


  1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.


  కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో ?

  ( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )


  2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.


  మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో ? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

  ( కళ్ళు వ్యర్ధ 
  అవయవాలు కాదేమో ! )


  3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి నెమ్మదిగా పక్షుల్లా పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో ? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

  ( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

  అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’

 • ౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.

 • .ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ? ( పరిణామవాదం ప్రకారం చూస్తే...)

 • కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?

 • ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,  మానవులలో   జంతువుల వలె  శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

 • ఉదా..మానవుల్లో వ్యర్ధ భాగంగా భావిస్తున్న coccyx ( tail bone ) గతకాలపు అవశేషం కాదేమో ? తోక అవసరమయ్యే విధంగా శారీరిక పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.

 •  జంతువులకు తోకతో ఎన్నో ఉపయోగాలున్నాయి.  మానవులకు కూడా కొందరికి  తోక పెరిగే అవసరం వచ్చిందేమో ? 


 • టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.   అయితే, ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.   ౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.


  దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ ..సీతాకోకచిలుక. 

 •  గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !


 • దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

 • * దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే.......

 • .  సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.


  దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


  * సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".. ..

   మరికొన్ని విషయాలను   ఇక్కడ  చదవవచ్చు .   దయచేసి వ్యాఖ్యలు కూడా గమనించగలరు . 

Friday, August 14, 2015

దైవ సృష్టి ...

ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే ఆస్తికులు దైవం అని పిలుచుకుంటున్నారు.


ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 


".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .


 అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.


ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.


విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 


 మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?


 పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !

  
దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 


అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 


 దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 


 విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 


అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
Monday, August 10, 2015

మహాభారతము

ఓం

Mahabharata - Wikipedia, the free encyclopedia


..ఈ లింక్ ద్వారా చూస్తే తెలుగులో కూడా మహాభారతము చదవవచ్చు.ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది,Friday, August 7, 2015

పురాణేతిహాసాలలో అతిశయోక్తులు ..Wednesday, August 5, 2015

అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...


 • ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారంటే , పాతకాలంలో శ్రమదోపిడీ ఎక్కువగా ఉండేది. అలా కాకుండా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అంటున్నారు.

 •  మరి, ఈ రోజుల్లో ఎవరి పని వాళ్లే చేసుకుంటున్నారా ?

 •  ఉదాహరణకు పారిశుధ్యం విషయంలో గమనిస్తే , 

 • ఈ రోజుల్లో ఎవరిపని వారు చేసుకోకుండా ఇతరులతో చేయించటం ఎక్కువయినట్లు కనిపిస్తోంది. 

 •  ఈ రోజుల్లో  శ్రమదోపిడీ కూడా ఎక్కువయినట్లు అనిపిస్తోంది.


 • మరిన్ని విషయాలను  దయచేసి ఈ క్రింద లింక్ వద్ద చదవగలరు. 


 • అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొ...
Monday, August 3, 2015

శంభూక వధ...

శ్రీరాముల వారు..శబరి ఇచ్చిన పండ్లను చక్కగా స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేసారు. పక్షి అయిన జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.


 శూద్ర కులానికి చెందిన భక్తురాలైన శబరిని కరుణించిన రాముడు శంభుకుని తపస్సు చేసినంత మాత్రాన్నే వధించటం ఎందుకు జరుగుతుంది ?
........................ 

రాముడు.. శూద్రుడైన శంభూకుని సంహరించటం  గురించి ...నాకు ఏమనిపిస్తోందంటే..

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

 కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.
........................ 

బహుశా శంభుకుడు విపరీతమైన  కోరికలతో  తపస్సును చేస్తూ ఉండి ఉంటాడు ..  అందుకే రాములవారు వధించి ఉంటారు.
....................... 

రాక్షసులు కూడా తపస్సులు చేయటం, దేవతలు వరాలు ఇవ్వటం జరుగుతుంటుంది.

రాక్షసులే తపస్సు  చేసి వరాలను పొందుతుంటే  ..   మానవులలో కొన్ని కులాల వాళ్ళు తపస్సులు చేయకూడదు...  అనే విధానం   ఉంటుందని అనుకోనవసరం లేదు.
......................... 

ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా..  దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. 

 కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు... శిక్షించబడ్డారు. 
....................... 

 శంభూకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నట్లుగా ఒక దగ్గర చదివాను.

హరిశ్చంద్రుని తండ్రి అయిన త్రిశంకుడంతటి వారినే బొందితో స్వర్గానికి రావటానికి .. ఇంద్రుడు అంగీకరించ లేదు.

 ఇవన్నీ గమనిస్తే, శంభూకుని వధించటానికి కులం అన్నది కారణం కాదనిపిస్తుంది.

ఈ విషయంలో మనకు తెలియని మరికొన్ని కారణాలు కూడా ఉండి ఉండవచ్చు.
...................... 

Shudra Hindu saints అని అంతర్జాలంలో చూస్తే ఎందరో భక్తుల వివరాలు ఉన్నాయి.  


నందనార్ అనే శూద్ర భక్తుని దైవం కరుణించటం ....వంటి విషయాలను గమనిస్తే , దైవం దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం అర్ధమవుతుంది.