koodali

Monday, August 31, 2015

పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ..


రామాయణ,  భారతములు  ముందే  ఒక ప్రణాళిక   ప్రకారం   జరిగాయని  అంటారు.

మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే .. (క్లుప్తంగా.)


ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు ..... దేవతలు మరియు భూదేవి .. ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.


అప్పుడు అమ్మవారు ..... దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.


శ్రీకృష్ణ జననం గురించి ,  పాండవుల జననం గురించి ,  ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.

ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.

అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.


 పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ....... లోకానికి   ఎన్నో గొప్పగొప్ప   విషయాలు అందించబడ్డాయి.


  మనము    పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా  ....చక్కగా అర్ధం చేసికొని    జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.


ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు , ఆ పరిష్కారం ద్వారా ప్రజలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకునే విధంగా సమస్యను పరిష్కరించటం దైవానికే సాధ్యమవుతుంది...

................
పురాణేతిహాసాల  గురించి  ఇంకా  నాకు  ఏమనిపిస్తుందంటే, 


 పిల్లలకు    నీతి కధలు  బోధించేటప్పుడు    కొన్నిసార్లు , పెద్దవాళ్ళు   ఆ కధలలోని    పాత్రధారులుగా   తామే    అభినయించి చూపిస్తారు   కదా! 


అలాగే   పెద్దలకు  నీతికధల  వంటి  , పురాణేతిహాసాల  ద్వారా     దైవం    మానవులకు   దిశానిర్దేశం  చేసారనిపిస్తుంది.


 (  లోకహితం  కొరకు   పురాణేతిహాసాలలోని   జీవిత కధలలో  దేవతలు   కూడా   పాత్రలను  పోషించారు ) .


రావణుడిని   సంహరించటం  కొరకు    సీతాపహరణం   వంటి  సంఘటనలు      జరగనవసరం  లేదు.  ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే    పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.


  లోకాన్ని  పీడించిన  ఎందరో  రాక్షసులను  అవలీలగా  సంహరించిన  దైవానికి  రావణుని,  దుర్యోధనుని  వంటివారిని   చంపటం    పెద్దపనేమీ  కాదు. 


అయితే.. రామాయణం,  భారతం  లోని  కధలను   ఒక  పధ్ధతి   ప్రకారం  అలా  నడిపించటం  ద్వారా   ,   ఆ   కధలలోని  పాత్రలు,  వారి  జీవితాలలో  జరిగిన    రకరకాల      సంఘటనల     ద్వారా .....  ఎన్నో  విషయాలను   దైవం,  పెద్దలు  ,   రాబోయే  తరాలకు       తెలియజేశారనిపిస్తుంది.


పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. వాటిని  మనకు  అందించిన    దైవానికి ,  పెద్దలకు  అనేక   కృతజ్ఞతలు.


రామాయణానికి వేదాంత కోణం..లింక్

Vedantic Interpretation of Ramayana



No comments:

Post a Comment